పాహీ! శంకరా! (పద్యం)
స్వరూపం
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
పాహీ శంకరా! మాం పాహీ శంకరా!
దీనాళి రక్షించు దేవ దేవా! |దీనాళి|
నా గతి నీవయ్య దేవ దేవా! |నా గతి|
పాహీ శంకరా! మాం పాహీ శంకరా!
దేవా! దివ్య కృపాకరా భవహరా! దీనావనా శంకరా!
నీ వాల్లభ్య బృహంచలామృత ఝరుల్ నీ పుత్రుపై జల్లగా
భావాతీత మనోజ్ఞ నేత్రములు విస్ఫారించినావా ప్రభో!
సేవా భాగ్యము కల్గజేయుమా దయన్ శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వరా!