మన ప్రాచీన విద్యా సంస్థలు
మనపూర్వపు విద్యాపర్థతి ఇప్పటి విద్యాపర్థతికంటె రుత్తమమైన దయినను కాకపోయినను అశోక, కృష్ణదేవరాయ, శివాజీలవంటి ప్రభువంగవలును, యుగంధర, తిమ్మరసాదులవంటి మంత్రివరేణ్యులును, కాళిదాస. భవభూత్యాదులవంటి కవివతంసులును, నాగార్జున, శంకరా చార్యాదులవంటి మతసంస్క ర్తలును విలసిల్లుటకు కారణభూతమై, జాతీయాభ్యుదయమునకును, వాఙ్మయని కాసమునకును, దేశీయ పురోభివృద్ధికిని దోడ్పడి, హైందవ విజ్ఞాన కాంతి కిరణములను నలుదెసలఁ బ్రసరింపఁ జేసి, భారతజాతి కఖండ గౌరవప్రతిష్ఠలను సముపార్జించి పెట్టిన డగుట చేత నది సంస్తుతి పాత్రమును, చిరస్మరణీయార్హమును గాకపోను. అందువలన రమారమి రెండు వేల యేండ్లు మన జాతీయహృదయమును పూర్తిగ వశపఱుచుకొని, ఐహికాముష్మిక సుఖములకు దారిచూపిన మన పూర్వకాలపు విద్య ఎచ్చ పెచ్చట నెక్లెట్లు వర్ధిల్లినదియు తెలిసికొనుట యుక్తము.
మన దేశచారిత్రము బౌద్ధయుగమున ఆరంభ మగుచున్నది. బౌద్ధయుగమునకు పూర్వపు విద్యాసంస్థలను గుఱించి మనకు బాగుగ తెలియదు; కాని వేద కాలమున పరిషత్తు లుండెడి వనియు, అచ్చటికి బహుశాస్త్ర వేత్తలు, వేద