పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

అనుభవసారము


క.

ఆదిపురాతనభక్తా
పాదితవచనములఁ దనరు[1]పక్వత మది సం
పాదింప కెట్లు కొలువక
వాదమె కా కవునె భక్తి? వరభక్తినిధీ!

78


ఉ.

భక్తులు చన్న మార్గ మది పాటిగఁ దప్పక భక్తుఁ డైయథా
శక్తిని భక్తి సేయు టది సత్పథ మట్లును గాక యమ్మహా
భక్తులు పల్కినట్లు తనప్రాప్తియె తాఁ బలుకంగఁజేయఁ బ్ర
వ్యక్తముగాఁ జరింప; భవవారణ సజ్జనభక్తికారణా!

79


ఉ.

ఒప్పుగ భక్తిసత్పథ[2]నయోక్తులు సెప్పక యున్కి మేలు సుగి
చెప్పుటకంటెఁ దాను నొగిఁ [3]జెప్పినయ ట్లుపదేశమయ్యెనేఁ
జెప్పెడి దానిలోనఁ గడుఁ జిక్కిన మాటల నైన నిల్పి మున్
దప్పక యుండఁగా వలదె? తామసదూరగ! తత్త్వపారగా!

80


క.

ఇది భక్తి యిది క్రమం బని
యెదిరికి నుచితంబుఁ జెప్పునెడ భక్తుఁడు దా
నెదిరికిఁ జెప్పినయట్టుల
ముదమున నడవంగ వలదె ముట్టినచోటన్.

81


చ.

ముదము వహింప హేతువులు ముప్పిరి యై మదిసొంపు పెంపునన్
మృదుమధురోక్తు లింపడర మెచ్చులు దీటుకొనంగ నవ్యసం
పద దళుకొత్త సాంగముగ భావము లల్లనఁ బల్లవించ న
ట్లెదిరి భజింపఁగాను వలదే శివభక్తకథాప్రసంగతిన్.

82


చ.

నిక మిది భక్తియుక్తి యననేరక నోరికి వచ్చినట్టు తా
నొకటికి వేయుఁ బన్నుచును నొడ్డరియడ్డరిమాట లాడుచున్

  1. పక్వము
  2. నియోక్తులు
  3. జెప్పఁగనట్లు