పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడిన అవగాహన ఉండాలనీ బలంగా విశ్వసించారు. పరస్సర పేమ, సహనం, సౌభ్రాతృత్వం, శాంతియుత సహజీవనం, మానవ హక్కులగుర్తింపు, ఫిన్నత్వాల వట్ల గౌరవ మానవీయ విలువల్నీ విశ్వమానవ ఏళత్వాన్నీ బోధించే విధంగా పాఠ్యపుస్తకాలు రూపొందాలన్నారు. చిన్నప్పటినుండీ పసిమెదళ్ళలో సదరు విలువల్ని నూరిపోయాలన్నారు.

విద్యారంగానికి ఎంత గొప్ప సేవలందించాదో సారస్వత, కళారంగాలకూ అంతే పేవలందించాడు. స్వతహాగా గొప్ప సాహితీవేత్తా, కళాపిపాసి అయిన ఆజాద్‌, సాహిత్య అకాడమీ, లలితకళా ఆకాడమీ, సంగీత నాటక అకాడమీ మొదలైన సంస్థలను స్థాపించాడు. భారతీయ వారసత్వంలో అవిభాజ్య భాగమ్రైన సాంస్కృతిక ఆదాన-ప్రదాన క్రమాలను (ప్రోత్సహిస్తూ - ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ని స్థాపించాడు. సారస్వత, కళారంగాల్లో ఉండి ఆర్దికంగా 'కుంగదీసే పరిస్థితులున్న వారికోసం పెన్షన్‌ పథకాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా ఎన్నో విధాలుగా ఆయన అమోఘమైన 'సేవలందించాడు. ఆయన జన్మదినాన్ని - 11నవంబరు -జాతీయ విద్యాదినోత్సవం'గా ప్రకటించి భారత ప్రభుత్వం గౌరవించింది.

1947 డిసెంబరు 21న మౌలానా అజాద్‌ పట్నా విశ్వవిద్యాలయ (బీహార్‌) స్నాతకోత్సవంలో ఉపన్యసించాడు. అందులో మాతృభాషలో విద్యాబోధనకు సంబంధించి ఉన అభిప్రాయాలను స్పష్టంచేశాడు. సంప్రదాయానికి భిన్నంగా అంటే ఇంగ్లీషులో కాకుండా తన ప్రసంగాన్ని అతడు హిందూస్టానీలో చేశాడు. భారతదేశ విశ్వవిద్యాలయాల చరిత్రలో ఒక స్నాతకోచ్సవ ఉపన్యాసం ఇంగ్లీషులో కాకుందా ఒక భారతీయ భాషలో చేయడమన్నది బహుషా అదే వెబదటిసారి. ఇంగ్లీషులో కాకుండా భారతీయ భాషలో ఉపన్యనిస్తున్నందుకు క్షవావణలు కోరాల్సిన అవనరం లేదనీ, ఒక భారతీయ విశ్వవిద్యాలయంలో, భారతీయుల ముందునిలబడి, భారతీయ భాషలో మాట్లాడడం అసంజసమేమీ కాదనీ విశదం చేశాడు. నిజానికి వలసవాద విద్యావిధానం మనమీద రుద్దిన ఇంగ్లీషులో మాట్టాడినపుడే క్షమంచమని అడగాల్సిన అవసరం ఉంటుందన్నారు. 'బ్రిటీషువాళ్ళు ప్రవేశపెట్టిన ఆంగ్ల్గమాధ్యమంలో విద్యాబోధన భారతీయుల జీవితానికీ, అవనరాలకూ ఖిన్నంగా ఉండిందనీ, థలితంగా ఖారతదేశంలో వవేశపెట్టిన ఆఅభాునికళ విద్యావిభానం “అభారతీయం”గా వుండిందనీ తేటతెల్లం చేశాడు. వలసవాదులు ప్రవేశపెట్టిన అంగ్ల భాషామాధ్యమం కారణంగా భారతీయుల వమననులు, వేధన్సు నహాజంగా కాకుందగా అనహజంగా రూపుదిద్దుకొన్నాయన్నాడు. వివిధ విషయాలు నేర్చుకోవడానికి కేటాయించాల్సిన సమయంలో అత్యధిక భాగం విదేశీ భాషను నేర్చుకోవడానికీ దానిమీద పట్టుసాధించడానికీ కేటాయించాల్సి వచ్చిందనీ సదరు విద్యావిధానం వల్ల భారతీయ భాషల అభివృద్ధి కుంటుబడిందనీ స్పష్టంగా ప్రకటించాడు. భారతదేశంలా కాకుందా ఇతర ఆసియా దేశాలైన ఈజిఫ్ల, సిరియా టర్కీ పర్షియా, చైనా, జపాన్‌ మొదలైనవి ఆధునిక విద్యను అందిపుచ్చుకున్నా యూనివర్సిటీ స్థాయిల్లో కూడా బోధనా మాధ్యమంగా మాత్రం తమ తమ

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ మార్చి-2021 |

మాతృభాషల్నే వినియోగించినాయనీ, తద్వారా అవి సాధించిన అఖివృద్ధి మన కళ్ళముందే కన్చిస్తున్నదనీ వివరించాడు. భారతదేశ విద్యావ్యవస్థ అంగ్రేయుల చేతుల్లో కాకుండా భారతీయుల చేతుల్లో వుండి వున్నట్లైజే వారు కూడా టర్కీ జపానుల్లాగే తము తవు మాత్చభాషల్లోనే విద్యాభ్యాసం చేని ఉండేవారనీ కానీ బిటీష్‌ వలసవాదం అ అవకాశాన్ని త్రుంచివేసిందనీ అన్నాము.

ఇంగ్లీషు భాష జాతీయ జీవనంపై వేసిన ప్రభావాన్ని గూర్చి తెల్పితే అది కొన్నీ విషయాల్లో చెరుపు చేసినప్పటికీ కాన్ని విషయాల్లో మంచే చేసిందనేది అందరూ గుర్తించాలన్నారు. ఇంగ్లీషు చేసిన మంచి పనుల్లో ఒకటి వివిధ భాషలు కలిగి ఉపఖండంగా ఉన్న దేశంమొత్తంలో కాళ్ళీరునుండి కన్వాకుమారిదాకా ఐక్యతను సాధించి, వివిధ ప్రదేశాల ప్రాదేశిక ప్రభుత్వాల, విశ్వవిద్యాలయాల, శాసన సభల మధ్య ఒక లంకెలా పనిచేయడం. అంతర్జాతీయ స్థాయిలో కూడా మధ్యవర్తి అవసరం లేకుండానే (అనువాదకులు) భారతదేశానికి గుర్తింపూ వివిధ దేశాలతో నంబంధాలూ ఇంగ్లీషుద్వారానే యేర్చద్దాయి. అయినప్పటికీ ఇంగ్లీషును ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, విద్యా నంస్ధల్లోనే ఎంతో కాలం కొనసాగించలేవునీ ఆజాద్‌ అభిప్రాయపడ్డారు. క్రమక్రమంగా భారతీయ భాషలు దానీ స్థానాన్ని ఆ(క్రమించాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. తన విద్యాభ్యాసాన్ని గూర్చి వివరిస్తూ తాను ఎప్పుడేగాని ఏ ఆంగ్ల విద్యాసంస్థలోనూ చదువుకోలేదనీ, తన విద్యాభ్యాసమంతా పర్షియన్‌, అరబిక్‌లతో ఇంట్లోనే సాగిందనీ, తన సొంత ప్రయత్నం ద్వారానే ఇంగ్లీషు నేర్చుకొన్నాననీ, కాబట్టీ భారతీయుల విద్యావిధానంలో ఇంగ్లీషు స్థానానికి సంబంధించి తాను నిష్పాక్షికమ్రైన అభిప్రాయాల్ని వెలిబుచ్చగలననీ వివరించారు.

భాషా సమస్య రెండు విషయాలకు సంబంధించిందనీ, ఒకటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిందైతే యింకోటి విద్యకు సనంబంధించిందనీ తెలియజేశారు ఆజాద్‌. ఆయన (ప్రకారం కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు ఐదు సంవత్సరాలపాటు ఇంగ్లీషుతో పాటుగా ప్రాంతీయ భాషల్ని కూడా పాలనా వ్యవహారాల్లో ఉపయోగించాలి. ఈ ఐదేంద్లలోపు ప్రాంతీయ భాషను పాలనా భాషగా అభివృద్ధివేసి అరో సంవత్సరం నుండే ఇంగ్లీషు స్థానంలో దాన్ని ప్రవేశపెట్టి ఇంగ్లీషును పూర్తిగా తీసివేయాలి. అంటే ఐదేంద్ల వరకు అధికారభాషలుంటాయి - ఒకటి 'ప్రాంతీయభాష, రెండోది ఇంగ్లీషు. ఆరో సంవత్సరం నుండి కేవలం ప్రాంతీయ భాషొక్కటే అధికార భాషగా చలామణీ అవుతుంది. ఇంగ్లీషు పూర్తిగా తప్పుకుంటుంది.

ఆజాద్‌ ప్రకారం ప్రాధమిక స్థాయి నుండీ విశ్వవిద్యాలయ స్థాయి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ప్రాధమిక మాధ్యమిక స్థాయిల వరకు సమన్య లేదుకాని ఉన్నతవిద్యలో మాత్రం మాతృభాషలో విద్యాబోధన నవాళ్ళతోకూడుకొన్నదని అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో వెంటనే పని ప్రారంభించాలనీ ఇక్కడ కూడా ఒక ఐదు సంవచ్సరాల కాలవ్యవధిని యేర్చాటు చేసుకోవాలనీ ఈ మధ్యకాలంలో ఎంభటి అభివృద్ధిని సాధించాలంటే అరో సంవత్చ్సరంనుండి ఉన్నత విద్యకు చెందిన అన్ని శాఖల్లోనూ