పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. కొందరు పిల్లలు పదేళ్లు బడిలోఉన్నా చదవలేకపోవడానికీ, రాయలేకపోవడానికీ కారణం టీచర్లు చెప్పకపోవడం కాదు, టీచర్లు చెప్పకపోయినా బడికి వచ్చినందుకైనా 50 అక్షరాలు గుర్తుపట్టి అక్షరం పక్కన అక్షరం పెట్టి చదవడం రాయడం స్వయంగా నేర్చుకొని ఉండాలి. ఆ మాత్రం నేర్చుకోగల్లిన శక్తిసామర్థ్యాలు పిల్లలకున్నాయి. బడిలో టీచర్ల వల్లా బోధనా పద్ధతులవల్లా విల్లల్లో ఏర్పడ్డ మానసిక సమస్యఇది.

4. భయం- ఈ అర్ధంగాని చదువుల వల్లా, టీచర్‌ మాటలవల్లా పరీక్షలు, మార్కులు, పాన్‌, ఫెయిల్‌- ఇలాంటి వాటి వలన బడిలో ఒకరకమైన భయం ఏర్పడుతుంది. ఈ భయం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆరోగ్యంపైన (ప్రభావం చూవిన్తూ ఉంటుంది.

5. ఆత్మన్యూనత - చాలా విషయాలు అర్ధం కానందు వల్ల నిరంతరం ఇతరులతో పోటి ఉన్నందు వల్ల (పరీక్షలు మార్కులు ఒక రకమైన పోటీయే) ఆత్మన్యూనత ఏర్పడుతుంది. తనను తాను అసమర్భునిగా భావించుకొంటాడు.

6. విల్లలను చదువులపేరుతో హింసించడం తిట్టడం మాని ఆత్మవిశ్వాసం కల్లించేలా ధైర్యం చెప్పాలి. ప్రోత్సహించాలి. భయాన్ని ఆత్మన్యూనతను పోగొట్టాలి. వానే చదువుకౌంటారు. వృత్తి నిపుణులపేరుతో కొంతమంది కౌన్సిలింగ్‌ ఇస్తూ పిల్లల్ని హింసిస్తూ ఉంటారు. ఈ కౌన్సిలింగ్‌ సన్నిహితంగా ఆత్మీయంగా ఉండే టీచరే చేయాలి. ఈ విషయాలన్నీ నాకు గుర్తుకురాగానే నా పని సులువుగానే పూర్తవుతుందని నమ్మకం ఏర్పడింది.

సాయంకాలం బన్సుదిగగానే (వసాద్‌ శంకర్‌లు పరుగెత్తుకొంటూ నా దగ్గరకొచ్చారు. ఇంటికెళ్లి బడలిక తీర్చుకొని ఒక అరగంటలో వస్తానని చెప్పాను. పాపం వారి ఆత్రం వారిది. నాకూ ఆసక్తిగానే ఉంది. ముందు వారికెంత వచ్చో, ఏమిరాదో తెలుసుకోవాలి. గణితం, భాషల్లో ప్రాధమిక విషయాలు (బేసిక్స్‌) ఎంత వచ్చో తెలుసుకోడానికి నేను కొంత సరంజామా సిద్ధంచేసుకొని ఉన్నాను. ఈ నరంజామా నాలుగు స్థాయిల్లో ఉంటుంది. ఈ సరంజామా అంతా తీసుకొని శంకర్‌ పనిచేసే ఫొటోస్టూడియోలో కూర్చొన్నాం. ఒక అరగంటలోనే వారికెంత తెలుసో? రానిదేదో అర్ధమైపోయింది.

వీరికి తొంభైశాతం వచ్చు. మిగిలిన పదిశాతం కూడా నందేహాలేకానీ రాకపోవడంగాదు. గణితంలో బాగా వెనుకబడి ఉన్నారు. స్థాన విలువలు, సంఖ్యామానం, క్లిష్టంగా ఉన్న తీసివేతలు, భాగహారాలు, ఆయా సందర్భాలలో సున్న(0) విలువ తెలియదు. వదిరోజుల కృషితో దారిలో వడ్డారు. ప్రోత్సాపాంచడం, థైర్యంచెప్పడం కాన్ని చిన్నవిన్న పొరపాటు అభిప్రాయాలను సరిదిద్ది ధారాళంగా చదివే అలవాటు చేయడం. ఇవే నేను చేసిన పనులు. వారి శ్రద్ధా, భవిష్యత్తు మీద ఆశా, అవసరాలే వారు వేగంగా నేర్చుకొనేటట్లు చేసాయి.

పదిరోజులు నేను చేసిన కృషి వివరిస్తాను.

1. పరీక్షించిన రోజునుంచే పని ప్రారంభించాను. వారికి ఇప్పుడు రాయడం ముఖ్యం. తప్పుల్లేకుందా రాయాలంటే మొదటచేయాల్సిన వని స్పష్టంగా, భావయుక్తంగా, ధారాళంగా చదవడం రావాలి. ముక్కుకూ, నసుగుతూ చదువుతున్నారు. ఎలా చదవాలో వినిపించి చిన్నచిన్న కథల పుస్తకాలిచ్చి రాత్రికి బాగా చదువుకొని రమ్మని చెప్పాను. పాపం రాత్రి చాలాసేవు మేలుకొని ఒక్కో కథ నాలుగైదుసార్లు చదివి, మరుసటి రోజు నాకు చదివి వినిపించారు. నేను ఆశ్చర్యంపోయాను. ఒక్కరోజులోనే చాలా అభివృద్ధి కనబడింది. అంటే పఠనాన్ని ఎంత నిర్తక్ష్యం చేస్తున్నామొ అర్ధమయింది.

2. భయాన్ని సిగ్గుపడటాన్ని దానికి కారణాలను వివరించి - తప్పో ఒప్పో రాయడం, మనం రాసింది మనవే తప్పులు సరిచూనుకోవడం, వుస్తకంలో ఉన్న కథలను సొంతమాటల్లో రాయడం అలవాటు చేసాను. రాసేటప్పుడు ఎక్కువగా చేసే పొరపాట్లను సరిదిద్దాను.

3. ఎక్కువ తప్పులు పోతున్నవి గుడిదీర్టం, ఏత్వం, ఓత్వం- ఉన్నచోట్ల తీసేయడం లేనిచోట్ల ఇవ్వడం-దీనికి కారణం వీటిని దీర్ధంగా భావించడంలేదు. కకా, కికీ, కుకూ, కెకే కొకో, ప్రతి రెండో అక్షరం దీర్షమే. పొల్లు అన్నా దీర్జంఅన్నా ఒకటే, సౌలభ్యంకోసం కొన్ని అక్షరాలకు దీర్జాన్ని 'కా మాదిరి భూమికి సమాంతరంగా. కాకుండా పైకి మళ్లించారు. "కీ, కే, కో- ఈ మూడు అక్షరాలకు దీర్ధం(పొల్లు) భామిక సమాంతరంగా రాస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అర్ధం చేసుకోవడం కష్టం అవుతుంది కదా.

ఇలా వివరించి రాసేపదాన్ని ముందుగా పైకి పలుకుతూ రాయమని సలహా ఇచ్చాను.

4. ద్విత్వాలు(క్కప్ప) తప్పుల్లేకుండా రాస్తున్నారు. కాని సంయుక్తాలు (క్ర, రృ) అక్కడక్కడా ఇబ్బంది పడుతున్నారు. విడదీసిరాయడం ఎలాగో నేర్పించాను.

సుల్తాను - సుల్‌తాను, - కార్యం - కార్‌యం

చక్రవర్తి - చక్‌ రవర్‌తి, ప్రయత్నం - ప్‌ రయ త్‌నం. హల్లు నిండు అక్షరంగాను, నిండు అక్షరం వత్తుగాను మారడం గమనింవచేసాను.

5. ష స శ చ-ల ళ-న ణ - లమధ్య ద్వని బేధాలను గుర్తింపజేసి తప్పులు రాసే సందర్భాలను తెలియజేసాను.

6. వత్తు అక్షరాలు -ఖఘఛరుఠతధథధఫభ - ముఖ్యంగా ధ,భృఫ-లు ఎక్కువగా వాడుకలో ఉన్నకొన్ని పదాలను గుర్తించి ఒక జాబితా ఇచ్చాను.

7. జృఇరుథ - వీటిని చూసి భయపడకుండా ఏపదాల్లో వస్తాయో వివరించాను.

8. అనుమానం వచ్చినపుడు ఎలా మాట్లాదుతున్నామో అలాగే రాసి, తరువాత తప్పొప్పుల గురించి ఆలోచించి సరిచేసుకోవల సిందిగా సలహా ఇచ్చాను.

9. మ, య - గుణింతంలో మొమో-యెయో-ఇలా రాసే సంప్రదాయాన్ని తెలిజేసాను.

10. ప్రామిసరీనోటు రాయడం, రశీదు రాయడం, అప్లికేషన్లు పూర్తిచేయడం, రైల్వే రిజర్వేషన్‌ఫారం పూర్తి చేయడం, బయోడేటా రాసిపెట్టుకోవడం, ఆర్జీరాయడం, బ్యాంకులావాదేవీలు, జమ చేయడం, నగదు తీసుకొనే ఫారాలు పూర్తిచేయడం నేర్పాను.

11. గణితంలో రానివేవో అవినేర్పాను. సులభంగానే నేర్చుకొన్నారు. జమా ఖర్చులు ఎలారాయాలో నేర్పాను. బ్యాంకు | తెలుగుజాతి పత్రిక జవ్మునుడి. ఉ అక్టోబరు-2020 |