పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అప్పిరెడ్డి హరినాధరెడ్డి 90630 17187

దోనయామాత్యుని

సస్యానందము : సమకాలీనత

భారతీయ సాహిత్యంలో (ప్రాబీన కాలం నుండి అనేక

నాయి. శాస్త్రగ్రంథాల కంటే

ఎక్కువగా సాహిత్యం, చరిత్ర,

నహజం. ఇతివృత్తం ఏ కాలానిదైనా అప్పటి సమకాలీన సమాజం కూడా వాటిలో (ప్రతిబింబి స్తుంది.

ప్రస్తుత సమకాలీన సమాజానికి ఆ రచనలు, లేదా అందులోని అన్ని అంశాలు ఉపయోగపడకపోవచ్చు. అవి ఒక చారిత్రక వరిణామక్రమం అధ్యయనానికి తోద్బడతాయి. శాస్త్రగ్రంథాల విషయానికి వచ్చినప్పుడు నేటి సమాజానికి తప్పకుండా అవి వినియోగపడతాయి. మనిషి భౌతిక అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్రం ఏ కాలంలో అయినా ప్రకృతి పరిశీలన కార్యకారణ నంబంధం, (ప్రాథమిక శాస్త్ర నియమాలతో రూపొందుతుంది. ఆ శాస్తనియమాలు ఏ తరానికైనా ప్రామాణికంగా నిలుస్తాయి. అందుకే ఒకనాటి భారతీయ శాస్త్ర (గ్రంథాలు నేటి సమకాలీన సమాజంలోనూ నిలబడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దోనయామాత్యుని “సస్యానందం లేదా వర్షశాస్త్రం” గ్రంథాన్ని గురించి ఇందులో పరిశీలిద్దాం.

దోనయామాత్యుడు [గ్రంథ అవతారికలో రాసుకొన్న వద్యాన్ని బట్టి క్రీ.శ 1856 కాలం చెందిన వారని, తల్లిదండ్రులు మాచిరాజు, రుద్రమ్మలుగా తెలుస్తుంది. మరాక పద్యంలో...

“వనుధలోన బరమ వంళ విభూవణ/ వమైన నన్నుపేం ్రుడాదరింవ / శ్రీకరముగ నర్వలోకాశయము జెవీ /మిన్నుముట్ట కీర్తిగన్నవాడ.. అని చెప్పుకున్నాడు. ఉపేంద్ర చక్రవర్తి ఆదరణతో 'సర్వలోకాశ్రయం” అనే (గ్రంథం రాసి లోకంలో ప్రసిద్ధి పొందానని తెలియజేసాడు. ఈ ఉపేంద్రుని విషయమై నిడదవోలు వేంకటరావు భారతిలో వంశవృక్షం ప్రకటించారు. ఉపేంద్రుడు తూర్పు చాళుక్య శాఖవాడు. కళింగ సీమలోని ఎలమంచిలి సర్వసిద్ధి మండలంలో పాలన చేశాడు. 1350లలో ఇతను ఉన్నట్లు నిడదవోలువారు నిర్ణయించారు.

సస్యానందం [గ్రంథం నాలుగు తాళపత్రాలు, రెండు రాత ప్రతులు సి.పి బ్రౌన్‌ సేకరించాడు. ఇవికాక ఇంకా జనంలో ఉండే వీలుంది. 1891లో పువ్వాడ సూర్యనారాయణరావు అండ్‌ బ్రదర్స్‌ వారు తదకమళ్ళ వేంకటకృష్ణారావు గారిచే పరిష్మరింవచేని ప్రచురించారు. సంగ శేషాచలశాస్త్రి తాత్పర్యం రాసారు. ఆ తర్వాత 1915, 1921లలో ఇది పునర్ముద్రణ అయింది. 1955లోను (ప్రచురణ అయినట్టు ఆరుద్ర గారు పేర్కొన్నారు. 'సస్యానందము - దోనయామాత్యుడు” అనే వ్యాసాన్ని భారతిలో 1946లో జూన్‌ నెలన నిడదవోలు వేంకటరావు రాసారు. విలువైన అంశాలు అందులో వెలుగు చూశాయి. ఆ తర్వాత కాలంలో చాగంటి శేషయ్య, ఆరుద్రలు తమ (గ్రంథాలలో దోనయామాత్యుడికి స్థానం కల్పించారు. 1921 ప్రతి ఆధారంగా ఉన్నం జ్యోతివాసు పరిష్కరణ - విస్తృత పీఠిక రాసారు. 2016లో శ్రీమతి రావి కృష్ణకుమారి, చీరాల వారు ప్రచురించారు. కొత్త చూపుతో జ్యోతివాసు ఇందులో విషయాలను ప్రస్తావించారు.

సస్యానందానికి మరో పేరు వర్ష శాస్త్రం. సస్యాలు అంటే పంటపొలాలు. అవి ఆనందంగా పండాలంటే వానలు కావాలి. వానల గురించి వివరిస్తుంది కాబట్టే వర్షశాస్తం అని కూడ ఈ గ్రంథానికి పేరు వచ్చింది. వాన రాకడ ప్రాణం పోకడ చెప్పలేమనే సామెత కూడా ఉంది. వానల రాక గురించి తెలుసుకోవాలసిన అవసరం, ఆసక్తి రైతులకు తప్పని సరి అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుడయిన దోనయామాత్యుడు ఈ వానల విషయమై రాయలను కొన్నాడు.

“వానచేత సన్యవర్ధంబు వర్ధిల్లు /(సస్యవ్చద్ధి నకల జన నవృద్ధి/ కారణంబు దాన గావున ధరలోన/ వానవలయు నెల్లవారలకును”.... అని అంటాడు.

ఈ గ్రంథం రాయడానికి పూర్వుల గ్రంథాలను, అప్పటికే ప్రజలు అనుసరిస్తున్న పద్ధతులను ఆధారంగా చేసుకొన్నానని వివరిస్తూ... “అను లోకోక్తులాకర్ణించి గార, వరాహమిహిర, లల్లాది, సంహితా సారంబులు గూర్చి ప్రవర్న వివర్శణంబులు జనులకు బోధ సేయుటకై సస్యానందము జెప్ప నుద్యోగించితిని” అని అంటాడు. తన వూర్వుల కృషిని నిజాయితీగా దోనయామాత్యుడు ప్రకటించాడు.

వేదాంగాలలో జ్యోతిషం ఒకటి. గ్రహగతులు, నక్షత్రాల ఆధారంగా కాలనిర్ణయం చేయడం, ఆయా కాలాల బట్టి మంచి చెడుల ప్రభావాలను జ్యోతిష్యం తెలియచేస్తుంది. జ్యోతివ్యశాస్త్రం ఆధారంగా వర్షాలపై కూడా పూర్వ గ్రంథాలలో అనేక ప్రస్తావనలు ఉన్నాయి. నంన్కృత భాషలో ఉన్న వాటిని తెలుగు భాషలో రైతాంగానికి అర్ధమయ్యే విధంగా పద్యగద్యాలలో దోనయామాత్యుడు రాసారు. సస్యానందంలోని పద్యాలు రైతుల నోళ్ళలో వ్యాపించాయి. కేవలం పూర్వ (గ్రంథాలలోనివే కాకుండా, లోకంలో అనుసరిస్తున్న ఇతర శాష్రీయ పద్దతులను కూడ ఇందులో దోనయామాత్యుదు చేర్చాడు. ప్రకృతి, వాతవరణ పరిస్థితులను పరిశీలించి, ప్రయోగం ద్వారా నిరూవణలైైన వాడుకలోని అనుభవాలను కూడా సస్యానందంలో వివరించడం విశేషం.

సస్యానందంను మొత్తం 232 పద్యగద్యాలతో, నాలుగు ప్రధాన అధికారాలుగా విభజించాడు. ఆయా ఆంశాలబట్టి అంతర్గత విభజన కూదా చేశాడు. సరైన పద్ధతిలో మేఘము కనిపెట్టి, మేఘ గర్భ | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |