పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరావతీస్తూపము 22

కాని తాను నిర్వాణము నొందనని 'ప్రణిధానము 'ఁ గావిం చినవాఁడు. బోధిసత్వులు భార్యాసహితులు : సంపత్స తులు, మహాయానమున వీరు అసంఖ్యముగ వెలసిరి. వీరి చుట్టు నపూర్వములయిన గాథ లనేకము లల్లుకొని, మహా యానమునకు గొప్పపురాణ వాఙ్మయమును (Mythology)బ్రసా దించినవి. ఇట్టి బోధి సత్వులలో నొకఁడును, బౌద్ధమున విద్యా సంస్కృతుల కధి దై వతమును అయిన ' మంజుశ్రీ'కి 'మాలధ్వజ వ్యూహ చైత్యము' (ధాన్యకటక చైత్యము) చెంత నున్న మహారణ్య మావాసమనియు, నతఁడు ఆ ప్రాంతమున నివ సించుచుండిన నాగవంశ్యు లనేకులను, ఇంక నితరులను బౌద్ధులను గావించె ననియు 'గండ వ్యూహ' మను గ్రంథము నఁ దెలుపఁబడినది.

మహాయానము వి స్తరిల్లిన కాలముననే అమరావతీ స్తూపము పేరు పెంపులు గాంచి విఖ్యాత బౌద్ధ క్షేత్రమయి విలసిల్లినది. ఈ నూతన బౌద్ధ మావిష్కరణము చెందిన స్థలము అమరావతీ ప్రాంతమని కొండఱును, కాశ్మీర గాంధారములని కొందఱును వచింతురు. ఇందేది సత్య మయినను మహాయానమునకు సమరావతికి నెక్కువ సంబంధము కలదనిమాత్ర మంగీకరింపక తీరదు.

ఆర్య నాగారునుఁడు