పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

27


బకపక నవ్వుచున్ గెలని భావము దూలఁగఁ బల్కునట్టి య
వ్వికలునిగోష్ఠికిన్ సొగసి విందురె సజ్జనమార్గ మందురే?

83


మ.

కడువేడ్కన్ శివభక్తగోష్ఠి వినుచోఁ గంపించుచున్ మగ్నుఁడై
యొడ లెల్లం జెవులై ప్రసన్నముఖుఁ డై యుద్యత్ప్రమోదాత్ముఁ డై
యడరంగా బ్రమదాశ్రుధార లవి నేత్రాపాంగసంజాత మై
తొడరన్ ముత్పులకాంకితాంగుఁ డయి భక్తుం డున్నఁ గా కొప్పునే.

84


చ.

అసదృశభక్తగోష్ఠి వినునట్టియెడన్ వెడమాట లాడుచున్
[1]నుసులుచుఁ గంటగింపుచు వినోదము సేయుచు నిద్రఁబొందుచున్
విసుగుచు మీఁదు చూచుచు భువిం గలవార్తలు ద్రవ్వునట్టిపా
లసు నట నుండనీఁ జనునె? లాలితభక్తమనోనురంజనా!

85


అస్తవ్యస్తున కెఱుక, స
మస్తేంద్రియమగ్నునకు విమలబుద్ధియు [2]
ప్రస్తుతవాదికి గోష్ఠియు
నాస్తికునకుఁ గృపయుఁ గలదె? నారయపుత్త్రా!

86


జూదరికి బొంకుఁ బొరయమి;
[3]పాదలికిని భక్తివలని భయమును, విషయా
హ్లాదికిఁ బ్రసాదభోగా
స్వాదనసుఖమును నసంభవము త్రిపురారీ!

87


దుర్గుణికిఁ గీర్తి, గర్వికి
భర్గార్చన, క్రోధికిని దఫఃఫల, మరిష

  1. నుసురులు
  2. నప్రస్తుతి యవాది
  3. పాదరి