పాట బాడెద రార సామి - పరమానందమురా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
పాట బాడెద రార సామి - పరమానందమురా, నాసామి
బ్రహ్మానందమురా నాసామి - పరమానందమురా ॥పాట బాడెద॥

చరణం1:
మదన జనక నీదు దయ - మదినిగోరి యున్నదాన
ముదముమీర ముచ్చటాడి - ముద్దుబెట్టరా, నాసామి
ముద్దుబెట్టరా నాసామి ॥పాట బాడెద॥

చరణం2:
వలపు నిలుప లేదురా - వగలుమాని యేలుకోర
కళలుదేర నొక్కసారి - కౌగిలించరా, నాసామి
కౌగిలించరా నాసామి ॥పాట బాడెద॥

చరణం3:
వనజనయన నిశ్చలా - వరద వేణుగోపబాల
ఘనుడ దాసు రామపాల - కాంక్షదీర్చరా, నాసామి
కాంక్షదీర్చరా నాసామి ॥పాట బాడెద॥