పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బుద్ధితో శివుఁడే శరణమని దృఢనిశ్చయముతోఁ గొలుచుభక్తులు.


15-28.

పదడు = మన్ను.


31.

హంసక్షీరమివాంఛసి = హంస నీరమును క్షీరమునుండి వేఱుచేయు


16-35.

లెప్పంబు = లక్ష్యము.


24-70.

ఉరవడించు = తొందరపడునట్లు.


71.

ఉరువిడి = సంపద; రూపము.


72.

అలయమి = విసుగు నొందకుండుట.


25-75.

ఒడమి = ధనము. కొనియాడక = లక్ష్యము సేయక.


26.93.

నికము = నిక్కము. ఒడ్డరి యడ్డరి = కల్లబొల్లి.


27-33.

కెలని = ఎదిరి.


85.

పాలసుఁడు = నీచుఁడు


87.

పాదలి = అధముఁడు.


28.92.

బ్రాఁతులె = అరుదులే = పొందరానివే.


30-90.

ఎడమడుగు = వైషమ్యము.


101.

వేఁగు = అసాధ్యము.


31-104.

 క్రేఁపు = దూడ. మొదవు = గోవు.


32-111.

తను విడువక = శరీర మొసంగక


3-114.

వంటని = అలవడని. పెంట = అతిశయము; పెంపు. రెంటికి నెడతాకి చెడ్డరేవనిభంగిన్ = ఈజాతీయోక్తినిగూర్చి చాలఁ జర్చ లిదివఱలో జరిగినవి. రేవఁ డనుచాకలి యొకనది యొద్ద రెండురేవులు పెట్టి బట్ట లుదుకుచుండఁగా నొకనాఁడు నదికి వఱద వచ్చుట గాంచి, తనదగ్గఱ నున్నరేవునందలి చాకిబానలందలి బట్టలను ముందుగా దూరమునకు గొనిపోయి జాగ్రత్త సేయక వాని నీట విడిచి రెండవరేవునందలి బట్టలకయి యేఁగఁగా నీనడుమ వెల్లువ వచ్చి రెండురేవులలోని బట్టలు గూడ గొట్టుకొనిపోయె ననుట యిందలి యైతిహ్యము. కాని కొందఱు పండితులు "ఉంబేకః కారికాంవేత్తి, తంత్రంవేత్తి ప్రభాకరః, మండనస్తూభయంవేత్తి, నోభయం వేత్తి రేవణః" అనుశ్లోకమునం దుదాహృతుఁ డయిన రేవణుని గూర్చియే యీ సామెత యేర్పడిన దని తలంచుచున్నారు. ఉపలబ్ధములయిన యాంధ్రగ్రంథములలో దీనిని సోమనాథుఁడే యీయనుభవసారమున మునుముందు వాడినట్లు కనవచ్చుచున్నది. ఇందలి "ఎడతాకి" యను పదమును జాకివానికథకే స్ఫోరకముగా నున్నది. మనుచరిత్రము, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానము, పినవీరన జైమినిభారతమునందును "రెంటికిం జెడినరేవఁడు" అని మాత్రమే ప్రయోగింపఁబడినది.