పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనుభవసారము

19


క.

గురులింగైక్యవిభేదము
గురులింగాశ్రవణమతియు గురువంచనమున్
గురు [1]తత్త్వద్వైతంబును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

44


క.

గురుమంత్రాధః[2]కృతియును
గురునాజ్ఞోల్లంఘనంబు గురువిముఖతయున్
గురురంధ్రాన్వేషణమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

45


క.

గురుసద్గుణవంచనమును
గురువంశామాన్యతయును గురువిస్మృతియున్
గురుదుర్గుణప్రకటనమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

46


క.

గురుసన్నిధి గర్వించుట
గురుసన్నిధిఁ దన్నుఁ దాన కొనియాడుటయున్
గురుసన్నిధి శంకింపమి
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

47


క.

గురువాక్యోదాసీనత
గురుపాదధ్యానవిరతి గురు[3]హుంకృతియున్
గురుమార్గాతిక్రమమును
గురుపాతక మండ్రు బుధులు గురుభక్తినిధీ!

48


క.

గురుని సపంక్తిని గుడుచుట
గురుని [4]సమాసనమునందుఁ గూర్చుండుటయున్

  1. తత్త్వా
  2. కృతమును
  3. హంకృతి
  4. సమానంబునందు