పల్నాటి చరిత్ర/పెందోట చరిత్ర

వికీసోర్స్ నుండి

లక్ష్మీచెన్నకేశవోత్సములు జరుగును. చైత్ర బ॥ పంచమినాడు రధోత్సవము జరుగును. అప్పుడు వేలకొలది జనులువచ్చెదరు. కార్తీక అమావాస్యనుండి కారెంపూడిలో వీరుల తిరుణాల జరుగును. మార్గశిర పూర్ణిమనాడు గురజాలలో పాతపాటమ్మ తిరుణాల జరుగును. పైమూడు తిరుణాలలకును పల్నాటివీరుల కధలు సుద్దులుగా చెప్పెదరు. క్రిసమసు పండుగకు రెంటచింతలలో క్రిస్టియనులతిరుణాల జరుగును.

పెందోట

పల్నాటిలో నాగార్జునకొండకు 8 మైళ్ల నైరుతి మూలన కృష్ణాతీరము పెందోటయను పట్టణము 16, 17 శతాబ్దము లలో నుండినది. ఇప్పుడా ప్రదేశమంతయు యడవులతో నిండి యున్నది అందలి దండపాణీశుని యాలయముకూడ యిప్పుడు లేదు. పెదోటవారిప్పు డచటచ్చట వలసవచ్చియున్నారు. పెందోటను పాలించిన మార్కండేయ భూపాలుడు క్రీ. శ. 1585 ప్రాంతముననుండెను. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ రశాహీ యను తురుష్క - ప్రభువు క్రీ.శ 1580 మొదలు 1611 వఱకు గోలకొండ రాజ్యమును పాలించెను. అతనికీ మార్కండేయ ప్రభువు సామంతుడై దండయై యతని రాజ్యవిస్తరణకు తోడ్పడెను. తుర్కారాజకవి అయ్యంకి బాలసరస్వతి యను నిరువురు కవుల నీమార్కండేయ ప్రభువు పోషించెను. స్కాంద పురాణము లోని నాగరఖండమును వారిచే తెలుగు చేయించి తాను కృతి నొందెను, మార్కండేయ ప్రభువు విశ్వబ్రాహ్మణుడు. నాగర ఖండము శాలివాహనశక 1508 (క్రీ.శ. 1585) లో రచింప బడెను. మార్కండేయ ప్రభుని కాలము క్రీ. శ. 1570 నుండి ప్రారంభము. ఇతనిపూర్వులలో నైదవతరమువాడు బెజవాడను పాలించి బెజవాడ ప్రభువని ప్రసిద్ధిగాంచెనని నాగరఖండము చెప్పుటచే నతని రాజ్యము బెజవాడవఱకుండెననియు, విజయవాడకు బెజవాడయని యప్పటికే పేరుండెననియు నూహింపవచ్చును. మార్కండేయ ప్రభు వనేకదానములు చేయుటేకాక శ్రీశైలమున నేకాదశలింగముల ప్రతిష్టించెనట.

నాగరఖండ కవులు తమ్ముగూర్చి చెప్పికొనినది.

కం॥ అభినవ విశ్రుతకవితా|
     విభవుల మఖిలాగమాంతవిద శౌనక గో|
     త్ర భవులము బుధవిధేయుల |
     మభవపదాంభోజ బంభరాత్ములము మహిన్.
     
కం॥ రసికుడు తుర్కారాజన |
     వసమప్రతిభావి రాజీయ య్యాంకిత బా|
     ల సరస్వతియనువారల |
     మసహిష్ణువజ విహారణార్థులము మతిన్ |
     
చ॥ మము బిలిపించి చాల బహుమానమొనర్చి కవీంద్రులార స్కాం |
    దమున మహాప్రసిద్ధమగు నాగరఖండమఖండ విశ్వక |
    ర్మ మహిత వైభవాకరము మాకు తెనుంగున నంకితంబుగా|
    రమణ ఘటింపగాదగు బురాణవిదుల్ మదిరాణమెచ్చగన్.

పెందోటయు తత్ప్రభుని వర్ణనము

(నాగరఖండములోని పద్యములు)

సీ॥ కోటయేవేయివీటికి మేటియై మిక్కిలి |
         చూపట్టు చక్కని చుట్టుగట్టు
    క్రీడాద్రులేపురికిని సప్తకుల పర్వతములునా మేరు

మందర నగములు |
       బొడ్డన బావులేపుట భేదనంబు
కమృతాభి ముఖ్యరత్నాకరములు |
        రవిసోమవీధులే రాజధానికి ప్రసిద్ధి
       గను నేబదియాఱు దేశములును ॥
       
గీ ॥ పరమమగునట్టి పెందోటపురవరమున |
    కధిపతి శిరోవతంసమై యలరె సకల
    కళల ధవళేశ్వరపురవిఖ్యాతు డైన
    గురుతరయశోధనుండు మార్కొండు ఘనుడు
    
సీ॥ శాలివాహనశక సంఖ్యాకములునగు
        పదియేనువందల పైయెనిమిది |
    వత్సరంబులలోన వసుధాస్తలంబున
        కుతుబుషాహీ నిజాంకుతలనాథు।
    ప్రాభవ వేళమార్కం డేయభూపతి
        ధవళేశ్వరాన్వయ భవుడునగుచు |
    సకలదిశావ్యాప్తి సాంద్రసుధా స్వచ్ఛ
        కీర్తి పరంపరాస్ఫూర్తినలరి
గీ॥ సురుచిరంబైన పెందోట పురినిలిచి |
    విశ్వకర్మాన్వయంబుధి వెలయజేసి
    సప్త సంతానములగని సాధువృత్తి
    ....వర్యులు భళియని స్తుతియొనర్ప |
    ధరనుబాలింపు చుండెను ధర్మనిరతి
    
కం॥ అతడు ప్రసిద్ధివహించెన్ |
    క్షితి వరగజపతులు గెలిచి చెలగి జయశ్రీ
    సతిజేకొనిన మహమ్మద్
    కుతుబ నిజాంచంద్రునకును కుడిభుజమగుచున్ ||
    
ఉ॥ ఎంతనియెన్నవచ్చు ధవళేశ్వరసోమయ మారుకండు ధీ
    మంతుని రాజ్యభారము, సమగ్రవిభూతియు సర్వమంత్రి సా
    మంతులయందలంబులె చమత్కృతి బారగరేకు దీర్చి న |
    ట్లంతటనిండుదద్గృహ సమావృతి చాల యలుకరించుచున్ ॥

కం. విశదముగ సల్పె నేకా |
    దశ మార్కొండయ్య లింగ ధామములు ని
    నిరంకుశ వృత్తిన్ శ్రీగిరి నా |
    శశితా రార్కముగ వీరశై


                     వాగ్రణియై|

సీ॥ పెందోట పురవరమందు గాపురముండు
          విశ్వకర్మాన్వయ విబుధవరులు |
    నగ్రహారాది సమగ్రసుస్థ్వాదిక
          ములును గల్గుటచేత గలిమిగాంచి |
    వేదశాస్త్రాదిక విద్యల జదివి ది
           వ్యజ్ఞాన సంపత్తినతిశయిల్లి
    సకలయజ్ఞంబులు సరవితో గావించి
           నిత్యాగ్నిహోత్రులై నెగడుచుండి
           
గీ॥ సుర పితామహునిని శతాధ్వరుని గురుని |
   ధిక్కరించియు నిరతవితీర్ణ మహిమ |
   ధైర్యమున వారిదాద్రుల దలకునటుల |
   జేసి బ్రహ్మణ్యులైరి యీస్థిరను స్థిరత.
  

పల్నాటి వీరగాధ

12 వ శతాబ్దమున గురజాల రాజధానిగ పల్నాటిని అలుగురా జేలుచుండెను. అతనికి మైలమ్మయందు నలగామ రాజు, విజ్జల దేవియందు మలిదేవాదులు భూరమాదేవియందు నరసింగరాజు జన్మించిరి . అతనివద్ద బ్రహ్మనాయుడు మంత్రిగా నుండెను. అలుగురాజుపిమ్మట నలగామరాజు రాజయ్యెను. జిట్టగామాలపాటిలో నాయకురాలను పేర వ్యవహరింపబడు నాగమ్మయను వితంతువు లౌకిక వ్యవహారములందు ప్రజ్ఞగలిగి యుండెను. ఆమె రాజును 'మెప్పించి మంత్రిణి యయ్యెను. బ్రహ్మనాయనియం దసూయ కలిగి యతనికిని యతని యను చరులగు మలిదేవాదులకును నపకారములు చేయుచుండెను. అంతట బ్రహ్మనాయుడు రాజుననుజ్ఞ ముపొంది మలిదేవాదు లతో మాచర్లకుపోయి యా ప్రాంతమును మలిదేవాదుల పేర