పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

అనుభవసారము


గురుని సమశయ్య నొందుట
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!.

49


క.

గురుహస్తాగ్రతనూజుల
గురుపుత్త్రకళత్రమిత్రగోత్రాదులఁ ద
ద్గురురూపముగాఁ దలఁపమి
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!.

50


క.

ఓపి మనోవాక్కాయ
వ్యాపారములందు గురుదయాత్మకరసధా
రాపాత్రుఁడు గాఁడేనిన్
క్ష్మాపాత్రుఁడు భక్తుఁడే? కుమార్గవిదూరా!

51


క.

గతి మతియు దెసయు దిక్కును
బతియును దలి దండ్రి తోడు ప్రాణము నర్థ
ప్రతతియు బంధుఁడు విద్యో
న్నతియున్ సద్గురుఁడ కాఁడె నారయపుత్రా!

52


సీ.

గురుమూర్తి యనుకల్పతరు వొప్పుఁ దత్తరు
         మూలంబు కరుణావిలోలదృష్టి
యాద్యశాఖోన్నతి యాజ్ఞామహత్త్వ మ
         య్యుపశాఖ లాదితత్త్వోదితములు
పల్లవంబులు శ్రుతుల్ ప్రసవముల్ మంత్రముల్
        ఫలము లింగంబు తత్పరిమళంబు
జంగమబోధలసారంబు నిత్య[1]ప్ర
        సాదాదికనయనోత్సవము ముక్తి

  1. ప్రభాదీపస్యాయనోత్సవము