పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరవింద్‌ సర్దానా

తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం లేదు?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యను పూర్తిగా ఆంగ్రమాధ్యమంలోకి మార్చేస్తూ ఉత్తర్వులిచ్చిన సంగతీ, ఆ తర్వాతి పరిణామాలూ, చివరికిది భారత ఉన్నత న్యాయస్థానం ముందుకు వెళ్లడం- ఇదంతా తెలిసిందే. ఆయితే, ఆంగ్లమాధ్యమం పట్ల మోజుపెరగడంతో మరి కొన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఆంగ్రమాధ్యమాన్ని ఐచ్చికంగా అమలు చేస్తున్నాయన్న నిజం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మన పొరుగునే ఉన్న తమిళనాడులోనే ప్రభుత్వం ఐచ్చికంగా ఆంగ్రమాధ్యమాన్ని ప్రవేశపెట్టిందనీ, దానివల్ల చేదు అనుభవాలను పొందుతున్నదన్న వాస్తవాన్ని అందరూ గర్తించాలనీ, కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, కొన్ని అధ్యయనాల వివరాలతో అరవింద్‌ సర్జానా వ్రాసిన ఈ వ్యాసాన్ని చదవండి. -సంపాదకుడు

కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వ విద్యావైఫల్యానికి ఆంగ్ల మాధ్యమమే విరుగుడుగా భావించాయి. ఆంధ్రప్రదేశ్‌ అయితే దీనిని అందరూ చేపట్టాలని ఆశిన్తున్నది. తమిళనాడులో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో మాధ్యమంగా ఆంగ్లం ఐచ్చికం.

(ఫైవేటు పాఠశాలలతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గిందని తమిళనాడు ప్రభుత్వం గమనించింది. ఈ తగ్గుదల ఆంగ్లం వైపు ప్రజల మొగ్గుకు తార్మాణమని తమిళనాడు (వ్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా తమిళనాడు మంత్రి ఒకరు 2012 లో శాననసభలో చెప్పడం జరిగింది. ఆంగ్ల మాధ్యమం అమలు చేయడం వల్ల పాఠశాలలు గ్రామీణ పిల్లలకు ఆకర్షణీయంగా తయారవుతాయని ఆయన అన్నారు. అప్పటి నుంచి, ప్రభుత్వ పాఠశాలలోకి దాదాపు 3,00,000 మంది పిల్లలు చేరారు.

తమిళనాడు రాష్ట్ర విద్యాశాఖ వారి 2013-2014 సంవత్సర విధాన పత్రంలో.... ఆంగ్ల మాధ్యమం నవ సంక్షేమ పథకాలలో ఒకటి అని ప్రకటించి, ఉచిత యూనిఫాం, క్రేయాన్లు, జామెట్రీ పెట్టెలు ఇవ్వడం వల్ల , ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ పిల్లలను బాగా ఆకర్షిస్తాయని పేర్మాన్నది.

ఒక వైపు, ప్రభుత్వ విద్యకు కట్టుబడి వుండి, క్షేత్ర స్థాయిలో వచ్చిన మార్పులకు తగ్గట్టుగా ప్రభుత్వం న్పందిన్తున్నట్లు చెప్పవచ్చును. కానీ సమస్య న్వభావం, సమస్య వట్ల సరైన స్పందన... “నాణ్యమైన విద్య” భావనపట్ల ప్రశ్నలను, ఆంగ్లాన్ని మాధ్యమంగా అమలుచేసే ప్రేరణ పట్ల ప్రశ్నలను రేకెత్తిస్తుంది.

తమిళనాడు ప్రభుత్వం తన విధానాన్ని ఒక “గొప్ప సాధన” గా ప్రకటించి, విద్యార్థుల నమోదు. రాష్ట్ర స్థాయి సాధన సర్వేలో ఆంగ్లం పెరుగుదలను ఉదహరిస్తున్నది. కానీ, ఉపాధ్యాయులు మరోవిధంగా చెప్తున్నారు. చాలా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో చలే ఆంగ్లం మాట్లాడ గలరు గనుక, తరగతులు 'ేరులోమాత్రవేం ఇంగ్లీషు మాధ్యమంగా, ఒక బలవంతపు విధానంగా ఉందని వారంటున్నారు.

నిర్బంధ విధానం

కాంచీపురం జిల్లా లో 3-4 తరగతులలో 28 మందికి గానూ, 25 మంది పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారు. రెండు మూడు నంవత్సరాల కిందట వారు బడికి రావడం ప్రారంభించినప్పుడు, తమిళం మాధ్యమంగా వుండేది. కాన్మీ గత సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ్రారంభించినవుడు, ఓ ముగ్గురు తప్ప అందరూ ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ఆ ముగ్గురు అదే తరగతిలో కొనసాగుతున్నారు.

(ప్రధాన ఉపాధ్యాయురాలు, తమతో తమిళనాడు ప్రభుత్వం ఈ విధాన మార్పు గురించి చర్చించలేదన్నారు. అయినప్పటికీ, ఆంగ్ల మాధ్యమం గురించి తల్లిదండ్రులను నిరుత్సాహవరచలే దన్నారు. 3-4 తరగతులను బోధించే సుప్రియ, పిల్లలకు తమిళమే ఉత్తమం అన్నారు. “ఆ మాటే వారి తల్లిదండ్రులతో చెప్పితే ఎక్కడ పిల్లలు బడి మానేస్తారోనని మేం భయపడుతున్నా” మని ఆమె తెలిపారు.

కార్యాచరణ ఆధారిత బోధనా పద్ధతి

“అక్షరాలు లేదా పదాలు,చిన్న వాక్యాలు నేర్పడం ఉపాధ్యాయులకు పెద్ద సమస్య కాదు, 1వ తరగతి నుంచే ఆంగ్లాన్ని రెండవ భాషగా బోధిస్తూనే వున్నాము! అంటుంది నువ్రియ. నమన్యంతా, ఆంగ్లంలో పదాలను, ఆలోచనలను, భావాలను వివరించలేము. అదీ కూడా, బొమ్మలలో వివరించ లేనప్పుడు. తమిళనాడు ప్రాథమిక పాఠశాలల్లో, ఒకే ఉపాధ్యాయుడు అన్ని పాఠ్యాంశాలు. నేర్పుతారు. భాష, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం, గణిత శాస్త్రం....అన్నీ ఒకరే బోధిస్తారు. సుప్రియ కష్టంగా ఆంగ్లంలో మాట్లాడుతుంది. అందువల్ల, అన్ని తరగతులలాగే ఆమె | తెలుగుజాతి పత్రిక అవ్మునుది ఈ అక్టోబరు-2020 |