పరమేశ్వర
Appearance
రాగం: శ్రీరాగం - తాళం: రూపకం
[మార్చు]పల్లవి:
పరమేశ్వర కరుణించర సరసాదర చంద్రధరా ||
అనుపల్లవి:
గిరిజావర కరుణింపుము గీర్వాణ శైల చాప ||
చరణం 1:
నిరాలంబ నిరామయ నీలకంఠ పరాత్పరా
సరోజాత భవునకైన తరమా హరా మా
ర భయంకర శంకర నిన్నెన్నగ ||
చరణం 2:
సమాన రహిత మొనివినుతమాన విరాజిత
సమయంబిది బ్రోవగ నిరతము గానము
గాన సదా మిమ్ము గానము గావించెద ||
చరణం 3:
సు దాసు రామదాస రాగదా సురాధిప నుతా
సదయుడవని వేడితి నిను గద నా మదనారి
దయా సదనా నిన్నెద నమ్మితి ||