పదబంధ పారిజాతము/కాజేయు
కాకు_____కాగ 439 కాగి_____కాజే
- "కాదంబనికురుంబకలిత యై ప్రవహించు, కాళింది గర్వంబు గాకు సేసి." మను. 3. 19.
- 2. బాధించు.
- "కగ్గు లేనివారి నేల కాకుసేసె నిపుడు." తాళ్ల. సం. 3. 110.
- 3. వ్యర్థపుచ్చు.
- "ఆతడు జమునిలావు, జేవయును బొల్లుగా గాకుజేసి విడిచె." హరి. పూ. 4. 155.
- "ఒక టిచ్చి వేఱొకటి గోరినయట్టి కానీనుగర్వంబు గాకు చేసి." చంద్రాం. 1. 21.
- 4. అవమానించు.
- "కలికి పై బడి తద్ద గరగించు నిన్ను, గాకున్న నెన్నైన గల్లలు గూర్చి, కాకు సేయును రాజుగారితో జెప్పి." ద్వి. తి. సా.
- 5. మాట తీసివేయు, తిరస్కరించు.
- "నిను వేడుకార్యము గాకు చేయక చేయుమీ." మైరా. 1. 72.
- "గంధర్వసౌఖ్యంబు కాకు సేయడు గదా." రుక్మా. 5. 55.
- చూ. కాకుచేయు.
కాగలకార్యము గంధర్వులు తీర్తురు
- మనం చేయవలసిన పని దానంత టదే మరొకరితో నెఱవేరుతుంది.
- భారతంలో గంధర్వులు దుర్యోధనుని బంధించినప్పుడు పాండవమధ్యము లను మాటపై వచ్చినది.
- "వానిసంగ తేదో ఆ రెడ్డిగారే చూచేట్టున్నారు. మన మేం చేయ నక్కర లేదు. కాగలపని గంధర్వులే తీరుస్తారు." వా.
కాగి చల్లారిన పాలభంగి
- శాంతపడినట్లు; పొంగు చాల్లారిన-అనుట.
- "నందను డొప్పుగ గ్రాగి చల్ల నా,రి వెలయు పాలభంగి నొకరీతిని వచ్చెడు దన్క." పాణి. 4. 104.
కాచి పోయు
- వంట చేసి పెట్టు. ముఖ్యంగా గంజి కాచి పోయుటపై యేర్పడిన పలుకుబడి./
- "ఎంత ముసలివా డైనా కాచి పోసే దిక్కు లేక మళ్లీపెళ్లి చేసుకుంటూ నంటున్నాడు." వా.
- "ఎంతుంటే నేం? వేళ కింత కాచిపోసేదిక్కు లేక అతను నానాబాధా పడుతున్నాడు." వా.
కాచి విడుచు
- చంపక వదలిపెట్టు.
- "దయ గాచి విడిచె." విజయ. 1. 58.
కా చేసుకొను
- ముగించు. కాశీయా. 272.
- "ఆపని కాస్తా కాచేసుకొని గానీ నేను ఊరికి వెళ్ల దలచుకో లేదు." వా.
కాజేయు
- 1. ముగించు.
- "వారి, కింత విష మిడి కా జేసి యెల్ల వేళ." దేవీ. 11. 114. కాట_____కాటి 440 కాటి_____కాటు
- 2. అపహరించు.
- "వదినగారి ఆస్తి కాస్తా వీడు కాజేశాడు." వా.
- 3. కలిగించు.
- "ఎక్కి తలంచిన నీ రూప మైన, గ్రక్కున నప్పుడు కాజేయుగిరులు." బస. 3. ఆ.
కాట గలియు
- నశించు.
- కాడు = స్మశానము; అడవి.
- "కటకటా! యెట్లు తన బుద్ధి కాట గలియ, నిసువు జంపంగ నెంచెనో నీ మగండు." హరవి. 2.99.
కాటాకట్టు
- తూనికకు అమర్చు. కొత్త. 13.
కాటికాపలా
- వ్యర్థము.
- "పంటంతా పశువులు మేసిపోయాయి. ఈ కాటికాపలా యెందు కని వచ్చేశాను." వా.
- చూ. శవజాగారం.
కాటికి కాళ్లు చాచు
- మరణమునకు సిద్ధముగా నుండు.
- "కటకటా! కాటికి గాళ్లు సాచియును విటతనంబులజాడ విడువ డీశుడును." గౌర. హరి. ద్వి. 1056, 1057.
కాటికి కాళ్లు చాచుకొని యుండు
- చావ సిద్ధముగా నుండు; ముదుసలి యగు.
- "నే నింకేం చేస్తాను నాయనా! కాటికి కాళ్లు చాచుకొని ఉన్నాను." వా.
కాటిపాపడు
- గొల్లవాడు. శైవులలో జంగాలవంటి వారు భిక్షాటనం చేస్తుంటారు. గొఱగొయ్యల లాగే కాటి పాప లనీ ఉన్నారు." బస. 4. ఆ.
కాటుకకన్నులు
- నల్ల కన్నులు.
- "ఆ యెఱ్ఱటి పిల్లకు కాటుక కన్ను లెంతో అందంగా ఉంటాయి." వా.
- "కాటుక కండ్లవాణ్ణి నమ్మకూడ దంటారు పెద్దలు." వా.
కాటుక తీర్చు
- కాటుక పెట్టు.
- "కడలరేఖ లమర్చి కాటుక తీర్చె వా, ల్గన్నుల కొకవింత కాంతి మెఱయ." శుక. 1. 226. పాండు. 3. 74.
కాటుక పట్టు
- నల్ల బడు.
- "బహుళజలప్లవమాన, ద్రుహిణాం డము చెమ్మ యుఱికి రూక్షార్కనిభా, రహితత గాటుక పట్టెను, రహి చెడియన నంధతమసరాసులు బెర సెన్." మను. 3. 28.
కాటుక పేటు లెత్తు
- కాటుక యెండి పెట్లిపోవు.
- "తొలచిన యట్లు వోయెడు గనుం గవ కాటుక బేటు లెత్తు." పారి. 3. 12. కాటు_____కాడు 441 కాడు_____కాడు
కాటులాడు
- కొట్లాడు. సింహా. 9. 103.
- రూ. కాట్లాడు.
కాటువడు
- గాయపడు.
- "తలలు జీరలును గంపలు కట్టుకొని, గాసిగా మ్రగ్గుటడవులు గాటువడియు." నిర్వ. 4. 76.
కాడికి తెచ్చు
- విధేయముగా నొనర్చు. గిత్తలను కాడికి కట్టి మాట వినునట్లు చేయుటపై వచ్చిన పలుకుబడి.
- "వాణ్ణి కాడికి తేగలిగా వంటే చాలా గొప్పవాడివి అన్నమాటే." వా.
కాడి పారవేయు
- బాధ్యతను వదలివేయు. ఎద్దులను కట్టిన కాడి బాధ్యతా స్వీకారానికి గుర్తుగా వాడడం కలదు. అందుపై వచ్చినపలుకుబడి.
- "వాడు నట్టనడియేట్లో కాడి పారవేశాడు. ఎలాగూ యిన్ని యేర్పాట్లు చేసుకున్నాక ఎలా మానడం?" వా.
కాడిపాఱు
- గరు సెక్కు.
- "కాడి పాఱిన మేని గరులు బ్రహ్మాండంబు, కణప పూబంతి కక్కజము దోప." శివ. 1. 61.
కాడుచేయు
- గాడ్పఱచు, పాడు చేయు.
- "ఒక్క నదిపొంత గార్హస్థ్య యుక్తమైన, పుణ్యతప మాచరించుచు బుణ్య జనులు, తారు బంధులు దామరతంప రగుచు, గూడి యుండంగ నెంతయు గాడు చేసి." భీమ. 4. 180.
కాడుపడు
- పా డగు; చెడిపోవు.
- "ఇరు లన్న నో యనియెడు తమిస్ర గాడుపడి పొలంబు లెల్ల దిరిగి." ఆము. 6. 12.
- "కటకటా! మీ వివేకంబు కాడుపడగ." భీమ. 4. 53.
కాడుపఱచు
- దిక్కుమాలునట్లు చేయు; పాడు చేయు.
- "అబల గడునెండ యెఱుగని యాట దాన, మెలుత నతిభీత నన్ను నమ్మించి తెచ్చి, కాననంబులో గన్నులు కట్టి కాడు, పఱచి నీ కిట్లు పోజన్నె భావజన్మ!" కుమా. 5. 65.
కాడ్పఱచు
- పాడు చేయు.
- "పాలవంటి కులంబు గాడ్పఱచి చనియె." పాండు. 3. 80.
కాడ్పాటు
- పాడువడుట.
- "ఆ నిసి బలియును నొండొక, మాని సియుం బడడు దృష్టిమార్గంబున న,ట్లేనును గాడ్పాటున జన,గా." వేం. పంచ. 1. 482.
కాడువారు
- పా డగు.
- "పాడరి జాడరి కాడువారియున్." బొబ్బిలి. 1. 53. కాణా_____కాదు 442 కాదు_____కాదు
కాణాచి కాపు
- కావలివాడు.
- "కామక్రోధములకు గాణాచి కాపను." తాళ్ల. సం. 7. 246.
కా దనిపించుకొను
- నడత మంచిది కా దనిపించుకొను; చేసినపని సరి కాదనిపించుకొను.
- "ఎల్లవారిచే గా దనిపించుకో ఫలము గల్గునె." విప్ర. 5. 56.
- "పదిమందిలో కా దనిపించుకొంటే నీ కేమి వస్తుంది." వా.
కాదారి మాదారి ప్రొద్దు
- అర్ధ రాత్రి.
- "వడివడిం జని పట్టి యో వాలుగంటి, నీదుపే రేమి యెవ్వడు నీదు మగడు, పూని కాదారి మాదారి ప్రొద్దుకడను, నెందు వోయెదు తలిదండ్రు లెవ్వరనిన." యయా. 2. 89.
- చూ. కాందారి మాందారి ప్రొద్దు.
కాదు
- సరిపడదు.
- "వాడికీ వీడికీ కాదు. అంచేత నువ్వు జాగ్రత్తగా మసలుకో." వా.
కాదు అను
- 1. తిరస్కరించు.
- "గంగాదితీర్థమహిమ మ,హిం గా దను తీర్థ మెద్ది." పాండు. 2. 214.
- "నీ మాట ఎవడు కా దంటాడు." వా.
- 2. లెక్కించక పోవు.
- "వాణ్ణి కా దని ఆ ఊళ్లో ఒక్కరూ ఈ విషయంలో ముందుకు రారు." వా.
కాదు అవును అని యెఱుగక పోవు
- లోకజ్ఞత లేకపోవు.
- "కడు బసిబిడ్డ వీ డొకటి కా దవునా నెఱుగండు." భార. విరా. 2. 213.
కాదు కూడ దంటే
- బలవంతం చేస్తే నిర్బంధిస్తే.
- "నా కేం అంత ఒంట్లో బాగా లేదు. బయటికి ఎక్కడికి పోకుండా పడుకుందా మని ఉంది. అంత మీరు కాదూ కూడ దంటే రాక తప్పుతుందా!" వా.
కాదు కూడ దను
- 1. వద్దను.
- "ఈ రామారత్నము కాదు కూడ దనినన్ రాజాల నీ చోటికిన్." హర. 2. 58.
- "ఒక్కరుడును గాదు గూడ దన గల్గెనె?" భార. విరా. 2. 257.
- 2. నిర్బంధించు.
- "నాకు ఉన్న యిబ్బందు లన్నీ నీకు చెప్పాను. నె నొక్కనిమిషం లేకపోతే యిక్కడ జరగదు. ఇంత చెప్పినా, నీవు కాదు కూడ దని నన్ను లాక్కెళు తున్నావు." వా.
కాదు పొ మ్మను
- తిరస్కరించు.
- "నను గాదు పొ మ్మని నాతి జేరిన వాని." రాధి. 4. 35.
కాదు పోదు
- ఇ దయ్యేపని కాదు.
- "ఊరికే వానిచుట్టూ తిరిగీ లాభం లేదు. కాదుపోదు, వృథాగా ఈ లంపటంతా దేనికి?" వా. కాన_____కాని 443 కాని_____కాని
కానక కన్న సంతానము
- లేక లేక పుట్టిన బిడ్డ.
- "కానక కన్న సంతానంబు శిశువులు, జీవనస్థితి కేన తావలంబు." శృం. నైష. 1. 108.
కానగ వచ్చు
- కనబడు.
- "కలకంఠికి బొడవు దోచి కానగ వచ్చెన్." రుక్మాం. 1. 141.
కానగాబడు
- కనబడు.
- "అంభోరుహాప్తుడు గానగాబడె." రుక్మాం. 5. 44.
కాననివాడు
- అంధుడు.
- "కాననివాని నూతగొని కాననివాడు విశిష్టవస్తువుల్, కాననిభంగి." భాగ. 7. 182.
కానబట్టు
- కనబడు.
- "భూ, నాకం బప్పుర మే కొఱంతయును గానంబట్ట దెప్పట్టునన్." భాస్క. రా. యు. 15.
కానబడయు
- చూడ గలుగు.
- "కన్నులారగ మిమ్ము గాన బడసి." హర. 4. 59.
కానబడు
- కనబడు.
- "స్వానుభవంబున దథ్యము కానంబడు." కా. మా. 1. 80.
కానికల
- దు:స్వప్నము.
- "వామహస్తము నురముపై వైచి నిదుర జెందుతఱి గానికల గందు రందు రెందు." శుక. 4. 126.
కానికి గై కొనక
- లక్ష్యపెట్టక.
- ఒక కానీకి కూడా పనికి వచ్చునని భావింపక.
- ".......తేజోనిధిన్, మౌనిం గానికి నైన గైకొనక..." వరాహ. 5. 19.
- చూ. కానికి గొనక.
కానికి గొనక
- లక్ష్యపెట్టక.
- "మము, గానికి గొన వప్పు డిపుడు గాడిద వైతే." భార. శాంతి. 4. 389.
- చూ. కానికి గైకొనక.
కానిచ్చు
- 1. జరుగ నిచ్చు.
- "అట్లే కానిమ్ము లె మ్మనిన." ఆము. 6. 66.
- 2. పూర్తి చేయు.
- "ఆపని కానిస్తే ముందు, తర్వాత మిగతవి చూచుకో వచ్చు." వా.
కానితెఱగులు
- అపమార్గములు. పాండు. 5. 69.
కానికి నైన గొనక
- ఏమాత్రం లక్ష్య పెట్టక.
- "ఆ నీలుండు వరూధినీపరివృతు డై పోయి తేజోనిధిన్, మౌనిం గానికినైన గైకొనక..." వరాహ. 5. 19.
కానితనము
- దుర్మార్గము; దౌష్ట్యము. కాని_____కాని 444 కాని___కాన్పీ
- "మారు డదే కానితన మూని పోరె." రాధికా. 4. 51.
కాని తిరుగులు తిరుగు
- చెడుతిరుగుళ్లు తిరుగు.
- "వా డీ మధ్య కాని తిరుగుళ్లు తిరుగుతున్నాడు. కాస్త అదుపులో ఉంచితే తప్ప లాభం లేదు." వా.
కానిది
- కూడనిది.
- "కానివాని మాన జెప్పి." భార. ఆను. 1. 278.
కానిపేరిది
- అయిష్ట మైనది; సరిపడనిది.
- "పలుమాఱుం దలవాకిట మెలగుట యసతీజనైకమిత్రత....నాకు గాని పేరివి మగువా." భార. అర. 5. 302.
కాని పోని
- లేనిపోని; జరగని. జం.
- "అరుంధతివి కానక నీపయి గానిపోని యీ, వింత ఘటించినట్టియవి వేకుల కోటికి శాస్తి చేసి..." శుక. 4. 54.
- "ఈ కానిపోని మాటలతో ఏం గానీ! అయ్యేపని చూడండి." వా.
- చూ. లేని పోని.
కానివలను
- కానికార్యము; తగనిపని.
- "వట్టి ప్రయాసంబు కానివలను దలంపన్." కళ. 8. 164.
కానివాడు
- 1. అనర్హుడు.
- "కానివాని, కీకు మీవిద్య పాత్రదా సైకనిరత." భార. శాంతి. 6. 65.
- 2. పరాయివాడు.
- "నీవు కానివాడ పోలెం దొలంగి యున్నాడవు?" భార. అరణ్య. 7. 416.
- 3. అనిష్టుడు, శత్రువు.
- "న న్నెందుకు ఈ పనిలో దింపి మావాళ్లకు కానివాణ్ణి చేస్తావు?"
- "ఇన్నాళ్లు పెట్టి పోసి యింతా చేస్తే వానికి నే నిప్పుడు కానివాణ్ణి అయిపోయాను." వా.
కానివావి
- 1. విరోధము. వివాహాదులలో వరుస చూచి పిల్ల నివ్వడం అలవాటు. వావి కుదిరిన దనగా సంబంధమునకు తగు నన్న మాట.
- దానికి వ్యతిరేకముగా ఇక్కడ 'కానివావి' కి భావార్థము - పొసగక పోవుట.
- "గడ్డి వేయడు కరణంబు కానివావి." శుక. 3. 405.
- 2. తగనిపని.
- "బొంకు నాలుకకు జేర్చుట కానివావి." గౌ. హరి. ప్రథ. పంక్తి. 235.
- చూ. తగనివావి.
కానుక పట్టు
- బహుమతి యొసగు.
- "ఆశీర్వాద పూర్వకంబుగా నారోజునకు గానుక వట్టుటయు..." కళా. 5. 2.
కాన్పించు
- కనబడు. కాన్పి____కాపి 445 కాపు____కాపు
- "కృప దలిర్పంగ గాన్పించె గేశవుండు." కళా. 2. 98.
కాన్పించుకొను
- చూచు.
- ఇది రాయలసీమలో నేటికీ వినవస్తుంది.
- "పాణిపాద ప్రక్షాళ నాచమనా నంతరంబ యతనిం గాన్పించుకొని." ఆము. 4. 199.
- "ఆ ఊరికి ఎటూ పోతున్నావు. కొంచెం ఆ రెడ్డిగారిని కనిపించుకొని రా." వా.
కాన్పు కెక్కు
- పేరు కెక్కు.
- "మరుమర్లుదీ గెలో మంజు సౌదామనీ ఖండంబులో యన గాన్పు కెక్కి." శ్రీరాధా. 4. 151.
కాన్పు చేయు
- ప్రసవసమయమున సాయపడు.
- "కాన్పు చేయడానికి మా అమ్మను రమ్మని ఉత్తరం రాశి ఉన్నాము." వా.
- "ఆ మంత్రసాని ఎన్నివందల కాన్పులు చేసిందో ఏమో? ఇప్పుడు చేయ లేక పోతుందా?" వా.
కాన్పు నడుపు
- కాన్పు చేయు.
- "చెల్వుగ బిడ్డ కాన్పు నడిపెన్ వామాక్షి బాలింత యై." కా. మా. 410.
కాపిడు
- కాపుదల పెట్టు; కావలి పెట్టు.
- "పవ లెల్ల లోపల జొరకుండ గాపిడి." పండితా. ప్రథ. పురా. పుట. 380.
కాపుండు
- కాపుర ముండు.
- "ఇప్పురంబున గాపుండ కితర మైన, పురమునం దేల నిల్చె నిర్జరవిభుండు." హర. 7. 177.
- "అల పన్నిద్దఱు నూరులందును సముద్యల్లీల గా పున్న వె, గ్గలపుం దాపము బాప నా..." ఆము. 1. 10.
కాపురము నారడి పుచ్చు
- కాపురము చెడగొట్టు.
- "అక్కట! భర్త గాపురము నాఱడి పుచ్చి నృపాలమౌళితో..." హంస. 1. 124.
కాపురములు కూల్చు
- కొంప లార్పు.
- "జార! యెన్ని, కాపురంబులు గూల్చితో కద యటంచు, బలుక నా వంటి వా డిందు గలిగె ననుచు." శుక. 3. 201.
- "వా డీసరికి ఎన్ని కాపురాలు కూల్చాడో? వీళ్లింటికి ఎసరు పెట్టాడు." వా.
కాపురము సేయు
- నివసించు.
- "ఆ పురమునందు జేయుం గాపురము." నిరంకు. 1. 556.
కాపుర మెత్తిపోవు
- కాపురము పా డగు. ఇది నేడూ రాయలసీమలో వ్యవహారంలో ఉన్న పలుకుబడి. కాపు_____కాబ 446 కామ_____కామి
- 'ఆ సంసారి ఎత్తిపోయినాడు' - ఇదే అర్థంలోనే ఎత్తుబడు అన్నక్రియ కూడా ఉన్నది. జబ్బులో కావచ్చు లేక మరొక విధంగా కావచ్చు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు - అన్న అర్థంలో ఇది ఉపయుక్త మవుతుంది: 'పశువు ఎత్తుబడింది.'
- "శరీర మొక్క మ,ట్టైన సమానదు:ఖ మెసయం దన కాపుర మెత్తిపోవదే." శుక. 2. 133.
- "వారి సంసారం పూర్వం బాగా ఉండేదే కాని ఇప్పుడు ఎత్తిపోయింది." వా.
కాపురుషులు
- చెడ్డవారు.
- "కా పురుషుల వలన నిట్టి కాఱియ పుట్టెన్." భార. విరా. 4. 140.
కాపులు పోవు
- వలస పోవు.
- "సర్వత్ర నిలింపకామినుల వాడకు గాపులు వోయి..." ఆము. 1. 37.
కాపెట్టుకొను
- కాచుకొను.
- "రతిసేన మందిర,మును గాపెట్టుకొని యుండుమోహము కలిగెన్." హంస. 5. 133.
కాబట్టదు
- ఇష్టం లేదు.
- "వాడికి సంసారం అంటే కాబట్టదు. మరెవరు చూచుకొంటా రనుకన్నాడో!" వా.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు
- అరిషడ్వర్గాలు.
కామధేనువు
- కోరిక లిచ్చే దేవతల ఆవు. తద్వారా మనోరథాలు నెఱవేర్చేవాడు, అది.
- "అతను ఆశ్రితుల పాలిటి కామధేనువు." వా.
కామవరపు జీడి
- తగులుకొంటే వదలనిది. జీడిరంగు తగిలితే అది యింక వదలదు. కామవరం అనే ఊరిజీడి మరింత ప్రసిద్ధి కావచ్చును.
- "వాడు కనిపించాడా? ఇక వెళ్లినట్లే. కామవరపుజీడిలా పట్టుకుంటాడు." వా.
- రూ. కామారపు జీడి.
కామాటపుపని
- ఇంటిపని.
- "భానుపుత్రాదులన్, వినుమీ చంపక పట్టి తెచ్చి దినమున్ నీ యింటి కామాటపుం,బనికిం జొచ్చెద మన్న దాక నిదె చెంపల్ వైతు మత్యుద్ధతిన్." రామా. 8. 185.
- కామాట మంటే ఇంటిలోని సామగ్రి, పరికరాలు అని వావిళ్ళ. ని.
కామినీభూతము
- భూతాలలో ఒకటి. అతి కాముకి. కాము____కాయ 447 కాయ____కాయ
- ఇలాంటి అతికాముక స్త్రీలను కామినీభూతము లంటారు. భూత విశేషాలు - కామిని, శాకిని, ఢాకిని, ప్రేంఖిణి ఇత్యాదులు.
- "కంటికి బ్రియ మగువానిన్, గెంటని తమకమున గామినీభూత మనన్, వెంటబడి..." శుక. 2. 106.
కాముకుని లజ్జ
- అసంభవము.
- 'కామాతురాణాం న భయం న లజ్జా' అనుటపై యేర్పడినది. రాధి. 4. 79.
కాయకము
- 1. కష్టం, శ్రమ అను అర్థాలపై వచ్చి లాక్షణికంగా వృత్తి జీవనం అని మారినది.
- "మఱి యెందు గాయకం బెఱు గమి జేసి." బస. 4. 118.
- 2. సేవ; శరీరశ్రమ. ఇందుమూలంగానే పని అని కూడా అర్థ మేర్పడినది.
- "చేయు కాయకమును శివభక్తితతికి, బాయకట్టుల సమర్పణ సేయుటయును." పండితా. ప్రథ. పురా. పుట. 477.
- "పాయక తనచేయు కాయకంబట్ల, చేయుచు..." అదే. 479 పుట.
కాయకల్పము
- ముదుసళ్ళకు జవ్వనం ప్రసాదించే ఆయుర్వేదప్రక్రియ.
- "ఆ ముసలాయన కాయకల్పచికిత్స చేసుకొని ముప్పైయేళ్లవా డయ్యాడు." వా.
- చూ. కాయసిద్ధి.
కాయకష్టము చేయు.
- శ్రమించు. నా. మా. 97.
- "ఏదో కాయకష్టం చేసుకొని ఆ పిల్లలను వాడు పోషించుకుంటున్నాడు." వా.
కాయక్లేశము
- శరీరశ్రమ.
- "కాయక్లేశ మేమీ లేకుండా పనులు కావాలంటే ఎలా?" వా.
కాయగసరులు
- కాయలూ కసురులూ. జం.
- "జడలు ధరియించి యడవుల, నిడుమల బడి కాయగసురులే మెస వెడు పెన్..." రామాభ్యు. 6. 152.
కాయ గాచు
- 1. సంతానము కలుగు.
- "ఇత డొక కాయ గాచి సుతుని ల్లనిపించె మునీంద్ర." కకుత్స. 2. 64.
- "నాలుగేన్, కాయలు గాయ వచ్చెలువ గర్భమునం దెటువంటి పాపమో." వేం. పంచ. 1, 588.
- "ఏదో మా పిల్లకడుపున ఒక కాయ కాస్తే చూచి వెళ్ళిపోతాను." వా.
- 2. పని సేయుట మొదలయిన వాని ద్వారా చేతులు మొదలయిన వాటిపై చర్మం గట్టిపడి కాయవలె ఏర్పడు.
- "కట్టెలు కొట్టి కొట్టి చేతులు కాయలు కాచిపోయాయి." వా. కాయ____కాయ 448 కాయా____కారా
కాయగూరలు
- కాయలు కూరలు. జం.
- మొత్తంగా కాయలకూ కూరలకూ కూడా ఉపయోగిస్తారు. కుమా. 11. 43.
- "ఏవైనా కాయగూరలు పట్టుక రారా." వా.
కాయము కొట్టు
- బాలింతలకు వేడిని కలిగించుట కని, శీత వాతాది దోషములు పోవుట కని కొన్ని దినుసులను దంచి పొడి చేయు. మదన. శత. 6.
కాయముతో కైలాసమునకు పోవు.
- బొందితో కైలాసమున కేగు. సశరీరముక్తి చెందు.
- పండితా. ప్రథ. పురా. పుట. 406.
కాయశుద్ధి చేయు
- శాస్తి చేయు, తన్ని వదలిపెట్టు.
- "ఇలానే ప్రవర్తించా వంటే ఆ ఊళ్లో కాయసుద్ధి చేసి పంపిస్తారు. జాగ్రత్త." వా.
- చూ. దేహశుద్ధి చేయు.
కాయసిద్ధి
- నిత్యయౌవనము. దీనిని సాధించుటకు చెప్పిన ఔషధాది ప్రక్రియలను 'కాయకల్పం' అంటారు.
- "వీరిబగిసికి మఱి గారవించి హరుడు, కాయసిద్ధి యొసంగునే కల్ల గాక." శుక. 3. 94.
- చూ. కాయకల్పము.
కాయా పండా ?
- పని అయిందా కాలేదా అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "వివరా లన్నీ తరవాత చెబుదువు గానీ ముందు కాయా పండా చెప్పు." వా.
కారణజన్ముడు
- ఏదో ఒక పనికి పుట్టినవాడు.
- "కారణజన్ము లై తనువికారము వచ్చిన బెంపు తప్పునే." భార. విరా. 4. 22.
కారము నూరు
- కోపించు.
- "దానిపై, గారము నూరు గాని తగు గారవమున్ బచరించి యేలునే?" పాణి. 5. 15.
- చూ. కారాలు మిరియాలు నూరు.
కారము లేని విడెము
- నిస్సార మైనది. వేంకటేశ. 64.
కారాకు మేపి చంపు
- నానాబాధలూ పెట్టి చంపు.
- "కృప, చాలు న్గారాకు మేపి చంపకు ప్రజలన్." ఆము. 3. 32.
కారాకులు డుల్లి నట్లు
- గబగబా. కారా____కారా 449 కారు____కారు
- సులువుగా పడిపోవుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "వైరమున నులిచి త్రెంపక, కారాకులు డుల్లినట్లు కర్మము లెల్లం, దార పెడ బాయ వలయుట." భార. భీష్మ. 1. 104.
కారాకూర మగు
- అల్లరిపడు. క్షోభ పడు.
- "సారెకు గేకలు వేయుచు, గారా కూర మయి మనసు కళవళపడగన్..." సారం.
- "కారాకూరంబు లై రాక్షసులహృదయముల్ గాడ్పడన్."ఉ. రా. 1. 176.
కారాకూరము చేయు.
- క్షోభపెట్టు. బాధపెట్టు.
- "....మీ పల్లెకుం బొండు కా,రా కూరంబులు చేసినం గదలి నే రా నిచ్చటన్." కా. మా. 3. 82.
- "మా,రదశన్ వేగెడుకాంత నింత పెను గారాకూరముల్ చేసె." పరమ. 3. 275.
కారాని
- కూడని.
- "కారానితలంపు బుట్టించె." హర. 3. 95.
- "కారాని చోటికి పోతే రారానిమాటలు వస్తాయి." సా.
కారాలు మిరియాలు నూరు
- కోపించు; ద్వేషించు.
- "డబ్బంతా ఖర్చు చేశా వని తెలిసి మీ నాన్న కారాలు మిరియాలు నూరుతున్నాడు." వా.
కారుకమ్మగా వండు
- కరకర మనునట్లు - కమ్మగా వండు.
- "పెక్కు చందముల జిన్నక పెద్దక కారుకమ్మగా వండుదురు." కా. మా. 3. 66.
కారుకూతలు కూయు
- తిట్టు. కొత్త. 84.
కారుకొను
- వ్యాపించు. క్రమ్ము; అతిశయించు.
- "...మెఱుగుటారు...గాటమై పూట పూటకు గారుకొనియె." రసిక. 6. 99.
కారు గ్రమ్ము
- నలు పెక్కు.
- "నిగిడి యీగులకెంపు నెలకట్టు కలచోట, గల్పకాపరి కారు గ్రమ్ముచోట." పాండు. 3. 158.
కారుచిచ్చు
- దావాగ్ని.
కారుచిచ్చునకు గాడ్పులు తోడగు చందమున
- మఱింత ప్రోత్సాహ మబ్బినట్లు.
- నిప్పునకు గాలి తో డయి నపుడు మరింత ప్రబలును.
- "ఉదారసారరణకోవిదబాహులు లోక పాలకుల్, గలసిరి కారుచిచ్చునకు గాడ్పులు దో డగు చంద మెందగన్." ఉ. హరి. 1. 22. కారు____కార్చి 450 కార్య____కార్య
కారుణ్యము సేయు
- దయచేయు; ఇచ్చు.
- "అమ్మదాలస గారుణ్యము సేయు మీతనికి." మార్క. 3. 8.
కారుబారు చేయు
- పెత్తనము చేయు.
- "తా నెత్తి పెంచగా దగు నిళాసతి మీద వడి నేల బలు కారుబారు చేసి." రాధి. 1. 49.
- నేటికీ రాయలసీమలో 'వాని కారు బారు జోరుగా సాగుతూ ఉంది' అని అంటారు.
కారె మెత్తు
- నీళ్ళు తాటిదోనెతో తోడు.
- "బడలినవార లిందనుక బాదులు త్రవ్వియు గారె మెత్తియున్." విప్ర. 3. 84.
కార్కొను
- దట్ట మగు.
- "పుడమి నెల్లెడల నిండి మెండుకొని జగదండఖండంబున గార్కొని." విప్ర. 2. 14. కవిక. 2. 67.
కార్చిచ్చులోపలి మిడ్త లట్లు
- చిచ్చులో ఉరికిన మిడత నిమిషంలో మాడి పోతుంది. కానీ అగ్గిలోకి ఉరుకుతూనే ఉంటుంది. అలా ప్రమాదంలో తమంత దుముకు వారియెడ అనుమాట.
- "వలదె కార్చిచ్చులోపలి మిడ్త లట్లు, పొలసి పోవనె కాక నిలువగగలరె?" బస. 7. ఆ. పుట. 187.
కార్యకర్మములు నడుపు
- పనులు నెఱవేర్చు.
- "ఫలములయెడ బ్రహ్మార్పణ, కలన పరుం డగుచు గార్యకర్మము నడపన్, వలయున్." భార. శాంతి. 1. 69.
కార్యకాడు
- పని నెఱవేర్చుకొనగలవాడు. ఆము. 4. 263.
కార్యఖడ్గములు
- సామదండో పాయములు. జం.
- "కార్య ఖడ్గము లనుచరుల్ గాన బలుక, వలయు." ఆము. 4. 259.
కార్యభారము
- బాధ్యత.
- కార్యనిర్వహణలోని బరువు. బరువుతోడి ఉపమానస్ఫూర్తివల్లనే కార్యభారము వహించు అని కూడా వ్యవహారం యేర్పడింది. కడకు కార్యబార మప్పగించుట అనే దానిలో ఆబరువును మోయుట కూడా కలిసిపోయినది.
- "చొక్కి బహువత్సరము లచ్చో వసించి, పిదప ప్రభుకార్యభారము మది దలంచి." శుక. 1. 196.
కార్య మరయు
- పని చూచు.
- "ఒకవేళ రేపు నృపాలకజాలసాల దు,ర్గమదుర్గహరణైక కార్య మరయు." శుక. 1. 355. కార్య____కాఱి 451 కాఱి____కాఱొ
కార్యము చేయు
- నిషేకము చేయు.
- "మా అమ్మాయికి కార్యం చేయాలి ఈ నెలలో?" వా.
కార్యము తప్పు
- కార్యము చెడు.
- "ఇక నిట్టటు, దడసిన గార్యము దప్పు ననుచు." కళా. 6. 71.
- "అప్పుడు మంత్రులు కార్యము దప్పె గదా యనుచు." నిరంకు. 4. 68.
కార్యము తెగు
- పని ముగియు.
- "తెగు గార్య మనువార్త." విజయ. 1. 41.
కార్యము పాకము తప్పు
- పని చెడిపోవు.
- "మతి దలపోసి యీపలుకు మానుడు పాకము దప్పె గార్యముల్..." భార. భీష్మ. 1. 13.
- చూ. పని పాకము తప్పు.
కార్యవాది
- అనవసరంగా వాదాలతో పని చెఱచుకొనక పని అయ్యేటట్టు చూచుకొనేవాడు.
- "లేనిపోనివానికి వెళ్లేవాడుకా దతను. కార్యవాది." వా.
కాఱియపెట్టు
- బాధపెట్టు.
- "దుర్భాషా, ఘనశరములు మనము నాటి కాఱియ బెట్టన్." భాగ. స్క. 4. 221.
కాఱియవడు
- కష్టపడు; బాధపడు.
- "జూదమాడి ధర్మనూనుండు రాజ్యంబ, ననుజులను బ్రియాంగనను బణంబు, గాగ నొడ్డి యాడి కాఱియవడ డె."భార. విరా. 5. 245.
కాఱియ వెట్టు
- కష్టపెట్టు.
- "మా ఱెందు లేక నిరతము, గాఱియ వెట్టంగ బెగడి." రుక్మాం. 3. 4.
కాఱుకూతలు
- దుర్భాషలు.
- "కన్ను లెఱ్ఱచేసి యన్నుల గని కాఱు, కూత లఱచె దేల కోకిలంబ!" రసిక. 4. 170.
కాఱు లఱచు
- 1. దుర్భాష లాడు.
- "కతలు సెప్పెదు విను మంచు గాఱు లఱచు, నేర్పు గలుగుట." రుక్మాం. 5. 86.
- 2. కాఱుకూతలు కూయు.
- "కంటే బ్రాహ్మణు డెన్ని కాఱు లఱచెన్ గర్వించి వీ రెల్ల నా,కంటెన్ బాత్రులె." మను. 5. 14.
కాఱులాడు
- వ్యర్థప్రలాపాలు పల్కు.
- "ఇవము నూడుకొలపుటేలికల్ ము న్నెందు, గాఱు లాడి రనినకత యెఱుంగ." అచ్చ. అయో. 30.
కాఱులు చెప్పు
- కారుకూతలు కూయు.
- "ఏమి కాఱులు చెప్పె దీమఱ్ఱి నాకు?" ద్విప. జగ. 158.
కాఱొడ్డెకాడు
- దుర్భాషి. శేష. 3. 269. కాల____కాల 452 కాల____కాల
కాలం ఇట్లే ఉండదు
- ఇట్లాగే ఎప్పుడూ ఉండదు.
- "నే నేదో యిప్పుడు తక్కువస్థితిలో ఉన్నాను. అంతమాత్రంతో నువ్వు తిరస్కరించ నక్కఱ లేదు. కాలం ఇట్లాగే ఉండదు." వా.
కాలం కర్మం కూడి వచ్చు
- కాలము కలిసి వచ్చు అనుట వంటిది. అయితే ఏదో చెడు రావలసి వచ్చు అన్న సూచన ఉన్నది.
- "కాలం కర్మం కూడివచ్చే వాడు ఆ ఊరికి వెళ్లాడు. దివాలా తీశాడు." వా.
కాలకూటజ్వాలను కబళించు
- అసాధ్య కార్యము చేయు.
- "కాలకూటజ్వాల గబళింప నగు గాని, యతివలతోడ మాటాడ నగునె? శుక. 1. 364.
కాలక్షేప మగు
- హాయిగా కాలము గడచు.
- "ఏవో నాలుగు నవల లుంటే కాలక్షేప మవుతుంది." వా.
కాలక్షేపము చేయు
- పని చేయక గడపు.
- "అనవసరంగా ఇదో అదో అని కాలక్షేపం చేస్తున్నా డతను. ఊరికే నమ్ముకొని ఉంటే ఏం లాభం?" వా.
కాలగర్భములో కలిసిపోయిన
- ఎన్నడో నశించిన. పాతకాలపు నాటి మాట అనుట. మాటా. 39.
కాలగోచరు డగు
- చనిపోవు.
- "...అయ్యఱువది వేవురు నతిదర్పితు లై యేకకాలంబున గాలగోచరు లగుదు రనియు..." భార. అర. 3. 51.
కాల చేత తన్ను
- చితక తన్ను.
- "ఇదే, మడరె బరపురుష వాసన, చెడుగా నొడువు మని కాల జేతం దన్నెన్." శుక. 2. 195.
- "వానిని కాలా చేతా తన్ని వదిలి పెట్టినారు." వా.
- చూ. కాలా చేతా తన్ను.
కాల చేత పొడుచు
- చితుక తన్ను.
- "ముత్తైదువ నటంచు బత్తిబొట్టు వహింప, జిన్నెలా యని కాల జేత బొడుచు." శుక. 2. 115.
- చూ. కాల చేత తన్ను.
కాలదోషము పట్టు
- ప్రామిసరీ నోట్లు మొదలగు వానికి మూడేండ్లలోగా చెల్లు వేయక పోతే అవి చెల్లవు. అప్పుడే కాలదోషము పట్టిన దంటారు. అలాగే కొన్ని కొన్నిటికి ఏదో కాలనిర్ణయం ఉంటుంది. అది దాటితే కాలదోషం పడుతుంది.
- "నోటుకు కాలదోష మని." గుంటూ. ఉత్త. పు. 2. కాల_____కాల 453 కాల_____కాలా
కాల ద్రొక్కు
- ధ్వంసము చేయు.
- "*"పాపముల గమి గాలం, ద్రొక్కెదవు నీవ." పారి. 1. 50.
కాలధర్మ చెందు.
- మరణించు.
- రూ. కాలధర్మము పొందు.
కాలనేమిజపము
- దొంగజపము.
- కాలనేమి ఒక రాక్షసుడు. లక్ష్మణుని మూర్ఛ తీర్చుటకు హనుమంతుడు సంజీవకరణి తెచ్చుటకు పోవుచుండగా దారిలో మునివేషమున నుండి మోసము చేయదలచినవాడు. అందుపై యేర్పడిన పలుకుబడి.
కాల మగు
- వేళ యగు.
- "కాలం బగుటయు నృపులకు, నాలము సమకూరె." భార. భీష్మ. 1. 6.
కాల మయి పోవు
- చనిపోవు.
- "వాళ్ల నాన్న కాల మయి పోయి అప్పుడే సంవత్సరం అయిపోయింది." వా.
కాలము చేయు
- మరణించు.
- "మాయ గోవు పడుచుం, గనుగ్రుడ్లం దిరుగ వేసి కాలము చేసెన్." వరాహ. 10. 40.
- "ఆయన కాలం చేసి అప్పుడే నాలుగయిదేం డ్లయింది." వా,.
కాలము చేరు
- అంత్య కాలము సమీపించు.
- "ఇందఱకు నేర్పడ గాలము చేరె నావుడున్." భాస్క. సుంద. 357.
కాలము చేరు వగు
- కాలము దాపురించు; మరణ మాసన్న మగు.
- "తథ్యంబుగా వజ్రనా, భునకుం గాలము చేరు వౌట యిది నీ బుద్ధిన్ వివేకింపుమా?" ప్రభా. 1. 127.
- రూ. కాలము దగ్గఱకు వచ్చు.
కాలాంతకుడు
- అసాధ్యుడు.
- "వాడు కాలాంతకుడు. వాడితో తగాదా పడితే మనం ఏం గెలుస్తాం?" వా.
కాలాగు
- కొంతకాలం అగు; నిలుచు.
- "తిమురు మధ్యాహ్న మయ్యెను దేవ! యిచట, నేడు కాలాగి మా మంద పాడిచూచి, గోరసము బాయసంబులు నారగించి, నిగ్రహం బైన మమ్ము మన్నింపవలయు." శకుం. 1. 123.
కాలాడునపుడు
- అనగా ఇంకా శరీరములో ఏకొద్దో బల మున్నప్పుడు.
- "కాలాడినపుడ, నడవవలెగాక కైలాస నగము జూడ." కా. మా. 3. 177.
- "కాలుచేతులు ఆడుతున్నప్పుడే అంతంతమాత్రం. ఇక అవీ పడిపోయా యంటే ఇక నా దిక్కు చూచేవా ళ్లెవరు తల్లీ!" వా.