పల్నాటి చరిత్ర/అనుబంధము 2

వికీసోర్స్ నుండి

అనుబంధము 2

.

పల్నాటిలోని కీర్తిశేషులైన యిటీవలికవులు

1. పాటిబండ గురుమూర్తి :- మాచర్ల నివాసి బ్రాహ్మణుడు నియోగి. ఋష్యశృంగోపాఖ్యానమను ప్రబంధము క్రీ. శ. 1879 న రచించి మాచర్ల వీరభద్రస్వామి కంకితమిచ్చెను. తన గ్రంధమున 'పల్లెనాటిసీమ' యనివాడెను. కొండవీటి సీమలోని పాటిబండ యితని గ్రామము

2. విద్యాశేఖర అక్కిరాజు ఉమాకాంతము గారు:- గుత్తికొండనివాసి, బ్రాహ్మణుడు , నియోగి, చెన్నపురి ప్రెసిడెన్నీ కాలేజీలో నాంధ్రాధ్యాపకుడుగా నుండెను. పల్నాటి వీర చరిత్ర కధలు, షేక్సుపియరు నాటకకధలు, టిప్పుసుల్తాను (నవల), నేటికాలపు కవిత్వము మొదలగునవి రచించుటేగాక శ్రీనాధుడు రచించిన వీరచరిత్రలో బాలచంద్రుని యుద్ధభాగమును అచ్చొత్తించి యుద్ధకాలమును నిర్ణయించుచు విపుల మగు పీఠిక వ్రాసిరి.

3. జానపాటి పట్టాభిరామశాస్త్రిగారు:- జానపాటినివాసి. వైదికుడు బ్రాహ్మణుడు. అభినవసరస్వతియను పత్రిక నడపెను. నాగరఖండము, స్వర్ణకార వ్యవహార మను పద్యకావ్యముల రచించెను.

4. కన్నెగంటి ప్రభులింగాచార్యులు: తక్కెళ్లపాటి నివాసి. విశ్వబ్రాహ్మణుడు. అష్టావధాని. పల్నాటి వీరచరిత్ర నాటకము జయప్రద నాటకము నీలకంఠేశ్వర శతకము, పోతన చరిత్రేయరు పద్యకావ్యము మున్నగు గ్రంధములు రచించెను ' 5. సూరపరాజు వేంకటరమణయ్య:- మాచర్ల నివాసి. బ్రాహ్మణుడు యాజ్ఞవల్కుడు,భైష్మీపరిణయమును, తారా శశాంక నాటకము వ్రాసెను.

6. పిన్నెలి నాగయ్య:- గురజాల నివాసి, బ్రాహ్మణుడు వైదికుడు. సుకన్యకాపరిణయమను గ్రంధమును రచించెను.

7. తిరునగరి వేంకట నరససూరి:- గంగవర నివాసి. సాతాని, రామదేవశతకమును రచించెను.

8. తంగెడ రామకృష్ణయ్య:- మోర్జంపాడు నివాసి బ్రాహ్మణుడు నియోగి. గౌరీపరిణయము, శివానందలహరి యాంధ్రీకరణమును రచించెను.

9. తంగెడ నరిసింహారావు:- మోర్జంపాడు నివాసి బ్రాహ్మణులు నియోగి. దీక్షితస్తుతి రచించెను.

10. తంగెడ లక్ష్మీకాంతకవి:- మోటంపాడు నివాసి, బ్రాహ్మణుడు నియోగి. సముద్ర మథనము బుఱ్ఱుకధ, జగన్మోహిని నాటకము యక్షగానము రచించెను.

11, గోలి కమలనాభుడు:- దాచేపల్లి నివాసి. కళావంతుడు. అంబరీషోపాఖ్యానము (పద్యకావ్యము) రచించెను.

12. దుర్గరాజు నరసయ్య పాకయాజి: గురజాలనివాసి, బ్రాహ్మణుడు నియోగి. భాగవతమును కందార్థ సీసములుగా రచించెను. పెద్దది. అముద్రితము.

13 సరికొండ లక్ష్మీనరసింహకవి:- నాగులవరనివాసి భట్రాజు. తిరుపతి వేంకటేశ్వర శతకమును, బెజవాడ కనకదుర్గ శతకమురు రచించెను. 14. ఘటం కాంతయ్య:- దైదనివాసి. వైదికుడు. ఘటకాంతోపదేశములను వేదాంత గ్రంధమును కందార్థములుగా వ్రాసెను. రుక్మిణీపరిణయమను జంగముకధను వ్రాసెను.

15. కొండ భవానిశంకరాచార్యులు:- విశ్వబ్రాహ్మణుడు వేమవరనివాసి. కనకదుర్గశతకము శ్రీగిరీశ్వరశతకము వీరబ్రహ్మయోగి నాటకము (యక్షగానము) వ్రాసెను.

16. చిరుమామిళ్ల సుబ్బయ్యదాసు:- ధర్మవర నివాసి. కమ్మకులము, గోపాలశతకము, రమాధిపశతకము మున్నగునవి రచించెను.

17. గాదె లక్ష్మీపతి:- పేటసన్నిగండ్లనివాసి. బ్రాహ్మణుడు, నియోగి, భక్తచింతామణి శతకమును రచించెను.

18. బూరుగుపల్లి పురుషోత్తము:- వైదికుడు. రెంటాల నివాసి. తిరుమలేశ్వరశతకము వ్రాసెను.

19. వారణాసి లక్ష్మీనారాయణ:- పిల్లుట్ల నివాసి సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలులో తెలుగు పండితులుగ నుండిరి మొదలగువారు.

పల్నాటిలోని ప్రస్తుత కవులు

1. కన్నెగంటి వీరభద్రాచారి:- తక్కెళ్లపాడు విశ్వబ్రాహ్మణుడు. అష్టావధాని నవభారతము, పేదరాలు, పార్వతీపరిణయము, నందికొండచిలుక, మున్నగునవి రచించెను.

2 కన్నెగంటి లింగాచారి:- తక్కెళ్లపాడు విశ్వబ్రాహ్మణుడు , నీలలోహితశతకమును రచించెను. వీరిద్దఱను పల్నాటిసోదరకవులందురు. గురజాలలోనుందురు. ప్రభులింగాచారియు, వీరిద్దఱును సోదరులు.

8. పోకూరి కాశీపతి:- బొదిలవీడునివాసి. విశ్వబ్రాహ్మణుడు. గద్వాలయాస్థానకవులలో నొకడుగ కొంతకాలముండెను సారంగధరయను త్య్రర్థికావ్యమును, శుద్ధాంధ్రనిరోష్ఠ్య నిర్వచన హరిశ్చంద్ర ప్రబంధమును రచించెను.

4. పిన్నెలి నరసింహకవి:- గురజాలనివాసి. బ్రాహ్మణుడు, \ వైదికుడు, గద్వాలలో గౌరవింపబడెను. భీషఙ్ఞణియను వైద్యశాస్త్రమును పద్య కావ్యముగా రచించెను. సైంధవపరాభవ నాటకము కలియుగనాటకము దండక పంచకము అర్యపర్యటనము లక్ష్మీనృసింహస్తోత్ర పద్యములు మొదలగునవి రచించెను.

5. దాసరి మోసెసు (D. Mosses M. A.) గారు:- మాదిగ క్రిస్టియన్ . సాకిన్ వెల్దుర్తి, గుంటూరు ఆంధ్ర క్రిష్టియన్ కాలేజీలో లెక్చరర్ గా నున్నారు. హర్ష చరిత్ర మొదలగునవి పద్యకావ్యములుగ రచించిరి. వీరి సోదరుడగు

6. దాసరి పెదజాన్:- రెంటచింతలలో నుండును. అప్పకవీయమునకు టీకాతాత్పర్యముల వ్రాసెను. అముద్రితము.

7. సరికొండ రామచంద్రరాజు:- పాలువాయినివాసి, భట్రాజు, మట్టపల్లి నరసింహశతకమును రచించెను.

8. శానంపూడి వరదయ్య:- జూలకల్లునివాసి, బ్రాహ్మణుడు, భీమలింగేశ్వర శతకమును రచించెను. 9. దండంరాజు కేశవరావు:- పిడుగురాళ్ల నివాసి. నియోగిబ్రాహ్మణుడు. సన్యసించి స్వామి కేశవతీర్ధయను నామ రామదర్శినియను మాసపత్రికను నడుపుచు ననేక యధ్యాత్మిక గ్రంధములు రచించిరి. తులసీదాసు రామాయణమును తెలుగున పద్యకావ్యముగా వ్రాయుచున్నారు

10. వేదాంతెము శేషాచారి:- ముటుకూరు, నెమలిపురిలో నుందురు, వైష్ణవుడు, మాఘపురాణము, రామరాఘవ శతకము సూర్యనారాయణ శతకమును రచించెను.

11. తంగెడ నారాయణరావు:- తంగెడనివాసి. బ్రాహ్మణుడు, నియోగి. వరూధిని నాటకమును రచించెను.

12. కూరపాటి కోటమరాజు:- నాగులవరము నివాసి. భట్రాజు. యల్లమందకోటీశ్వర శతకమును రచించెను.

18. శీతిరాజు రామచంద్రయ్య:- వెల్దుర్తినివాసి నియోగి సత్యనారాయణ వ్రతమును పద్యకావ్యముగా రచించెను.

14. కొండ రాజమల్లయాచారి:- వేమవరనివాసి. విశ్వ బ్రాహ్మణుడు. నలనాటకము యక్షగానముగా రచించెను.

15. రెంటాల వేంకటసీతారామయ్య:- రెంటాల నివాసి, బ్రాహ్మణుడు. నందవరీకి. ఆదిశంకరుడు సంస్కృతమున రచించిన సౌందర్యలహరిని పద్యములుగా తెలుగున రచించెను.

అక్కిరాజు చంద్రమౌళి నిత్యానందముగారు మొదలగు