పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

అనుభవసారము


క.

అగ్రతనూజుఁడు సద్భ
క్తగ్రాహకచెన్ననీలకంఠపదాంభో
జగ్రహణాంతఃకరణస
మగ్రసుఖామృతపయోధిమగ్నుఁడు ప్రీతిన్.

21


క.

గురుభావోద్భవహృదయే
శ్వరసంజాతప్రసాద[1]సంభ్రమమథన
స్ఫురితానందసముద్భవ
పరవశమానసమహానుభావుఁడు భక్తిన్.

22


క.

ఏకసతీవ్రతచరితుం
డేకాగ్రమనఃప్రపూరితేంద్రియ[2]గుణలిం
గైకాత్మకప్రమథనసు
ఖైకాంతనితాంతపరవశాత్ముఁడు పేర్మిన్.

23


క.

గురులింగహస్తజాతుఁడు
గురులింగపదాబ్జభృంగగురుతరమతి స
ద్గురులింగప్రాణుఁడు శ్రీ
గురులింగాఖండ[3]భక్తికోవిదుఁ డెలమిన్.

24


క.

త్రిపురారిభక్తియుక్తుఁడు
త్రిపురారిమహిష్ఠనామధేయుఁడు సాక్షా
త్త్రిపురారిమూర్తి గోడగి
త్రిపురారి మదీయసత్కృతికి నొడయఁడు గాన్.

25


క.

గురులింగజంగమస్థల
శరణస్తోత్రప్రసాదసంవిత్పదమున్

  1. సంభవ
  2. గుణి
  3. సంగ