పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్‌

తెయి[ు ఖంళచెతద్తతము సమాంత్యు

జ! ! (ప్రభుత్వ నమోదు సంఖ్య 1288/2009) గ్‌ కార్యాలయం : జి-2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కాలేజీ వీధి, మాచవరం, విజయవాడ-520 004.

గౌరవాధ్యక్షుడు అధ్యక్షుడు డా॥ చుక్కారామయ్య డా॥ సామల రమేష్‌బాబు ఫోన్‌: 9490300716 ఫోన్‌: 9848016136

విస్తృత సమావేశానికి ఆహ్వానం

తెలుగు భాషోద్యమ సమాఖ్యను 20083 ఫిబ్రవరి 21న స్థాపించినప్పటి నుండి తెలుగు భాష రక్షణకోసం, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలలోను, ఇతర ప్రాంతాలలోను నిర్వహించుకొన్నాము. మిత్ర సంఘాలను కూడా ప్రోత్సహించాం. పాలన, బోధన రంగాల్లో తెలుగు అమలు కోసం ఉద్యమాలను నడిపి, న్యాయస్థానాలను కడిలించి అనేక సానుకూల ఉత్తర్వులను సాధించాం. తెలుగుకు ప్రాచీన భాషగా గుర్తింపుకై ముందుగా జాతిని మేల్మొల్చి ప్రభుత్వాలను కదివించి గుర్తింపును తెచ్చుకున్నాం. తెలుగుకు (ప్రత్యేక మంత్రిత్వశాఖ కోసమూ, తెలుగు అభివృద్ధి ప్రాధికార సంస్థ కోసమూ పోరాడి, వాటికై ప్రభుత్వ ఉత్తర్వులను సాధించుకోగలిగాం. అయినా పాలకుల్లో నిజాయితీ లేకపోవడంతో అదంతా అమలులో నీరుగారిపోయింది. ఇంతేగాక గత రెండు దశాబ్దాలకు పైగా విద్యారంగంలో విపరీతంగా చోటుచేసుకున్న కార్పొరేటీకరణ విధానాల వల్లా, పాలక పార్టీలు బోధనామాధ్యమంగా తెలుగును అణిచివేసినండువల్లా మాతృభాష ప్రగతికి ఎంతో నష్టం వాటిల్లింది. ఈ అనేక పరిణామాల ఫలితంగా భాషోద్యమంలో 'ప్రాథమ్యాలను, విధివిధానాలను తిరిగి నిర్ణయించుకోవలసివుంది. ఇందుకోసం తెలుగు భాషోద్యమసమాఖ్యలోకి అనుభవజ్ఞులైన వారినీ, యువతరాన్నీ విద్యార్థి ఉపాధ్యాయ ప్రతినిధులను, వివిధ రంగాల నిపుణులను మరికొందరిని స్వాగతించి, సంస్థను మరింత చైతన్యవంతంగా, ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించాము. ఒక కేంద్ర విధాననిర్ణయ మండలిని కూడా మనం ఏర్పాటు చేసుకోవలసియున్నది.

ఇందుకోసం సమాఖ్య విస్త త్‌ సమావేశం 2022 జనవరి 28 ఆదివారం నాడు జరుగుతుంది.

వేదిక : బిషప్‌ ఇగ్నేషియస్‌ ముమ్మడి హోల్‌ (ఓల్డ్‌ 'సెమినార్‌ హాల్స్‌, ప్రధాన లైబ్రరీ ఎనుక

ఆంధ్ర లొయోలా కళాశాల, గుణదల, విజయవాడ -6520008

సమాఖ్య అధ్యక్షుడు డా! సామల రమేష్‌బాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సమాఖ్య అధ్యక్షుడిని కొత్తగా ఎన్నుకోవలసియున్నది. ఇందుకోసం ఈ విస్త లత సమావేశాన్ని ఏర్పాటు చేసుకొంటున్నాం. సమాఖ్య సభ్యులతో పాటు, ఇంతవరకు సమాఖ్యతో కలసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారూ, ఇకపై పాల్గొనాలనే ఆసక్తి కలిగినవారూ ఈ సమావేశంలో పాల్గొనగోరుతున్నాము.

ఈ సమావేశంలో పాల్గొనదలచేవారు జనవరి 15లోపుగా 98480 16186 / 92994 56678 లకు వాట్సాప్‌ ద్వారా గానీ మెసేజ్‌ ద్వారాగానీ మీ చిరునామాను, ఫోన్‌ నెం., మెయిల్‌ ఐడిలను తెలుపగోరుతున్నాము. ఇంకా వివరాల కోసం సంప్రదించ కోరుతున్నాము.

కార్యక్రమం: ఉదయం గం.9.30 నుండి ప్రతినిధులు నమోదు మొదటి సభ 10.30 గం. నుంది మధ్యాహ్నం 1 గం. వరకు:

అధ్యక్షుని ప్రసంగం, నివేదిక సమర్పణ, ప్రతినిధుల ప్రసంగాలు, కొత్త అధ్యక్షుని ఎన్నిక, అభినందనలు.

గం 1నుండి గం 2.380 వరకు భోజనవిరామం.

రెండవ సభ: మధ్యాహ్నం 280 గలు నుతి, 5:గఠలు వతతు తీర్మానముల ప్రతిపాదన, చర్చ, ఆమోదం.

తెలుగు భాషోద్యమ సమాఖ్య సభ్యులు తప్పకుండా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. - డా॥ వెన్ని సెట్టి సింగారావు సమావేశకర్త సెల్‌ 93930 15584 అతెలుగు భాషోద్యమ సమాఖ్య ఆశయ లక్ష్యాలను, విధివిధానాలను ఆమోదించేవారు మాత్రమే సభలో పాల్గొనగోరుచున్నాము.

+కరోనా వైరస్‌ నుండి రక్షణకారకై 'మూతిగుడ్డ(మాస్క్‌ను తప్పనిసరిగాధరించాలి. వ్యాక్సిన్‌చేయించుకున్నవారు మాత్రమే పాల్గొనాలి. | తెలుగుజాతి పత్రిక జవ్సునుజె ఉ జనవరి-2022 |