పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23 అమరావతీస్తూపము

వాదమును బ్రతిపాదించినవాఁడు బౌద్ధ శ్రావకుఁ డయిన యార్య నాగార్జునుఁడు. మహాయాన మత స్థాపకుఁడే యితఁడని కొంద అందురు కాని ఇతనికి పూర్వమే మహా యాన బౌద్ధ మావిష్కరణము నొందుటకుఁ గారణములయిన యభిప్రాయములు బౌద్ధసంఘమున నిగూఢములుగ నుండిన పనియు, ఇట్టి యభిప్రాయములు నదివఱకే వెలువఱుచుచు వచ్చిన దూచార్యులు కొందఱు కల రనియు కొంద దుకు ; కాని మహాయానము ఆర్యనాగార్జునుని వలననే ప్రఖ్యాతమయి వర్ధిల్లినదని యెల్లరు నంగీకరింతురు.

జన్మచేత బ్రాహ్మణుఁడయి, మతావలంబనమున బౌద్ధుఁ డయిన యీ యార్య నాగార్జునుని కాలమును గుఱించి కాని, జన్మస్థలమును గుఱించి కాని మనకు నిశ్చయముగఁ దెలియదు. కొంద తీ యాచార్యసత్తముఁడు క్రీస్త్వబ్దమునకు పూర్వము మొదటిశ తాబ్ది యంతిమ భాగమునం దుండెననియు, మఱి కొందఱు క్రీస్తుశకము రెండవ శతాబ్ది యంతిమభాగమునను, మూఁడవ శతాబ్ది యారంభమునందు నుండెననియు వాదిం తురు; క్రీస్తుశకము రెండవ శతాబ్దినాఁటివాఁడను నభి ప్రాయమే యిప్పుడు ప్రబలముగ నున్నది. విదర్భయందలి యమరావతిలో జన్మించెనని కొండలు, దక్షిణ కోసల దేశీయుఁ