పద్మపురాణము/ఏకాదశాశ్వాసము

వికీసోర్స్ నుండి

పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/546 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/547 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/548 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/549 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/550 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/551 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/552 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/553 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/554 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/555 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/556 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/557 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/558 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/559 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/560 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/561 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/562 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/563 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/564 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/565 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/566 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/567 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/568 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/569 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/570 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/571 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/572 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/573 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/574 పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/575

ఆ.

ప్రాభవమున నిప్పురాణార్థ మంతయుఁ
దెలిసి విష్ణుపూజ తివిరిసేయు
నిదియె నీకు మోక్ష మీ నోపు గతి యని
చెప్పె నమ్మునీంద్రశేఖరుండు.

138


వ.

ఇట్టి పురాణం బాద్యంతంబుగ విని దిలీపభూపాలుండు నిజకుల
గురుండగు వసిష్ఠమహామునీంద్రునకుఁ బునఃపునఃప్రణామంబు
లాచరించి యనేకవస్త్రాభరణమాల్యంబులం బూజించి వీడ్కొలు
పుటయు నమ్మునికుంజరుండు నిజాశ్రమంబునకుం జని సుఖం
బుండె నమ్మానవేశ్వరుండు నిత్యనైమిత్తికవిధానంబున విష్ణు
నారాధించుచు ననేకసహస్రవర్షంబులు రాజ్యంబు చేసి పదంపది
పరమయోగీంద్రగమ్యం బగు పరమపదంబున విష్ణుసారూప్యంబు
పడసి నిత్యముక్తుం డయ్యెనని చెప్పి సూతుండు [1]వెండియు
నిట్లనియె.

139


క.

ఇది సర్వవేదసారం
బిది సకలసురైకసేవ్య మిది పురుషార్థం
బిది హరిభక్తిసుఖాస్పద
మిది మోక్షప్రదము నగు మునీశ్వరులారా!

140


తే.

అఖిలజగములు సుఖలీలలందుఁ గాత
పరహితోపకారమ్ముగఁ బరఁగుఁ గాత
దోషసంఘము శాంతమై దూలుఁ గాత
మనుజు లందఱు సుఖమొంది నుండ్రు గాత.

141


క.

అని యిప్పురాణకథనం
బనుపమమతియైన రోమహర్షణసుతుఁ డిం
పొనర వినిపించుటయు విని
యనఘాత్ములు శౌనకాదు లతిహర్షమునన్.

142

పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/577

శంకరుం డంబిక కెఱింగించుటయును, భృగుండు రుద్ర ద్రుహి
ణుల శపించుటయు, విష్ణుండు పరమబ్రహ్మణ్యదైవం బని కొని
యాడంబడుటయు, విని దిలీపుండు కృతకృత్యుండై [2]పరమ
పదంబునకుం జనుటయు నన్నది సర్వంబు నేకాదశాశ్వాసము.


సంపూర్ణము


  1. శౌనకాదులకు వెండియు (హై)
  2. పరమపదంబు బొందుటయు ననుకథలం గల పద్మపురాణోత్తరఖండంబు సర్వంబు (హై)