పదబంధ పారిజాతము/చూలాలితనము

వికీసోర్స్ నుండి

  • "పమ్మినబాళి నంటి యెలప్రాయము చూఱ లొసంగె వానికిన్." శుక. 2. 556.

చూఱవట్టు

  • చూఱపట్టు.

చూఱ విడుచు

  • వదలి వేయు, ఎవరికో అప్పగించు.

చూఱ వుచ్చు.

  • కొల్ల వుచ్చు.
  • దొంగలకు అప్పగించు. దొంగలకు కాక పోయినా సరే పరిపూర్తిగా వదలివేయు అని కూడా వాడుకలోనికి వచ్చినది.
  • "తన బండారువు నూఱవుచ్చె నొకొ కందర్పుండు." కుమా. 10. 32.

చూఱవోవు

  • కొల్లబోవు, నశించి పోవు.

చూఱాడు

  • అపహరించు.

చూలాలితనము

  • గర్భిణీత్వం. భాగ. 8. 502.

చూలుకొను

  • గర్భ మగు. కాశీ. 4. 60.

చూలు చేయు

  • గర్భము చేయు.
  • "తారకావల్లభుండు, చూలు చేసిన వాఁ డంచు సూక్ష్మఫణితి." కాళ. 4. 229.

చూలువడు

  • గర్భముతో నుండు. శ. ర.

చెంగ గొట్టు

  • ఓడించు.
  • "సింగపు గుంపులఁ జెంగగొట్టిన వాఁడు." భాను. 2. 209.

చెంగ గొను

  • దాటు; జయించు.
  • "లంకాప్రాకారంబు చెంగ గొని." భాస్క. యుద్ధ. 910.

చెంగలి గొను

  • చెంగలించు, ఎక్కు వగు. చెంగు చెంగున దాటుటలో వలె ధ్వన్యనుకరణ మై వచ్చి ఉంటుంది.
  • "చెరలాడు చెయ్వులు సెంగలి గొనఁగ." పండితా. ద్వితీ. మహి. పుట. 133.
  • చెంగలించు తప్ప, చెంగలి గొను కోశములలోనికి ఎక్క లేదు.

చెంగావి

  • ఒక రకమైన ఎరుపు.
  • "చెంగావి పంచలు నెల్లూరివా ళ్లెక్కువగా కడతారు." వా.

చెంగోలు

  • అధికార సూచక మగు దండము.
  • శెన్ కోల్ అని తమిళము.
  • "బంగారుచాయల బాగు మీఱిన యట్టి, చెంగోలు కెంగేలఁ జెలువుగాఁ బట్టి." హేమా. పు. 5.

చెండాడు

  • హింసించు.
  • "కఠోరసాయకములం జెండాడ." జైమి. 5. 191.

చెండి కొండలు వైచు

  • చించి చెండాడు వంటిది.
  • "కండలు చెండి కండలుగా వైచు." వీర. 4. 206.

చెండి చెకపిక లాడు

  • చీల్చి చెండాడు.
  • "చెండి చెకపిక లాడమా యుండె నేని." సారం. 1. ఆ.

చెండిపోతు

  • గయ్యాళి, మాట విననిది.

చెండి వేయు

  • (కత్తితో) చెక్కి వేయు.
  • "కరవాలున మాంసము చెండివేయఁగన్." రుక్మాం. 2. 37.

చెండుగోరింపులు

  • ఒక బాల్యక్రీడ.
  • "పింపిళ్ళు చెండుగోరింపు లోమన గుంటలు." దశా. 8. 81.

చెండుదానిమ్మ

  • పూలు మాత్రం పూసే ఒక దానిమ్మ. శ. ర.

చెండు బెండాడు

  • చించి చెండాడు.
  • చెండ్లవలెను, బెండ్లవలెను ఎగురగొట్టు అనుట ద్వారా యేర్పడినది.
  • "చెండుబెం డాడి మెకముల బెండు పఱిచి, దేవరకు వేడ్క వుట్టింతు దేవు నాన." శుక. 1. 247.

చెండుబెం డొనర్చు

  • చెండు బెండాడు.
  • ఇలాగే చెండుబెండు కావించు. చెండుబెండు చేయు కూడా.
  • "చేగల మెకములఁ జెండు బెం డొనరించి, కాలరిపౌఁజుల నేలఁ జమిరి." అచ్చ. రా. సుంద.
  • చూ. చెండు బెండాడు.

చెండుమల్లె

  • ముద్దమల్లె, బంతిపూవు.

చెంప వేయు

  • చెంపదెబ్బ వేయు. బ్రౌన్.

చెందుగపులి

  • చిఱుత; సివంగి. బ్రౌన్.

చెందుప్పు

  • సైంధవలవణం.

చెంద్రకావి

  • సిందూరపు టెరుపు.
  • "కలయఁగఁ జెంద్రకావి ఱవికంబలె." విజ. 2. 92.

చెంద్రవంకలు

  • ఒక రకం ధాన్యం.

చెంపకల్లి

  • ఒక నగ.
  • "కెంపుల చెంపకల్లీరుచుల్ చిందు ద్రొక్క." కఱి. శ. 15.

చెంపకాయలు తిను

  • చెంపపెట్లు తిను. బాల. 177.

చెంపకు చేరెడు కండ్లు

  • విశాలము లయిన కండ్లు.
  • "కోడేరులాంటి ముక్కు, చెంపకు చేరెడు కండ్లు, భలే అందంగా ఉంటుంది లే ఆ పిల్ల." వా.

చెంపకొప్పు

  • కోరకొప్పు.
  • "ఒక వేళ చెంపకొ ప్పోరఁగఁ దిద్దు." వైజ. 2. 134.

చెంపగిల్లు

  • పెడదారి పట్టు; ప్రక్కకు తిరుగు. బ్రౌన్.

చెంపతల

  • దగ్గర.
  • "క్రూ,రోరగభంగిఁ జెంపతల నుండఁగ నెవ్విధి నిద్ర వచ్చు." వేం. పంచ. 3. 164.

చెంపపెట్టు

  • చెంపకాయ.

చెంపబిళ్ళ

  • ఒరుగుదిండు.

చెంపల గొట్టు

  • తిరస్కరించు.
  • "వెన్నం జెంపలఁ గొట్టు మైనునుపుతో." శ్రవ. 3. 59.

చెంపలు వేయు

  • చెంపమీద కొట్టు. కువల. 2. 110.

చెంపలు వేసుకొను

  • పశ్చాత్తాప పడు, తప్పు ఒప్పుకొను.
  • "వీనికి డబ్బివ్వడం తప్పని చెంపలు వేసుకొని వచ్చాను." వా.

చెంప వెట్టు

  • చెంపమీద కొట్టు, చపెటము నిచ్చు.
  • "నిబిరీసతతజటానికురంబకంబులు, చెదరి బ్రహ్మాండంబు చెంపవెట్ట." కాశీ. 5. 130.

చెంపశుద్ధిచేయు

  • చెంపదెబ్బ వేయు.
  • "ఓరీ! మమ్మా అనేది! చెంపశుద్ధి చేతుమో!" హేమా. పు. 84.

చెంపసరులు

  • ఒక నగ.

చెంబట్టు

  • ఎఱ్ఱపట్టు. విక్ర. 6. 67.

చెంబుతల

  • నున్నటి బోడితల. ఆము. 6. 19.

చెంబు పట్టుకొని వెళ్లు

  • దొడ్డికి వెళ్లు.
  • ఏ ప్రాంతంలో ఏ అలవాటు ఉంటుందో ఆరకంగా యీ పలుకుబడి మారుతూ ఉంటుంది.
  • ఏటికి వెళ్లు, కాలవకు వెళ్లు, గుంటకు వెళ్లు, బయటికి వెళ్లు, దొడ్డికి వెళ్లు, పెరటికి వెళ్లు, వెలపటికి వెళ్లు ఇత్యాదులు.

చెంబులో ధనము

  • కొంగుబంగారము. నానా. 68.

చెకపికగా

  • వేగముగా.
  • "....రావోయి! యో, యకలం కాత్మక! వైళ మన్నఁ ద్వరితుం డై నిండువెల్లిం జెకా, పికగాఁ గాల్నడ రాఁ గడంగుట కెదం బ్రీతిల్లువాఁ డెల్లి యౌ." శంకరవిజయకథా. 2. 58.

చెకబికల్ చేయు

  • చెక్కముక్కలు చేయు. ధ్వన్యనుకరణము.
  • "చెకబికల్ చేసి తా నురుముపైఁ గొట్టి." వర. రా. సుం. పు. 153. పం. 12.

చెకబొక లాడు

  • చెండి చెకపిక లాడు. ముక్కలు చేయు.
  • చూ. చెండి చెకపిక లాడు.

చెకాచెకలు

  • చెక్క చెక్కలు.
  • "చెకా చెక లై యవియంగ." రంగా. 3. 198.

చెకుముకిరాయి

  • నిప్పునకై ఱాతిని కొట్టే ఉక్కుముక్క.

చెక్కకొణుజు

  • ఒక పిడుదు. పశువులకు పట్టునది.

చెక్కచెట్టు

  • ఎఱ్ఱరంగు వేయుట కుపయోగించే ఒకచెట్టు. శ. ర.

చెక్కతాపీ

  • తాపీ పనిముట్టు.

చెక్కపిడుజు

  • చెక్కపిడుదు. పశువులకు పట్టే పిడుదు.

చెక్కపీరు

  • చూ. చెక్కకొణుజు.

చెక్కలు చేయు

  • ముక్కలు చేయు.

చెక్కలు వాపు

  • పగుల గొట్టు. జైమి. 5. 72.

చెక్కలు వాఱు

  • ముక్క లగు. భాగ. 6. 32.

చెక్కికొను

  • చెక్కొను.

చెక్కిట నద్దుకొను

  • చెంపలకు అద్దుకొను, ప్రమతో, ఆదరంతో.
  • "కన్నులు చేరుచుకొంచుఁ జెక్కిట, న్గట్టిగ నద్దుకొంచుఁ దనగాటపుఁ గూరిమి దెల్పె మిక్కిలిన్." కళా. 4. 121.

చెక్కి పుచ్చు

  • చెక్కు.

చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు

  • కాస్త కష్టం కలిగించినా వారి మేలుకోస మయ్యే పని చేయు.
  • పిల్లలను ఒక చెంపను దెబ్బకొట్టి అయినా సరే పాలు తాగించడం పిల్లల శ్రేయస్సుకే అనుట ప్రసిద్ధము.
  • "ఇంచుకయేని వేసరక యీగయిఁ జెక్కిలి గొట్టి పాలు ద్రా,గించువిధంబునన్ బలిమిఁ గేశవ! నీవు..." కళా. 8. 247.

చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు నట్లు

  • దండించి మంచిపని చేయించు నట్లు.
  • "ఎంచఁగఁ గౌశికుండు యిల నీగఁగ రాని ఋణంబు దీర్ప నన్, బంచి కలంచు టెల్ల యది బాలునిఁ జెక్కిలి గొట్టి పాలు త్రా,గించినలీలగాఁ దలఁతు." ఉత్త. హరి. 1. 63.
  • చూ. చెక్కిలిమీటి పాలు ద్రావించునట్లు.

చెక్కిలి నొక్కు

  • ప్రేమాదరములతో చెంప పై కొట్టు, లఘుచపేటము నిచ్చు, బుగ్గ పుణుకు. ఒక ప్రేమసూచక మైన చేష్ట.
  • "చెక్కిలి నొక్కి చుంబనము చేసి కవుంగిట నోలలార్చి." కళా. 7. 162.
  • "సరోజాక్ష! నా, కళుకుం జెక్కిలి నొక్కి యొక్క నెలవంకన్ నెక్కొనం జేయుటల్." రాజగో. 4. 33.

చెక్కిలి మీటి పాలు ద్రావించు నట్లు

  • ప్రేమతో దండించి మంచిపని చేయించునట్లు.
  • "బాలు చెక్కిలి మీటి పాలు త్రావించి, బాలు రక్షింపదె బాలుని తల్లి." ప్రభులిం. 14. 115.
  • "శిశువులు వాపోవఁ జెక్కిలి మీటి, విశ దాత్మ పాలు ద్రావించు చందమున." హరి. ద్వి. 2 భా. 195.
  • చూ. చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు.

చెక్కు గట్టు

  • పైభాగం గట్టిపడు.
  • ముఖ్యంగా ద్రవంగానో, మెత్తగానో ఉన్నవి ఆరగా పైన చెక్కు లాగా యేర్పడుతుంది. దానినే చెక్కు గట్టుట అంటారు.

చెక్కు గీటిన వస వల్చు

  • బాల్యంలో ఉండు.
  • చిన్నప్పుడు వస పోస్తారు. అలా గీరితే వస పైకి వచ్చే వయసు - బాల్యం - అనుటపై వచ్చినది.
  • "లే జవరాలు చెక్కు గీ,టిన వస వల్చు బాలకుఁడు డెందమునం గలఁగంగ నేర్చు నే." నైష. 1. 17.
  • చూ. చెక్కు మీటిన వస వల్చు.

చెక్కు చెదరక

  • ఉన్న దున్నట్లు. సాక్షి. 336. పు.
  • "షాజహాను కట్టించిన తాజ్ మహల్ నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నది." వా.

చెక్కు చెమరించు

  • అలసిపోవునట్లు చేయు.
  • "ఈ క్రొవ్విరులు గ్రోలు నెలితుమ్మెదలు చెక్కు, చెమరింపకున్నవా చిగురుఁబోడి." విజయ. 3. 62.

చెక్కు చెమరుచు

  • అలసి పోవు.
  • "చిలుక నక్కునఁ బెట్టఁ జెక్కు సెమర్చు." గౌర. హరిశ్చ. పూ. 1696.

చెక్కు చెమర్పక

  • ఏ అలసటా లేక, అవలీలగా.
  • ఏ ఢోకా లేక.
  • "....పురందరనందను బల్మికల్మి ని,శ్చింతత నుల్లసిల్లెదరు చెక్కు చెమర్పక కౌరవేశ్వరా!" భార. శల్య. 1. 50.
  • "ఖరాదియోధుల సంహరించి చెక్కు చెమర్పక." వర. రా. అర. పు. 121. పం. 23.
  • చూ. చెక్కు సెమర్పక.

చెక్కుటద్దాలు

  • అద్దములవలె నున్నగా నున్న చెక్కులు.

చెక్కుడుపాఱ

  • గడ్డి మున్నగువానిని చెక్కే పాఱ.
  • "....కస వారసి తెమ్మని కూఁతు చేతికిం, జెక్కుడుపాఱ యీయ." శుక. 3. 410.

చెక్కున చె క్కాను

  • చెంప చెంప చేర్చు.
  • ప్రేమను సూచించు ఒక చేష్ట.
  • "చె,క్కునఁ జె క్కానుచు నొక్క చన్మొన యుర:కోణంబుతో రాయఁగన్." కళా. 5. 67.

చెక్కు పిండిన వస యొలుకు

  • పసితనంలో ఉండు.
  • చిన్న పిల్లలకు మాటలు వచ్చుటకై వస నూరి పోస్తారు. ఆ వసే బయటికి వస్తున్న దనుట. అనగా చిన్నతనము.
  • ఇలాంటిదే పాలు గారే చెక్కిళ్లు.
  • "చెక్కు పిండిన వస యొల్కు చిఱుత వాని." హరవి. 2. 76.
  • చూ. చెక్కు గీటిన వస వల్చు.

చెక్కు మీటిన వస గాఱు

  • పసితనంలో ఉండు.
  • "చెక్కు మీటిన వస గాఱు శిశువు భక్తి, నుగ్రతప మాచరించుచు నున్న యతని." విష్ణు. 2. 63.
  • చూ. చెక్కు పిండిన వస యొలుకు. చెక్కు మీటిన వస వల్చు
  • బాల్యంలో ఉండు.
  • ఇదే అర్థంలో ఉపయోగించేవే 'ఒక చెంపన పాలు, ఒక చెంపన నెత్తురు - చెక్కులు పాలు గారు' - ఇత్యాదులు.
  • చిన్నతనంలో పిల్లలకు వస పోయడం, పాలు పట్టడం సహజం. ఇంకా ఆ పాలు, వస తాగే వయసులోనే వున్నారు అనే అర్థాన్ని సూచిస్తూనే చెక్కులు మీటితే పాలో, వసో కారు తుం దనే పలుకుబడి.
  • "పద్మగర్భాదులకు నీఁతబంటి యనినఁ, జెక్కు మీటిన వస వల్చు శిశువు లెదురె?" జైమి. 6. 245.
  • చూ. చెక్కు పిండిన వస యొలుకు.

చెక్కులు గీటు

  • చెక్కులు పుణుకు (ఆదరముతో, ప్రేమతో.)
  • "చేతి వీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పుచున్నదో, యన." పారి. 1. 5.

చెక్కులు సేయు

  • ముక్కలు చెక్కలు చేయు.
  • "ఘోరాపారమహాఘపంచకముఁ జెక్కు ల్సేయఁగా నేర్పు నా." ఆము. 4. 31.

చెక్కు లొత్తు

  • మొల కెత్తు, అంకురించు.
  • "పిదపిద నై లజ్జ మదిఁ బద నిచ్చినఁ, జెలిమేనఁ బులకలు చెక్కు లొత్త." భాగ. 10. ఉత్త. 331.

చెక్కు సెమర్పక

  • ఏ మాత్రం అలసట పడక.
  • "క్రిక్కిఱిసి నగరిలోనికిఁ, జక్కన దురదురన చొచ్చి చనుచో నేమిం, జెక్కు సెమర్పక యుండెడు, నక్కొమరునిఁ గాంచి వార లతిదు:ఖితు లై." సారం. 3.35.
  • చూ. చెక్కు చెమర్పక.

చె క్కూదు

  • చెక్కు చేర్చు.
  • "అంది ముద్రితపాణి యందుఁ జెక్కూఁది యా, గమములు వినుచు హేమము పొదివిన." ఆము. 4. 58.

చెక్కేశాడు

  • ఎక్కడికో పాఱిపోయినాడు.
  • "వా డెక్కడికో చెక్కేశాడు. నాలుగురోజులుగా కనిపించడం లేదు." వా.

చెట్టంత కొడుకు

  • ఎదిగిన కొడుకు.
  • "చెట్టంత కొడుకు పోయాడనేసరికి ఆవిడ కుప్పగూలి పోయింది." వా.
  • చూ. చెట్టంత మనిషి.

చెట్టంత మనిషి

  • ఆజానుబాహుడు.
  • "ఆ రాయి కణతకు తగిలేసరికి చెట్టంత మనిషీ కుప్పకూలి పోయాడు." వా.
  • చూ. చెట్టంత కొడుకు.

చెట్టగొను

  • చేపట్టు.
  • "తనకుఁ గలయర్థ మంతయు, ననురాగముతోడ నిచ్చి యర్థులచే ని,ర్ధనవృత్తిఁ జెట్టగొనియెను." దశ. 5. 81.

చెట్టడిచిన చేటెడు

  • కావలసినన్ని.
  • అతిసమృద్ధిగా ఉన్న వనుట.
  • "తొట్టిన క్రొవ్వులు గలయవి, చెట్టడి చినఁజేటెఁ డేమి చెప్పం బులుఁగుల్." మను. 4. 24.
  • చెట్టు కదిలించగానే బాగుగా పండి ఉన్న ప్పుడు చేతినిండా పండ్లు రాలును అన్నదానిపై వచ్చిన పలుకుబడి.

చెట్టతనము

  • దుష్టత్వము.
  • "చుట్టాలు నీ దగుచెట్టతనంబునఁ, బాసి పశ్చాత్తాపపరుఁడ వగుచు." భార. అను. 4. 382.

చెట్టపట్టలు

  • చెట్టపట్టాలు.

చెట్టపట్టలు వట్టు

  • చెట్టపట్టాలు పట్టుకొను, ప్రేమతో ఒకరిచేతులలో ఒకరు చేతులు జొనిపి పట్టుకొను.
  • "బంతు లేర్పడఁ జెట్టపట్టలు వట్టి." పండితా. పర్వ. 401. పు.

చెట్టపట్టా లాడు

  • సరస మాడు, చెమ్మ చెక్క లాడు.
  • "చేల లంటి గోపికల చెట్టపట్టా లాడితివి." తాళ్ల. సం. 8. 179.

చెట్టపట్టాలు

  • అన్యోన్యంగా ఒకరిచేతు లొకరు పట్టుకొనుట.
  • చూ. చెట్టపట్టలు.

చెట్టపట్టు

  • వివాహ మాడు.
  • "చెలఁగు శ్రీ కృష్ణరాయలఁ జెట్టపట్టి." కృష్ణ. 4. 24.
  • పాండు. 4. 197.
  • చూ. చెట్టవట్టు.

చెట్ట యగు

  • ద్రోహి యగు.
  • "మీఁదు పరికింపక యమ్మెయి నీవు పాండునం,దనులకుఁ జెట్ట వై." భార. ద్రో. 4. 209.

చెట్ట యొనర్చు

  • కీడు చేయు.
  • "అతి వ్యసనత్వము గల్గువారలుం, జేరువ నున్కి భూపతికిఁ జెట్ట యొనర్చు." భార. శాంతి. 3. 469.

చెట్టలాడు

  • దూషించు.
  • "శ్రీకంఠుభక్తులఁ జెట్ట లాడెదరు." పండితా. ప్రథ. దీక్షా. పు. 128.

చెట్ట వచ్చు

  • కీడు కలుగు.
  • "మయలం జెప్పిన సౌఖ్యము, రయలం జెప్పినను జెట్ట రయమున వచ్చున్." కవిజ. సం. 39. చెట్టవట్టు
  • 1. వివాహ మాడు. పాణిగ్రహణము సేయు. పెండ్లిలో పాణిగ్రహణం ప్రధానము కనుక అందుపై వచ్చినది.
  • "....ఈ లతాంగి వసుధావరు నెన్నఁడు చెట్టవట్టునో?" వసు. 3. 43.
  • "చెలఁగి శ్రీకృష్ణరాయలఁ జెట్టబట్టి." కృష్ణా. 4. ఆ.
  • 2. చేయి పట్టుకొను.
  • "చెట్ట వట్టి నిజాంకంబుఁ జేర్పఁ జూచునంత." శుక. 1. 296.

చెట్టాపట్టాలు పట్టు (కొను)

  • చేతులు చేతులు కలుపుకొను.
  • "అట్టియెడ సైంధవోపల, పట్టికలం గట్టినట్టి పలు మెట్టికలన్, మెట్టి డిగి కొలనుఁ జొచ్చిరి, చెట్టాపట్టాలు వట్టి శీతాంశుముఖుల్." బహులా. 2. 54.
  • రూ. చెట్టాపట్టాలు వేసుకొను.

చెట్టాపట్టాలు వేసుకొను

  • చేతులు చేతులు కలుపుకొను.
  • "వా రిద్దరూ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంటారు." వా.

చెట్టు కట్టు

  • నిలద్రొక్కుకొను; వర్ధిల్లు.
  • "నినుఁ గూర్చి చెట్టుకట్టెను గాలవ తపస్వి, ప్రబలించె రుచి మందపాల మౌని." బహు.1. 116.
  • "భక్తి సంయుక్తి యనుపోఁతపాల నొయ్యఁ, జెట్టు కట్టుచు ముని శాఖి నిట్ట చూప." పాండు. 3. 139.
  • చూ. చెట్టు గట్టు.

చెట్టు కొకడుగా పాఱు

  • చెల్లాచెద రై పాఱిపోవు.
  • "ఒకఁడు వోయిన త్రోవ వే ఱొకఁడు వోక, చెట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచులపుడు." మను. 4. 103.
  • నేటికీ వాడుకలో - 'ఆ యింటివా ళ్లందరూ చెట్టు కొక్కడూ, పుట్ట కొక్కడూ గా పోయారు.' 'చెట్టు కొక్కడూ గుట్ట కొక్కడూ' అని కూడా అంటారు.

చెట్టు కొకడు పుట్ట కొకడు అగు

  • దిక్కులు పట్టి పోవు.
  • "ఆ యింటి యజమాని చనిపోయేసరికి కొడుకు లందరూ చెట్టు కొకడూ పుట్ట కొకడూ అయి పోయారు." వా.

చెట్టు కొకడై చను

  • చెల్లాచెద రై - దిక్కు కొకరుగా పోవు.
  • "బకనిభు లాపతితుని దోఁ,చికొని రయం బడరఁ జనిరి చెట్టు కొకరుఁ డై." పాండు. 3. 54.

చెట్టు కొట్టి పై వేసికొను

  • తనకు తా నై చిక్కులు తెచ్చి పెట్టుకొను.
  • "కుడిచి కూర్చుండ లేక చెట్టు గొట్టి పయి వేసికొన్నాడు." ధర్మజ. 70 పు. 2 పం.