పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

35


మ్ముల లింగాధీనం బని
నిలుచుం గా కేల కలఁగు నీతివిలాసా!

124


క.

తనమదిఁ బుట్టినకోపము
తనుఁ జెఱుపునె యెదిరివారిఁ దాఁ జెఱుపునె పు
ట్టినయి ల్లుండఁగ ననలము
మును చెఱుచునె యితరసదనములఁ ద్రిపురారీ!

125


క.

కోపంబు పాపహేతువు
కోపము దుర్గతికి నూఁత కోపమె పగవాఁ
డేపారఁగ భక్తునకుం
గోపము దాఁ బుట్టు నయ్య? కోపవిదూరా!

126


క.

లేకుండును గోపం బథ
వా కలిగినఁ బూరిచిచ్చువడువున నాఱుం
గా కెగయునె సద్భక్తుని
యాకోపము శమము [1]పొరుగ; నతిశాంతాత్మా!

127


క.

కోపంబు పెరిఁగి శాంతత
రూ పణఁచుం గర్మి; కొక్కరూ పగు నది ధ
ర్మాపాదికి; నతిశాంతత
కోపముఁ బరిమార్చు భక్తి గుణికి మహాత్మా!

128


క.

చెనయుశివద్రోహులయెడఁ
దనుధర్మములెడలఁ దక్క దయయును శాంత
త్వనిరూఢియు[2]శృంగారిలు
ననయము భక్తులకు గురుపదాంబుజభృంగా!

129
  1. పొరుగు
  2. శృంగారము