పల్నాటి చరిత్ర/అనుబంధము 3

వికీసోర్స్ నుండి

అనుబంధము 3

.

పల్నాటిలోని కొన్ని శాసనములు.

మాచర్ల:- 1. చెన్నకేశవాలయములో శ క 1033 (A. D. IIII) శాసనము, ఇదిచాల ప్రాచీనమైనది. ఆదిత్యే శ్వరాలయమునకు చాగి చేతరాజు భూదానమిచ్చినట్లు శాసనము, దీనినకలిందు వ్రాయబడినది.

2. చంద్రవంకయొడ్డున జనరలు రోడ్డు వంతెననానుకొని వాగుకు పడమరగాను రోడ్డుకు మత్తరముగానున్న రెండవ ప్రతాపరుద్రువినాటి శక 1236 (1314 A. D) వాటి దాన శాసనము. దీనినకలిందు వ్రాయడమైనది.

3. వీరభద్రాలయములోని యెఱబండ శాసనము (Ā. D. 1554 నాటిది). ఇది విజయనగర సామ్రాజ్యమునాటిది, లింగాపురమను గ్రామము వీరభద్రస్వామికిచ్చిన శాసనము. దీనినకలిందు వ్రాయబడినది.

4. చంద్రవంకయొడ్డున చింతల రామస్వామి గుడిలోని శక 1710 (1788 A. D.) కీలక ఫాల్గుణ శు 15 నాటి శాస నము. దీనివలన పల్నాటిలో మాచర్లసీమ , గురజాలసీమ , తుమృకోటసీమ, కారెంపూడిసీమ , తంగెడసీమయను యయిదు భాగములుండినట్లు తెలియుచున్నది

5. చెన్న కేశవాలయములో శిధిలమయిన భాగమును బాగుచేయించినట్లు శ.క 1310 (AD 1397) నాటిది ముఖ ముఖమంటప స్తంభముమీద కలదు. శశ 1541 (A. D.1619) నాటి దానశాసనముకూడ నా స్తంభమునందే కలదు.

6. మాచర్ల ముటుకూరు మధ్య శక 1171 (A. D. 1249) నాటి శాసనముకలదు.

7. గరుడ స్తంభముమీద శ క 1566 (1644 A.D.) తో స్తంభము నిర్మించినట్లు శాసనము.

8. పోలేరమ్మ గుడివద్దగల నొక రాతి మీద శక 1215 (1293 AD.)న రెండవ ప్రతాపరుద్రుని కాలమున నిచ్ఛిన దానశాసనము.

9. తాలూకా ఆఫీసుకు వెనుకవైపున వాగుయొడ్డున పొలములో శక 1448 (1526 A.D.) కృష్ణ దేవరాయలు మాచర్ల వీరభద్రస్వామికి యిష్టకామేశ్వరికి యిచ్చినభూదాన శాసనము. దీనినిక లిందువ్రాయడమైనది.

10. శ క 1592 సౌమ్య కార్తీక శు 15 (1670 A.D.) గోల్కొండనవాబగు అబ్దుల్లాపాదుషా (ఇతనితరువాత తానీషా యేలెను) కాలపుశాసనము మాచెర్ల చెరువుకట్టమీద కలదు.

మాచర్ల చెన్నకేశవాలయములో నాగుపాముగల

రాతిస్తంభముమీది శాసనము.

1. శ్రీలక్ష్మీంద్విజపతిధారిణం వృషాంకం చక్రిణం సతతము 2. మాంత్రిమార్గగాంచ। ఆదిత్యం శ్రుతినయనాత్తభూష 3. మవ్యాడ్భూతేశః స్వయమితి భూరిమన్యమానః|| 4. శ్రియామేకం పాత్రం నిరుపమమహామన్మధ ఇవద్వితీయం 5. శీతాంశుమృదుకరసము (త్సూ ) దిరజనః అన+ర్ణంపుం

6. సాం ఖనిరివ మణినా ము (ద) మభూరవి + త్వాం గాప్రనర +

7. వంశోస్థిశశినః| రాజేస్మిన్ సమలంకరిష్ణు రభవత్తం కార్తవీర్యార్జునో

8. యోన్తర్వేశ్మసు భన్మపుంఖితశర శ్శాస్త్య న్యమా ర్గోన్ముఖాన్ హేలానిర్జ్జిత రావ

9. ణో పృధుభుజా సంరుధ్య రేవా రయ స్సప్తద్వీప నిఖాతయూపనిచ

10. య స్సంప్రాస్తచక్రోహరేః శీతాంశువంశ మభివర్ధయితుం రమే

11. శస్సాక్షా దివ క్షితితలే జని చాగి బేతః యోవిక్రమక్రమ వశీక్రిత

12. సర్వన్ లోకః పృధ్వీంశ్రియం సమహర ద్బలితో ద్విషత్తః అనుంగుగా

13. మనృపోస్యసుతో గ్రజో బిరు దుంగామ నృపస్త మనూత్తమః తనుచ

14. రాయపదేవ సమాహ్వయః స్తమను తా హవమల్ల నృపో భవత్ ||

15. దోర్దణ్డ్యోర్జ్జగ దార్తిన్ హరిభి రివ శ్రీశ స్సదా నందభి ర్వేదైర్వా చతురా

16. ననః పృధుతరైద్ధర్మేన్ క్రియా వర్తిభిః శ్రింగైః క్షోద్వహనాభి రాను 17. చరితై+ + గజైః ప్రీతక్షోణిపతిః కలాను చతు

18. రః పుత్రై శ్చతుర్భిర్జ్జనిః అదితిరివ రమేశం కశ్యపా ద్విక్రమార్కం (నృ) పవర మనసూ యాపుత్ర మాత్రే రివాఢ్యం అజన

19. య దథబేతక్ష్మాపతిం వీర మార్యాన్ నయభుజవితా

20. రిం వీరకామక్షితిశాత్ + + + భూపతిః ++

21. +++శ్రీ ధరపుత్రేణ భోగమాంబికానందనేన శ్రీ

22, మదాదిత్యేన మహాదేవితటాకాభిధానాయాం రాజ ధాన్యాం ప్ర

23. తిష్ఠితాయా దిత్యేశ్వరాయ గుణ పురగగనందు సంఖ్యా

24. కనకవర్షే ఖరాభిధానే కార్తిక శుద్ధ ద్వాదశ్యాం పల్లిదేశశ

25. తత్రయాన్తర్వర్తిన్ నాగేశ్వర నదిప్రాగ్భాగావస్థిత సబ్బెయ

26. పల్యాం రాజమానేన వర్తన చతుష్టయ పరిమితాం భూమిం ప్రాదా

27.త్

1. కన్నడ నాగిమయ్యాభిధాన వే++

2. ++ధానగ్రామే సప్తతి నివర్తన్ (న)

3. పరిమితాం ప్రాదాత్ పుణ్యశా+ + +++మహాదేవీతటాక

5. చంద్రభాగానదీప్రదేశ ఆతుకూరి

6. మార్గ సమీపే దశ నివర్తన పరిమి 7. తాం ప్రాదాత్ ప్రాయుంబ్రోలా

8. భిధాన కంబముపా (ట్ట్య) భిడానే గ్రా (మే)

9. అష్టనివర్తన పరిమితాం ప్రాదాత్

10. ఏతా స్థలవృత్తయ అష్టభోగోప + +

11. ౧+నదేవే++ణోపభోజ్యాః అత్ర స

12. (ర్వన్ ) బాధాభ్యః రాజభిరపి రక్షణీయః

13. + + విషయస్థి తాధికారిభి రంగులిభి ర +

14. (పి) నిరూపణీయః అత్ర కంబము

15. పాడుగ్రామే ఆదితటాక దక్షిణ (భాగే)

16. ఆదిత్యనిర్మిత దేవప్రసాదాయ

17. (నా) వోజు పోతోజు తిప్పోజు నా

18. మ్నో, శిల్పికాచార్యాయ దేవప్రతి

19. ష్టావేలాయాం సిన్దుమాన్యరూ

20. పతయా నివత్త౯వ షష్టి పరిమి

21. తాం ప్రాదాత్ | బ్రహ్మ బ్రహ్మగురుః ||

ఇది ప్రాచీనమైనది. ముఖ్యమైనది. దీని తేదీ శాలివాహనశక 1033. గుణపుర గగనేందు సంఖ్య. (గుణము త్రిగుణములు 3, పురము త్రిపురములు 3, గగనము శూన్య సంఖ్య 0. ఇందు అనగా చంద్రుడు 1. దీనిని త్రిప్పి చదువవలెను. 1033 అగును). దానికి 78 కలుపగా క్రీస్తుశకము 1111 సంవత్స ధము ఖరనామసంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి, పల్లిదేశ మనగా పల్నాడు. మహాదేవితటాక మనగా మాచెర్ల, చంద్ర భాగానది యనగా చంద్రవంక, నాగేశ్వరనది యనగా నాగులేరు. నాగులేటికి తూర్పునగల సబ్బెయపల్లి (ఆగ్రామమిప్పుడు లేదు) యను గ్రామములోను ఆతుకూరిగ్రామములోను కంభముపాడు గ్రామములోను కొంతభూమిని శ్రీధరునికుమారుడగు నొకయాదిత్యునిచే (చాళుక్యవంశపు రాజులకు ఆదిత్యయను బిరుదు పేరునకు చివర యుండును. అట్టిరాజులలోనొకడు) నిర్మింపబడిన శివాలయమునకు, చాగిబేతరాజనువాడు భూదా నము చేసినట్లున్నది. కార్తవీర్యునివంశములో పుట్టిన చాగిబేతరాజు అతనిపుత్రుడు - అనుంగుగాముడు-అతనిపుత్రుడు- కామనృపుడు (వీరకాముడు) — అతని కుమారుడు బేతరాజు భూదానము చేసినట్లున్నది. పల్నాటి వీరచరిత్రలోని అలుగురాజు (ఇతనికి అనుగురాజు అను నామాంతరముకలదు) యొక్క తండ్రి పేరు వీర కామేంద్రుడని ఉమాకాంతముగారి పీఠికలో నున్నది.

అలుగురాజు కుమారుడగు నలగామరాజును వీర కామేంద్రుడని శ్రీనాధుడు వాడినాడు. తాత పేరు మనుమనికి పెట్టు ఆచారమున్నది. కావున ఈ చాగి బేతరాజే పల్నాటి వీర చరిత్రలోని అనుగురాజై యుండును. నివర్తనపరిమితమనగా యి ప్ప టి యకరములవలె భూమికొలత మానమై యుండును. కన్నడ నాగిమయ్య కన్నడదేశస్థుడైయుండును. శాసనపు లిపికూడి కన్నడ లిపిని బోలియున్నది. ఈ శాసనమునకు పిమ్మట రమారమి 70 సంవత్సరములకు పల్నాటియుద్ధము జరిగినది. దీనిలిపి తెలుగేయైనను 12 వ శతాబ్దపులిపికావున యిప్పటి అక్షరముల పోలికగా నుండదు. ఈ యాదిత్యేశ్వరాలయము చెన్నకేశవాలయ ప్రాకారములో నున్నది. దీని నిటీవల కర్నాటి హనుమంతు యను వైశ్యుడు బాగు చేయించెను.

మాచెర్ల వీరభద్రాలయములో తూర్పువైపున నున్న యెఱ్ఱరాతిబండమీది శాసనము.

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్షంబులు (శక 1476_1554 A. D.) నిజ ఆనంద సంవత్సరములు మాచర్ల యిష్టకామేశ్వరికిన్ని వీరభద్రేశ్వరునకున్ను గాయిగోవాన ఖడ్గనారాయణ బిరుదాంకిత ప్రశస్తులై శ్వేతచ్ఛత్రాధీశ్వర రేచెర్ల గోత్ర పవిత్రులైన వెలిగోటి...... మనాయనింగారి ప్రపౌత్రులై

తిమ్మానాయానింగారి పౌత్రులై బ... నాయనిగారి పుత్రులైన కొమారి తిమ్మానాయనింగారి అర్ధాంగి లింగాంబ దండబెట్టిం యిచ్చిన శాసనము.

శ్రీమద్రాజ మార్తాండరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప సదాశివరాయదేవ మహారాజులుంగారు పృధ్వీరాజ్యం చేయుచుండంగాను శ్రీమన్మహామండలేశ్వర రామరాజు తిరుమల జయదేవమహారాజులుంగారు కుమార తిమ్మానాయనింగారి నాయంకరానకు పాలించి యిచ్చిన నాగార్జున కొండ సీమలోని మాచెర్లకు ఉత్తరభాగాన చంద్రభాగానదికి పడమర సం॥ కి 45 నాలుపుట్ల పందుం క్షేత్రముపాలిచ్చే లింగాపురమనెడి అగ్రహారము కట్టించి యీ సోమగ్రహణ పుణ్యకాలమందుల గంగాగర్భమందుల ధారాపూర్వకంగాను సమర్పిస్తిమి గనుక ఆలింగాపురాన నలుదరి పొలాలు హేమకూప తటాక నిధి నిక్షేప జలపాషాణ ఆగామిసిద్ధి సాధ్యాలు అనెడి అష్టభోగ తేజస్వామ్యాలు సమర్పిస్తిమిగాన ఆలింగాపురమందుల పొలము ఆచంద్రార్కస్థాయిగాను అంగరంగ వైభవాలకు అవధరించి ఆగ్రామదేవరకు ఎవ్వరు ఇయ్యకపోయినా గంగా గర్భమందు గోబ్రాహ్మణ హత్యచేసిన పాపానపోతారు. వారణాసిలో తలిదండ్రుల జంపిన పాపానపోతారు.

శ్లో. ఏకైవ భగినీలోకే ఏషామేవ భూభుజాం
    నభోగ్యా నకరగ్రాహ్యా దేవదత్తా వసుంధరా

“క్షేత్రము పాలిచ్చుటయనగా యాపొలమును వ్యవసాయము చేయుటకు కావలసిన విత్తనములు కావచ్చును.

ఇది మాచర్ల డి. నె. 792రు 1216 యకరముల 6 సెంట్లు. ఈ శాసనము ననుసరించి ఆదేశాలను కైంకర్యమునకు యిప్ప టికీని వినియోగపడుచున్నది"

మాచర్లకు తూర్పున చంద్రవంకవెంబడి పడమరను జనరల్ రోడ్డు వంతెనకు వాయవ్యమున పాడుపడినగుడి వెంబడియున్న శాసనము.

"కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖముగా వినోదంబున పృధివీరాజ్యం చేయుచుండంగాను... శక 1236 (1314 A.D) అగు ఆనంద.... మాచమనాయనింగారి.... దేవరనాయనింగారు మహాదేవి చెఱు సుఖాన పాలించుచు తమకు పుణ్యముకుగాను ధారాపూర్వకముగా సమర్పిస్తిమి."

ఇతడు రెండవ ప్రతాపరుద్రుడు. Wonders మాచర్ల తాలూకా ఆఫీసుకుత్తరముగా వాగుయొడ్డున పొలములో నిలువుగా పాతిన యెఱ్ఱరాతిమీది శాసనము.

“శక 1448 అగు నేటి వ్యయసం॥ క్రిష్ణ రాయదేవ మహా రాజులు పృధ్వీరాజ్యం చేయుచుండంగాను... కార్యకర్తలైన కూనమనాయని కుమారుడు కోనపనాయనింగారు నాగార్జున కొండసీమలోని మాచర్లను వూరితూర్పున....ముత్తినేని తొండడు యిష్టకామేశ్వరునికి వీరేశ్వరునికి అమృతపడి కూర గాయలు పూజపుష్పాలకు త్రియంబక... గాను ధారాపూర్వ కంగా సమర్పిస్తిమి.” ఇది 1526 A.D. లో కృష్ణ దేవరాయల కాలమునాటి శాసనము.

సింగరుట్ల:-సింగరుట్ల అడవిలో శక 1240 (A D. 1318) నాటి శాసనము కలదు.

దుర్గి :- గోపాలస్వామి గుడి యుత్తర ప్రాకారమువద్ద రాతిమీద 1219 (1297 A.D.) రెండవ ప్రతాపరుద్రుని కాలమునాటి దానశాసనము కలదు.

వరంగల్లు సామ్రాజ్యమునకు రుద్రమదేవి రాణిగా నుండి ఈ ప్రాంతమున జన్నిగదేవరాజు గవర్నరుగనుండిన శక 1191 (1269 A. D.) శుక్లనామ సంవత్సమునాటి శాసనము. పైశాసనమునకు దగ్గరగనే యొక పెద్ద రాతిమీద కలదు. వెంకటేశ్వరస్వామివారి యాలయములోని స్తంభము పైన శక 1180 (A.D. 1258) నాటి కాకతీయ గణపతిదేవుని కాలమునాటి దానశాసనము కలదు. కాలమునాటి దాసశాసనము కలదు.

బుగ్గకుత్తరముగా మూడు మైళ్ల దూరమునగల గుడిలో రెండవప్రతాపరుద్రుని కాలమునాటి శక 1240 (1318 A D.). శాసనము కలదు.

చింతపల్లి:- రెండవ ప్రతాపరుద్రుని కాలమునాటి దానశాసనములు రెండు శక 1224 (A.D 1302) నాటిది శక 1226 (1304 A.D) నాటిది శివాలయములోని యొక రాతిపైన నిరువైపుల కలవు. శక 1674 (1752 A. D.) నాటిది హనుమంతునిగుడి కట్టబడినట్లు యొక శాసనము కలదు.

దాచేపల్లి : 14 వ శతాబ్దమున కొండవీటి రెడ్డిరాజు లచే కట్టబడినదని చెప్పబడు పాడుబడిన కోటగలదు. కల్యాణ మంటపమునకు దగ్గరగానున్న యొక రాతిపైన (నాగేశ్వరస్వామిగుడిలో) త్రిపురాంతక దేవుని ప్రధాన మంత్రియొక్క కుమారులచే చేయబడిన దానశాసనము శక 1135 (1213A.D.) నాటిది కలదు.

శక 1177 (1255 A.D) నాటిశాసన మొక రాతి స్తంభముమీద కలదు. రెండవ ప్రతాపరుద్రుని మంత్రి నువ్వులమంచిరాజు గ్రామపుశిస్తులను దేవాలయమునకు దానము చేసెను. కృష్ణ దేవరాయల కాలములో శక 1440 (A. D.1518 ) (అనగా రాయలీ ప్రాంతమును గెలిచిన రెండు సంవత్సరములకు) నాటి దానశాసనము నందిమండపమునకు దక్షిణముగానున్న రాతిమీద కలదు. ముఖమంటపమునకు బయట చిన్న రాతిమీద కాకతీయ రెండవ ప్రతాపరుద్రునినాటి శక 1219 (1297 A.D.) నాటి శాసనము కలదు. అదే ముఖమంటపముయొక్క పెద్ద రాతిపైన కాకతీయ గణపతిదేవుని గవర్నరగు గంగయ్యచే చేయబడిన దానశాసనము శక 1173 (A.D. 1251) విరోధి కృతు నాటిది కలదు.

ఊరిమధ్య దేవాలయములో రెండవ ప్రతాపరుద్రుని యుద్యోగస్తుడు శక 1219 (1297 A D.) హేవిళంబి సం॥ లో నిచ్చిన దానశాసనము. రుద్రమదేవి కాలములో శక 1191] (1269 A.D.)న నొక కరణమిచ్చిన దానశాసన మొకటి. గణపతి దేవునికాలములో శక 1180 (A D. 1258) కాళయుక్తి నాటి దానశాసనమును శశ 1179 (1259 A D.) పింగళ సం॥ దానశాసనములును కలవు.

గోలి:- గోలినుండి త్రవ్వబడిన బౌద్ధశిలా ఫలకములలో వెస్సంతరునికధ చెన్నపురి చిత్రవస్తు కళాశాలలో నున్నది. వెస్సంతరుడనగా బుద్ధుని పూర్వజన్మలలో నొకడుగు వైశ్య కుమారుడు, దానశీలుడు. తనకున్న సర్వస్వము నేకాక తుదకు తన భార్యను కూడ దానమిచ్చెను.

కొండవీటి రాజ్యములో నాగార్జునకొండ సీమలో 150 గ్రామములు.
సముతు గ్రామముల సంఖ్య సీమపెత్తనదారు
మాచెర్ల 64 సూరపరాజువారు
కారెంపూడి 12 కందుకూరివారు
తుమృకోడు 12 డిటో
గురిజాల 16 దుగ్గరాజువారు
తంగెడ 46 తుమ్మలచెర్వువారు

ఆంజనేయుని గుడిలో శక 1547 (A.D. 1625) నాటి శాసనముకలదు దానివద్దనే శక 1577 (1655 AD.) నాటి శాసనమింకొకటి కలదు ఇచ్చట పాళీభాషలోని శాసనములు కొన్ని కలవు. బౌద్ధులకాలమున నిక్కడ యొక స్తూపముండెడిది. నాగార్జునకొండ స్తూపముకంటే అది చిన్నది. దాని వ్యాసము అడుగులు ఎత్తు 8 అడుగులుండెను.

గుండ్లపాడు: శివవిష్ణు ఆలయములకు తూర్పున శక 1243 (1321 AD) నాటి దానశాసనముకలదు. 1175 లేక 1115 A D తేదిగలు శిధిలమగు శాసనము గ్రామమునకు పడమర కలదు.

గురజాల:- వీరభద్రస్వామి గుడిలోని నాగుపాములు బొమ్మలుగల శాసవముగూర్చి శ్రీచిలుకూరి వీరభద్రరావుగారి ఆంధ్రుల చరిత్రలో నిట్లున్నది.

“బిరుదాంకరుద్రుడను నామాంతరముగల చాగి బేతరాజు పల్నాటికి ప్రభువై భూలోకమల్లునకు కప్పము కట్టుచుండెను. ఇతడు హైహయవంశజుడు. ఈరాజు కామనూరు వాస్తవ్యుడును ఋగ్వేదపాఠియునగు నొక బ్రాహ్మణునిచే మాధవీపురము (గురజాల)లో ప్రతిష్టించబడిన త్రిమూర్తి దేవాలయ మునకు శాలివాహనశక 1051 సౌమ్య సం॥ (1129-30 A. D.) దానశాసనము వ్రాయించెను. ఈశాసనము వ్రాయబడిన నాగస్తంభముకూడ ఆకాలమునందే ప్రతిష్టింపబడినది. ఈశాసనములోని మొదటి రెండుశ్లోకములలో శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, అబ్జుడు, మహాంబుజుడు, శంఖధరుడు కుళితుడు యనెడు యష్టనాగముల ప్రార్థన కలదు,”

ఈ త్రిమూర్తి దేవాలయము కోటగడ్డలలోని శిధిల మయిన ముక్కంటి దేవాలయములోనిదై యుండును.

కోటసానిబావివద్ద చిన్న రాతిమీద పాళీభాషలోని శాసనము బౌద్ధయుగమునాటిది కలదు. చోళులకాలముప కట్టబడినదని చెప్పబడుచు కాలినగురజాల యిష్టకామేశ హరాయని శ్రీనాధునిచే చాటు పద్యము చెప్పబడిన యిష్టకామేశ్వరాలయము కలదు. గురజాలలో రహదారి బంగళాకు వెనుకవైపున పొలములో పాళీభాషలోగల శాసనము (రెండువేల సంవత్సరముల క్రిందటిది) ఉండెడిది. దానినిప్పుడు గురజాల తాలూకా ఆఫీసులో నుంచినారు.

పల్నాటివీరుల కోటయని చెప్పబడు ప్రదేశముకలదు. దీనినిప్పుడు కోటగడ్డలందురు. ఇది యప్పడు శ్మశానముగా వాడబడుచున్నది. “ముక్కంటి" గుడియని పిలువబడు పాడుపడిన శివాలయమిందు కలదు. ఇది కోట మధ్యనున్నది. కోట లోని వారిందు పూజ చేయుచుండువారట.

వీరభద్రాలయము (వీరేశ్వరాలయము) రాజరాజ నరేంద్రునికాలమున కట్టబడినదని యందురు. అందు తిరుమల దేవరాయని కాలమునాటి శిధిలమగు శాసనము నాగుపాము బొమ్మగల రాతి స్తంభముమీద కలదు. ఆ గుడిలోనే ధ్వజ స్తంభమువద్ద శక 1470 (1548 A. D) లో గురిందలసీమ గురిందల (గురజాల) లో వీరభద్రునికి భూదానమిచ్చినట్లు శాసన మున్నది. దాని నకలిందు వ్రాయడమైనది.

ఆర్కాటునవాబు కొలువులోనున్న పోర్చుగీసు ఉద్యోగియొక్క యిద్దఱుపిల్లల సమాధులు యిష్టకామేశ్వరాలయము వద్దగల స్మశానములో కలవు.

పాతపాటమ్మగుడిలోని శాసనమువలన 1823 A. D. ప్రాంతమున గుంటూరు జిల్లా కలెక్టరు ఓక్సుదొర పాతపాటమ్మ గుడికి ఈనాము యిచ్చినట్లు తెలియుచున్నది.

గురజాల వీరభద్రస్వామి యాలయములో ధ్వజస్తంభము వెంబడిగల శాసనము. స్వస్తిశ్రీ జయాభుద్యయ శరవర్షంబులు 1470 (1548 A.D.) అగు ...... సంవత్సర నందరాజు రామయ దేవ మహారాజులుంగారు ....... గురిందల గురిఁదలసీమ.... దేవబ్రాహ్మణుల కిచ్చిన ధర్మం ....మాన్యంగాను సమర్పిస్తిమిగాన...చంద్రార్కంగాను అనుభవించు...

రామయదేవుడనగా విజయనగరరాజ్యమేలిన రామరాజు.

ఈ వీరభద్రాలయ శిఖరమును ఇటీవల ప్రఖ్యాత నటకుడును న్యాయవాదియునగు కీర్తిశేషులగు బెల్లంకొండ సుబ్బారావుగారు బాగుచేయించిరి గురిజాల వీరభద్రాలయములో నాగుపాము బొమ్మలు గల నిలువు రాతి స్తంభము మీది యక్షరములు సరిగా కన్పించుటలేదు. తిరుమలరాయని (1567 A. D. మొదలు 1577 వఱకు రాజ్యమేలెను) పేరుమాత్రము కన్పించుచున్నది.

కంభముపాడు:— మాచర్లకు పోవు త్రోవకుత్తరముగా శక 1549 (1627 A. D.) నాటి భూదానశాసనము కలదు.

ముటుకూరు:- గ్రామమునకు తూర్పుగాగల సీతారామస్వామి గుడిలో నొక రాతిపైన శక 1576 (A. D. 1654) నాటిది శిధిలమగు శాసనము కలదు.

నడికూడె:- పాడుపడిన దేవాలయములో శక 1134 (1212 A. D.) నాటి దానశాసనమున్నది.

ఒప్పిచర్ల :- బావి వద్దనున్న పాడుపడిన దేవాలయములో శక 1221 (A. D 1299) రెండవ ప్రతాపరుద్రునినాటి శాసనము కలదు. దేవతలబావియని పిలువబడు బావి వద్ద శక 1233 (A D. 1311) నాటి శాసనము కలదు. ఒక బావిని త్రవ్వించినట్లు శక 1560 (A. D. 1638) నాటి శాసనము కలదు. దేవాలయమున కిచ్చిన దానము విషయమై శక 1541 (A.D.1619) నాటి శాసనము కలదు.

ఊరికి తూర్పుగా ఒక బావి వద్ద రెండవ ప్రతాపరుద్రుని శాసనములు రెండు ఉన్నవి. ఒకటి శక 1233 (1311 A. D.) రెండవది శక 1221 (A.D. 1299) నాటిది.

పట్లవీడు:- ఊరికి అరమైలు దూరమునగల రాతిమీది శాసనము శక 1410 (1518 A. D.) నాటిది శ్రీకృష్ణదేవరాయలు పట్లవీడుశివారు రామడకను మాచెర్ల చెన్నకేశవునికిచ్చినట్లు శాసనము. (ఈ ప్రాంతమును గెలిచిన రెండు సంవత్సరములకు)

పట్లవీడు వద్దగల కృష్ణదేవరాయని శాసనము.

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు కృష్ణవర సంగడు 1440 (A.D 1518) బహుధాన్యనామ సం॥ వైశాఖ శు 15 మహారాజశ్రీ రాజాధిరాజ మహీవర శ్రీ వీర ప్రతాప కృష్ణరాయలు వృధివీరాజ్యం శాయంగాను యల్లవినాయంకరు మక్బకా తిమ్మరు నాయంకరు మాచెర్ల చెన్నకేశవదేవరి అమృతపడి నయివేద్య అంగరంగ వైభవానకుమనిరి భూదాన ధర్మశాసనపత్రం క్రిష్ణరాయ మహారాయ నాయంకరు నాగార్జునకొండసీమ రామడక గ్రామానువారిరాగ ... పుణ్యకాలమున క్రిష్ణవేణి తిరుణోత్సవవర్త ఏక్వనాధ సన్నిధియలు దానము పూర్వకముగా కృష్ణరాయ మహారాయనికి పుణ్యంగాను ధారపోసి సమర్పిస్తిమి. ఆగ్రామ మందలి చతురుమూలలం దాననిత్యాపజలవాహిని అందు మాచర్ల చెన్నకేశవదేవర అమృతపడి సయితం అంగరంగ వయిభవ గ్రామముకొండ ఆచంద్రార్క స్తాయిగాను స్వామి మాచర్ల చెన్నకేశవదేవ చదివించి నైవైద్య అంగరంగవయిభవము మల్లప్పనాయంకరు తిమ్మనాయంకరు అనుభవించేది. తిమ్మప్పనాయంకరు సమర్పించింది స్వదత్తాద్విగుణం పుణ్యం... పెదగార్లపాడు:- దేవాలయముననున్న శశ 1695 (A.D. 1773) నాటి శాసనము, ఆ దేవాలయమును బాగుచేసినట్లున్నది.

పిడుగురాళ్ల:- రహదారి బంగళావద్దనున్న పాడుపడిన కృష్ణాలయములో నున్నది. ఆదేవాలయమును శక 1472 (1550 A. D.) లో బాగు చేయించినట్లు గల శాసనము.

శ్రీగిరిపాడు:- శక 1220 (1298 A D) నాటి శాసన మొకటి కలదు. చోళుల కాలమున కట్టబడినదని చెప్పబడు శివాలయము కలదు.

తంగెడః- పాడుపడిన కోటయు ఆకోటలో పాడుపడిన 16 దేవాలయములు కలవు. శక 1294 (A D. 1372) నాటిది కొండవీటినేలు ఆళియ వేమారేడ్డియొక్క శాసనము కలదు. శక 1474 ( 1552 A D.) నాటి దానశాసనము దుగ్గగుడికి పడమరగా కలదు. ఇది విజయనగర రాజులనాటి శాసనము. ఇందు రామరాజ, రామదేవ, తిరుమల దేవుల పేరులు కలవు. తంగెడ కోటను ఉప్పల (అనుముల) కోటిరెడ్డి యనునతకడు కట్టించినట్లు తెలియుచున్నది.

తేరాల:- సిద్ధేశ్వరస్వామి గుడిలో శక 1165 (A.D. 1243) నాటి దానశాసనము కలదు. ఇంకొకరాతిమీద శక 1366 (1444 A. D) నాటి దాన శాసనము కలదు.

పొందుగుల.. శక 1672 (1750 A.D) లో విపరీతమైన వరదలు కృష్ణానదిలో వచ్చినట్లు ఒకశాసన మున్నది. తుమ్మురుకోడు:- ఇచ్చటనొక పెద్దమశీదు కలదు. 1766, 1773, 1774, 1778 లో చనిపోయిన ఆంగ్లేయ సైనికోద్యోగుల సమాధులు కలవు. క్లైవుకాలమందలి ఆర్కాటు నవాబగుమహమ్మదాలీ పేరుకూడ యిందు నమోదు కాబడినది. ఈ ప్రాంతములో జరిగిన యొకయుద్ధములో చనిపోయిన ఫ్రెంచి యింగ్లీషు సైనికుల సమాధులుకూడ కలవు.

వెల్దుర్తి. సహగమనము చేసి సతీత్వమునొందిన స్త్రీల గూర్చి రెండుశిలలు కలవు. శక 1087 (1165 A.D.) నాటిది చదువుటకు వీలు లేని శిధిలమగు శాసన మొకటి కలదు.

1. కారెమపూడి:- శక 1536 (1614 A.D.) న నొక స్తంభమును నిర్మించినట్లు వీరులగుడుల మంటపమునకు దక్షిణము గానున్న నొక రాతిమీద శాసనము.

2. ఆగుడియొక్క తూర్పు ప్రాకారమునకు దగ్గరనున్న నొకరాతిమీద శక 1318 (1396 A D.) నాటి శాసనము.

3. ఆ గుడియొక్క ధ్వజ స్తంభమునకు వెనుక చిన్న మండ పమునకు తూర్పుగానున్న యొక రాతిమీద శక 1246 (1324 A.D.) నాటి శాసనము.

4. ఆగుడియొక్క ముఖమండపముయొక్క స్తంభము మీద నామండప నిర్మాణము గూర్చి శక 1255 (1333 A. D.) నాటి శాసనము.

5. ఊరిలో విష్ణుగుడి బయటి ప్రాకారములోగల రాతి మీద :శక 1549 (1627 A D.) నాటి శాసనము. పల్నాటి వీరులచేత కట్టబడిన యాగుడిని యాసంవత్సరములో నొక నాయుడు బాగుచేయించినట్లుగల శాసనము,

6. సూరేశ్వరస్వామి గుడియొక్క ముఖమండపపు స్తంభముమీద శక 1186 (1261 A.D) నాటిది రుద్రమదేవియొక్క గవర్నరగు జన్నిగ దేవమహారాజులు యిచ్చి దాన శాసనము.

7. ఆగుడియొక్క యింకొక స్తంభముమీద రెండవ ప్రతాపరుద్రుని కాలమున శశ 1239 (1317 A.D.) నాటి దానశాసనము. అందులోనే మఱియొక స్తంభముమీద శక 1227 (A. D. 1305) రెండవ ప్రతాపరుద్రుని కాలము నాటి శాసనము.

8. శశ 1076 (1154 A.D.) కుళుత్తుంగచోళుని ప్రధానమంత్రి దీపారాధనకిచ్చిన భూదానశాసనము. సూరేశ్వరస్వామి గుడిలో తూర్పుప్రాకారములోనున్న రాతిమీదకలదు.

9. రెండవ ప్రతాపరుద్రుని పేరు నమోదు చేయుచు శక 1225 (A D. 1303) నాటి శాసనము ఒక స్తంభముమీద కలదు.

10. శక 1229 (1307 A. D.) న శ్రీమతుమాంచయ నాయనింగారి పుణ్యమునకుగాను వారి అడపం పోచూలెంకంగారు సూరేశ్వర దేవరగుడికి సున్నము పెట్టించినట్లు శాసనము.

అమీనాబాదు శాసనము

ఉ॥ ధాటిగ నేగి యుద్ధగిరి దార్కొని వేంకటరాజుదోలి ముం
    గోటలు లగ్గబట్టి వినుకొండయు బెల్లముకొండ తంగెడల్
    

    పాటిపరిన్ హరించి మఱి బల్మిని గైకొని కొండవీడు క
    ర్ణాటక రాజధాని నిభరాముడు బాహుబలంబుమీఱుచున్

గోల్కొండ నవాబగు మహమ్మద్ ఖులీ కుతుబ్ శా యొక్క మంత్రియగు అమీనుముల్కు క్రీ.శ. 1592-93 న యీశాసనము వ్రాయించెను, ఈ అమీన్ ముల్కుయే పొన్నిగంటి తెలగనార్యునిచే యయాతి చరిత్రము నంకితముగాంచిన యమీనుఖాను. పల్నాటిలోని పెందోటకు ప్ర భు వ గు మార్కండేయుడీ కుతుబ్ రశాహికి సామంతుడుగ నుండెను. ఈ శాసనములో శక 1502 విక్రమసం॥ (క్రీ.శ. 1580) చైత్ర బ 14 భౌమవారమునాడు బయలు వెడలి గోల్కొండ నవాబుయు, ఖులీకుతుబ్ రశాహీకి తండ్రియుయగు యిబ్రహీంకుతుబ్ (ఇభరాముడు) కొండవీటిని గెలిచినట్లున్నది.

ఈ ఇబ్రహీంకుతుబ్ షా, అద్దంకి గంగాధర కవిచే రచింపబడిన తపతీసంువరణోపాఖ్యానమును కృతినొందెను. ఈశాసనము వలన 16వ శతాబ్దాంతమున వినుకొండ, బెల్లముకొండ, తంగెడ దుగ్గములు చెప్పుకొనదగిన బలముగలిగిన దుర్గములని తెలియుచున్నది. వివరములకు చిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రమహానీయులను గ్రంధము చూడనగును.