పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వడక తమ పద్ధతియే సరియైనదని వాదించి థేరవాదులనుండి విడిపోయి, మహా సాంఘీకులను పేర నొక తెగగా నేర్పడి యొక నూతన వాదమును స్థాపించిరి.

ఈచీలిక నతికించి సంఘమును కట్టు దిట్ట పఱుచుట కొఱకు అశోకచక్రవర్తి పాటలీపుత్రమున మఱియొక సంగీతిని సమావేశ పఱిచెను. దీనికి మౌద్గల్య పుత్రుఁడయిన తిష్యుఁ డధ్యక్షుఁడు. బౌద్ధధర్మ ప్రవచనానంతరమున శిక్షా సూత్రార్థ సమన్వయమున థేరవాదులకును, మహాసాంఘికులకును ఏకీ భావము కుదుర లేదు. థేరవాదులు సభనుండి వెడలి పోవు టయే కాక, తమకు మహా సాంఘికులతో సరిపడక మగధ దేశమును గూడ విడిచిపెట్టి, కాశ్మీరా ద్యుత్తరదేశముల కరిగి యచ్చటఁ దమ మతమును వ్యాపింపఁ జేయుచుండిరి.

బౌద్ధ సంఘమున నిట్లు చీలిక కలుగుటకు కారణము పైని చెప్పినట్లు ‘దశవస్తువు' లని కొన్ని బౌద్ధ గ్రంథము లును, మహా దేవుఁడు 'అర్హతుని లక్షణము'ను గూర్చి ప్రతి పాదించిన 'పంచ సిద్ధాంతము'లని మఱికొన్నియు నుడువు చున్నవి. విడిపోయిన మహాసాంఘికులు ‘ధమ్మము’ను, ‘వినయము’ను (బౌద్ధవేదములగు త్రిపిటకములందలి మొదటి రెండు పిటకములు) స్వవాదానుసార మందందు సంస్కరించి 'థేరవాదము'నకు ప్రతిగా తమ వాదమునకు 'ఆచారియ