Jump to content

పదబంధ పారిజాతము/చచ్చి కడుపున పుట్టు

వికీసోర్స్ నుండి

  • "అప్పు డా, చక్కెరబొమ్మ మార్మలయు చైవులకున్ విభుఁ డుల్లసిల్లుచున్." శుక. 1. 302.
  • చూ. బంగారుబొమ్మ.

చక్కెర ముద్దుగుమ్మ

  • అందగత్తె.
  • "ఈ, చక్కెర ముద్దుగుమ్మకు రసప్రియ భాషల నిం పొనర్చెడిన్." వేంక. పంచ. 3. 288.

చక్కెరలప్పలు

  • శర్కరఖండములు.
  • "ఎక్కడ గోరు సోకినన్, జక్కెర లప్పలు." కా. మా. 1. 43.

చక్కెర లొల్కు

  • మధుర మైన.
  • "చక్కెర లొల్కెడు చక్కని యీతని, కెమ్మోవిఁ జూడుము కీరవాణి! ఉషా. 3. 3.

చక్కెరవంటి (పండ్లు)

  • మధుర మైన.
  • "ఈ, చక్కెరవంటి పండ్లు తిన సాఁగి రటంచుఁ గృశించు నెంతయున్." శుక. 3. 376.

చచ్చదరము

  • చచ్చౌకము; నలుచదరము.
  • చూ. చచ్చవుకము.

చచ్చవుకము

  • నలువైపులా చదరముగా నున్నది.
  • "ఇక్కడి గుడి నన్నూరు అడుగుల చచ్చవుకములో." కాశీయా. 304.
  • చూ. చచ్చౌకము.

చచ్చి కడుపున పుట్టు

  • కృతజ్ఞతను తెలియజేయు సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
  • "నీవు మావానికి కాస్త ఆశ్రయం చూపించా వంటే చచ్చి నీ కడుపున పుడతాను." వా.

చచ్చి చావని వాడు

  • అటూ యిటూ కానివాడు.
  • "చచ్చి చావని వాని బల్ హెచ్చునకును." దేవీ. 3. 401.

చచ్చి చెడి

  • నానా శ్రమపడి.
  • "చచ్చి చెడి యింత దూరం వస్తే నువ్వు లేదు పొ మ్మంటే ఎట్లా?" వా.

చచ్చి చెడి చాయంగల విన్నపాలగు

  • నానా శ్రమపడు అనుట. మాటా. 33.

చచ్చి చెడి సున్న మగు

  • నానా శ్రమపడు.
  • "శ్రీశైలం చేరేసరికి చచ్చి చెడి సున్నమయ్యాము." వా.
  • చూ. చచ్చి సున్న మగు.

చచ్చిన చావు అగు

  • అత్యంతబాధకు లోనగు.
  • "చచ్చినచావు గాదె, దై తేయవిభుని సోదరుఁ డీల్గె ననిన." వర. రా. యు. పు. 297. పంక్తి. 20....
  • "వీడితో వేగ లేక చచ్చినచావుగా ఉంది." వా. చచ్చిన చావుగా
  • నానా బాధగా.
  • "చచ్చిన చావుగా జనలోకనాథుఁ, డచ్చోట నాత్మలో నడలుచు నుండె." నలచ. ద్వి. 5. 61.
  • "వీడితో నాకు చచ్చినచావుగా ఉంది." వా.

చచ్చినపామును చంపు

  • అసలే దెబ్బ తిన్న వానిని బాధించు.
  • "వా డసలే చితికి పోయి ఉన్నాడు. మళ్లీ వాడిమీద ఎందుకు వ్యాజ్యం వేస్తావు? చచ్చినపామును చంపడం ఎందుకు." వా.

చచ్చినవానికండ్లు చేరెడేసి

  • గతించినది చాలా గొప్పగా కనబడుట సహజము అనుపట్ల వినవచ్చే పలుకుబడి.
  • "ఎప్పుడో అలా బతికాము ఇలా బతికాము అంటే లాభ మే ముంది? ఇప్పటి సంగతి చెప్పు. చచ్చిన వానికండ్లు చేరెడేసి." వా.

చచ్చినవానిని చదువ వేయు

  • శక్తిహీనునికి బరువైన పనిని అప్పగించు.
  • "వా డసలే అర్భకుడు. వాడినెత్తిన ఇంత పని పెడ్తే ఏం లాభం ? చచ్చిన వాణ్ణి చదవ వేసినట్లు." వా.

చచ్చి పుట్ట నేర్చు

  • అసాధ్యములను చేయగల జగజంత అని నిరసించుటలో వచ్చిన పలుకుబడి. పండితా. ప్రథ. పురా. పుట. 360.
  • "అమ్మా అదా! ఎంత నెఱజాణ. చచ్చి పుట్ట గలదు." వా.

చచ్చి బ్రతుకు

  • చావవలసినంత ప్రమాదానికి గుఱి అయి ఎలాగో బతికి బయట పడు.
  • "ప్రాల్గల రతిదేవి భాగ్యసంపదఁ గదా, ప్రసవసాయక ! చచ్చి బ్రతికి తీవు." నైష. 2. 138.
  • ఇక్కడ శ్లేషలో జాతీయం నిక్షిప్త మై యున్నది.
  • "వాడి కీ మధ్య చాలా జబ్బు చేసింది. ఎలాగో చచ్చి బతికాడు."
  • "ఆ విమానప్రమాదంలో వాడు తగులుకొని చచ్చి బతికాడు."

చచ్చియు చావడు

  • చచ్చినవాడూ కాదు, బతికిన వాడూ కాదు.
  • "ఎంత బల్లిదు నైన నెదిరింప వచ్చుఁ, జచ్చియుఁ జావఁ డీ చపలరాక్షసుఁడు." మైరా. పు. 65.

చచ్చి సగ మగు

  • నానా బాధా పడు.
  • "ఈ పనితో వాడు చచ్చి సగ మయ్యాడు. ఇం కేమి చేస్తాడు?" వా.

చచ్చి సాధించు

  • చనిపోయి కూడా పగ తీర్చుకొను.
  • ఒక కథపై వచ్చిన పలుకుబడి.
  • కరణం బతికున్నంతకాలం రెడ్డిమీద పగ తీర్చుకొన లేక పోయాడు. చావబోతుండగా రెడ్డి వచ్చి యింకా పగ ఎందు కని పలుకరించాడు. అప్పు డతను రెడ్డిగారి దొడ్డికి దక్షిణాన తన్ను కాల్చ మని కడపటి కోరికగా కోరాడు. పాపం! కడపటి కోరిక గదా అని రెడ్డిగారు అలాగే చేశారు. గాలి కాకాష్ఠంలో అగ్గి రెడ్డిగారి దొడ్లో పడి వాము లన్నీ కాలి పొయ్యాయి. 'చచ్చి సాధించాడు రా ముండాకొడుకు' అన్నా డట రెడ్డి.

చచ్చి సున్న మగు

  • విపరీతముగా శ్రమించు.
  • "వీడికి చదువు చెప్ప లేక చచ్చి సున్న మవుతున్నాను." వా.
  • చూ. చచ్చి చెడి సున్న మగు.

చచ్చుదద్దమ్మ

  • చూ. చచ్చు పెద్దమ్మ.

చచ్చునాగమ్మ

  • చూ. చచ్చుదద్దమ్మ.

చచ్చు పీనుగ

  • 1. వెధవ. ఒక తిట్టు. కొత్త. 271.
  • 2. ఏమీ చేత కానివాడు. మదన. 30.

చచ్చుపుచ్చు

  • పనికి రాని.
  • "ఈ చచ్చుపుచ్చు కబుర్లన్నీ నా దగ్గఱ పనికి రావు." వా.
  • "వీడు తెచ్చిన వన్నీ చచ్చుపుచ్చు వంకాయలే." వా.

చచ్చు పెద్దమ్మ

  • దద్దమ్మ.
  • "వాడు వట్టి చచ్చు పెద్దమ్మ. ఎవరే మన్నా పడతాడు." వా.

చచ్చౌకము

  • చచ్చదరము.
  • నాలుగువైపుల చదరముగా నున్నది.
  • "చచ్చౌక మేర్పడి సరసంపుభువిని." పల. పు. 33.
  • చూ. చచ్చవుకము.

చటులపడు

  • మడగబడు, కుంటుపడు.
  • "ఆకాశవాహిని సైకతంబుల ఖురాం,చల టంకముల్ గ్రుంగఁ జటుల పడిన." కాశీ. 3. 12.

చట్టలు చీరు

  • చంపు. రామా. 7. 265.

చట్టలు దూయు

  • చంపు. వరాహ. 6. 22.

చట్టలు ద్రుంచు

  • చంపు.

చట్టలు పట్టుకొను

  • ఒకరిచేతు లొకరు పరస్పరం పట్టుకొను.
  • "పాదుకలు మెట్టి చట్టలు పట్టుకొనుచు." భీమ. 2. 197.
  • చూ. చెట్టాపట్టాలు.

చట్టలు పడిపోవు

  • 'చట్ట' అంటే పిఱుదుకు కింద నున్న వెలుపలి భాగం.
  • "పొద్దున్నుంచీ నిలబడి నిలబడి చట్టలు పడిపోయాయి." వా.

చట్టలు వాపు

  • నాశము చేయు. ఉత్త. హరి. 4. 87.

చట్టి చుయ్యను నా దాఱని

  • చట్టిమీద చుయ్యను శబ్దము ఇంకా ఆఱిపోని.
  • అనగా అప్పుడప్పుడే చేసిన వేడివేడి పదార్థ మనుట.
  • "పునుఁగుందావి నవోదనంబు మిరియం పుంబొళ్లతోఁ జట్టి చుయ్యనునా దాఱని కూరగుంపు..." ఆము. 1. 82.

చట్టితో చట్టి పగుల గొట్టు

  • ఇంటిలో కుండలు పగుల గొట్టు.
  • ఇది కోపసూచకముగా ఆడువారు చేయుపని.
  • "చట్టితోఁ జట్టి పగులంగఁ గొట్టి తనదు, పదరులకు నింట బలుకుక్క లదరి కూయ." శుక. 3. 275.

చట్టుపడు

  • నశించు - త్యక్త మగు.

చట్టుపై పోక లగు

  • చెల్లాచెదరు లగు.
  • రాతిపై పడిన పోకలవలె చెల్లాచెద రై పోయి రనుట.
  • "చట్టుపై పోక లై చనిరి గంధర్వులు, గరుడులు పంచబంగాళ మైరి." పారి. 5. 37.

చట్టుబండ లగు

  • పా డగు. కొత్త. 365.

చట్టు మోపు

  • రాయిని మోసే శిక్షను వేయు. దశా. 2. 190.

చట్రాతిపై క్రుంగగల

  • రాతిలో మునుగగల.
  • అసాధ్యకార్యము లొనర్చు నెఱజాణ అనుటలో... కుమా. 8. 135.

చట్రాతిపై గ్రుంక నేర్చు

  • రాతిలో మునిగిపోగల్గు, అసాధ్య కార్యములను చేయ గలవా రనుటలో నిరసన ద్యోతక మైన పలుకుబడి. పండితా. ప్రథ. పురా. పుట. 359.

చట్రాళ్లు

  • కటికవారు, కఠినులు.
  • "ఇచ్చటి జగజంతలు మగలకన్నఁ జట్రాళ్లు సుమీ!" శుక. 3. 184. చడిజాడలు
  • దారితెన్నులు. జం.
  • "పడఁతి వెడలిన చడిజాడ లడుగఁ దొడఁగె." వేం. మాహా. 2. 130.

చడి సను

  • పేరందు, ప్రఖ్యాతి వహించు.
  • "లింగదేవునకు ననుంగుబసవఁడు, జంగమకోటికి సడి సన్న దాసి." బస. 1. 5.
  • "చడి సన్న లింగప్రసాదులు భువిని, అసమశాపానుగ్రహసమర్థులు..." పండితా. ప్రథ. దీక్షా. పుట. 103.

చడి సప్డు లేకుండ

  • ఎవరికీ తెలియకుండా, గప్పు చిప్పు మని. కాశీ. 5. 289.
  • "వాడు చడీ చప్పుడూ లేకుండా పెళ్లి చేసుకున్నాడు." వా.

చడీ చప్పుడూ

  • సవ్వడి. జం.
  • చూ. చడి సప్డు లేకుండ.

చతికిలబడు

  • కూలబడు. భీమ. 5. 15.

చతుర్థసంపద

  • మోక్షము.
  • పురుషార్థములు నాలుగింటిలో నాలుగవది మోక్షము గనుక.
  • ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు. పాండు. 4. 61.
  • "చరితార్థుఁడ వీవు చతుర్థసంపదన్."

చతుర్వేది

  • నాలుగువేదములూ చదువుకొన్నవాడు. ఇలా చదువుకొన్నవా రెప్పుడో ఉండగా, ఆవంశాని కా పేరు వచ్చి తర్వాత నేడు ఇంటిపేరు కూడా అయినది.
  • "మూఁగైనఁ జతుర్వేది గాఁడె." పండితా. ప్రథ. పురా. పుట. 466.

చత్తు సరిపోదు నను

  • చచ్చెద నని బెదరించు. జం.
  • "చేరి వరు వేఁడు మిమ్మాటఁ జెప్పకున్నఁ, జత్తు సరిపోదు ననుము నిస్సంశయముగ." శుక. 3. 267.

చత్వారం వచ్చు

  • నలభై యేండ్ల పైబడిన తర్వాత కండ్లచూపు తగ్గు.
  • "కండ్లకుఁ జత్వార మొదవెఁ గాయము ముదిసెన్." చంద్ర. వి. 2. 21.
  • "నా కీమధ్య చత్వారం వచ్చింది. అద్దాలు వేసుకోవాలి." వా.

చదలు మోయు

  • మిన్నంటు.
  • "చదలు మోచిన శృంగచయముల చేత." వర. రా. కిష్కి. పు. 465. పం. 17.

చదికిల ద్రెళ్లు

  • చదికిల బడు.
  • "తేరిపైఁ జదికిలఁ ద్రెళ్లి నిశ్చైతన్య, గతి నున్న దశసాయకముల సూతు." ఉ. హరి. 3. 53.

చదికిల బడు

  • 1. కూల బడు
  • "వేగంగా పరుగెత్తుకొంటూ పోయి వా డక్కడ చదికిలబడ్డాడు." వా.
  • 2. డీలా పడిపోవు.
  • "వాడు వ్యాపారంలో బాగా దెబ్బ తిని చదికిలబడి పోయాడు." వా.

చదియగొట్టు

  • ఉతుకు.
  • "కూటశాల్మలులందుఁ గుదియఁ గట్టి, చట్రాతిపై మేను చదియఁ గొట్టి." రుక్మాం. 5. 82.

చదివించు

  • బహూకరించు.
  • పెండ్లిండ్లలో వధూవరుల కిచ్చు బహుమతులను చదివింపు లనుట, ఆ యిచ్చుటను చదివించుట అనుట నేటికీ అలవాటు.
  • మొదట ఏ శ్లోకమో, పద్యమో వధూవరుల నాశీర్వదిస్తూ వ్రాసి చదువుట ఆచార మై, అదే తరువాత బహుమతిప్రదానమునకు ప్రత్యామ్నాయంగా పరిణమించి ఉండ వచ్చును.
  • "చీరలున్ హార విభూషణావళియు నమ్మిథునంబునకున్ బ్రియంబుతో, నారదమౌనిచేత నదనన్ జదివించెఁ గుబేరుపేరుగాన్." మను. 5. 96.
  • "వాళ్ళ మామ పెండ్లికూతురికి ఒక పట్టు చీర, పది రూపాయలు చదివించాడు." వా.

చదుకు పడు

  • చప్పిడి బడు; ఊడు.
  • "మురిసి మురిసి రాలె ముని వ్రేళ్ళు నడుముక్కు, చదుకు పడియె." వరాహ. 9. 78.

చదు కెక్కు

  • రాలు.
  • "కెంజిగురాకుడాలు దులకించిన ధాతు పటంబు చాయఁ జే, యం జదు కెక్కు పుప్పొడుల నంటినతేఁటులు." పాండు. 4. 14.

చదు రడచు

  • హాస్య మాడు.
  • "చదు రడచిన మనసుపొందు చక్కం బడునే." భార. ఉద్యో. 1. 312.

చదురుం బదురు

  • సల్లాపాలు. జం.
  • "చదురుం బదురు నొక్క సమ్మతౌనె." తాళ్ల. సం. 3, 582.

చదురు మీఱు

  • చతురత మీఱు.
  • "చదురుల్ మీఱు భవత్ప్రబంధ మిల నిచ్చల్ దక్షిణద్వారకా, సదనాస్థాన కథానుషంగములచే..." రాజగో. 1. 32.

చదురులాడు

  • నేర్పరి.
  • "జగములఁ గలిగించుచదురులాఁడు." భోజసుతా. 1. 25. చదువ బెట్టు
  • 1. చదివించు.
  • "చదువం బెట్టినఁ బట్ట దాత్మల." కా. మా. 4. 22.
  • 2. కుదువ బెట్టు.
  • "అత్తవా రిచ్చిన యపరంజి గంటీలు, సంశయింపక వేగఁ జదువఁ బెట్టె." నిరం. 2. 116.
  • "ఏమని చెప్పవచ్చు నపు డింతుల సొమ్ములు చెల్లిపోవఁ ద,త్ప్రేమము నెక్కడం జదువఁ బెట్టెనొ?" కళా. 6. 97.
  • ఇలాగే 'నీ తెలివిని ఎక్కడ చదవ బెట్టినావు.' 'చదువ వేసినాడు' అన్నట్టు కూడా వాడుక.
  • దక్షిణాంధ్రంలో నేటికీ ప్రచురంగా, ఈ అర్థంలో వాడుకలో ఉన్న పలుకుబడి.
  • పోగొట్టు అని పూర్వకోశాలు చెప్పిన అర్థం సరి కాదు.
  • చూ. చదువ వేయు.

చదువయ్య

  • పండితుడు.
  • "ఇది యెఱుఁగరు చదువయ్యలు, మది ముక్తికి నాస్పదంబు మహిలో వేమా!" వేమన.

చదువ వేస్తే ఉన్నమతి పోయినట్లు

  • తెలివి ఎక్కు వగుటకై ప్రయత్నింపగా తక్కు వయ్యె ననుట.
  • "ఇన్నాళ్లు సేవ చేయుచు, నున్నదియుం బోయె నేఁ డయో కౌఁగిలి యి,మ్మన్నంతఁ జదువఁ బెట్టఁగ, నున్న మతియుఁ బోయె నను టహో? నిజ మయ్యెన్." విజ. 3. 10.

చదువు అంటు

  • చదువు వచ్చు.
  • "వాడి కెన్నా ళ్లయినా చదువు అంట లేదు." వా.

చదువు చట్టుబండలు

  • చదువుసంధ్యలు. జం.
  • "వాడి కేం చదువా చట్టుబండలా ? వాణ్ణీ వీణ్ణీ ఆడిపోసుకుంటూ కూర్చుంటాడు." వా.

చదువు లొజ్జల కొప్పగించు

  • చదువు మఱచిపోవు.
  • "వంచనామతిఁ బ్రాడ్వివాకు లై వటువు లొ,జ్జల కొప్పగించిరి చదువు లెల్ల." మను. 3. 129.

చదువు సంత

  • చదువుసంధ్యలు. జం.
  • "చదువు సంత సాగించి నడిపించుచు నిజానుజు దుర్వ్యసనంబువలన గాసిం బొందని రాజానుగ్రహలబ్ధంబు లగు ననేకభోగగ్రామంబులు..." పాండు. 3. 24.

చదువుసంధ్యలు

  • చదువుసాములు. జం.
  • "పొడము నీమొదలియూర్పుల నేర్పులన కదా, చదువు సంధ్యలు గల్గి జగము మనుట." పాండు. 2. 55.
  • చూ. చదువుసంతలు. చదువుసాములు
  • చదువుసంతలు జం.
  • "పురిఁ బొలుతురు చదువుసాముల." విజయ. 1. 69.

చద్దికి వేడికి వచ్చు

  • పొద్దునా మధ్యాహ్నమూ వచ్చు.
  • చద్ది తినే ప్రొద్దు ఉదయము. వేడి అన్నం తినే ప్రొద్దు మధ్యాహ్నము.
  • "చద్దికి వేఁడికి వచ్చి సనకాదులు పాడేరు." తాళ్ల. సం. 11. 3. భా. 99.

చద్ది అన్నము

  • చద్ది బువ్వ.

చద్ది బువ్వ

  • చద్దన్నము.

చద్దిమూట యగు

  • అనుభవింపక తప్పని దగు. అవసరమునకు పనికి వచ్చు.
  • "ఒద్దనే పెక్కు గాలము ఊనిన పురాకృతము, చద్దిమూ టై యనుభవించఁగఁ జేసే మానదు." తాళ్ల. సం. 8. 216.

చద్ది వడు

  • ఆలస్య మై మూల పడు.
  • "ఏ పనైనా వేడిమీదే అయి పోవాలి. చద్దివడితే ఇక సాగదు." వా.

చద్దివలపు బేరము

  • వేడి తగ్గిపోయిన ప్రేమ. తాళ్ల. సం. 12. 145.

చన విచ్చు

  • 1. ప్రేమతో గూడిన స్వేచ్ఛ నిచ్చు.
  • "చన విచ్చి పుచ్చుకొన్నను, మన వచ్చునె యింక నేటి మాటలు చెలియా!" పారి. 1. 97.
  • "ఇది సరి కా దని అతనితో చెప్పగలను. ఈ మాత్రం నాకు చనువు ఇచ్చాడు." వా.
  • 2. అలు సిచ్చు.
  • "పిల్లలకు చను విస్తే నెత్తి కెక్కి కూర్చుంటారు." వా.

చనవు చెల్లించు

  • ప్రియ మొనగూర్చు.
  • ".......మా యెడఁ జనవు చెల్లించి, త్రోచిపోవక యున్న తోయమాత్రంబు." వర. రా. బా. పు. 161. పంక్తి. 9.

చనవు చెల్లు

  • ప్రేమతోడి స్వాతంత్ర్యము సాగు.
  • "ననుఁ బిలిపింప వైతి తగునా చన వింతకు నాకుఁ జెల్లదే." ఉ. హరి. 1. 69.
  • ఈ పద్యంలోని అర్థంలోనే వాడుకలో - 'ఆ మాత్రం చనువు నాకు లేదా ?' 'నా విషయంలో ఆ మాత్రం చనువు చూపవద్దా ?' అంటారు.

చనవు తీరు

  • కోరిక తీరు.
  • "సమర మొనరించి వచ్చి నీ చనవు దీర్తు." జైమి. 4. 117.

చనవు లిచ్చు

  • చన విచ్చు.
  • "దేవకీదేవి మన్నించు నీవు నాకుఁ, జనవు లిచ్చుటఁజేసి." పారి. 1. 130.
  • చూ. చన విచ్చు.

చన వెఱిగి

  • సమయ మెఱిగి.
  • "చన వెఱిఁగి నడవ వలయును, వినియోచితవృత్తిసంధివిగ్రహయానా, సన సంశ్రయణద్వైధులు." కుమా. 10. 182.

చనుగప్పు

  • పైట.

చనుగొయ్య

  • బండి చట్టానికి ఇరువేపులా నాటే కొయ్య. కుమా. 4. 83.

చనుదెంచు

  • వచ్చు.
  • (చను = పోవు, తెంచు = వచ్చు.)

చనుబాలు

  • స్తన్యము.

చను మనుచు త్రోయ విస్తరి చినిగెడు నన్నట్లు

  • అసలే అన్నము పెట్టం పో పొమ్మంటే విస్తరి చినిగి పోతుంది జాగ్రత్త అన్నట్లు.
  • "చను మనుచుఁ ద్రోయ విస్తరి, చినిఁగెడు నన్నట్లు వలపు చెడ్డది సుమ్మా!" శుక. 2. 476.
  • 'ఎంటే రావ ద్దంటే ఎత్తుకో మన్నట్లు' - అన్నది దీనికి దగ్గఱగా ఉన్న నేటి సామెత.

చనుమఱ

  • స్తనం చుట్టూ పైన ఉండే నల్లనిచోటు. వక్షస్థలము.

చనుమానము

  • చనవు.
  • "చనుమా చనుమానముతోడ నావుడున్." సారం. 2. 63.

చనుముక్కు

  • చూచుకము.
  • "ఇఁకఁ జూడఁ గప్పితి నిదె యంచుఁ జనుముక్కు, నతఁడు పాణుల నంట నలఁగి యలఁగి." కళా. 7. 165.

చనుమొన

  • చనుముక్కు.

చనుమోము

  • చనుమొన.

చనువాడు

  • మాట చెల్లుబడి గలవాడు.
  • "కడుఁ జనువాఁడు నై పురుషకారుఁడు దక్షుఁడు నైనమంత్రి." భార. సభా. 1. 31.

చన్న మన్నవారు

  • అందఱూ అనుట. చనినవారు మనినవారు.
  • "ఎన్నఁగ సంసారధర్మ మిది వో మోక్షము చూప, చన్నమన్నవారి కెల్లా సాధనము గాదు." తాళ్ల. సం. 8. 205.

చన్నవారు

  • గతించినవారు.
  • "వారక మును చన్నవారిలో." గౌ. హరి. ప్రథ. పం. 115.

చ న్నవియు

  • ఆవులు మొదలయినవాని చన్నులు చేపు.
  • "ధేనువులు చన్నవిసి పిండు." శకుం. 1. 13.

చన్నిడు

  • తల్లి పాలిచ్చు.
  • "విలపించు బిడ్డలకు నొయ్యనఁ జన్నిడి నిద్ర పుచ్చఁ బోఁగా వలెనో..." హంస. 4. 150.

చన్నిచ్చు

  • తల్లి పాలిచ్చు.
  • "కడుపు నిండఁగఁ జన్నిచ్చి." హరి. పూ. 5. 156.

చన్నూ చంకా ఉన్న ఆడది

  • కాస్త ఆకారం కలస్త్రీమాత్రురాలు.
  • "వాడికి కాస్త చన్నూ చంకా ఉన్న ఆడ దైతే చాలు. వెంట బడతాడు." వా.

చపచపగా

  • ఊరకే.

చపచప చేయు

  • సఫా చేయు, చంపు.
  • "కపులను దెచ్చి లెక్కఁగ నెంచి మమ్ముఁ జపచపఁ జేసి." వర. రా. యు. పు. 30. పం. 2.

చపచప నగు

  • వ్యర్థ మగు.
  • "పలా, శిపతుల ముక్కులుం జెవులుఁ జక్కగ జెక్కఁగ వచ్చి యుండఁగాఁ జప జప నైన తద్వధవిచారవి శేషముతోఁ గకుత్థ్సుఁడున్." కకు. 5. 162.

చప్పట లగు

  • అణగు.
  • "ఒదవెడు జవ్వనంబు వెలి కొత్తఁగఁ బయ్యెద సిగ్గుఁ గూడి చి,ట్టదుమఁగ లేఁత లౌట దిగనీకను మీఱను లేక పక్షపుం, జదువునఁ బ్రక్కల న్మెఱసి చప్పట లై మఱి లావుఁ గూడఁ బైఁ, బొదలె ననంగ...." ఆము. 5. 21.

చప్పట లిడు

  • చప్పట్లు కొట్టు.
  • "సరసంబు లాడుచుఁ జప్పట లిడుచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 440.
  • కరతాళ ధ్వనులు చేయుటగా నేడు అలవాటు.
  • "అధ్యక్షుని ఉపన్యాసం ముగియగనే సభ్యులు కరతాళధ్వనులు చేసిరి." వా.
  • రూ. చప్పట్లు కొట్టు.

చప్పట్లు వెట్టు

  • చప్పట్లు కొట్టు, చప్పట్లు చఱచు, కరతాళధ్వనులు చేయు.
  • "చిందులు వాడుచుఁ జెలఁగి యాడుచును, జప్పట్లు వెట్టుచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 304. చప్పని
  • నిస్సార మైన. సుమతి. 108.

చప్పరమంచము

  • పందిరిమంచము. శ. ర.

చప్పరించు

  • 1. నోటితో చప్పరించు - తిను, ఆస్వాదించు.
  • 2. ఆ అదేమిటి లే అని నిర్లక్ష్యత కనబఱచు.
  • "జపతపంబులు తలఁచినఁ జప్పరించు." మహిమ. 3. 3.
  • "వాని కెంత గొప్పవిశేషం చెప్పినా చప్పరించి వేస్తాడు." వా.

చప్పలించు

  • చప్పరించు.

చప్పి చప్పి

  • చప్పరించి చప్పరించి.
  • "దప్పి నంగేక్షువుల్ చప్పి చప్పి." కా. మా. 4. 137.

చప్పిడి.

  • ఉప్పు లేని, కారం లేని.
  • "చప్పిడిపథ్యంతో ఈ మందు తినాలి." వా.

చప్పిడిముక్కు

  • అణగిపోయిన ముక్కు.

చబుకు సేయు

  • కొరడాతో కొట్టు.
  • "సైంధవంబుల ధే యని చబుకు సేయ." జైమి. 6. 53.

చమడా లూడగొట్టు

  • చర్మం ఒలిచి వేయు. తిట్టుగానే అలవాటు.
  • "ఇంకోసారి ఆమాట అన్నా వంటే చమడా లూడగొడతాను." వా.
  • చూ. చమడా లెక్కగొట్టు.

చెమడా లెక్కగొట్టు

  • చూ. చమడా లూడగొట్టు.

చమురుకాళ్ల పెద్దమ్మ

  • దురదృష్టవంతుడు, చేత కాని వాడు, సోమరి.
  • "ఆ చమురుకాళ్ల పెద్దమ్మను పట్టుకొని ఏం చేస్తాము?" వా.

చమురు చల్లిన మంటలకై వడి

  • విజృంభించి. మంటలలో నూనె పోస్తే మరింత మండుతుంది.
  • "చమురు చల్లిన మంటల కైవడిఁ, బ్రత్తి తాల్చినవడువున." ఉ. హరి. 3. 71.

చమురు దీసిన దివ్వె

  • ఆరిపోవునది, చంచలము. చము రుంటేనే దీపం వెలుగుతుంది కదా.
  • "చమురు దీసినదివ్వె సంసారము." తాళ్ల. సం. 11. 3. భా. 71.

చమ్మెట వ్రేయు

  • సమ్మెటతో కొట్టు.
  • "ఈ, వీరులు నిన్నుఁ జమ్మెటనె వ్రేయుదు డాయుదుఁ బోర శౌరికిన్." ఉ. హరి. 4. 206. చరచర
  • ధ్వన్యనుకరణము.
  • "చరచర పోతున్నాడు." వా.

చరలాడు

  • ఆటలాడు.

చర్మం తీసి చెప్పులు కుట్టించు

  • అతి కృతజ్ఞతను చూపు.
  • "మీ రీకాస్త సహాయం చేశా రంటే నా చర్మం తీసి చెప్పులు కుట్టించి యిస్తాను." వా.

చర్లాట మాడు

  • ఆడుకొను. భార. శాంతి. 3. 245.

చఱపు పిడక

  • గోడకు తట్టిన పిడక - నుగ్గు. చలచల కారు.
  • బాగా కారు.
  • ధ్వన్యనుకరణము.

చలచల నగు

  • ద్రవరూప మగు.
  • "చలచల నై పిదపిద నై, కలలం బై కరుడు గట్టి." భార. 7. 493.

చలపకారి

  • పట్టుదల మనిషి. కాశీ. 6. 9.

చలపట్టు

  • పగ పూను.
  • "చలపట్టి బొంకింపఁ జాలక యున్న." గౌ. హరి. ప్రథ. పం. 294.
  • "నీకు నై చలపట్టి నిర్వహించితిని." వర. రా. అయో. పు. 532. పంక్తి. 24.
  • పండితా. ద్వితీ. పర్వ. పుట. 517.
  • 'ఆ పాము చలం పట్టింది' అని వాడుకలోనూ వినవస్తుంది.

చలపాదము

  • గర్వము.
  • "చదివితి ననియెడి చలపాద మింతే కాని, అదన నందులోని యర్థ మెఱుఁగ." తాళ్ల. సం. 7. 21.

చలపొడుచు

  • చలపట్టు.
  • దుష్ట మగు అని వావిళ్ల ని. సరి అనిపించదు.
  • "చలపొడిచి ఱంకె లిడుచును, బలుమఱు ముంగాళ్లఁ ద్రవ్వి." నీలా. 2. 56.

చలపోరు

  • చలపట్టు.
  • "ఈ కుముదబాంధవుఁడు చలపోరి గెలిచె." తాళ్ల. సం. 3. 36.
  • "మారుసాములఁ జలపోరి పోరువేళ." రాధి. 1. 113.

చలముకొను

  • చలపట్టు; పట్టు పట్టు.
  • "చలముకొని యొరుల నుడుపుట, బలియుం డై తెంపు సేసి." భార. భీష్మ. 1. 102.

చలము గొను

  • పగ పూను. కాశీ. 6. 172.

చలాచలి

  • కలత.
  • "దా,నవుఁ డొకఁ డేగుదెంచె సవనంబున భాగము లాహరింప న,న్న విని చలాచలిన్ విబుధ నాథులు దక్షుని తోడఁ జెప్పినన్." వరాహ. 5. 111.
  • "డోలీ చప్పుడు చేఁగకుప్పలు చలా చలి బొందఁగ దాడివెట్టి." వరాహ. 11. 60.

చలికప్పడము

  • దుప్పటి. హంస. 5. 356.

చలికాల దన్ను

  • రక్షించు, కాపాడు.
  • ఏవిధంగా చూచైనా సరే - ఏ విధ మైన పనులు చెప్పైనా సరే - ఏవిధంగా దండించైనా సరే రక్షించుట అనుట.
  • "చల్లి మదీయ మ్మై వ,ర్తిల్లెడు నీచుట్లు పట్టు గృహవనముఖ్యం, బెల్లను మీ సొమ్మిఁక మముఁ, జల్లఁగఁ జలి గాలఁ దన్ని సాకుం డనియెన్." కళా. 6. 138.
  • చూ. చలికాల ద్రోయు.

చలికాల ద్రోయు

  • రక్షించు.
  • "కావరే దీవన బ్రోవరే తప్పు, ద్రోవరే చలిగాలఁ ద్రోవరే యింక." బసవ. 7.
  • "చలికాలఁ ద్రోచి విడువుము, చెలి మిక్కిలి మనసు పేద శీతలపాదా!" విజ. 3. 50.
  • చూ. చలికాల దన్ను.

చలికి జడిసి కుంప ట్లెత్తుకొను

  • చిన్న బాధ తొలగించుకొనుటకై మఱింత పెద్ద బాధను నెత్తిన వేసికొను. కాళ. శత. 80.

చలికూటిపై నిడిన వెన్నవలె

  • కరగకుండా.
  • వేడి అన్నంలో వెన్న వేస్తే కరుగుతుంది. రుచిగానూ ఉంటుంది.
  • "....మోహము నెమ్మనంబునన్, దవిలిపు డెంత లె మ్మనుచుఁ దా బతిమాలి ననుం గరుంగఁ డీ, భువిఁ జలికూటిపై నిడినఁ బోఁ దలరారెడు వెన్న కైవడిన్." రాజశే. వి. 3. 180.

చలికూడు

  • చద్దన్నము. కుక్కు. 16.

చలిగరువు

  • లోపల ఇసుక, గులకరాళ్ళు ఉన్న నల్లమట్టి నేల. బ్రౌన్.

చలి గొట్టు

  • చల్లని యీదురుగాలి వీచు; అందువలన చలి వేయు.
  • "కొఱపము చెడ్డ యొట్టు చలి గొట్టినచో కవనంబు కల్ల..." హంస. 4. 41.
  • చూ. చలి వేయు, చలి పెట్టు.

చలిచీమ నైనను చంపుటకు శంకించు

  • ఎవరికీ ఏ అపకారం చేయకుండు.
  • ఏ మాత్రమూ ఇతరులకు బాధ కల్పింపనివానిపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "చలిచీమ నేనియుఁ జాఁ ద్రొక్క శంకించుఁ, బలుకఁ డెన్నఁడు మృషా భాషణములు." పాండు. 2. 6. చలిదిమూట
  • ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగింప వీ లయినది.
  • "నువ్వు చేసిన పుణ్యం నీకు చలిది మూటగా పనికి వస్తుంది." వా.
  • దీనినే రాయలసీమలో సద్ది మూట అని ఉపయోగిస్తారు.

చలి దీఱు

  • సంకోచము తొలగిపోవు.
  • సామాన్యంగా చల్ల నీళ్లలో స్నానం చేయడానికి దిగినప్పుడు మొదటిసారి చాలా చలిగా ఉంటుంది. ఒక్క మునకతో ఆ చలి తీరిపోతుంది. ఆతరవాత యింకెన్ని సార్లు మునిగినా చలి ఉండదు. దీనిపై వచ్చిన పలుకుబడి.
  • "ఇవ్విధంబునఁ జలి దీఱి యింటిపనులు, నూఱు నటు వెట్టి వల్లభు నోరు గొట్టి." శుక. 3. 350.
  • చూ. చలి విడుచు.

చలిపండ్లు వడు

  • చల్లనివస్తువులో, పుల్లనివో తిన్నప్పుడు పండ్లు పులిసిపోవు.
  • "ఇలఁ బడ వానిఁ దిన్నయపుడే చలిపండ్లు వడంగ నేటికిన్." ఆము. 4. 116.

చలిపందిరి

  • ప్రప; నీ ళ్ళిచ్చుటకై బాటలలో అక్కడక్కడా పందిరి వేసి అందులో బానలలో నీ రుంచి ఎవరో ఒక రుండి బాటసారుల కిస్తుంటారు. వీనినే సంస్కృతంలో ప్రపలు అంటారు. వాడుకలో చలి వెందర. పండితా. ద్వితీ. పర్వ. పుట. 352.
  • చూ. చలివెందర; చలిపందిలి.

చలిపందిలి పెట్టు

  • ఉపకారము చేయు.
  • "ఇదియ పదివే లింకన్, జలిపందిరి వెట్టుట కద, వల బో మొత్తమియె మాకు వనజారాతీ!" ప్రభా. 4. 152.

చలిపట్టు

  • చలివేయు.
  • "వలపుచెమ్మట లింకఁ జలిపట్టు నందురు, చలువగొజ్జఁగినీట జవర రమ్మ." రాధికా. 2. 7.

చలిపనులు

  • శీతలోపచారము.
  • "చలిపనుల్ గావింపఁజాలి మానుట లేక." యయా. 5. 77.

చలిపిడుగు

  • మంట లేని పిడుగు. వజ్రాయుధం.
  • "చలిపిడుగునుబోలె శాపంబు దాఁకి." రంగ. రా. యు. 398. పుట.

చలిబిండి

  • 1. చలిమిడి.
  • 2. ఒకచెట్టు. చలిమంట
  • చలి తగ్గుటకై పుల్లలతో వేసిన మంట.

చలిమందు

  • శీతలోపచారము.
  • "నా కీ చలిమందు లేమిటికి?" కావ్యా. 2, 79.

చలిమిడిముద్దవలె

  • గుండుగా, నున్నగా, నల్లగా - చమురు కారుతూ.
  • "ఈ పిల్ల యెక్కడ దొరికింది రా నీకు? చలిమిడి ముద్దలాగా ఉంది. అందమా చందమా?" వా.

చలిమిరి

  • "ఈమిరి, చల్ల గాలి, ఈదు గాలి.
  • "మలయానిలుం డింత చలిమిరితోఁ గ్రాలి, నడపాడునోజ యెన్నండొ పడసె..." కుమా. 5. 121.

చలివంద్రి

  • చూ. చలివెందర.

చలి వాపు

  • సిగ్గు సంకోచములను తొలగించు.
  • "చలి వాపి ఆపె నిడ సరిబేసు లాడు కొంటా, కలిసితి విటు నన్ను కాదా మరి." తాళ్ల. సం. 3. 620.

చలివిందల

  • చూ. చలివెందర.

చలి విడుచు

  • జంకు తీరు.
  • "చలి విడిచి నాఁడునాఁటికి జగ మెఱుంగ." నిరంకు. 2. 17.
  • చూ. చలి దీఱు.

చలివెందర

  • బాటసారులకోస మై అక్క డక్కడా దారిలో దాహం తీసికొని విశ్రమించుటకై యేర్పరిచిన పందిరి. దీనికే సంస్కృతంలో 'ప్రప' అని పేరు. రాయలసీమలో దీనినే 'చలివెందర' అంటారు. చలిపందిరి అని కూడా కొంద రంటారు.
  • "చలివెందరలు పెట్టి యధ్వనీనుల దప్పి యార్చి..." కాశీ. 4. 66.
  • చూ. చలిపందిరి.

చలివెంద్ర

  • చలిపందిలి.
  • "చల్లఁగా నీడయై చలివెంద్రవోలె." గౌర. హరి ఉత్త. 1774.

చలివేందల

  • చలిపందిరి. బ్రౌన్.

చలివేంద్ర

  • చలిపందిరి. బ్రౌన్.

చలువగుఱ్ఱము

  • గాడిద. సాంబ. నిఘం.

చలువ చేయు

  • గుడ్డలు చౌడు వేసి ఉడికించి ఉదుకు.
  • "బట్టలు చలువ చేసి తీసుక రారా." వా.

చలువజోడు

  • చలవద్దాల కళ్ల జోడు.

చలువ దీర్చు

  • చలువ చేయు.
  • "చలువ దీర్చిన సన్న వలిపె దోవతి మీఁద." నిరంకు. 2. 74.
  • చూ. చలువ చేయు.

చలువపట్టు

  • చలువ చేయు, ఉతుకు.
  • "చల్లడ మామీఁదఁ జలువపట్టిన దట్టి, దలిమంపు దుప్పటి దానిమీఁద." నిరం. 2. 20.
  • 2. చల్లనితావు.
  • "చలువపట్టు విడిసె సాఁ తెల్ల ననుచు." పండిత. పర్వ. 290.

చలువమందు

  • శైత్యోపచారం.
  • "నయ మొకించుక యైనఁ గానంగ రాదు, చలువమందుల శైత్యంబు సంభ విలక." శృణ్. శకుం. 3. 44.

చలువమజ్జిగ

  • నిమ్మరసం పిండిన నీటిమజ్జిగ.

చలువ మిరియాలు

  • ఒక రకమైన మిరియాలు.

చలువలు చేయు

  • శీతలోపచారములు చేయు.
  • "విభ్రాంత యై యున్న హేమాబ్జ నాయికాకాంత చెంత జేరి యాచెలువలు చలువలు జేసి రట యెటువలెను." హేమా. పు. 40.

చల్లకు వచ్చి ముంత దాచ నేల

  • అడగడానికై వచ్చి బిడియ పడడం ఎందుకు అనేపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "తెలియఁగ జెప్పు మింక భవదీయ సమాగమన ప్రసంగముల్, జలజ దళాక్షి! యేమిటికిఁ జల్లకు వచ్చియు ముంత దాఁచఁగన్." విక్ర. 7. 38.
  • "సమయ మై యున్నది చల్లకు వచ్చి, ముంత దాఁపఁగ నేల మోమోటమునకు." సారం. ద్వి. 1. 56.

చల్లగా గను

  • కన్నులు చల్ల వడగా చూచు.
  • అనగా చూచుటలో కన్నులు చల్ల బడిన వనుట.
  • "నేఁటి కీపాటి నీవు నాత్రాటిమహిమ, నింటి కేతేరఁ జల్లఁగా గంటి నింక." శుక. 2. 84.

చల్లగా నుండుము

  • సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుము.
  • నేటికీ వాడుకలో - వెయ్యేండ్లు చల్లగా ఉండు తల్లీ! అంటారు.
  • "నామారుగఁ జూడర నా బం,గారయ్యా నీవు చల్లఁగా నుండు మిఁకన్." శుక. 2. 71.

చల్ల చప్పుడు

  • వట్టిమాటలు తప్ప చేతలు లేనివాడు.
  • "మొండరి చల్లచప్పుడు గోడచేర్పు, చండిపో తనునట్టి జాడ నున్నాఁడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1497-98.

చల్ల జంపులు

  • చల్లగా గొంతు కోసేవారు. క్రూరు లనుట. తడి గుడ్డతో కుత్తుక కోసే వాడు అనుటవంటిది.
  • "చల్లఁజంపులు జోగి జంగమంబులు." హర. 2. 52.

చల్ల జేయు

  • చల్లార్చు.
  • "దక్షకన్యామనోజసంతాపభరము, నెయ్యమునఁ జల్లఁజేయు పన్నీటి కొలఁకు." కవిరా. 2. 3.
  • 2. మనసున కూరట కల్పించు.
  • "పద్మాయతాక్షి నీ పలుకులు చాలవే, సరసుల హృదయంబుఁ జల్లఁ జేయు." మల్హ. 2. 75.

చల్ల నారు

  • చల్లారు.
  • "పక్వాన్నములు శాకపాకాదికంబులు, చల్లనారినయేనిఁ జవులు దప్పు." కాశీ. 4. 105.

చల్లనికడుపు

  • సంతానవతి యనుట.
  • "ఘనురాల ! చల్లని కడుపుదానవు నీవు." శుక స. 1. 5.
  • "ఆమెది చాలా చల్లని కడుపు. కొడుకులూ, బిడ్డలూ, మనమలూ, మనమరాండ్రూ కావలసినంతమంది." వా.

చల్లనిచూపు చూచు

  • ఆదరముతో చూచు, అనుగ్రహించు.
  • "ఎండ నుండఁగ నీడ యెదురు వచ్చుట గదా, సుదతి చల్లనిచూపుఁ జూచె నేని." ఉషా. 3. 49.

చల్లనివేళ తలప దగు

  • మంచివారైన అనుట. మంచివారిని గూర్చి, మంచి విషయాలను గూర్చి, చల్లని ప్రొద్దున తలచుకొనవలె ననుటపై యేర్పడిన పలుకుబడి. శ్రవ. 5. 43.

చల్లపడు (ప్రొద్దు)

  • సాయంత్ర మగు. 5. 39.

చల్లపడు వేళ

  • సాయంకాలం.
  • "కొంతవడి నిలిచి వారల, పంతంబులు వినుచుఁ జల్లపడువేళకు న,క్కాంతారమునం గల మృగ, సంతతి వధియించి." వరాహ. 4. 87.

చల్ల పెట్టు

  • నిరాదరము చేయు. చల్లవడ జేయుట పరిగ్రహింపక వదలి వేయుటకు - నిరాదరముగా చూచుటకు సూచకము.
  • "హృల్లీలభావంబు సల్ల పెట్టి." పాండు. 2. 11.

చల్లబడు

  • 1. ఎండతీవ్రత తగ్గు.
  • "కాస్త చల్లబడిం తర్వాత బయలు దేరుదా మని అనుకుంటున్నాను." వా.

2. చల్ల నగు.

  • "వాడి ఒళ్లంతా చల్లబడింది. కాస్త వేడి ఎక్కిస్తే కాని లాభం లేదు." వా.

చల్లమ్మి చవకమ్మి

  • అమ్మి ఆర్చి. ఏదో అవస్థపడి అనుట. కుక్కు. 32.
  • "పాపం ఆ యిల్లాలు మొగుడు పోయిన తర్వాత చల్లమ్మి చవ కమ్మి పిల్లవాణ్ణి చదివిస్తూంది." వా.

చల్లవడియము

  • ఒక రకమైన వడియము. శ. ర.

చల్ల సేయు

  • 1. చల్ల వరుచు; ఆనంద మిచ్చు.
  • "అందఱకు నన్నివగల నానంద మిచ్చి, చల్ల సేయఁగ నింటింటఁ జంద్రుఁ డగుచు." రాధికా. 1. 55.
  • 2. మజ్జిగ చిలికు.

చల్లు పోరాడు

  • 1. వెదజల్లు.
  • "ముదము మీఱఁ జల్లుఁ బోరాడి చించి చీరెద." భాస్క. యుద్ధ. 14. 82.
  • 2. జలక్రీడ లాడు.
  • "వారిఁ జల్లు పో,రాడిరి యోల లాడిరి లతాంగులు రాగరసైకమగ్న లై." రామా. 1. 206.

చల్లుపోరు

  • జలక్రీడ.

చల్లు లాడు

  • చల్లుకొను; జలక్రీడ లాడు.

చల్లు వలపు బేరము

  • మాటలతో మాత్రమే ఆగిపోవు ప్రేమ. తాళ్ల. సం. 12. 145.

చల్లు వెదచల్లు

  • విత్తనాలు చల్లు.
  • "నైపుణిఁ జందనాద్రి గగనద్రుమ సౌర భవీచిఁ దామ్రప,ర్ణీ పరిలబ్ధ మౌక్తికమణి ప్రకరంబులు దోఁచి దక్షిణా, శా. ప వనుండు సల్లు వెదజల్ల జనించెన కాక..." ఆము. 5. 114.

చల్లు వెదలాడు

  • వెదజల్లు; విత్తు.
  • "చాటు వైనవరములు చల్లు వెదలాడుచు." తాళ్ల. సం. 11. 2. భా. 69.

చవి గొను

  • రుచి చూచు; అనుభవించు.
  • చూ. చవి చూచు.

చవి గొన్న కూరలకు మేలుం గీడు కొనియాడు

  • తినిన కూడును గూర్చి చింతించుట వ్యర్థ మనుట.
  • "చాలుఁ జాలు నాఁడే చవిగొన్న కూరలకు, మేలుం గీడు గొనియాడ మీఁద మీఁదను." తాళ్ల. 3. 33.

చవి చదువులు

  • శృంగారవిద్యలు.
  • "చవిచదువులు గఱపుఁ గీరశాబంబులకున్." కావ్యా. 1. 106.

చవి చూచు

  • రుచి చూచు.
  • "తవిలి ఖండింపుచుఁ దాఁ జవి చూచి, చని యున్న లెస్స మాంసము దొప్పఁ బెట్టి." బస. 3. 694.
  • "అక్క గుక్కెఁ డింద యబ్జాక్షి చవిచూడు, మనుచు." రుక్మాం. 3. 230.
  • "చక్కెర కెమ్మోవి చవి చూడ నీయరా?" రాజగో. 1. 109.
  • చూ. చవిగొను.

చవితిచందురుడు

  • చూడ కూడనిది (వాడు.)
  • చవితినాడు చంద్రుణ్ణి చూడడం అపవాద హేతువు కనుక మనవారి దృష్టిలో అది నిషిద్ధము. పాండు. 3. 11.

చవి దేల్చు

  • ఆనందమగ్నులను చేయు.
  • "సంగీతమాధురి చవి దేల్చు." నిరంకు. 4. 74.

చవి మరగు

  • రుచి మరగు.
  • "చలి విడిచి జారశేఖరు, కలయిక చవి మరగి తెరువు కాపెట్టుక..." హంస. 2. 110.
  • "లవణంబు చవి మరిగి మఱుగకుండ." కా. మా. 2. 63.

చవి యగు

  • 1. తగు.
  • "నగినవారితో మారునగం బాడి యెవ్వరికి, జగడించే వారితోడ చవి గాదు గాని." తాళ్ల. సం. 3. 156.
  • 2. రుచి యగు.
  • "కాలెనొ చవి గావొ కమ్మ గావో నీకున్." కా. మా. 3. 88.
  • "ఈ వలనిబొంకులు మాచవి గావు." పారి. 1. 126.

చవిలె పోవు

  • కృశించు. బ్రౌన్.

చవి సూపు

  • రుచి చూపు.
  • "సొరిది నీకును జవి సూపఁగలను." విప్ర. 3. 19.

చవుకగా నెంచు

  • చులకన చేయు.
  • "సవతు లందఱు నన్ను చవుకగా నెంచి, యవమానవాక్యంబు లాడుచు నుండ." వర. రా. అయో. పు. 337. పంక్తి. 3.

చవుకట్లు

  • ముత్యాలు నాలుగు ఉంచి చేసిన చెవుల పోగులు.
  • "చెవుల కమ్మల పట్ల జవుకట్లు." వైజ. 2. 47.

చవుకపడు

  • న్యూన మగు.

చవుకపఱచు

  • కించపఱుచు.

చవుక సేయు

  • న్యూనపఱచు.
  • "సరివారలలో చవుకఁ జేసి." త్యాగయ్య.

చవుకాడి గుదియ

  • నాలుగు ప్రక్కలు తీరిన యినుపదండము. శ. ర. చవుకాలి పీట.
  • నాలుగుకాళ్ళ పీట.

చవుల మరగు

  • రుచి మరుగు, రుచికి అలవాటగు.
  • "వీటఁ గల కోడెకాం డ్రెల్ల వింతరతులఁ, జవుల మరగించి భయము లజ్జయును దీర్ప." శుక. 2. 101.

చవు లిచ్చు

  • ఇష్టము కలిగించు.
  • "అలమేలుమంగ నీ వభినవరూపము, జలజాక్ష (క్షు) కన్నులకు చవు లిచ్చెనమ్మా." తాళ్ల. సం. 3. 658.

చవులు గొను

  • రుచి చూచు.
  • "మాంసఖండముల్ కర్పూరశకల సంచయమును జవులు గొనుచు." రుక్మాం. 3. 230.

చవు వంచ

  • అయిదు.

చవువీధి

  • చౌకు; శృంగాటకము.

చవ్వంచ

  • అయిదు. శ. ర.

చాంగు బళా

  • భళిరే, సెబాసు.
  • "చాంగు బళా య,నిన మంగళధ్వని నిండారి పాఱ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 191.

చాంగు రే

  • చాంగు బళా. పండితా. ప్రథ. దీక్షా. పుట. 246.

చాంద్రాయణము

  • ఒక వ్రతము.
  • చంద్రుని వృద్ధి క్షయాల ననుసరించి ఒక్కొక్క కబళం శుక్లపక్షంలో హెచ్చిస్తూ, కృష్ణపక్షంలో తగ్గిస్తూ తిను వ్రతము.

చా !

  • ఛీ ఛీ అని చీకొట్టుటలో అనుమాట.
  • ఛీ అన్నట్టే ఛా అనుటా వాడుకలో నేటికీ ఉన్నది. అయితే అది ఒత్తి పలుకుతారు.
  • "చా కాఱు లే మని చదువుచున్నారు, మీ కొలఁదియె మమ్ము మీఱి పల్కంగ." బస. 7. 186.
  • "ఛా వెధవా ! అవాచ్యాలు అంటా వెందుకు రా ?" వా.

చాకచక్యము

  • నేర్పు.
  • "ఏం చాకచక్య మమ్మా దీనిది." వా.

చాకలిపిట్ట

  • భారద్వాజపక్షి.

చాకలివానికి జలుబు

  • చాకలివానికి జలుబు చేసినా చేయక పోయినా నీళ్ళలో ఉండాలి.
  • మొసలిపడిశము వంటిది. చాకలివాడు ఎప్పుడూ నీళ్లలోనే ఉంటాడనుట పై వచ్చిన పలుకుబడి. కృష్ణనీ. 72.

చాకిబాన

  • చాకలి బట్టలుతికేబాన; ఒక పిల్లల ఆట.

చాకిమూట

  • చాకలివాని మైల బట్టల మూట.

చాకిమణుగులు

  • అస్థిరములు. తాళ్ల. సం. 11. 3 భా. 116.
  • చలువ చేసి మడత పెట్టిన వస్త్రాలు కాసేపటికి మడతలు చెరిగిపోయి మామూలు అయి తీరును కదా !

చాకిరేవు పెట్టు

  • ఒకరి లోపాలను ఎత్తిచూపు వారి గుట్టు మట్టులు కడిగివేయు.

చాగబడు

  • సాగిలపడు, సాష్టాంగపడు.
  • "పుడమి నంతటఁ జాఁగఁ బడి మ్రొక్కి." పండితా. ప్రథ. పురా. పుట. 302.

చాగఱ గొను

  • చంపు.
  • "నాగ రథాశ్వ భటావలిం గదన్ జాఁగఱ గొన్నఁ జక్కుగ." ఉత్త. హరి. 6. 68.

చాగి మ్రొక్కు

  • సాష్టాంగ నమస్కార మొనర్చు. పండితా. ప్రథ. పురా. పుట. 455.
  • చూ. చాగిలి మ్రొక్కు.

చాగిల బడు

  • సాష్టాంగపడు.

చాగిలి మ్రొక్కు

  • సాష్టాంగ నమస్కారం చేయు.
  • "సంతాపమునఁ జిక్కి చాఁగిలి మ్రొక్కి." పండితా. ప్రథ. దీక్షా. పుట. 102.
  • "వినయంబునఁ జాఁగిలి మ్రొక్కి యిట్లనున్." జైమి. 4. 81.
  • "యలఘువ్రతుఁ డా బాలిక, కిలఁ జాగిలి మ్రొక్కి లేచి..." కళా. 5. 76.
  • చూ. చాగి మ్రొక్కు.

చాగుబడికెలు

  • సాష్టాంగనమస్కారాలు. బ్రౌన్.

చాచి కొట్టు

  • చేతికొలది చెంపపెట్టు పెట్టు.
  • "చాచి కొట్టేసరికి చెంప బురబురా వాచి పోయింది." వా. చాచు
  • చేయి చాచి అడుగు, అర్థించు. దాశ. 96.

చాట బంచు

  • చాటింపు వేయించు.
  • "సకలజనులకుఁ బయనంబు చాటఁ బంచి." జైమి. 2. 106.

చాటభారతము

  • అనంత మైన ప్రసంగము. తొలిరోజులలో పెద్దసైజులో భారతం వగైరాలు అచ్చు వేసేవారు, అవి చేటవలె పెద్దవి కనుక చేటభారతములు అని అలవా టయినవి. అవి పెద్దవి కూడా కనుక యెక్కువ అన్న అర్థంలో పలుకుబడి అయినది.
  • "నీ చాటభారత మంతయు వినుటకు నాకు దెఱపి లేదు. గాని ముచ్చి మూడు మాటలలోఁ జెప్పఁ గలిగితివా చెప్పుము." వా.
  • చింతా. 7. అం. 68. పు.
  • చాటుభారత మని మార్చి కొందఱు అర్థం చెప్పుట సరి కా దనిపించును.

చాటు చేయు

  • మఱుగుపఱచు.
  • "చాటు చేసిన నేమి చక్రవాకులఁబోలు, పాలిండ్లమెఱుఁగులు బయలు పడియె." క్రీడా. 95.

చాటుపడు

  • మఱుగుపడు.

చాటు మాటున

  • చాటున.
  • "...అడంగెఁ కీఁకటుల్, గొందుల సందులన్ గుహల గుట్టలఁ బుట్టల చాటు మాటునన్." అని. 3. 85.

చాటు మాటు లేక

  • గుట్టు గోప్యము లేక - బహిరంగంగా.
  • "చాటు మాటు లేక తేట తెల్లంబుగా, నబ్బోటితోఁ జాటం దొడంగె." చంద్రరేఖా. 2. 8.

చాటువడు

  • మఱుగుపడు.
  • "తురగములు నీరుగొను నవసరము నేతెంచె మనము చాటువడుదము." జైమి. 29.

చాడికత్తె

  • చాడీలు చెప్పునది.

చాడికాడు

  • చాడీలు చెప్పువాడు.

చాడి చెప్పు

  • ఒకరిపై కొండెములు చెప్పు.
  • "చాడి చెప్పిన మనవిగా సంగ్రహించు." రాజగో. 3. 17.
  • "వాడికి వాళ్లమీదా వీళ్లమీదా చాడీలు చెప్పడమే పని." వా.
  • చూ. చాడీకోరు.

చాడీకోరు

  • చాడీలు చెప్పువాడు. చాడీగొట్టు
  • చాడీకోరు.

చాతుర్మాస్యము

  • ఒకవ్రతము.
  • నాలుగునెలలుచేసే యజ్ఞము; వ్రతము.

చానపి పట్లల్కు

  • పట్టెలు తీర్చి పేడనీళ్ళతో అలుకు.
  • "సరసర బసవయ్య సనుదేహ మున్న, కర మభిషేకంబు గావింత మనుచుఁ, జానపి పట్లల్కి సద్భక్తి యద్ది, గానక చాపల కాళ్లు గడ్గుటయు." బస. 7. 204. పుట.

చాపకట్టుగ

  • కుప్పగా.
  • "చాపకట్టుగఁ గూలె సకలబలంబు." పల. పు. 114.
  • "చాఁపకట్టుగఁ బడ్డసైంధవములు." జైమి. 2. 78.

చాపకట్టుగా కూలు

  • కుప్ప గూలు.
  • "చాపకట్టు పడం గూలిన." కాశీ. 6. 277.

చాప కట్టు వడ గొట్టు

  • కుప్ప గూలునట్లు కొట్టు.
  • "మూకల గిట్టివడిన్ జాఁపకట్టు వడం గొట్టి." జైమి. 2. 31.

చాపకట్టు వడు

  • చాప వలె వరుసగా కింద పడిపోవు.
  • "తిరుగ వచ్చినం జొచ్చి చక్కడఁ చుటయుం జాఁపకట్టు వడిన ఘోటకంబులక్రింద మిల మిల మెలంగెడు రావుతులును." ఉ. హరి. 3. 27.

చాపకింది నీరు

  • తెలియకనే ఆపద తెచ్చునది.
  • మెల్లగా అంతటా అలము కొనునది.
  • చాపకింద నీళ్లు పోస్తే పైకి కనిపించవు కానీ చల్లగా అంతట అలుముకొనును.
  • "పాపముఁ బుణ్యము పై పైఁ గూడుకొని, చాపకిందినీరు సంసారము." తాళ్ల. సం. 8. 105.

చాప చద రగు

  • నానాటికి దిగజారు.
  • చాప పెద్దది చినిగి చినిగి చదరగా మిగులు.
  • "చాప యై, చద రయి నిల్చి యిప్పటికి...." గీర. విగ్ర. 33.

చాపచుట్టగ చుట్టు

  • చాపను చుట్టినట్లు చుట్టు.
  • "జగ మెల్లఁ జాపచుట్టగఁ జుట్టి ఘనశక్తి, నెసఁగు హిరాణ్యాక్షుఁ డేమి యయ్యె...." కళా. 6. 20.

చాపచుట్టగా

  • చదరముగా.
  • చాప పఱచిన ట్లనుట.
  • "....బడల్పడియె ననఁగఁ జాపచుట్టఁగఁ బడె నని తోఁపఁబడును." ఆంధ్రభా. 3. 104.
  • "ఆ గాలివానకు చెట్లన్నీ చాపచుట్టగా పడి పోయాయి." వా. చాపట్లు
  • పలచగా దోసెవలె చేసిన పిండివంట.
  • దోసెపిండి ముందురాత్రి రుబ్బి పులియ బెడతారు. చాపట్ల కలా కాక అప్పుడే రుబ్బి ఉపూ కారం వేసి పోస్తారు. ఇవి నేటికీ రాయలసీమలో బాగా వాడుకలో ఉన్నవి. చాపవలె చదరంగా పోయునవి కావున చాపట్లు అయినవి కావచ్చును.
  • (చాప + అట్లు.)

చాపట్లు వోయు

  • దోసెల వంటి వానిని పోయు, చేయు.
  • దోసెలను చాపట్టు అనడం నేటికీ రాయలసీమలో వినబడుతుంది.
  • పులియ బెట్టిన పిండితో కాక అప్పుడప్పుడే రుబ్బినపిండితో చేసినవాటిని చాపట్టులు అంటారు.
  • "పొలిచె మాపటఁ బండువెన్నెల చకోర, పోతవితతికిఁ జాఁపట్లు వోసినట్టు." ఆము. 2. 60.

చాపన్నలు

  • చవటలు.
  • ఇంకా అర్థ మాలోచించవలసిన పదం.
  • "జినునికి గినునికిఁ జేతు లెత్తుదునె, చాపన్నలార సాక్షాల్లింగ మూర్తిఁ, జూపెద రం డంచు లోపలి కేఁగి..." బస. 6. 163.

చాపరువు వాఱు

  • చావుపరుగు తీయు.
  • చచ్చుటకు సిద్ధపడి తెగించి పరువెత్తు.
  • "అది యుక్కఱఁ గాఁడి డుస్సి పాఱిన నఱిముఱిఁ జాపరువు వాఱి యల్లటు వడియన్." మను. 4. 45.
  • "చావుపరువు లంకించుకొన్నాడు." వా.
  • రూ. చావుపరువు.

చాపి పుచ్చు

  • చాచి కొట్టు, చెంపపై చాపి కొట్టు.
  • వాడుకలో ఆత్మనేపదంగానే కానవస్తుంది.
  • "చేనుల్చి చాఁపి, పుచ్చుచునటు ద్విజుఁ బొ మ్మని త్రోవ." పండితా. ద్వితీ. మహి. పు. 126.
  • చూ. చాపి పుచ్చుకొను.
  • రూ. చాచి పుచ్చుకొను.

చాపి పుచ్చుకొను

  • చాచి లెంపకాయ కొట్టు, చేతికొద్దీ కొట్టు.
  • "నాలుగు చాచి పుచ్చుకుంటే సరి. బుద్ధి వస్తుంది." వా.
  • చాపి కాక, చాచి అనే వాడుకలో ఎక్కువగా వినవస్తుంది.

చామర లిడు

  • వింజామరలతో వీచు.
  • "చామరల్ కవ లిడన్." భార. శాంతి. 1. 149.

చామనచాయ

  • కొద్ది నలుపు.
  • "నీలమేఘము డాలు డీలు సేయఁగఁ జాలు, మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ." మను. 6. 102.
  • "అంత మఱి నలుపు కాదు. తెలుపూ కాదు. నీ ఖోడలు చామనచాయ లేవే పిన్నీ." వా.

చామరలు వెట్టు

  • వింజామరలతో వీచు. కుమా. 9. 21.

చాయ.....

  • విధము, తీరు.
  • తండ్రిచాయ, తల్లిచాయ ఇత్యాదులలోని మాట. 'చాలు' అని ఇదే తాల్లిచాలు ఇత్యాదులలో వినవస్తుంది.
  • "ని,క్కమ్ముగఁ దండ్రిచాయ కల కన్యలు ధన్యలు గా వసుంధరన్." వసు. 3. 113.

చాయగోసు

  • చిఱుతపులి. హర. 7. 38.

చాయకు వచ్చు

  • దారికి వచ్చు, మాట విను.
  • "రామునిచేఁ గాని రాక్షసు లితర, సామాన్యనృపులచేఁ జాయకు రారు." వర. రా. బా. పు. 76. పం. 18.

చాయల బల్కు

  • సైగలు చేయు.
  • "చామరో! సురపొన్నలకు నీచాయఁ జాయలఁ బల్క నేటికి." పారి. 4. 16.

చాయవాటులు

  • సైగలు మొదలైన అన్యాపదేశాలు.
  • "చాయవాటులు సన్నలు గాయకములు." కాళ. 4. 39.

చాయవారు

  • లీలగా తోచు.
  • ఛాయరూపముగా తోచు.
  • "సందేహములు పెక్కు చాయవారె." శివ. 3. 71.
  • "చాయ వాఱుటయు." నైష." 3. 42.
  • దీనినే వాడుకలో నీడగా అని వాడుతారు.
  • "వాడి రూప మేదో నీడగా నాకు గుర్తు." వా.

చాయవెన్నెల

  • పండువెన్నెల. పాండు. 1. 15.

చారెడు బియ్యం

  • కొంచెం బియ్యం - చేరనిండా.
  • "బిచ్చగాడు అంతగా అరుస్తున్నాడు. ఓ చారెడుబియ్యం వేసి పంపించు." వా.
  • దోసెడులో సగం చా (చే) రెడు.

చార్వాకము చేయు

  • పిడివాదము చేయు.
  • "దేవునితోడ నేల చా, ర్వాక మొనర్చితిన్." కా. మా. 3. 174.
  • చార్వాకుడు అంతవరకూ ఉన్న ఆధ్యాత్మిక వాదాన్ని కా దని భౌతికవాదాన్ని నెలకొల్పినవాడు. సహజంగా అతని వాదం ఆస్తికుల దృష్టిలో పిడివాదమే.

చాఱకంద

  • ఒక గడ్డ.

చాఱపప్పు

  • ప్రియాలపు పప్పు.

చాఱబియ్యము.

  • వెదురు ఇత్యాదులలోని బియ్యము.
  • చాఱపప్పు అని వావిళ్ళ ని.

చాఱమామిడి

  • చాఱకంద. బ్రౌన్.

చాఱమీను

  • ఒక రకమైన చేప.

చాఱలమెకము

  • పెద్దపులి.

చాఱల వన్నె మెకము

  • పెద్ద పులి.

చా లగు

  • విసుగుదల కలుగు.
  • అంతదాకా వచ్చిన దనుపట్ల అనేమాట.
  • "అదవదఁ బొంద చా లయితి నక్కట." హరి. ఉ. 8. 199.
  • "నాకు ఈపిల్లలతో వేగ లేక చాల యింది." వా.
  • "ఈ సంసారం చా లయింది." వా.
  • ఇదే 'చా లయి పోయింది' అని కూడా వినవస్తుంది.
  • "ఈ కష్టాలూ, బాధలూ, పిల్లలూ, ఈ దరిద్రం అబ్బా ! చా లయి పోయింది. ఎక్కడో దేశంమీద పోదా మని ఉంది." వా.
  • చూ. చాలయి పోవు.

చాలయి పోవు

  • విసుగుదల కలుగు.
  • చూ. చా లగు.

చాలు

  • సమర్థు డగు. (ఏ దైనా చేయుటకు.)
  • "మీ మొగంబులు నాల్గు నీ మాడ్కి నువ్విళు లూరిన నేకాస్య నొకతె నేను జాలుదునే యిది చాలించెదరొ మఱి యే మైనఁ గలదో..." కళా. 5. 18.

చాలుకొను

  • వరుసగా ఏర్పడు.
  • "చాలుకొని యున్నవనమాలికలు." ముకుంద. 2. 132.

చాలు చాలు !

  • చాల్చాలు.
  • ఇది నిరసనసూచకంగా నీ మాట లిక కట్టిపెట్టు అన్న అర్థంలో ఉపయోగిస్తారు.
  • "...నే నిటువంటి వెఱుంగఁ జాలు చాల్, దినమును రాజుఁ జేరఁ జనఁ దీరక నీ కథ వించు నుందునే." శుక. 2. 226.
  • వాడుకలో 'చాలు చాలు లే వయ్యా! ...బలే పెద్దమనిషివి.'
  • రూ. చాలు జాలు. చాలు జాలు
  • ఇక కట్టిపెట్టు.
  • ఏ దైనా అయిష్టంగా మాట్లాడునప్పుడు వారి నిక కట్టిపెట్టు అన్నట్లు అనుటలో వాడు మాట.
  • "వల్లవీ, కింకర ! చాలుఁ జాలు బలికింపకు నింపకు లేనికూరుముల్." సారి. 1. 126.
  • "చాలు చాలు. నోరు ముయ్యి." వా.
  • "చాలు లేవయ్యా. మహ చెప్పొచ్చావు." వా.
  • రూ. చాలు చాలు.

చాలు పట్టు

  • దున్ను.
  • చాళ్లు దున్నుటనుబట్టి వచ్చిన పలుకుబడి.
  • "వైరిభుజాంతరాళజాం, గలమహిఁ జాలు పట్టి." పాండు. 2. 59.
  • రూ. చాలు వట్టు.

చాలు ! పదివేలు వచ్చె !

  • ఇంతవఱకే చాలు. ఇదే పదివేలు.
  • "బాగాయె నిఁకఁ జాలుఁ బదివేలు వచ్చె." సారం. ద్వి. 1. 621.
  • "చాలుఁ బదివేలు వచ్చెఁ బాంచాలి దొరకి,నట్టె కద...." పాంచా. 2. ఆ.
  • "నీవు వచ్చిందే పదివేలు నాయనా - ఏం తెస్తే నేం తేకపోతే నేం ?" వా.

చాలుబడి

  • శక్తి. శ. ర.

చాలుమానిసి

  • 1. సమర్థుడు. భార. విరా. 4. 221.
  • 2. ముఖ్యుడు. దశా. 7. 1. 225.

చాలువాడు

  • సమర్థుడు.
  • "ఇత్తెఱఁ గొక చాలువాని బలు తీర్పునఁ గాక పొసంగ నేర్చు నే?" భార. ఉద్యో. 4. 143.

చాలువాఱు

  • చాళ్ళు కట్టు; సమృద్ధి చెందు.
  • "మొలచి తల లెత్తి నిక్కుచు, సల లితగతిఁ జాలువాఱె సస్యము లధిపా !" భాగ 10. పూ. 755.

చాలూ మూలా

  • తీరూ, తెన్నూ. జం.
  • "వానికి దాని చాలూ మూలా తెలియదు." వా.
  • "వాని ఉపన్యాసానికి చాలూ మూలా లేదు." వా.

చాలెడువాడు

  • సమర్థుడు. హరి. పూ. 9. 157.

చాల్పడు

  • చాళ్ళుగా పడు; చాప కట్టుగా పడు. భార. ఆది. 6. 207.
  • రూ. చాల్వడు.

చావక నోవక

  • ఏమాత్రం కష్టపడక.
  • "ఉన్నటు లుండఁగానె సిరు లూరక చావక నోవ కబ్బునే?" ఆము. 3. 57. చావగొట్టి చెవులు మూయు
  • బాగా శాస్తి చేయు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆ ఊళ్లో వెళ్లి వాడిమీద ఏమన్నా అన్నా వంటే చావగొట్టి చెవులు మూసి పంపిస్తారు. జాగ్రత్త." వా.

చావ గొట్టు

  • చిదుక గొట్టు.
  • "సకలదనుజులను జావంగఁ గొట్టు." మైరా. పు. 19.

చావ జూచు

  • చంపు.
  • "నిను ధార్తరాష్ట్రు లొండె, నీవు వారల నొండెను జావఁ జూడ, వలయు టప్పు డెఱుంగవే." భార. శాంతి. 1. 120.

చావడిమాటలు

  • బజారుమాటలు. బ్రౌన్.

చావు

  • దురవస్థ.
  • "చాకలి మంగలిం దనుపుచావునకున్ దుది కల్గఁ జేయుచున్." పాణి. 2. 13.
  • "వీడితో వేగలేక చావు వచ్చింది." వా.
  • చూ. చావు వచ్చు.

చావుగా ఉండు

  • అతి కష్టంగా ఉండు.
  • "ఈ యింట్లో నీళ్లు సరిగా రాక చావుగా ఉంది." వా.

చావుతల

  • అవసానసమయం.
  • "చావుతల నైన నించుక సత్యవాక్య, ముగ్గడింపర." భోజ. 5. 315.

చావుతెలివి

  • అంతా అయిపోయిన తర్వాత కలిగే పరిజ్ఞానము.
  • చనిపోయేముందు అంతదాకా స్మారకం తప్పి ఉన్నా తెలివి వస్తుం దనుటపై యేర్పడిన పలుకుబడి.
  • "ఈ చావుతెలివితో ఏం లాభం ? మొదటే ఆ పరిజ్ఞానం ఉండవలసింది." వా.

చావు దప్పి కన్ను లొట్ట పోయినట్లు

  • ఎక్కువనష్టం కావలసి ఉండగా ఏదో కొద్దినష్టంతో బయటపడినపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఆ కంపెనీ దివాలా తీయడంతో డబ్బంతా పోయినా జైలు తప్పింది." చావు దప్పి కన్ను లొట్ట పోయి అతను బయట పడ్డాడు." వా.

చావునకు తప్పితివి పొమ్ము !

  • బతికి పోయావు పో!
  • "పుష్కర సరోవరంబునకు రమ్ము, చావునకుం దప్పితివి పొ మ్మనుటయుం గనలి కలకల నవ్వి." ఉ. హరి. 4. 211.

చావుపిట్ట

  • తీతువుపక్షి, సీతవ. బ్రౌన్. చావుబిడ్డ
  • కడుపులోనే చచ్చిపుట్టిన బిడ్డ. బ్రౌన్.

చావుబ్రతుకులలో నుండు

  • 1. మరణావస్థలో ఉండు.
  • "వాడు ఈరోజు చావుబ్రతుకలలో ఉన్నాడు." వా.
  • 2. అతి క్లిష్టదశలో ఉండు.
  • "ఈ వ్యవహారం ఇప్పుడు చావు బతుకుల్లో ఉండి. అటో యిటో తేల్చు కోవాలి." వా.

చావు లేదు

  • ఢోకా లేదు.
  • తగ్గదు.
  • "ఒక్కశతానకుఁ జావు లేదు." గీర. గురు. 22.

చావు వచ్చు

  • దుస్థితి వచ్చు.
  • అనాహూత మేర్పడు.
  • "వచ్చెఁ జా వనుచు." బస. 6. 164.
  • "అబ్బ! వీడితో చావు వచ్చింది." వా.
  • "ఏం చావు వచ్చిం దమ్మా ! ఇప్పుడంతగా వగుస్తావు..." వా.
  • చూ. చావు.

చాళియం బిప్పించు

  • అలంకరింప బనుచు, సాలెలు వేయించుటకు నియమించు.
  • "పురం బభిరమ్యముగను, నెల్లెడఁ జాళియం బిప్పించి రంగ,వల్లులు వెట్టించి." పండితా. ద్వితీ. మహి. పుట. 179.
  • వందనాద్యుపచారము అని కొశ్చెన్‌మార్కుతో. వావిళ్ల ని.

చాళెములు ద్రిప్పు

  • గిరగిర త్రిప్పు.
  • ఒక విధమైన నాట్యములో వలె తిరుగుతూ గద తిప్పు.
  • "చలితాస్య క్రూర దంతక్షత రదరసనక్షార కీలాల వేల,జ్జ్వలన జ్వాలాభ జిహ్వాంచలుఁ డగుచు గదన్ జాళెముల్ ద్రిప్పుకొంచున్." మను. 4. 95.

చింకలిక్క

  • ఎఱ్ఱమూతి కోతి. శ. ర.

చింగులువాఱగా

  • చంగులు వ్రేలు.
  • "బంగరు చెఱఁగు పట్టంచుదట్టి, చింగులు వాఱంగఁ జెలువుగాఁ గట్టి." ద్విప. భళ్ళా. 2.

చించి చిందఱ రేగు

  • చించి చెండాడు.
  • "చేల కావలివారిఁ జించి చిందఱ రేఁగి." రుక్మాం. 3. 10.

చించు

  • నశింపఁజేయు.
  • "చించెన్ గాశి వియోగదు:ఖము." భీమ. 2. 65.
  • "తమముం జించున్." పాండు. 4. 126.

చింతకాయకజ్జము

  • ఉపయోగించుకొన వీలు లేనిది. తాళ్ల. సం. 7. 34. చింతగుల్ల
  • బెరడుతో ఉన్న చింతపండు.

చింతచే సగ మగు

  • విచారముతో చిక్కి పోవు.
  • "తెల్వి సగము మఱపు, సగము నయి చింతచే సగ మగుచు నరిగె, నవ్వరూధిని యంతికోద్యానమునకు." మను. 3. 66.
  • "ఈమధ్య వాళ్ళ నాన్న పోయి వాడు చింతతో సగ మయ్యాడు పాపం!" వా.

చింతనాగు

  • ఒక రకమైన పాము. బ్రౌన్.

చింతనిప్పులు రాలు (కన్నులు)

  • క్రోధారుణితము లగు.
  • "చింత నిప్పులు రాలు చిఱుతకన్నుల డాలు, దావకొలలకుఁ గైదండ లొసఁగె." రాజగో. 5. 36.
  • చింత మొద్దులు కాల్చిన నిప్పులు చాల వేడిగానూ, నిలిచి మండునవిగానూ ఉండును. చండ్రనిప్పుల వంటివే యివి.

చింతపూవు

  • ఒకరకమైన పిల్లల ఆట. భోజసుతా. 2. 9.

చింత యిడు

  • ఆలోచన చేయు.
  • "సకలసురాసురసంఘంబు బుద్ధి, నొక చింత యిడి." వర. రా. బా. పు. 141. పం. 16.

చింతల వంతల చివుకు

  • చింతతో క్రుంగిపోవు.
  • "ఏ నమర్త్య నై, చింతల వంతలం జివికి సిగ్గఱితిన్." మను. 3. 8.

చింత వంత బడు

  • బాధపడు.
  • "దురంతకంతుకుం,తనిహతిఁ జింత వంతఁ బడి, తాంతలతాంతముచంద మొందె." శుక. 1. 519.

చింతాకంత

  • కొంచెము.
  • "చింతా కంతయు వెన్కఁ దియ్యక." పాండు. 5. 39.
  • "చింతా కంతయుఁ జింత నిల్పఁడు గదా." కాళ. శ. 3.

చింతాకు

  • ఒక పిల్లల ఆట. హంస. 4. 136.

చింతాకు ముడుగుతఱి

  • సాయంకాలము.
  • "చింతాకు ముడుఁగుతఱిఁ ద,త్కాంతం గొని తెచ్చి మేరుకార్ముక గేహో..." శుక. 1. 533.

చింతించిన చింత

  • ధ్యానించిన ధ్యానము.
  • "తిరుముగ నినుఁ జింతించిన చింతే, నిరతము ముక్తికి నిధి గాదా." తాళ్ల. 1. సం. పు. 20.

చిం దగు

  • పా డగు.
  • "సికతాసేతువు నిమ్న గారయముచేఁ జిం దైనచందాన సా,త్యకిచేతన్." ఉ. హరి. 4. 127. చిందఱకొట్టు
  • చెలరేగు.
  • "గోడలం వడనూఁకి కొమ్ముల నేలఁ, గ్రోడాడి తోఁకెత్తుకొని పంచితిలుచుఁ, గడిదిఁ జిందఱకొట్టి కడిమి క్రేళ్లుఱికి..." అ. మ. క. 2. 117. పు.

చిందఱగొను

  • 1. చెల రేగు
  • "అడపంగ వచ్చిన నదటునఁ జిందఱ, గొని యెట్టి బలియురఁ గొనక కలియు." హరి పూ. 6. 126.
  • 2. పా డగు, కలత చెందు.
  • "చప్పుడు నిండె నజాండము, సెప్పెడి దేమజుని చెవులు సిందఱ గొనియెన్." భాగ. 8. 209.

చిందఱ రేగు

  • చెలరేగు, వెఱ్ఱి యెత్తు.
  • చిందఱ = చీదఱ.
  • "కటకటఁ బడి యౌడు గఱచి హుమ్మనుచు, దటము దాఁటించి చిందఱ రేఁగినట్లు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1061-62.

చిందఱ లాడు

  • ఛిన్నాభిన్న మొనర్చు.
  • "మావుతుల నిర్జీవితులఁ జేసియుఁ, గుధరంబుల చిందఱ లాడియు." వరాహ. 2. 29.

చిందఱ వందఱ అగు

  • ఛిన్నాభిన్నము అగు.
  • "రూపు చెడి తిరుగుడువడి వాహినులు చిక్కువడి చిందఱ వంద ఱై మతి చెడి మల్లామడి యై." ఉ. హరి. 1. 148.

చిందఱ వందఱ చేయు

  • ఛిన్నాభిన్నము చేయు.
  • "స్యందనంబులఁ జిందఱ వందఱఁ జేసియు." జైమి. 3. 101.

చిందఱవందఱ లాడు

  • ఛిన్నాభిన్న మొనర్చు. భాస్క. యు. 847.

చిందఱ వోవు

  • కలగు; చిల్లులువడు.
  • "చెవులు చిందఱ వోవఁ జెలఁగు కవీంద్రుల, పో రంటిమా శనివారపు జడి." కళా. 7. 19.

చిందాడు

  • చిందులాడు.
  • "పెదవిమీఁదను లేనగ వంకురించి, చిందాడఁగ." హంస. 2. 28.

చిందిలి పడు

  • కళవళపడు. కాశీ. 2. 159.

చిందిలిపాటు

  • కళవళపాటు.

చిందిలి మందిలి యగు

  • ఛిన్నాభిన్న మగు.
  • "మీ రిటఁ బూని యీక్రమము మేకొని చేసిన దివ్యరాజ్యల, క్ష్మీరమణీయవైభవము చిందిలి మందిలి గాక తక్కు." నృసిం. 2. 53.

చిందుగొను

  • చిందులాడు, నర్తిల్లు.

చిందుతెప్పెట

  • చిందు త్రొక్కునప్పుడు ఒకానొక లయలో కొట్టే డప్పు. చిందు ద్రొక్కు
  • ఒక రకమైన నృత్యము చేయు. చిందు అనునది ఒక రక మైన నృత్యం. తప్పెట కొడుతుండగా చిందు త్రొక్కడం నేటికీ ఉన్నది.
  • చూ. చిందులు పాడు.

చిందుపరువు

  • ఒకానొక పిల్లల ఆట.

చిందులు పాడు

  • చిందుపాటలు పాడు.
  • చిందువా రనే ఒక తెగవారున్నారు. వారు చిందు త్రొక్కుతూ పాడే పాటలు. వారూ శైవులే. విశ్వబ్రాహ్మల నాశ్రయించి తిరుగుతుండే తెగ చిందు వారు. పండితా. ద్వితీ. పర్వ. పు. 304.

చిందులు వాఱు

  • చిందు ద్రొక్కు.

చిందు వందగు

  • చిందర వందర యగు.
  • ధ్వన్యనుకరణము.
  • "బెండువడి డెందంబు గంది తాలిమి చిందువం దై కెందలిరుపాన్పునం దను వొందక లేచి." మను. 3. 28.

చిందువందు చేయు

  • పాడు చేయు; ఖర్చు చేయు.
  • "వడ్డి లెక్కకుఁ జిందువందుఁ జేసి." నిరంకు. 2. 116.

చికమకల బెట్టు

  • తికమకల బెట్టు.
  • "....యో, పిక మాలి యెందుఁ గుందెనొ, చికమకలం బెట్ట కిపుడు చెపుమా నాకున్." రసిక. 6.

చికాకు పడు

  • కలత చెందు.

చికిబికి

  • చీకిరిబాకిరి.
  • "చికిబికివెండ్రుకల కొప్పు." రాధా. 5. 108.

చికిలికాడు

  • అందగాడు, షోకీలా.
  • "చికిలి నెఱవన్నెకాండ్రకు సివము లెత్త, నెనసి చరియించు నావీట హేమరేఖ." హంస. 1. 220.

చికిలి చేయు

  • సానబట్టు.
  • "చికిలి చేసిన యడిదంబు చేతఁ దాల్చి." శివ. 4. 74.

చికిలిసాన

  • మెఱుగుపెట్టు సాన.

చిక్కంటు

  • వెండ్రుకలు చిక్కు దీసికొను దువ్వెన.
  • మామూలు దువ్వెనవలె కాక పెద్దపండ్లు గలిగి పొడవుగా ఉంటుంది.

చిక్కక స్రుక్కక

  • వెనుకంజ వేయక. జం. చిక్కదనము
  • 1. ధైర్యము, గుండె చిక్కన. నిర్వ. 9. 89.
  • 2. అరుచి.
  • ఇది కేవలం సందర్భాన్ని బట్టి కోశాలు చెప్పిన అర్థం. ఎందు కిలా కావాలో బోధపడదు. ఇంకను విచార్యము.
  • "ఒకని సొమ్మేమి వేఱొక్కని సొమ్మేమి, చక్కెర కమరునే చిక్కఁదనము, లోకులు గన నేమి తాఁగనుం గొన నేమి, వెన్నెల పూనునే విన్నఁదనము." రాధా. 3. 147.

చిక్క నగు

  • గాట మగు.
  • "చెక్కు చెమట పెక్కు వలెనే చిక్క నైనచెలిమి." తాళ్ల. సం. 5. 29.

చిక్కనా బిళ్ళ

  • ఒక పిల్లల ఆట.

చిక్కనిడెందము

  • కఠిన హృదయము, గట్టి మనసు.
  • "ఆడువారు సిక్కని డెందంబువారు జగతి." కుమా. 5. 93.

చిక్క నై నిలుచు

  • ధైర్యంగా నిలబడు, స్థిరంగా ఉండు.
  • "మా యెత్తి వచ్చు నంతకుం జిక్క నై నిలు మనుము." కుమా. 10. 177.

చిక్కపట్టు

  • నిర్ణయము. శ. ర.

చిక్కములో చిక్కిన పిట్టవలె

  • తప్పించుకొనుటకు వీలు లేక.
  • "చిక్కంబులోఁ బిట్ట చిక్కినరీతి, దిక్కు లాలించుచు దీనుఁ డై పలికె." సారం. ద్వి. 2. 117.

చిక్కి పోవు

  • కృశించు.
  • "అతను బాగా చిక్కి పోయాడు. తటాలున చూస్తే గుర్తు పట్టలేక పోయాను." వా.
  • చిక్కుటనే 'చిక్కుడు' అని కొన్ని జిల్లాలలో అంటారు.

చిక్కి సగ మగు

  • కృశించి పోవు.
  • "ధరణి భైక్షం బెందు దొరక దాయెనె విక్కి, సగ మైతి విది యేల చంద్రమౌళి." దశా. 2. 75.

చిక్కు చీఱు చేయు

  • చిందర వందర చేయు.
  • "....నలంగు నట్లుగాఁ బదంబులం ద్రొక్కి చిక్కు చీఱునుం జేసి చెల్లా చెదరుగాఁ బాఱఁ జల్లిన..." విష్ణు. 1. 139.

చిక్కు జీరుగా

  • తుత్తుమురుగా, చిందర వందరగా చిక్కుగా.
  • "జడ లూడి యహులకైవడిఁ జిక్కుఁ జీరుగా, నవనిపైఁ బడి పొరలాడు వారు." శృం. శాకుం. 3. 61.
  • "చింతా పరంపరఁ జిక్కుఁజీ రయ్యెడు." ప్రబోధ. 5. 32.

చిక్కు జీరు పడు

  • చిందరవంద రగు; చిక్కగు.
  • "చిక్కుజీరువడు తురంగమ్ములును." హరి. ఉ. 3. 130.
  • "నాయికయును నాయకుండును దమ యిద్దఱ యంగములు న్విమిశ్రభావకలనఁ జిక్కు జీరు వడ వైచిన..." ప్రభా. 5. 49.

చిక్కుతాళము

  • కొత్తవారికి రానితాళము. బ్రౌన్.
  • చూ. చిక్కుబీగము.

చిక్కు దీర్చు

  • చిక్కు తీయు.
  • "కులుకుంజన్నులమీఁది హారములు చిక్కుల్ దీర్చునందంబునన్." రాజగో. 1. 103.

చిక్కు పడు

  • 1. చిక్కు అగు.
  • "వెంట్రుకలు చిక్కుపడినవి." వా.
  • 2. చిక్కులో తగులుకొను.
  • "చిక్కియుఁ జిక్కువడక యక్కజపు జవధరంబునన నరంబులతోడం బెకలించుకొని..." కళా. 8. 112.
  • 3. ఏమీ చేయ లేక చిక్కులో పడు.
  • "కాలంబుకొలఁది లెక్కలు వెట్ట నేరక, చిత్రగుప్తాదులు చిక్కు పడిరి." కాశీ. 1. 137.

చిక్కు పఱచు

  • 1. బాధించు.
  • "విశిఖపుంజంబులం జిక్కు పఱచి." జైమి. 8. 22.
  • 2. పట్టువడ జేయు, చిక్కు కొనునట్లు చేయు. పాండు. 5. 304.

చిక్కుపాటు

  • ఇబ్బంది పడుట, మెలికలు పడుట.

చిక్కుపురువు

  • ఒకరక మైన పురుగు. ప్రబంధ. 130.

చిక్కువఱచు

  • చిక్కుపఱచు.
  • చూ. చిక్కు పఱచు.

చిక్కుబాకీలు

  • గొంతుమీదికి వచ్చిన బాకీలు; తగాదాలో పడినవి.
  • "చిక్కు బాకీలు పిదప నిశ్శేషపఱిచె." రుక్మా. 2. 116.

చిక్కుబీగములు

  • కొత్తవారు సులువుగా తీయుటకు వీలులేని తాళములు.
  • "విం తగుచిక్కుబీగములు వేసిన యట్లనె యున్న విప్పుడున్." ఉషా. 3. 106.
  • చూ. చిక్కు తాళము.

చిక్కురాత

  • జిలుగువ్రాత.

చిక్కురొక్కరుగా

  • చిందరవందరగా. కొత్త. 11.

చిక్కులమారి

  • చిక్కులు పెట్టువాడు.
  • "చిక్కులమారి యా బలిజసెట్టి వయాళులఁ గట్టి బర్వులన్, స్రు క్కెడలంగఁ గొట్టి..." హంస. 5. 48. చిక్కులు గొను
  • చిక్కువడు.
  • "చెదరిన పత్త్రభంగములఁ జిక్కులు గొన్న మణీసరంబులన్." పారి. 4. 18.

చిక్కులు వాపు

  • చిక్కు తీయు.
  • "కొనగోళ్ల నెఱులు సిక్కులు వాపి." పారి. 2. 12.
  • "అంకపీఠముం జేరిచి సోగవెండ్రుకలఁ జిక్కులు వాపి." పారి. 4. 8.

చిక్కువడు

  • చిక్కుకొను.
  • "చిక్కువడియును మదిఁ జేవ చెడ కతండు." జైమి. 5. 12.
  • "శోకమోహంబుల సుడిఁ జిక్కు వడక." వర. రా. కిష్కి. పు. 353. పంక్తి. 16.

చిక్కువర్చు

  • చిక్కులలో పెట్టు.
  • "వాడు నన్ను చాలా చిక్కుపరచి నాడు." వా.
  • "చిక్కయ్య లింగయ్యఁ జిక్కువర్చితివొ." పండితా. ద్వితీ. మహి. పు. 214.
  • ఇక్కడ కించపరుచు, చిన్న చూపు చూచు అనే అర్థంగా కానవస్తుంది.

చిక్కు సీరై పోవు

  • చెదరి పోవు.
  • "చిన్నైన యాట లెల్ల సిక్కు సీరై పోవు." తాళ్ల. సం. 3. 15.

చిక్కె గుమ్మడు

  • దొరికాడు లే అబ్బాయి ! అనుట వంటిది.
  • "చిక్కె గుమ్మఁ డటంచు నలరి." వర. రా. బా. పు. 51. పంక్తి. 7.

చిక్కొట్టు

  • చీకొట్టు.
  • "ఇక్కన్యకు మగఁడే యితఁ, డక్కట యీ మగని కేటి యా లిది యనుచుం, జిక్కొట్ట వలదు..." ఉత్త. హరి. 5. 147.

చిగరుగోరు

  • అర్థం విచార్యం.
  • 'జుట్టుముడి బిగించుట కుపయోగించు సాధన విశేష' మని వావిళ్ళ ని.
  • "చిగరుగోళ్ళను జాఱు సిగ నిక్కఁగా వేసి, గదలి పూ రేకులు గానఁ జెరివి." మల్హ. 3. 9.

చిగిరింతపదవి

  • అల్పకాలభోగ్యము.
  • ".......క్రూరకృత్యంబునకు నొడి గట్టినచో నొడి గట్టుటంబట్టి వాని పదవి చిగిరింతపదవి గాక మానదు." ధర్మజ. 32. 10. తె. జా.

చిగిరింతయైశ్వర్యము

  • అల్ప కాలభోగ్య మైన భాగ్యము.
  • "ఈ చిగిరింత యైశ్వర్యముకై యింత పొంగ నేల." ధర్మజ. తె. జా. చిగురాకుమఱుగునం బొడము మొగ్గయుం బోలె
  • ఆకుమఱుగు పిందెవలె.
  • "తన ముఖం బెత్తి చిగురాకుమఱుగునం బొడముమొగ్గయుంబోలె." శుక. 1. 538.
  • చూ. ఆకుమఱుగుపిందె.

చిగురుకొను

  • చిగిరించు; పొడము.

చిగురు గొలుపు

  • చిగు రెత్తించు, చిగుర్ప జేయు.

చిగురుజొంపము

  • చిగురుటాకుల మొత్తము.
  • "శ్రీ రమణీకుచశిఖరాగ్రముల నేలి, చిగురుజొంపంబు లై జిగి చెలంగు." రాధి. పీఠిక. ప. 16.

చిగురు లొత్తు

  • చిగురించు.
  • "సీమంతినికిఁ గోర్కి చిగురు లొత్తె." రాధా. 1. 128.

చిగురులో చేగ యగు

  • మొలకలోనే చేవ దేరు, సారవంత మగు.
  • చెట్టు ముదిరిన ట్లెల్ల చేవ దేరుతుంది. అలా కాక చిగురులోనే చేవ గల దైన దనుట.
  • "చేవ దేరి చిగురులో చేఁగ యై యుండెను." తాళ్ల. సం. 8. 165.

చిగురెక్కు

  • వాసి కెక్కు.
  • "ఎడపక జంగమం బే వస్తు వైన, నడుగ కుండిన నొట్టు నడిగిన లేదు, అనినచో నా యొట్టు నఖిలంబు వినఁగఁ, దన కని గర్వించి దండితో గంట, మొగసాలఁ గట్టించి మ్రోయించుకొనుచుఁ, జిగురెక్కి యున్నాఁడు." ద్వి. భల్లా. 2. 24.

చిగురొత్తు

  • 1. చిగిరించు
  • "చెప్ప వే కరుణాలత చిగురొత్త." భార. శాం. 5. 542.
  • 2. పొడము.
  • "కయ్యపువేడుక చిగురొత్త." భార. ద్రో. 1. 55.
  • 3. అనురాగపూరిత మగు.
  • "మలయపుగాలి రాకలకు మానసముల్ చిగురొత్త దంపతుల్." ఇందు. 3. 102.

చిగుర్కొను

  • చిగురుకొను.

చిచ్చరకోల

  • అగ్ని బాణము.
  • "నాడింధమునిఁ గన్న నాతిపై నేయును, నలరుఁ జిచ్చరకోల నంగ భవుఁడు." క్రీడా. పు. 68.

చిచ్చఱపిడుగు

  • అగ్గి పిడుగు.
  • "....దందడిఁ దార్కొని మండుచుండెఁ జి,చ్చఱ పిడుగుల్ వడిం దొరఁగు చాడ్పున నంబరవీధి నుగ్రమై." భార. విరా. 5.
  • "వచ్చెఁ గద విటులపాలిటి, చిచ్చఱ పిడు గింక నేమి సేయుదు." నిరంకు. 2. 122. చిచ్చికొట్టు
  • జో కొట్టు.
  • "కాస్త ఆ పిల్లను చిచ్చికొట్టి నిద్రపుచ్చవే తల్లీ." వా.

చిచ్చీ యను

  • చీకొట్టు.
  • "లచ్చన మెఱుఁగనికవులను, జిచ్చీ యని సుక వివరులు చేపట్టరు గా." కవిజ. అవతారిక.

చిచ్చును గాడ్పును గూడినట్టు

  • అగ్గికి గాలి తో డయినట్లు - అనగా మరింత విజృంభించు అనుట.
  • "మేడ్పడి రాజ్యగర్వమున మీఁదు తలంపవు గాక చిచ్చునుం, గాడ్పును గూడినట్టు." ఉ. హరి. 4. 198.

చిచ్చుపిడుగు

  • అగ్గిపిడుగు.

చిచ్చుఱపిడుగు

  • చిచ్చుపిడుగు. కుమా. 5. 70.
  • రూ. చిచ్చఱపిడుగు.

చిచ్చు లేక చిముడు

  • కారణము లేకయే త్రుళ్లిపడు; మండిపడు.
  • అగ్గి లేకయే ఉడికిపోవు వా డని వాచ్యార్థము.
  • అతి కోపిష్ఠి అనుట.
  • "చిచ్చు లేక చిముడు మచ్చరీఁ డీ సుద్ది, వజ్రనాభుఁ డోర్చువాఁడె యకట !" ప్రభా. 1. 134.

చిచ్చుఱుకు

  • 1. అగ్నిప్రవేశము చేయు. కాశీ. 2. 86.
  • 2. సహగమనము చేయు.
  • "చిచ్చుఱికిన సతి కెదురుగ వచ్చు విమానములు." రుక్మాం. 4. 94.

చిచ్చులో నెయ్యి పోసిన భంగి

  • అగ్నిలో ఆజ్యము పోసినట్లు. మఱింత దోహదమగు ననుట.
  • "విచ్చేయు మనుకురువిభుఁ జూచి సీరి, చిచ్చులో నెయ్యిఁ బోసినభంగి మండి." ద్విప. జగ. 183.

చిచ్చు సింగార మెంచదు

  • ఏవిచక్షణా లేనివానిపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • అగ్నికి అంద మైన దైనా కాని దైనా ఒకటే. అన్నిటినీ కాల్చి వేస్తుంది. వేంకటేశ. 75.

చిటమట మను

  • మండి పడు, చిటచిట లాడు.

చిటచిట లాడు

  • 1. చిడిముడిపాటు చెందు; కోపగించు.
  • "హరి సర్వమయుం డటె యంచుఁ బట్టితోఁ జిటచిటలాడి." పారి. 3. 32.
  • 2. చిట చిట శబ్దము చేయు.
  • ధ్వన్యనుకరణము.

చిటపెట

  • ధ్వన్యనుకరణము. చిటపట వోవు
  • చిటపట లాడు. క్రీడా. పు. 80.

చిటబొట మని

  • చినుకులు పడుటలో -
  • ధ్వన్యనుకరణము.
  • "అట మున్ను మొగులు బలియుచుఁ, జిట పొట మని పాట పాట చినుకులు వడఁ జొ,చ్చుట యాది గాఁగఁ..." కళా. 4. 90.

చిటికిలపందిరి వేయు

  • మాటలతో మభ్యపెట్టు.
  • చిన్న చిన్న పుల్లలతో పందిరి వేస్తే చూడ్డానికి అందగానే ఉంటుంది. కాని కాస్త చెయ్యి తగిలితే కిందపడి పోతుంది. దానిమీద వచ్చిన పలుకుబడి.
  • "వాడి వన్నీ వట్టి కోతలు. ఆ చిటికెల పందిరి నమ్ముకొని ఆ వ్యవహారంలోకి దిగితిమా మనమే నవ్వుల పాలవుతాం." వా.

చిటికలో

  • క్షణంలో. కొత్త. 53.

చిటిక వేయు

  • బొటనవ్రేలూ, నడిమివ్రేలూ చేర్చి, జార్చి, చిటు క్కని శబ్దము కలిగించు.
  • "కొ,క్కెరయఁగఁ జూచి పందియపు టెంకువ దిద్దుచుఁ జిట్కె వేసి స,ళ్లిరి." హంస. 3. 216.

చిటికెనవ్రేలి కెక్కు

  • ప్రథమగణ్యు డగు.
  • లెక్కించునప్పుడు మొట్ట మొదట చిటికెన వ్రేలిని మడిచి చెప్పుట పై యేర్పడిన పలుకుబడి.
  • "ఉత్తమమతిని మరుత్తుండును జిటికెన వ్రేలి కెక్కి సకలభూచక్రంబును సక్రమంబుగ నేలిరి." ధర్మజ. 32. 5. తె. జా.

చిటిచాప

  • మెత్తని చిఱుచాప.
  • "బాలీసు రతనంపు గీలు బొమ్మలు చిటి,చాపలు వెడఁదవింజామరలును." రసిక. 1. 61.

చిటితాళము

  • చిన్న తాళము.
  • "చిటి తాళములు చంక పుటిక నొక్కకమాటు, గతి రయంబునఁ దాఁకి కలసి మొఱయు." ఆము. 6. 6.

చిటిపొటి

  • 1. చిలిపి తగాదా.
  • "ఇటు మీ లోపల నూరక - చిటి పొటి వలదు." సింహా. 8. 80.
  • 2. అల్పాల్ప మైన.
  • "చిటిపొటి సొమ్ములు పెట్టుక, పుటపుటగా వీధివెంటఁ బొరుగిండ్లబడిన్." హంస. 5. 25.

చిటిబొట్టు

  • ముత్తైదువలు మంగళకరంగా ధరించే చిన్న బొట్టు.
  • "కాశ్మీర తిలక రేఖామధ్యమున యందుఁ, బుణ్యంబుఁ జిటిబొట్టు పొందు పఱచి." కాశీ. 3. 212.
  • చూ. చిట్టిబొట్టు.

చిటిముడి

  • దొంగయెత్తు; మోసము. వావిళ్ళ ని.

చిటిముత్తెములు

  • ధాన్యవిశేషం. శ. ర.

చిటిలిపడు

  • చెదరిపడు; ఎగిరిపడు.

చిటివ్రేలు

  • చిటికెన వ్రేలు. ఆము. 6. 80.

చిటు కను

  • శబ్దించు. ధ్వన్యనుకరణము.

చిటుకు పొటుకు

  • వాన వెలిసినా చెట్టు మీది నుండి పడే నీటిబొట్లు.

చిటుకు పొటుకు మనక

  • ఉలకక పలకక. శ. ర.

చిటుకులాడి

  • మిటుకులాడి, వగలాడి.

చిట్టంటుసేతలు

  • శృంగారచేష్టలు.
  • "వరుని చిట్టంటు సేఁతలఁ గెరలు ప్రేమ, మెఱపువోలెఁ దళుక్కున మెఱచుఁ గాని." కళా. 7. 159.

చిట్టంట్లు

  • చిలిపి చేష్టలు; నఖక్షతాదులు.
  • "ఈ చిట్టంట్లు నీ వెంచక చిత్తగించరా వోరి." తాళ్ల. సం. 3. 11.

చిట్టకపుదనము

  • పరిహాసము. వావిళ్ళ ని.
  • రామా. 4. 167.

చిట్టచివర

  • కట్టకడపట.

చిట్టడవి

  • కాఱడవి.

చిట్ట మిడిచినంతలో

  • చిటికె వేసినంతలో - త్వరలో అనుట.
  • ".....ఏ పదార్థంబును సంపాదింప రాని యిట్టి నట్టడవిలోనం జిట్ట మిడిచిన మాత్రంబున విచిత్రంబుగా నానావిధ పదార్థంబులు...." వరాహ. 5. 12.

చిట్టాముదము

  • చిన్న ఆముదపు గింజల చమురు.
  • "చిట్టాముదమ్మున శిర సంటి." ఇందు. 2. 15.
  • "చిట్టాముదం తాగితే వేడీ వాతం తగ్గుతుంది." వా.

చిట్టితాళము

  • చిన్న తాళము (కొట్టునది).
  • "అట్టిద కాకంచు నప్పుడు నంబి, చిట్టి తాళము వేసి చేయెత్తి మ్రొక్కి." పండితా. మహిమ. 289. పు.
  • చూ. చిటితాళము.

చిట్టిపొట్టి

  • 1. చిల్లరసొమ్ములు.
  • "నింబప్రవాళ మాల్యంబులు వైచిరి, చిట్టిపొట్టి ధరించి రిట్టు నట్టు." పాండు. 3. 74.
  • 2. చిన్న చిన్న.
  • "చిట్టిపొట్టి మాటలతో అత డెంతో అందంగా రాస్తాడు." వా.

చిట్టిబొట్టు

  • ముఖంలో పెద్దగా పెట్టుకొనే బొట్టుకింద పెట్టుకొనే చిన్నబొట్టు.
  • "నింబప్రసూనమాల్యంబులు వైచిరి, చిట్టిబొట్టు ధరించిరి." పాండు. 3. 74.
  • రూ. చిటిబొట్టు.

చిట్టిమట్ట

  • చిన్న తాటిమొక్క.

చిట్టివెదుళుల కదుపు

  • పొట్టి వెదుళ్లు (పదార్థ పట్టిక) చిటచిటలాడు వెదురులూ కావచ్చును.
  • "ఉగ్రభటులు నిట్టి వెదుళుల కదుపుగా." కుమా. 12. 121.

చిట్టాడు

  • చెలరేగు.
  • "చిట్టాడుసిగ్గుతోఁ జేపట్టి పెనఁగు డెందము." సారం. 3. 148.

చిట్టీత

  • చిన్న కాయలు కాసే యీత చెట్టు.

చిట్టీదు

  • చిట్టీతచెట్టు.
  • "వెలివాడకుఁ గడుఁజేరువ, సెలయేటికిఁ బొరువుతాళ్లుఁ జిట్టీఁదులునా, వల దఱుచు భద్రకాళీ, నిలయంబు." శివరా. 3. 100.

చిట్టుడుకు

  • కవోష్ణ మైన, కొద్దిగా ఉడికిన.

చిట్టుడుకు నీళ్లు

  • బియ్యం ఉడుకుచుండగా పై నున్న నీళ్లు.
  • "చిట్టుడుకు నీళ్లు త్రాగితే మంచి దంటారు." వా.

చిట్టుడుకు పట్టు

  • కొద్దిగా ఉడుకు.
  • "ఉరము గంధంబు చిట్టుడుకు వట్టిన బొంగి, యందు దుమార మై యావు లెగ సె." శృం. శాకుం. 3. 174.

చిట్టుముల బయకలు

  • గర్భిణీస్త్రీ తొలి నెలలలో చేసుకొను వాంతులు. ఇవి రెండూ (చిట్టములు, బయకలు) ఒకే అర్థంలో ప్రయోగింపబడేవే అయినా ఇచ్చట రెండూ కలిసి ఉండుట విశేషం. (చిఱు + ఉమ్మి + లు.)
  • "ఇట్లు వర్తింప నాతని యింతి గర్భ, కలిత యై చిట్టుముల బయకలు మొగమునఁ, దెలుపు గనిపింప..." శుక. 2. 146.

చిట్టుములు

  • బయకలు.
  • "చిట్టుము లుల్లసిల్లెఁ దఱు చై తోడ్తోఁ గురంగాక్షికిన్." మను. 3. 120.
  • "చిట్టుములు పుట్టెఁ దాఁగను, పట్టికి." దశా. 3. 106.
  • "నెల మసలె నంతఁ గాంతకు....చిట్టుముల్ తఱచు మీఱె." విజ. 3. 228.
  • చూ. చిట్టుముల బయకలు.

చిట్టూట చోటు

  • నీరూరు తావు.
  • "గ్రామ నికటంబు గాక దూరంబు గాక, చౌటి పొరగాక చిట్టూట చోటుగాక వెల్లితల గాక క్రీఁజెదల్ వేరు పురువు, రాతిపోట్లును లేని బారాది నేల." విప్ర. 2. 18.

చిట్టూడి

  • ఒకరక మైన కూరాకు. బ్రౌన్.

చిట్టెడుపంట

  • రెండవపంట.

చిట్టెడుపొట్ట

  • చిన్నపొట్ట. శరభాంక. 95.

చిట్టెడు వేస్తే పుట్టె డగు

  • ముఖం మటమట లాడు. ముఖం పెనంలాగా కాలిపోతున్న దనుట.
  • చిట్టెడు గింజలు వేస్తే పుట్టెడు కావడం అప్పుడే సంభవం.
  • "వాడి మొహం చూడు. చిట్టెడు వేస్తే పుట్టెడు అవుతుంది." వా.

చిట్టెలుక

  • చిన్న జాతి ఎలుక.

చిట్లపొట్టులు

  • ఒకరక మైన బాలక్రీడ. భోజసుతా. 2. 9.
  • చూ. చిట్లపొట్లాలు.

చిట్లపొట్లకాయ

  • ఒక బాలక్రీడ. ప్రబంధ. 613.
  • చూ. చిట్లపొట్టులు.

చిట్లపొట్లాలు

  • ఒక బాలక్రీడ.
  • 'చిట్లపొట్లకాయ సీమరేణి కాయ...' అంటూ పాడడం పిల్లల ఆటలలో ఉంది. పండితా. ప్రథ. పురా. పు. 460.

చిట్ల బొట్లాకాయ కాళ. 3. 33.

  • చూ. చిట్లపొట్లకాయ.

చిట్లి సున్న మగు

  • పెటిలి పొడి యగు.
  • "......తారహారంబులు సొబ గెల్లఁ జెడి చిట్లి సున్న మయ్యె." రాధి. 3. 76.

చిట్లుకట్టె

  • అతి కోపిష్ఠి. శ. ర. చిట్లుకొఱవి
  • పీడాకారి, సంతాపకారి.
  • "పంచశరుం డొక ప్రళయకాలయ ముండు, చిన్న పెంపుడు చిల్క చిట్లు కొఱవి." కలు. శ. 55.

చిట్లుగొను

  • చిటపట చిట్లు.
  • పేలాలు వేయించగా చిట్లుతాయి. గింజలు చిట్లిన వని నేటి వాడుకలోనూ ఉంది.
  • "మంగలమున బ్రేలలు సిట్లుగొన్న పొలుపున." బస. 7. 199. పు.

చిఠాను చెల్లు వ్రాయు

  • లెక్కలో జమకట్టు.
  • "...అయ్య దన రాక యున్న లోపంబు దీరె నేఁడో నృపాల !, యెలమిఁ జిఠాను జెల్లు వ్రాయింపు మయ్య !" నానా. 244.
  • నేటి రూపం చిఠ్ఠా.

చిడిముడి పడు

  • చీకాకు పడు, కోపించు.
  • "చిత్తంబు జల్లనఁ జిడిముడి పడుచు." గౌ. హరి. ద్వితీ. పం. 1079.
  • రూ. చిడిముడి వడు.

చిడిముడిపాటు

  • తొట్రుపాటు; కలత; కోపము.

చిడిముడి వడు

  • 1. ముఖము మటమట లాడించు; అసంతృప్తి వెలిబుచ్చు.
  • "చెదరక యుదరక చిడిముడి వడక." పండితా. ప్రథ. దీక్షా. పు. 178.
  • 2. కుతూహలము చెందు.
  • "చిత్తము లనిఁ జూచువేడ్కఁ జిడిముడి వడఁగా." భార. భీష్మ. 1. 151.

చిడుగుడు పరువులు

  • ఒక ఆట; చెడుగుడు, చిడుగుడు.

చిత్తం !

  • ఎవరైనా పెద్దవారు, గౌరవనీయులు చెప్తున్నప్పుడు వినుటలో అను ఉపస్కారక పదం.
  • "వెళ్ళి రామయ్యను పిల్చుక రారా !" "చిత్తం." వా.
  • అలాగే 'ఔను' అనుటలోనూ కలదు.
  • "నిన్ననే వచ్చారా?" "చిత్తం." వా.
  • ఇత్యాదు లూహ్యములు.

చిత్తకార్తిలో కుక్కలలాగా

  • కామోద్రేకంతో.
  • ఆకార్తిలో కుక్కలకు కామోద్రేకం ఎక్కు వనుటపై ఏర్పడినది.

చిత్తగించు

  • 1. తలచు.
  • "శ్రీహర్షు నాత్మలోఁ జిత్తగించి." రుక్మాంగ. 1. 13.
  • వాడుకలో -
  • "నా మనవి చిత్తగించండి." వా.