పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

15


గురుభక్తిపూర్వకంబుగ
విరచింతు మదీయభక్తి వినుతింపంగన్.

26


చ.

గురు నుతియింతు సంతతము ఘోరభవాంబుధితారణార్థి నై
హరుఁ బ్రణుతింతు లింగమథనార్థసముద్భవచిత్సుఖార్థి నై
శరణులఁ గీర్తి సేయుదుఁ బ్రసన్నకటాక్షనిరీక్షణార్థి నై
యిరవుగ నొండుభంగి నుతియింపమి నాకు నిజవ్రతంబుగన్.

27


క.

మదనారిభక్తమండలి
నుదరార్థము పొగడువాని యుక్తిఁ దలంపన్
సదమలరత్నవితానముఁ
బదడున్ సరిఁ బోల్చునట్టిపగిదియె కాదే.

28


క.

కావున భక్తానందము
వావిరి నీప్సితము గాఁగ వర్ణింతు లస
ద్భావనఁ గృతి సత్కావ్యక
ళావేదులు వొగడఁ గావ్యలసనము నెగడన్.

29


క.

అనుభవసారం బనఁగా
మనసిజహరుశుద్ధభక్తిమార్గము వేదో
క్తనిరూఢిఁ బురాణరహ
స్యనియుక్తిని [1]విస్తరింతు నది యెట్లనినన్.

30


క.

వారక వేదపురాణ
ప్రారంభార్థముల నెల్లఁ [2]ద్రచ్చఁగ 'హంస
క్షీరమివాంభసి' యనుగతి
సారమె కొని తెలుపువాఁడ సద్గురుకరుణన్.

31
  1. విన్నవింతు
  2. ద్రవ్వక