పద్మపురాణము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పద్మపురాణము

ఉత్తరఖండము - సప్తమాశ్వాసము

ద్వితీయసంపుటము

క.

శ్రీ కేశవసచివానుజ!
లోకస్తుతసౌమ్యచరిత! లోకాలోక
వ్యాకీర్ణకీర్తిపూర! ద
యాకరనయనారవింద! యబ్బయకందా!

1


వ.

పరమయోగవిద్యాగరిష్ఠుండగు వసిష్ఠుండు దిలీపున కిట్లనియె.

2


అ.

అఖిలలోకరక్షణార్థమై [1]పెనుపొంది
హరి వరాహరూపమైన విధము
చిత్తగించి వినుము చెప్పెద నీ కని
శివుఁడు గిరిజతోనఁ జెప్పఁ దొడఁగె.

3

వరాహావతారకథ

క.

శ్రీవైకుంఠపురంబున
[2]దేవాధిపనుతుఁడు వాసుదేవుఁడు సతత
శ్రీవనితాసుఖకలితమ
హావిభవముతోడ [3]నుండు ననవరతంబున్.

4


క.

తద్ద్వారపాలు లఖిలజ
గద్వినుతులు పుణ్యదములు గరుడధ్వజపా
దద్విదయసేవనాత్ములు
సద్వర్తనపరులు నిత్యసౌమ్యచరిత్రుల్.

5

వ.

జయవిజయనామంబులం గలిగి విష్ణునకుం బరమాప్తులై ద్వారం
బున ననవరతంబును గొల్చియుండ నొక్కనాడు బ్రహ్మపుత్రు
లును యోగీశ్వరులును విష్ణుభక్తిపరాయణులు నగు సనక
సనందనాదిమునిముఖ్యులు విష్ణుదర్శనలాలసులై చనుదెంచునప్పు
డంతఃపురంబునఁ గమలాలయసమేతుండై విష్ణుఁడు విశ్రమించు
టం జేసి యమ్మనుల నవసరంబు గాదని వారించిన వార లతి
రోషాయత్తచిత్తులై వారి నిద్దఱం గనలి చూచి యిట్లనిరి.

6


ఉ.

శ్రీ విభుఁ జూచువేడ్క నిటఁ జెచ్చెర వచ్చిన మమ్ము నిమ్ములం
బోవఁగనీక యడ్డపడి పొండని త్రోచినపాపు లిద్దఱున్
భూవలయంబునం దనుజపుంగవులై జనియింపుఁడంచు దుః
ఖావహమైన [4]శాపము రయంబున నిచ్చిరి నొచ్చియ్మునుల్.

7


వ.

ఇ ట్లతిదారుణంబైన మహాశాపం బిచ్చిన వారలు వడవడ వణుంకుచు
బాష్పజలపూరితనేత్రులై తచనుదెంచి ముకుందునకు సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి లేచి నిలిచి కృతాంజలులై గద్గద
కంఠులగుచు మునులశాపప్రకారంబు చెప్పిన నద్దేవుండు కరు
ణించి వారల కిట్లనియె.

8


ఉ.

అప్రతిమానతేజులు గుణాఢ్యులు నిత్యులు పుణ్యమూర్తు లా
విప్రులు సర్వదిక్కులఁ బవిత్రులు వారల నడ్డపెట్టి మీ
రప్రియ మాచరించి రహంకరణంబున వారిమాటకున్
నిప్రతిపత్తి పుట్ట దది వేదము దప్పినఁ దప్పనేర్చునే.

9


వ.

అట్లు గావున మీరు భూలోకంబున జనియించి యేడుజన్మంబుల
మద్భక్తులై యొండె మూడుజన్మంబుల విరోధులై యొండె నన్నుఁ
గూడంగలవా రనిన విని వాసుదేవునకు జయవిజయు లిట్లనిరి.

10

పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/301 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/302 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/303 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/304 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/305 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/306 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/307 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/308 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/309 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/310 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/311 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/312 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/313 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/314 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/315 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/316 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/317 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/318 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/319 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/320 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/321 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/322 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/323 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/324 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/325 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/326 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/327 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/328 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/329 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/330 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/331 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/332 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/333 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/334 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/335 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/336 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/337 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/338 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/339 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/340 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/341 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/342 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/343 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/344 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/345 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/346 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/347 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/348 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/349 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/350 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/351 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/352 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/353 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/354

  1. పెనుపారి (మ)
  2. దేవాధిపుడైన (మ-తి-హై)
  3. నేలు (మ-తి)
  4. శాపమనంబును నిచ్చిరి (ము)