పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

అనుభవసారము


పాఱునె సుఖగోష్ఠియెడం
గోరునె పరధననిముక్తి గుణరత్ననిధీ!

119


క.

కొనునే నిషిద్ధపాకము
వినునే శివదూషణంబు వేఱొకత్రోవం
జనునే సద్భక్తుఁడ నే
ననునే గర్వించి భక్తియందు మహాత్మా!

120


క.

కూడునె యుపాధిగుణముల
నోడునె వంచించి యవసరోచితముల రెం
డాడునె సద్భక్తుఁడు గొం
డాడునె భవవిపినముల మహానందాత్మా!

121


క.

జాఱునె నియమవ్రతముల
మీఱునె శివునాజ్ఞ [1]నెందు మితి గడవక మున్
పాఱునె పలుత్రోవలకును
దాఱునె భక్తుండు భక్తతతిఁ ద్రిపురారీ!

122


క.

పెట్టునె భక్తుఁడు భవికిని
మెట్టునె ము న్నన్యపదము [2]మెయ్యొఱపులఁ దా
ముట్టునె లింగానర్పిత
మెట్టైనను బ్రతుకఁ దలఁచునే త్రిపురారీ!

123


క.

ఇల భక్తుఁడు సుఖదుఃఖం
బులయెడ బొబ్బిడక వంతఁ బొందక యవి యి

  1. యందు
  2. మెయ్యరపుల