పుట:అక్షరశిల్పులు.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అటు తరువాత గత దాశాబ్ది కాలంలో పలు కవితా, కథా సంకలనాలు వెలువడ్డాయి. ఈ సంకలనాలను వెలువరించిన సంకలనకర్తలు, సంపాదాకులలో కొందరు తమకు రచనలు అందచేసిన కవులు, రచయితల చిరునామాలను మాత్రమే పొందుపర్చారు.

                           అవసరమన్పించింది :

ఆ కారణంగా ముస్లిం కవులు రచయితల వ్యక్తిగత, సాహిత్య వివరాలతో కూడిన గ్రంథం తీసుకరావాల్సిన అవసరం ఎంతో ఉందన్పించింది. తెలుగు వాఙ్మయ చరిత్రను వెల్లడిస్తున్న చాలా గ్రంథాలలో ముస్లిం కవులు, రచయితల, అనువాదాకుల వివరాలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ఆ కారణంగా ముస్లిం కవులు, రచయితల వ్యక్తిగత, సాహిత్య పరమైన వివరాలతో గ్రంథం తీసుకరావాలన్పించింది. ఈ ప్రయత్మం చాలాశ్రమతో కూడినది, పరిమితులు నాకు తెలుసు. ఆ కారణంగా ముస్లిం కవులు-రచయితలు సృజించిన సాహిత్యం, తీరుతెన్నుల జోలికి వెళ్ళకుండ కవులు-రచయితలు, అనువాదాకుల వ్యక్తిగత-సాహిత్య పరిచయాన్ని సంక్షిప్తంగా నమోదు చేయాలని నిర్ణయించుకుని 'అక్షరశిల్పులు' రూపకల్పనకు సిద్ధపడ్డాను.

                               ప్రోత్సాహం:

అక్షరశిల్పులు గ్రంథాన్ని తీసుకురావాలన్న ఆలోచన బాగుందంటూ ప్రొఫెసర్‌ షేక్‌ మస్తాన్‌ (అలీఘర్‌ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీఘర్‌),డాక్టర్‌ యాకూబ్‌ (పరీకక్షల నియంత్రణాధికారి, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం), మహబూబ్‌ బాషా (చరిత్ర శాఖాధిపతి, బాబా సాహెబ్‌ భీంరావ్‌ అంబేద్కర్‌ కేంద్రీయ విద్యాలయం, లక్నో), ఆంధ్రాప్రదేశ్‌ ముస్లింసంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్‌ ఎం.ఎ.రహమాన్‌ (విజయవాడ), ప్రముఖకవులు డాక్టర్‌ ఇక్బాల్‌చంద్‌ (బెంగుళారు), డాక్టర్‌ షేక్‌ ముహమ్మద్‌ ముస్తఫా, ఎసి దస్తగిరి (ప్రొద్దుటూరు), సత్యాగ్నిహుసేన్‌ (కడప), ప్రముఖ రచయిత ఇనగంటి దావూద్‌(హైదారాబాద్‌), పాత్రికేయ మిత్రులు అబ్దుల్‌ వాహెద్‌ (గీటురాయి, వారపత్రిక, హైదారాబాద్‌),ఎం.డి షఫీ అహమ్మద్‌ (వార్త, దినపత్రిక, విజయవాడ), కవి మిత్రులు సయ్యద్‌ ఖుర్షీద్‌ (మహబూబాబాద్‌), షేక్‌ కరీముల్లా (వినుకొండ), షేక్‌ లతీఫ్‌ క్టుీ (నెల్లూరు) తదితరులు ప్రోత్సహించారు.

ఆహ్వానం :

ఈ మేరకు రాష్ట్రంలోని ముస్లిం కవులు, రచయితలు, అనువాదాకుల వివరాలను ఆహ్వానిస్తూ 2008 మార్చిలో ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన రాష్ట్రంలోని అన్నితెలుగు, ఉర్దూ పత్రికలలో ప్రచురితమైంది. జిల్లా కేంద్రాలలో ఉన్న మిత్రుల సహకారంతో