పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

47


లెందుఁ గలుగఁ బోదురే శివగోత్ర! స
త్పాత్ర! భక్తిసూత్రపథచరిత్ర!

181


క.

శివగర్భులు శివజన్ములు
శివగోత్రులు శివకులజులు శివవిజ్ఞానుల్
శివశాసనధరు లటె యం
దు వేఱకులములను వెదుకుదురె? త్రిపురారీ!

182


క.

భువిలో శివదీక్షితు లగు
శివభక్తులపూర్వజాతిఁ జింతించుట రౌ
రవనరకభాజనం బా
శివుఁ బాషాణంబు గాఁగఁ జింతించుక్రియన్.

183


క.

నికముగ 'మద్భక్తా విగ
[1]కల్మషా' యనిన శివునితద్వచనము న
మ్మక భక్తుల దుర్గుణములు
ప్రకటించినవాఁడె కాఁడె పాతకుఁ డుర్విన్?

184


క.

శివలాంఛనసంహితుఁడును
భువి మానవుఁడే యగణ్యపుణ్యుఁ డతనియం
[2]దవగుణము గలదె యేయెడ
ల వెదక వారాశిలోఁ గలంకము గలదే!

185


శా.

వీక్షింపంగ శరీరధారులె భవావిర్భూతులే యీషణా
పేక్షాక్రాంతులె యన్యభోగవిషయప్రేతాత్ములే [3]పూర్వక

  1. కలుషా
  2. దవగుణములు గలుగునె యెయిల వెలయగ నీర్రాశిలో నలంతయు గలదే.
  3. పూజ్య