పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి: 6 సంచిక: 8 అమ్మనుడి

జనవరి 2021

భాషాపెత్తనం దిశగా కేంద్రప్రభుత్వ విధానాలు

ఒక భాష తక్మిన భాషలపై పెత్తనం సాగించడం స్వరాజ్యం కాబోదన్న మాటను చెప్పింది గాందీగారు. హిందీని జాతీయభాషగా ప్రకటించాలనే చర్చ సందర్భంలో ఆయన ఈ మాట చెప్పాడు. అంతేకాదు, మొదటిభాష ఎల్లవేళలా మాతృభాషదేననీ, ఆ తర్వాతే హిందీగాని, మరేదైనా గానీ అని ఆయన స్పష్టం చేశాడు. “సరైన ఎదుగుదలను అమ్మనుడితోనే పొందగలుగుతామని, అమ్మభాషను పణంగా పెట్టి ఆంగ్లభాషను నేర్చుకోవలసివస్తే అసలు ఆంగ్లభాషను నేర్చుకోవలసిన అవసరం ఏ దేశానికీ లేదు” అని ఆయన వివరించి చెప్పాడు.

“పరపీడన పరాయణత్వం'తో నిండిన చరిత్ర నుండి బయటపడి స్వేచ్చాయుత సమాజాన్ని నిర్మించుకోవడం కోసమే మన స్వాతంత్రోద్యమం నడిచింది. విదేశీయుల పాలన నుండి రాజకీయ విముక్తిని పొందినా పాలకుల 'పెత్తనం నుండీ సమాజంలోని అన్ని విధాల ఆధిపత్యాల నుండీ మనం విముక్తిని సాధించవలసి వుంది. ఈ లక్ష్యంతోనే మనం రాజ్యాంగాన్ని నిర్మించుకొన్నాం. ఆ సందర్భంలోనే ఏ ఇతర అంశాల పైనా జరగనంత లోతుగా ఎంతో సమయం 'జాతీయభాష, దేశంలోని ప్రజల భాషల ప్రతిపత్తి అప్పటికి పాలకభాషగా ఉన్న అంగ్ల వినియోగం అనే అంశాల మీద మన రాజ్యాంగ నిర్మాతలు చర్చించారు. చివరకు - జాతీయభాషగా ఏ భాషనూ నిర్ణయించలేకపోయారు. ఆంగ్లాన్ని కొనసాగిస్తూ దానితోపాటు పాలనా అనుసంధాన (link) భాషగా హిందీని వినియోగించుకోవాలని నిర్ణయించారు. అయితే పదిహేను ఏళ్లలో ఇంగ్లీషు స్థానంలో దేశీయ భాషను తేవాలనీ నిర్ణయించారు. కాని, పాలకుల అశ్రద్ధ వల్ల ఆ విషయం మరుగునపడిపోయి, నిరాటంకంగా ఆంగ్లం అన్నివిధాలా పాలనలో బలపడింది. పాలనారంగంలో హిందీని కూడా అన్నివిధాలా అభివృద్ధి చేశారు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల క్రితం భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చి పూర్తిబలంతో ముందుకు సాగుతున్నది. తాను అంకితమైన హిందుత్వ జాతీయవాద విధానాలను క్రమక్రమంగా అన్నిరంగాలలోను అమలులో 'పెడుతున్నది. పాకిస్తాన్‌, చైనాలతో సరిహద్దుల వంటి సమస్యలతోపాటు, ఉగ్రవాదం, తదితర సమస్యల పరిష్మారాన్నిైై కఠిన విధానాలను చేపట్టింది. దానితోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ నాయకత్వాలు, బలమైన జాతీయ విధానాలకు అడ్డంకిగా పరిణమించకుండా, కేంద్రాన్ని అత్యంత శక్తివంతమైన అధికార కేంద్రంగా చెయ్యడం కోసం దీర్ధకాలిక వ్యూహాలను అమలు చెయ్యడానికి పూనుకొంది. భారతీయ జనతాపార్టీ రాజకీయ ఎత్తుగడలతోపాటు పాలనావిభానాలను గమనించేవారికి ఇది స్పష్టంగా అర్ధమవుతుంది.

జాతీయ భద్రతకు సంబంధించిన ఈ విధానాలను ఎక్కువమంది ప్రజలు అమోదించవచ్చు. దేశం భద్రంగా ఉండాలనే అందరూ కోరుకొంటారు. అందుకై ప్రభుత్వం అనుసరించే విధానాలలో కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉండవచ్చుగాక. అయితే, రాష్ట్రాలు బలహీనపడాలని ఎవ్వరూ కోరుకోరు.

ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకేసారి ఎన్నికలు, ఒకే పన్నుల విధానం వగైరా నినాదాలు, లక్ష్యాలు బాగానే ఉండవచ్చు. అయితే దేశమంతా ఒకే భాష అంటే కుదరదు. దేశంలోని వివిధ ప్రాంతాల, రాష్ట్రాల మనుగడకు భాష, విద్య సంస్కృతి, చరిత్ర, సహజవనరులు, అభివృద్ధి వంటి అంశాల్లో కేంద్రం సహకారం అందిస్తూ వాటి అభివృద్ధికి తోడ్చడాలి. అంతేగాని, అందుకు విరుద్ధమైన విధానాలను చేపట్టకూడదు. అప్పుడు ప్రతిఘటన నెదుర్మోవలసివస్తుంది. అది ప్రజల మధ్య ఐక్యతకు, శాంతికి, అభివృద్ధికి భంగం కలిగిస్తుంది.

ఇప్పుడు కేంద్రపాలకులు అనుసరించదలచుకొన్న - ముఖ్యంగా పరిపాలన, విద్యారంగాల్లో భాషా విధానం పట్ల వారు చేపడుతున్న చర్యలు పూర్తిగా సందేహాస్పదంగా ఉన్నాయి. ఇవి రాష్ట్రాల - ముఖ్యంగా హిందియేతర భాషా రాష్ట్రాల మౌలికతకు, మనుగడకు గొడ్డలి పెట్టు కానున్నాయి. పూర్తిగా అమలులో కొచ్చినట్లయితే క్రమంగా ఇవి దేశైక్యతకు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వం ఆశించే హిందూత్వ విధానాలకు కూడా ప్రతిబంధకం కానున్నాయనే అంశాన్ని పాలకులు తెలుసుకోవాలి.

ఇప్పుడు గత ఏడాదికి పైగా చర్చల్లో నలుగుతూ ఇటీవలే బయటకు వచ్చిన జాతీయ విద్యావిధానంలోనూ,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

7