పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ధారణను, గర్భపాతమును, గర్భపాత కారణాలను, గర్భ పరిపక్వ కారణాలు, గర్భము ఫలించు కారణాలు చక్కగా తెలుసుకొని వర్షము కురియుట, కురవకపోవుట చెప్పాలి. నోటికి వచ్చనట్లు తెంపు చేసి చెబితే సభలలో అవమానం పొందుతారు; గౌరవం కోల్పోతారని దోనయామాత్యుడు హెచ్చరిస్తాడు. శాలివాహన శక సంవత్సరాలను ఎనిమిదితో పెంచి వచ్చిన మొత్తాన్ని తొమ్మిదిచేత భాగించగా వచ్చిన శేషము బట్టి ఆయా సంవత్సర మేఘాల నిర్ణయం చేయాలంటాడు. శేషము 1 అయితే ఆవర్తనవేఖుము, 2 నంవర్తనవేఘము, 8 వృష్మరవేఛుము, 4 ద్రోణవేవుము, 5 కాలవేవుము, 6 నీలమేఘము, 7? కారుమేఘము, 8 గౌనీమేఘము, 9 తమము అని శేషసంఖ్యల ఆధారంగా. మేఘనిర్ణయం చేశాడు.

వర్షానికి ఆధారమైన ధాతువులుగా వాన, మంచి ఎండ, మంచి శీతము నలువైపుల వ్యాపించు మేఘము, ఉరుము, మెరువు, పరివేషము, ఇంద్రధనుస్సు, మంచు, వాయువులను పేర్కొన్నాడు. సూర్యుని వేడికిరణాలు భూమిపై వ్యాపించి జలం ఆవిరి రూపాన పైకి తీసుకెళ్లే కాలాన్ని గర్భకాలము అన్నాడు. ఆ ఆవిరి మరల వర్షంగా మారే కాలాన్ని ప్రసవకాలం అని వివరించాడు. మేఘాలు గర్భం దాల్చి నూటనలుబదియేదవ దినం భూమంతయు కానరా కుండ వర్షిస్తుందని వివరించాడు.

గ్రహాల స్థితిగతులు, రాశుల బట్టి ఆయా మాసాలలో వర్షం పడే విధానాన్ని తెలిపాడు. ఉదాహరణకు... వృశ్చిక రాశియందు సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు ఉండే రాశికి, రెండు, మూడు, నాలుగు రాసులతో అనగా ధనస్సు, మకర, కుంభమందు శుక్రుడు, బుధుడు, బృహస్పతి చంద్రుడు అనే ఈ నాలుగు గ్రహాలు ఉన్నట్లయితే భూమి అంతటా వర్షాలు పడదతాయంటాడు.

సూర్యుడు అనూరాధలో ప్రవేశించునపుడు గానీ, మూలా నక్షత్రములో ్రవేశించునపుడు గాని కొంచమైన వాన పడకపోతే ఆ కార్తె మొదలు పదునాలుగు దినాలు వాన ఉండదంటాడు. సూర్యుడు జేష్ట నక్షత్రంలో ్రవేశించునపుడు మేఘాలు దట్టంగా ఉంటే వర్షం వస్తుందని వివరించాడు. మార్గశిర, స్వాతి, ఆరుద్ర, శతభిషములలో వాన, ఎండ మేఘము, ఉరుము, పరివేషము అనే ధాతువులలో ఏ ఒక్కటి ఆకాశంలో కనిపించినా సస్యసమృద్ధిగా వానలు వస్తాయి.

పుష్యమాసములో మూలా నక్షతం మొదలుకొని అమావాస్య వరకు తూర్పుగాలితో కూడిన వాన దట్టంగా వస్తే మొదటి కారు పంటలకు సమృద్ధిగా వానలొస్తాయి. చైత్ర శుద్ధ పూర్ణిమకు లోవల నాలుగు దినములలో వానలు కురిస్తే, ఆ సంవత్సరం రెండవ పంట సమయంలో వానలు తక్కువగా కురుస్తాయి.

వైశాఖంలో ముందుగా పడమటి వైపున మబ్బుపట్టి ఎంత నేల చినుకులు పడతాయో ఆ నేలంతా ఆ సంవత్సరం చక్కగా వానలు పడతాయి. ఈ మానంలో మబ్బుపట్టి ఉరుము శబ్దం ఎంతవరకు వినివిన్తుందో అంత దాకా వానలుంటాయని వివరించాడు. ఈ విధంగా ఆయా మాసాలలో వర్షాల స్థితిగతులు క్రమపద్ధతిలో వివరించాడు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారమే కాకుండా ప్రకృతి పరిశీలన, వాతావరణ మార్పులు, జీవరాశుల ప్రతిస్పందనలబట్టి కూడా శాస్త్రీయంగా వానల గురించి సస్యానందంలో నమోదుచేశాడు.

సంవత్సర కాలంలో మొత్తంగా వానల వరిన్థితిని అంచనా వేసేందుకు నాగలికి దూది పెట్టి వర్ష రాకలను అంచనా వేసే తులాపరీక్ష పద్ధతిని వివరించాడు.

పుష్యశుద్ధ పూర్ణిమ నాటి ప్రదోష సమయంలో పలిమెడు దూది నాగలికి తగిలించి ఏ అడ్డు లేకుండా బయలులో ఉంచాలి. మరునాడు ఉదయం ఆ దూది పిండాలి. ధారగా నీళ్ళు వస్తే మరుసటి సంవత్సరం వానలు సమృద్ధిగా పడతాయి. కొన్ని బిందువులే దూది నుండి వస్తే మధ్యరకంగా వానలొస్తాయి. దూది మంచునీటితో కనీసం తడవకపోతే వానలు కురియవు అని పేర్కొన్నాడు. ఒక ప్రయోగం ద్వారా ఇలా శాస్త్రీయంగా ఇలా ఆరోజులలో ఒక అంచనాకు రావడం విశేషం.

మెట్టకప్పలు కూసినపుడు, జంతువులు నీళ్ళలోకి దిగినవుడు, చిన్న చిన్న చేపలు ఎగిరినపుడు, తామర పుప్పోడిలో తొండలు పొర్గాడినపుడు పంటలు బాగా పండేలా వానలొస్తాయి. భూనాగాలు 'మెట్టను విడవకుండా పొర్గాడినపుడు, పశువులు కారణం లేకుండా పుట్టలు, మెట్టల మీదికి ఎక్కినపుడు దట్టంగా వానలొస్తాయి. ఊరి పొలిమేరలలోని పశువులు తోకలెత్తుకౌని, అంభారాలు చేస్తూ (గ్రామంలోకి ప్రవేశించినపుడు, సంతోషంతో చీమలు ముక్కున (గ్రుడ్లు కరచుకొని బారులుతీరి పోతుంటే, సకల దిశల వ్యాపించిన మేఘాలు నదినెత్తిన మెరుములతో ఉంటే, అనేక సార్లు తూర్పుగాలులు భూమిపై వ్యాపిస్తే, ఆకాశంలో గోమూత్రం వంటి కాంతులు దట్టంగా వ్యాపిస్తే తప్పక వానలొస్తాయి.

సూర్యోదయం, నూర్యాస్తమయాలలో కొంచం ముందుగా కుక్కలు మొరుగకున్న ఎడల నష్టం కలిగించని, పైరులకు భంగంలేని వాన వస్తుందని వివరించాడు.

పై వాటిలో జంతువుల వింత ప్రవర్తనలు, అరుపుల వెనుక శాస్త్రీయ అంశాలు దాగి ఉన్నాయి. సునామి వచ్చిన సందర్భంలో కొంత ముందుగానే అనేక తీరప్రాంత జీవరాశుల విచిత్ర ప్రవర్తనను గుర్తించారు. అలాగే భూకంపాలు తదితర సందర్భాలలో తక్కువ స్థాయి తరంగాలను కూదా జీవరాశులు ముందుగా గుర్తిస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ గ్రంథంలో వర్షాలకు ముందు జీవరాశుల ప్రవర్తనను దోనయామాత్యుడు నమోదు చేశాడు.

తొలకరి వాననీటి రుచిని బట్టి ఆ సంవత్సరం ఏయే పంటలు పండుతాయో ఇలా వివరిస్తాడు. వగరు, కారంగా ఉంటే కొర్రపైరు, చేదుగా ఉంటే నువ్వులు, తియ్యగా ఉంటే పత్తి, కుసుమలు, చప్పగా ఉంటే మద్దిగడ్డలు, కసురుగా ఉంటే జొన్నలు, గోధుమలు, పుల్లగా ఉంటే వరిగెలు, సజ్జలు, చిట్టిచామలు బాగా పండుతాయి. ఉప్పుగా ఉంటే ఆ సంవత్సరం పంటలు ఎక్కువ తాలు కంకులే అవుతాయని వివరించాడు.

వర్షం రావడానికి వాయువు కీలకం అంటాడు. వాయువు వలనే మేఘములు పుడుతాయి. మేఘాలు విచ్చిపోయి వానలు వస్తాయి. వాయువు వలన ఉరుముల వస్తాయి. సర్వానికి వాయువే కారణం అని వాయు లక్షణాలు వివరించాడు.

ఆషాదశుద్ధ పున్నమి నాడు మొదటి జామున గాలి వీస్తే (శావణంలో, రెండవ జామున గాలి వీస్తే భాద్రపద మాసంలో, మూడవ జామున వీస్తే అశ్వయుజమాసంలో, నాలుగోవ జామున | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |