పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

అనుభవసారము


ర్మక్షోభాన్వితులే యధర్మమతులే రాగాదిదోషాఢ్యులే
సాక్షాద్రుద్రులు గాక కేవలులె భాస్వద్భక్తు లుద్యద్గుణా!

186


మ.

ధర జన్మించినభక్తు లెన్న జనులే? ధాత్రీతలావిష్కృతా
చరలీలం జనులింగమూర్తు లవి పాషాణంబులే? వారు దా
నరచర్మావృతు లైన నేమి నరులే నానావిచిత్రాదివి
స్తరవస్త్రావృతు లైనమానవులు తద్వర్ణాంగులే? ధీనిధీ!

187


చ.

నిరవయవాదిమూర్తికి ననిర్వచనీయవిశాలకీర్తికిం
బరమపదప్రవర్తికి నపారజగత్పరిపూర్తికిన్ సదా
వరదున కర్థిమై నవయవప్రకరాదులు దార యై మహిం
బరఁగుమహాచరిత్రు లగుభక్తులు భక్తిగుణాఢ్యు లల్పులే?

188


చ.

హరునకు నాశ్రయంబును గుణాగుణమూర్తికి నాత్మయుం బరా
పరునకు దేహ మీశునకుఁ బ్రాణము శంభునకున్ జవంబు శం
కరునకు సీమ యాగరళకంఠున కాభరణంబు నిర్జిత
స్మరుసుఖలీల నాఁ బరఁగుసజ్జనభక్తిగుణాఢ్యు లల్పులే?

189


ఉ.

మి న్నెట యందు[1]కొన్గలరె? మేనితనర్పది పెద్ద యంచుఁ దా
రెన్నుదు రెల్లలోకముల [2]నిట్టివి మిన్నుల నంతకోట్లకున్
మిన్నగుచున్న మిన్నయట మిన్నుకు మిన్నును మిన్ను దాటున
త్యున్నతి నున్న లింగముసమున్నతి నంటినభక్తు లల్పులే?

190


చ.

మొదలున కెల్ల మున్మొదలు ముప్పదియాఱును [3]మించి నడ్మి కిం
పొదవఁగఁ దాన నట్టనడు మొప్పుసమున్నతి నుల్లసిల్లి య
త్తుదికిని దాన తుట్టతుదిఁ దోఁచి వెలింగెడుదివ్యలింగమున్
ముదమునఁ బట్టియాడెడువినోదమహిష్ఠులు భక్తు లల్పులే?

191
  1. కొన్వనరు.
  2. నెట్టిదొ
  3. ముంచి