పదబంధ పారిజాతము/ఎ

వికీసోర్స్ నుండి

ఎంత____ఎందు 247 ఎందు____ఎక

  • "మార్పెట్టు నోపనిమ్రాకు లేర్చుట యెంత, వా లగు నని వనవహ్ని నవ్వు." కుమా. 10. 159.

ఎంతసేపూ

  • ఎల్లప్పుడూ అనుట.
  • "ఎంతసేపూ వాడికి ఆత్మస్తుతీ, పరనిందా తప్పితే మరొకటి లేదు కదా !" వా.
  • చూ. ఎంతదాకా.

ఎందాక ? (ఎంతదనుక)

  • ఎక్కడికి పోతున్నారు అనుట. ఎక్కడికి అని అడగడం అపశకున మని ఎంతదాక అని అడుగుట అలవాటు.
  • "పొద్దున్నే బయలు దేరారు. ఎందాకా ?" వా.

ఎందు కైనా మంచిది

  • అంత ప్రయోజనం లేక పోయినా ఎంతో కొంత మేలు ఉండక పోదు.
  • కామేశ్వరి. శత. 85.
  • "ఆయనను వెళ్లి ఒకసారి చూడు. ఎందు కైనా మంచిది." వా.

ఎందు పెరటిచెట్టు మందు కాదు.

  • సన్నిహితులు చెప్పే హితవు తల కెక్కదు.
  • 'అతిపరిచయా దవజ్ఞా' అన్న సంస్కృతసూక్తిని తెలిపే పలుకుబడి.
  • పెరటిచెట్టును తేలికగా చూస్తారు కదా !
  • "తమకు సులభ మైన నమృతంబు గైకొన, రెందు బెరటిచెట్టు మందు గాదు." కళా. 7. 39.

ఎందు లేని

  • ఎక్కడ లేని.
  • "ఎందు లేనిపలుపోకల మాయలు నీకు వెన్నతో బెట్టినవి." పారి. 1. 127.
  • ఇది వాడుకలో 'ఎక్కడ లేని' అనేరూపంతోనే కనబడుతుంది.
  • చూ. ఎక్కడ లేని.

ఎంబెన్న

  • యంబ్రహ్మ.
  • "ఓ అంటే నా రాని యెంబెన్నలదే యీ రోజులలో అధికారంగా ఉంది." వా.
  • చూ. యంబ్రహ్మ.

ఎకసక్కె మాడు

  • వేళాకోళము చేయు.
  • "ఎవ్వారి బొడ గన్న నెకసక్కెమాడుచు." విప్ర. 5. 26.
  • చూ. ఎకసక్కెము లాడు.

ఎకసక్కెము చేయు

  • హాస్యము చేయు.
  • "నీ విట వచ్చుట పారిజాతవా,సన బ్రకటించి నాకు నెకసక్కెము సేయన కాదె చెప్పుమా!" పారి. 1. 128.

ఎకసక్కెము లాడు

  • పరిహాస మాడు.
  • "చక్కెర వింటి వాని నెకసక్కెము లాడడె." నిరంకు. 2. 12. కాశీ. 4. 123.
  • చూ. ఎకసక్కెము చేయు. ఎకా___ఎక్క 248 ఎక్క___ఎక్క

ఎకాయకిగా

  • మధ్యలో ఆగకుండా.
  • "అమ్మకు చాలా జబ్బుగా ఉం దని తంతి వచ్చేసరికి ఎకాయెకిగా బయలుదేరి వచ్చాను." వా.
  • రూ. ఎకాయెకిని.

ఎక్కడ చూచిన...

  • అన్నిచోట్ల.
  • "ఎక్కడ జూచిన నిండ్లపై బసిడికుం,డలు క్రొత్త మెఱుగిడి నిలుపు వారు..." కళా. 7. 58.
  • "ఎక్కడ చూచినా తోరణాలే. జెండాలే. ఊరంతా వెలిగిపోతున్నది." వా.

ఎక్కడను ప్రొద్దు పొడుచు టెఱుగక

  • ఏ కష్టమూ తెలియకుండా.
  • "మ్రొక్కెదము సామి నీదయ, నెక్కడనుం బ్రొద్దు పొడుచు టెఱుగక నీవే, దిక్కని యందుము దాయలు, గ్రక్క తిలం గడుపుచల్ల కదలక యుండన్." రామాభ్యు. 2. 7.

ఎక్కడ పట్టిన నక్కడ

  • ప్రతిచోట.
  • "ఎక్కడ బట్టినం గళల యిక్కువ లెక్కడ నోరు సోకినన్, జక్కెర లప్పలు." కా. మా. 1. 43.
  • "వాడు ఎక్కడ పడితే అక్కడ అప్పు చేశాడు." వా.

ఎక్కడ పొడిచితే ప్రొద్దా అను

  • ఏ కష్టమూ లేక హాయిగా నుండు.
  • "...మత్తిల్లి యుష్మత్కథా బోధం బొందితి, మెక్కడం బొడిచితే ప్రొద్దా యటంచున్ సుఖ, శ్రీధన్యస్థితి రామరాజ్యమువలెం జే ఱొమ్ముపై జేర్చుచున్." బహులా. 1. 115.

ఎక్కడ లేని....

  • విపరీత మైన.
  • "నాకు ఎక్కడలేని కోపం వచ్చింది." వా.
  • "ఎక్కడలేని కపటమూ వాడి దగ్గర ఉంది." వా.
  • "వానికి తన భార్యమీద ఎక్కడ లేని ప్రేమ." వా.

ఎక్కడి కెక్కడ ?

  • దానికీ దీనికీ సంబంధము లే దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "వారి వీరి బలసంపద లెక్కడి కెక్కడా నృప, గ్రామణితోడ..." రుద్రమ. 22. పు.

ఎక్కడి జగజోలి

  • ఇ దెక్కడి పీడ, ఇ దెక్కడి సంతన; ఇదేమి పీకులాట- అనుపలుకుబళ్ల వంటిది.
  • నా జోలి కాదు, ఊరివారి జోలి అన్న అర్థంలో జగజోలి యిక్కడ ప్రయుక్తమయింది. వావిళ్లలో, సూ. ని. లో కూడ జగజోలి = మిక్కిలి మోసగాడు అన్న అర్థం యిచ్చారు గానీ వా రిచ్చినప్రయోగాలలోనే అది అతకదు.
  • "....తనకార్య మైనయందాక విరా,ళి గదింతు రంత నెక్కడి, జగజోలి ఎక్క____ఎక్క 249 ఎక్కా____ఎక్కు

యటంచు నెరసి చన జూతురుగా." శుక. 3. 127.

  • "చాలు చాలు వట్టి జగజోలిమాట చాలింపుమా యిట్టి జాడ లేమిటికి ?" రంగ. అయో. 94 పొ.
  • "జగజోలిమాటలు మాని...." పరమ. 4. 306.
  • "ఫలమువారలొ కాక పని మాలినట్టి చలమువారలొ వట్టిజగజోలి యేల ?" పరమ. 7. 645.

ఎక్కడి జోలి ?

  • ఎక్కడి గొడవ ?
  • "ఎక్కడిజోలి పెండ్లి యగుటెట్లు?...." శుక. 1. 363.
  • "ఇదెక్కడి గొడవ?" వా.

ఎక్క పెట్టు

  • 1. ఎగసన త్రోయు.
  • "వా డెక్క పెట్టడంవల్లనే వీ డిలా తయా రయ్యాడు." వా.
  • 2. పురి యెక్కించు. ఎవరిమీదైనా చాడీలు చెప్పి ద్వేషము పుట్టించు.
  • "పాపం! వాడు మంచివాడే కాని రెడ్డిగారి కెవరో ఎక్క పెట్టి దావా వేసేట్టు చేశారు."
  • చూ. ఎక్కపొడుచు.

ఎక్కపొడుచు

  • చూ. ఎక్క పెట్టు.

ఎక్కద్రోచు

  • ఎక్కు పెట్టు.
  • "గొనయంబు నెక్క ద్రోచిన, గనయంబున కెక్కకున్న." పారి. 4. 72.

ఎక్కద్రోయు

  • ఎగద్రోయు.

ఎక్కాలు

  • ఒకట్లు.
  • "మా వాడికి ఎక్కాలు బొత్తిగా రావు. నాలుగో ఎక్కమే సరిగా చెప్పలేడు." వా.

ఎక్కి తొక్కి

  • కావలసినంత; సుష్ఠుగా.
  • "శేరుబియ్యం వేస్తే మాఇంట్లో అందరికీ ఎక్కి తొక్కి సరిపోతుంది." వా.

ఎక్కివచ్చు

  • వృద్ధికి వచ్చు.
  • "ఆ వ్యాపారంలో దిగినప్పటినుండీ బాగా యెక్కి వచ్చాడు." వా.
  • "వాళ్ల సంసారం పాపం ఎక్కి రాలేదు." వా.

ఎక్కుగొఱ్ఱు

  • భయంకరుడు.
  • పని పట్టించగలవాడు అని భావం. అపరాధులను కొఱ్ఱు కెక్కించడం, కొఱత వేయడం ఉన్నది. ఆ కొఱత వేసేదే ఎక్కు గొఱ్ఱు.
  • "భేదవాదుల కెక్కు గొఱ్ఱు." పండితా. ప్రథ. వాద. పుట. 511.
  • చూ. వీపుగోల.

ఎక్కుడించు

  • వింటినుండి నారి తొలగించు. ఎక్కు పెట్టుటకు వ్యతిరేకము. సంధించినబాణమును వింటినుండి తొలగించు అని అర్థం.
  • "వి ల్లెక్కుడించి." జైమి. 8. 29.
  • "అంత లతాంతచాపలత యంగభవుం ఎక్కు____ఎగ 250 ఎగ____ఎగ

డవు డెక్కు డించె ద,త్కాంత ప్రభాత మయ్యె నని." శుక. 1. 217. ఎక్కుడుగోద

  • వాహన మగు ఎద్దు, ఎక్కుటెద్దు.
  • "ఎక్కుడు గోద ని న్నెక్కడ వైచి, యెక్కడ వోయె." బస. 3. 69.

ఎక్కువ తక్కువ లేకుండు

  • సమానరూపముతో నుండు.
  • "ఎక్కువ తక్కువ లింతయు లేకన్ ఒక్క రూపమున నున్నవి చూడన్." సుద్రీ. 241.

ఎక్కువ తక్కువ లేక

  • సమానముగా, ఒకేతీరుగా.
  • "ఎక్కువ తక్కువ లెందు నించుకయు గ,ల్గక నేరు పొక్కలీలన తనర్ప." కళా. 8. 68.

ఎక్కే గుమ్మం దిగే గుమ్మం

  • ఏదో ఒక పనికై యింటింటికీ పోవుపట్ల అంటారు.
  • "పొద్దున్నుంచీ ఎక్కేగుమ్మం దిగేగుమ్మం. దీంతోనే సరిపోయింది." వా.

ఎగ ఊపిరి దిగ ఊపిరిగా ఉండు

  • మహా అలసటగా - ఆయాసముగా ఉండు.
  • "కొండెక్కి దిగేసరికి ఎగ ఊపిరి దిగ ఊపిరిగా ఉంది." వా.

ఎగచేపు

  • పా లివ్వకుండు (ఆవు మొదలయినవి)
  • చేపుట కిది వ్యతిరేకము.
  • "రాత్రి ఆవు ఎగ చేసింది. పొద్దున్న మజ్జిగనీళ్లు లేకుండా పోయినవి." వా.

ఎగజోపు

  • పై కెగురునట్లుగా పక్ష్యాదులను చోపు.
  • "ఒక వేళ డేగవేటకు జని యెగజోపి." కా. మా. 3. 47.
  • "వాటి నిలా ఎగజోపుక రారా. నే నిక్క డుంటాను." వా.

ఎగదట్టు

  • పైకి పోవు. అతిశయించు.
  • పాండు. 5. 182.
  • "వాడికి ఊపిరి ఎగదట్టింది." వా.

ఎగదిగ చూచు

  • దిక్కులు చూచు.
  • "చిగురుటాస దగిలి చింతాజలధి బడి, యెగదిగ జూడ బోతే యెందుకు నెక్కినది." తాళ్ల. సం. 9. 24.
  • చూ. ఎగా దిగా.

ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య

  • ఎటు పోయినా తప్పే అను పట్ల ఉపయోగించే పలుకుబడి.

ఎగదోయు

  • పురి ఎక్కించు.
  • "వాడు ముందే కొడుకుమీద మటమట లాడుతూ ఉంటే వీ డింకాస్త ఎగదోశాడు." వా.
  • చూ. ఎగబోయు.

ఎగనామం పెట్టు

  • మోసగించు; ఇవ్వక పోవు. ఎగ____ఎగ 251 ఎగ____ఎగా
  • "వాడు పది రూపాయలు తీసుకొని ఎగనామం పెట్టాడు." వా.
  • చూ. నామం పెట్టు.

ఎగనుబ్బు

  • ఉప్పొంగు.
  • "తదీయంబు లగు కృతక తరంగిణీ జాలంబులు కటిదఘ్నంబులు బెందొడలబంటులు నై యెగ నుబ్బి దిబ్బ తీర్థంబు లై పొరలి తెర లెత్తి." విప్ర. 2. 14.

ఎగబెట్టు

  • 1. ఎగ వేయు.
  • "వాడిస్తాను ఇస్తా నని కడకు ఎగ బెట్టాడు." వా.
  • 2. ఎత్తిపెట్టు.
  • "కాసేపు ఉండు. సామాను ఎగబెట్టి వస్తాను." వా.
  • ఈ అర్థంలో రాయలసీమలో ఈ మాట విరివిగా వినవస్తుంది.

ఎగబోయు

  • పురి ఎక్కించు.
  • "భూపాలునకు నెగబోసి యీర్ష్య." సారం. 3. 185.

ఎగరాసి దిగరాసి

  • లెక్కలలో ఏదో తారాతికిడీ చేసి.
  • "సంవత్సరం కిందట నూరురూపాయలు తీసుకుంటే, ఆ సెట్టి ఎగరాసి దిగరాసి నూటయాభైరూపాయలకు తేల్చాడు." వా.

ఎగవిడుచు

  • వదలిపెట్టు (ఇతరులకోస మై).
  • "తెక తేరగ నీ కెగ విడిచి పోయెదనె ప్రా,వగ నాకాణాచి యైన వలపుల పంటన్." కళా. 3. 202.

ఎగవేయు

  • ఇవ్వవలసింది, చేయవలసింది ఇవ్వక, చేయక - తప్పించు కొను.
  • "వాడీరోజు పని ఎగ వేశాడు." వా.
  • "నాకు వాడు నూరురూపాయ లివ్వవలసి వుండి ఎగవేశాడు." వా.

ఎగసన త్రోయు

  • ఎక్క పెట్టు. ఇది అన్యాయ మన్న సూచనా ఉన్నది.
  • "వాళ్లూ వీళ్లూ ఎగసన తోయడంతో వాడు అన్నకొడుకును యింటినుండీ తరిమేశాడు." వా.

ఎగా దిగా

  • పైనుండి క్రిందివరకూ.
  • చూ. ఎగ దిగ చూచు.

ఎగాదిగ కనుగొను

  • కోపముతో ఎదిరిని నిలు వెల్లా చూచు.
  • "కన్ను లెఱ్ఱగా నెగాదిగ గన్గొని, యౌడు గఱచి దీని నాటదేని...." శుక. 4. 39.
  • రూ. ఎగా దిగా చూచు.

ఎగా దిగా చూచు

  • తేరిపార జూచు.
  • "అలా ఎగా దిగా చూస్తున్నా వేమి ? గుర్తుపట్టలా ?" వా.
  • చూ. ఎగ దిగ చూచు. ఎగి____ఎగ్గు 252 ఎగ్గు____ఎటు

ఎగిరి గంతు వేయు

  • సంతోషపడు. క్రొత్త. 27.

ఎగిరిపడు

  • చాల కోపించు.
  • "వాడిపే రెత్తితే మా నాన్న ఎగిరిపడతాడు." వా.

ఎగ్గాడు

  • దూషించు.
  • "ఎగ్గాడి నారసా లేసినారు." నాయకు. పు. 13.

ఎగ్గుగొను

  • తప్పుగా తలచు.
  • "ఈ విభు డాడినది యెల్ల నెగ్గు గొనక." భార. కర్ణ. 2. 83.

ఎగ్గుతగ్గులు

  • హెచ్చుతగ్గులు.
  • "తగ్గుం గాక యా యెగ్గుత,గ్గులు."గుంటూ. ఉత్త. 63.

ఎగ్గు పుట్టు

  • హాని కలుగు.
  • "వీనిచేత నెట్టు కౌరవులకు నెగ్గుపుట్టు." భార. అర. 19. 4.

ఎగ్గులాడు

  • దూషించు.
  • "ఇప్పురంధ్రీరత్నంబు నిన్ని యెగ్గు లాడం దగదు." భాస్క. యుద్ధ. 2409.

ఎగ్గులు పట్టు

  • తప్పులు పట్టు.
  • "ఎగ్గులు పట్టు గుబుద్ధి పెద్దలన్." సింహా. 1. 18.
  • రూ. ఎగ్గులు వట్టు.

ఎగ్గులు వట్టు

  • తప్పు పట్టు.
  • "నను నెగ్గులు వట్టకుండినం బొందొనరున్." భార. కర్ణ. 1. 255.
  • రూ. ఎగ్గులు పట్టు.

ఎగ్గుసిగ్గులు

  • సిగ్గు, సంకోచము. జం.
  • "పోడిమి చెడి యెగ్గుసిగ్గులు లేక." రాధా. 5. 83.
  • "ఎగ్గూ సిగ్గూ లేని పిల్లలతో ఏం మాట్లాడుతాం?" వా.

ఎచ్చు కుందు లేక

  • హెచ్చుతక్కువలు లేక.
  • "ఇట్లు ప్రతిబాణముల హంసు డెచ్చు గుందు లేక పోరాడె." ఉ. హరి. 4. 289.

ఎటాడ బోగా నెటు వచ్చునో ?

  • ఏ మంటే ఏమి వస్తుందో ?/
  • "పూర్వపు నీ యత నుత్వ ధర్మమున్, మానక యేచుచున్న నది మామక భాగ్యము ని న్నెటాడబో,గా నెటు వచ్చునో తడవగా వెఱతున్." ప్రభా. 5. 3.
  • వాడుకలో:
  • "ఏ మంటే ఏమి వస్తుందో ? మన కెందుకని పలక్కుండా ఉన్నాడు." వా.

ఎటు తిరిగీ

  • ఏ మైనప్పటికీ; ఎలాగూ.
  • "ఎటు తిరిగీ వా డిక్కడికి రావలసిందే." వా.

ఎటు ననరాకుండు

  • ఏమనడానికి వీలు లేకుండు. ఎటు___ఎటొ 253 ఎట్టి___ఎట్లై
  • "మఱి ప్రధానుల వెట్టి మంతనా లెటు నన, రానివి పేగులలోని తీట..." కళా. 7. 19.

ఎటులైన కమ్ము నీవు

  • నీవు ఎలా అయినా అయిపో.
  • "...ఎటు లైన గమ్ము నీవు." పాండు. 5. 229.
  • ఇది వాడుకలో 'నీ వెట్లా అయినా అయి పో' 'నీ వెట్లపోతే నాకేమి' - మొదలయిన రూపాలలో నేటికీ వినబడుతుంది.

ఎటువంటి పెద్దవారు?

  • ఏం పెద్ద మనుష్యులు? అనగా ఇతరులు చేసిన పని సరిగా లే దనునపుడు అను మాట.
  • "మీ రెటువంటి పెద్దవా రెంచ రొకింతయుం..." కళా. 3. 36.
  • నేటి వాడుక రూపం:
  • "ఏం పెద్దమనుష్యు లయ్యా ! మీరు ? మొన్ననగా వస్తా నని చెప్పి రానే లేదు." వా.

ఎటూ

  • ఎలాగూ, తప్పక.
  • "వీనిచేత నెట్టు కౌరవులకు నెగ్గు వుట్టు." భార. అర. 1. 49.
  • "ఎటూ వెడతాం కనక ఆయన్ను కూడా చూచి వెడదాము." వా.

ఎటొచ్చీ

  • ఇంతకూ అనుట వంటి ఊతపదం. మాటా. 29.

ఎట్టిపాటు పఱిచినా

  • ఎన్ని పాట్లు పెట్టినా, ఎంత బాధ పెట్టినా. వాడుకలో ఎన్నిపాట్లు పెట్టినా అనే అలవాటు.
  • "ఎంత పాటుపడ్డా వాడికి కడుపు నిండడమే గగనంగా ఉంది." వా.

ఎట్లు కాదగిన కార్యము లట్లగు

  • అయ్యేదవుతుంది అనుట. యద్భావి తద్భవతి అని సంస్కృతం.
  • "కాంతరొ ! యెట్లు కాదగినకార్యము లట్లగు మున్గళావతీ, కాంతకు మోహనాంగు నుపకాంతుని..." శుక. 1. 239.

ఎట్లు చూడగలను ?

  • ఎలా చూడగలను ?
  • చూడ లే ననుట.
  • "అపత్యంబులదు:ఖం బే నెట్లు సూడ నోపుదు." భార. ఆర. 1. 86..

ఎట్లో ఒక్కచందాన

  • ఏదొ ఒక విధంగా. అయిష్టంతో అనుట.
  • "వీడ్కో జాలక చాల కంత మది యెట్లో యొక్క చందాన వీడ్కొనియెన్." కళా. 7. 97.
  • వాడుకలో:
  • "ఏదో ఒక విధంగా వెళ్ళి పోక తప్పదు." వా.

ఎట్లైన నగు

  • ఏమైనా కానీ. ఎడ____ఎడ 254 ఎడ____ఎడ
  • "...యెట్లైన నయ్యె నే నిచటన యుండెద నని యొక్క తొఱ్ఱలో నడగి యుండె." కళా. 2. 170.
  • "ఏ మయినా కానీ, నేను మాత్రం పోను." వా.

ఎడ కలుగ చను

  • దూరముగా పోవు.
  • "మణికంధరుండు రహస్యశంక నెడ గలుగ జనగ నమ్మహాముని కి ట్లనియె." కళా. 1. 198.

ఎడ కలుగ నిలుచు

  • దూరముగా నిలుచు.
  • "అతని విడిచి యెడ గలుగ నిలిచి, నా పలుకులు విని మాని పలికిన..." కళా. 3. 264.

ఎడగరపడు

  • కష్టపడు.
  • "నీవు డస్సి, యున్న వాడవు నిద్రయును లేక యున్న నీ, వెడగరవడియె దీయడవిలోన." భార. సౌప్తి. 1. 61.

ఎడగా చను

  • దూరంగా పోవు.
  • "అప్పుడు తద్వనలక్ష్మీవిలోకన కౌతుకంబున నెడగా జనియున్న మణికంధరుం బిలిచి..." కళా. 1. 208.

ఎడ తప్పించి

  • ఒకటి విడిచి ఒకటి (గ్రుచ్చు.)
  • "సాంధ్యరశ్మిసూత్రమున బొసంగ గ్రుచ్చి, యెడతప్పున ద్రోచి పిఱుంద జేర్చు." పారి. 2. 43.

ఎడ తాకు

  • బాధపడు.
  • "ఎండలకు నీడలకు నెడ తాకినాడు." తాళ్ళ. సం. 11. 2 భా. 56.

ఎడపడు

  • ఆలస్య మగు. లోపము కలుగు.
  • "ఏ క్రియలందును నెడపడకుండ, నీ క్రియ హయమేధ మీడేరుటయును." రంగ. రా. బాల. పు. 16. 11.

ఎడప దడప

  • అప్పుడప్పుడు.
  • "ఎడప దడప దనూభవుం డెచట నుండు." కాశీ. 4. 85.
  • "మసిబొట్టు బోనాన నసలు కొల్పిన కన్ను, కొడుపుచే దాటించు నెడప దడప." క్రీడాభి. 1. 136.
  • "ఎడపా దడపా వాడు వస్తూ పోతూ ఉంటాడు." వా.
  • రూ. అడపదడప.

ఎడపేర్పు

  • దాళి.
  • నుగ్గులను గుండ్రంగా పేర్చి అందులో నిప్పువేస్తారు. పాలు కాచడానికి, పప్పు ఉడికించడానికి ఉపయోగిస్తారు.
  • "ఒసగి యెడ పేర్పులో గ్రాగుచున్న యావు, పాలు వడ్డించుటయు." పాండు. 4. 174.

ఎడబిడ్డ

  • చంటిబిడ్డకంటే పెద్దబిడ్డ.
  • "ఎడబిడ్డం డొక డైన లేడొ?" క్షేత్రలక్ష్మి. 58.

ఎడమడుగు

  • 1. అరమరిక, సంకోచము.
  • "పొడవున బ్రాయంబున గడుం, గడిదిబలంబునను జూడగా నసదృశు ఎడ____ఎడ 255 ఎడ____ఎడ

నీ, కొడు కని యీతని నెంతయు, నెడమడుగున జూప దెత్తె యిందఱు నగ గాన్." భార. ఆది. 4. 99.

  • 2. భేదము, విలంబము. విరుద్ధము, కుటిలము. ఇడై మడిక్కై - తమిళం. వావిళ్ళ.
  • "ఈ పాలు ద్రావు మెడమడు గేమిటికి?" బసవ. 3. 62. పు
  • "ఏ యెడమడుగు లేని నెచ్చెలి, బొడ గాంచుట చచ్చి మరల బుట్టుట గాదే." భాగ. 10. స్కం. పు. 202.
  • "తోడితెం డెడమడు వేల యింక..." హరి. పూ. 9. 87.
  • "తత్సేవన తాత్పర్యంబు తగ నెవం బడియే ప్రొద్దును నెడమడు గగుమదితో ననుసరింపంగా..." హరి. పూ. 1.83.

ఎడమపిరి వెట్టు

  • అపసవ్యముగా ప్రవర్తించు.
  • "ఎడమపిరి వెట్టె నీమూఢు డెఱుకమాలి." రాధా. 3. 48.
  • చూ. ఎడమపురి వెట్టు.

ఎడమపురి వెట్టు

  • పురి విప్పు, అపసవ్యముగా ప్రవర్తించు.
  • "ఎడమపురి వెట్టె పరహిత వివేకములోన." తాళ్ల. సం. 11. 3. భా. 103.
  • చూ. ఎడమపిరి వెట్టు.

ఎడమ వెట్టు

  • ప్రక్కకు నెట్టు. ఇది నేటికీ దక్షిణాంధ్ర ప్రాంతంలో బాగా వాడుకలో ఉన్నపదం.
  • "సామాను లన్నీ తెచ్చాను అవన్నీ ఎడంగా పట్టు" అంటారు.
  • "కుడువంగ నొల్లక యెడము వెట్టి." హరి. పీఠిక. 14.
  • "విస్తట్లో అన్నీ వడ్డిస్తే అన్నీ ఎడంగా పెడుతున్నా వేమి?" వా.

ఎడమొగం పెడమొగం

  • సరిపడమి.
  • "వారికీ వీరికీ ఎడమొగం పెడమొగంగా ఉన్నది." వా.

ఎడ యెడ మాట లేల

  • ఆమాటలూ యీమాటలూ ఎందుకు? అవన్నీ అప్రస్తుతం అనుట.
  • "ఎడ యెడ మాట లేల ?" కవిక. 4. 146.

ఎడవాయు

  • వేఱుపడు.
  • "ఎడవాయని సఖులతోడ నెందున్నాడో." నిరంకు. 2. 80.

ఎడ సనక

  • దూరము పోక; అతి జాగరూకతతో.
  • "పతివ్రతారత్నము న, న్నెప్పు డెడసనక కంటికి, ఱెప్పవలెం గాచి తిరుగు రేయిం బవలున్." శుక. 1. 389.

ఎడసిపోవు

  • తొలగిపోవు.
  • "బొంకుమాట లెడసిపోయిన గాక శంక యేల మాను." తాళ్ల. సం. 5. 62. ఎడ____ఎడ్లు 256 ఎత్త____ఎత్తి


ఎడ సేయక

  • ఆలస్యము చేయక.
  • "మాయకా డెతెంచి మనలను గల్ల, సేయుచున్నా డెడసేయక వీని దెగటార్పు."
  • గౌ. హరి. ప్రథ. పంక్తి. 1853-55.

ఎడసేయు

  • ఎడబాపు, లోటు కలిగించు.
  • "చిలుకలకొల్కి ! యెవ్వ రెడసేసిరి నీ కిటు లేల చింతిలన్." పారి. 1. 117.

ఎడసొచ్చు

  • దిగు.
  • "దుష్క్రియా, శూరత కిట్టివార లెడ సొచ్చుట గంటిమొ." నిరంకు. 2. 13.

ఎడ పెడా

  • అటూ యిటూ.
  • "వాడు యెడాపెడా నాలుగు వాయించి పంపించాడు." వా.

ఎడ్దకత్తెర నాలుక బెల్ల మగు

  • లోపల యేమున్నా పైకి ప్రియంగా మాట్లాడు. పయోముఖ విషకుంభము లాంటిది.
  • "వికచముఖు డగుచు శాత్రవు, లకు హితు లగునట్టివారలం గని భూపా,లకు డెడ్దకత్తెరయు నా, లుక బెల్లము నై మనంబులుం గనవలయున్." భార. శాంతి. 3. 268.

ఎడ్లు దున్ని గుఱ్ఱముల మేపు

  • ఒకరు బాధపడి మరొకరిని పోషించుపట్ల ఉపయోగిస్తారు. ముఖ్యంగా బాధపడేవారు మంచివా రనీ, ఇతరులు కారనీ సూచన కూడ కలదు. రుద్రమ. 39 పు.

ఎత్తర తత్తర చేయు

  • ఉక్కిరిబిక్కిరి చేయు.
  • "ఎల్ల విటాగ్రగణ్యులను ఎత్తరతత్తర చేసినట్టి..." పాణి. 2. 102.

ఎత్తికోలు

  • ప్రయత్నము, ఆరంభము.
  • "ధాత మదియెత్తికోల్ తుది దాక కున్నె." నైష. 1. 82.
  • దీనికి దగ్గరగా ఉన్నదే ఎత్తుగడ.
  • చూ. ఎత్తుగడ.

ఎత్తిచ్చు

  • ఎదుటివారికి నేర్పు.
  • "ఎల్లవారికిని ఇదె యెత్తిచ్చె ననవు గదా కల్లరితనమున చీకటిలోని సుద్దులు." తాళ్ల. సం. 3. 650.
  • "వాణ్ణి నేను అడుగుతున్నాను. వా డేమీ చెప్పక ముందే నువ్వు ఎత్తిస్తావెందుకు?" వా.

ఎత్తినకాలు దించకుండా

  • నిర్విరామంగా.
  • "కోడి కూసినప్పటినుంచీ ఎత్తినకాలు దించకుండా పని చేస్తూనే ఉన్నాను. ఇంకా తెమల లేదు." వా.

ఎత్తినకే లెత్తినట్లే యుండు

  • ఉన్న దున్నట్లుగానే.
  • "దృఢముష్టిం బూని బల్గత్తి యె,త్తినకే లెత్తిన యట్ల యుండ దివి నుద్వేగంబునం బోవుచున్." కళా. 3. 152. ఎత్తి____ఎత్తి 257 ఎత్తి____ఎత్తు

ఎత్తినకోలగా

  • ఎత్తినబాణం ఎత్తినట్లుగా. వెంటనే.
  • "ఎత్తినకోలగా మదను డేసిన వే చని వచ్చు నర్ధచం,ద్రోత్తరబాణమో యనగ నొప్పెడుపాపటతో." కళా. 7. 126.

ఎత్తినడుగుల నుండు

  • ఎప్పుడెప్పు డని ఆతురతతో ఉండు.
  • కాళ్లెత్తి నిల్చి చూస్తున్నారు అనుటపై వచ్చినది.
  • "గొంతి కోడండ్రు రెల్లను గురువరేణ్య! యెత్తినడుగుల నున్నవారు." భార. ఆశ్ర. 2. 25.

ఎత్తినభీతి

  • భయముతో.
  • "వాసవుం, డెత్తినభీతి బ్రహ్మకడ కేగి ప్రణామము చేసి ఖేదముం, దత్తఱపాటు జెప్పిన." ఉ. హరి. 2. 187.

ఎత్తిపెట్టు

  • దాచిపెట్టు.
  • "ఈ డబ్బు ఎత్తిపెట్టు." వా.

ఎత్తి పొడుచు

  • దెప్పు.
  • "ఈరా లెఱింగిన నెత్తిపొడుచు." భాగ. 10.వూ. 978.
  • "అత్తగా రెప్పుడూ ఏదో ఒకటి ఎత్తి పొడుస్తూ నే ఉంటుంది. వా.

ఎత్తిపోతలు

  • పోషణము.
  • "ఆ ! వాళ్లతల్లి ఉన్నంతవరకూ ఎత్తి పోతల కేం లోపం లేదు." వా.

ఎత్తిపోవు

  • దండెత్తు.
  • "తండ్రిబిడ్డ యన్న దమ్ముడు నాకెత్తి, పోయి పోటు లాడి పుడమి గొండ్రు." భార. భీష్మ. 1. 42.

ఎత్తి వచ్చు

  • దండెత్తి వచ్చు. కుమా. 10. 167.
  • "సరగున దుర్గముల్ సాధింప జనువేళ, వైరిభూభుజు లెత్తివచ్చు వేళ." శుక. 1. 235.
  • "అనికిన్ బలనూదను డెత్తివచ్చినన్, దీలుపడంగ దోలి యిట దెచ్చెద నిచ్చెద బారిజాతమున్." పారి. 1. 135.

.....ఎత్తు

  • ప్రస్తావించు.
  • "ఆ సంగతి నా దగ్గఱ యెత్తవద్దు." వా.
  • "ఇకమీద ఈ సంభాషణ నీ దగ్గఱ ఎత్తితే ఒట్టు !" వా.

ఎత్తు ఎఱుగక

  • చాక చక్యము లేక; తెలివి తక్కు వై. చదరంగముద్వారా వచ్చిన పలుకుబడి. ఒక ఎత్తు వేసినప్పుడు దానికి సరిగా ఎత్తు వేయవలసి ఉంటుంది. ఆ యెత్తు వేయుటకు తెలియక పోయె ననుట.
  • "అవ్విష్ణుశర్మయు నె త్తెఱుంగక యి త్తెఱంగున మాటలాడి నోటికూటికి జేటు దెచ్చుకొంటిని గదా..." శుక. 3. 364. ఎత్తు____ఎత్తు 258 ఎత్తు____ఎత్తు

ఎత్తుక వచ్చు

  • 1. తీసుకొని వచ్చు; 2. లేవ దీసుక వచ్చు; 3. దొంగిలించు.
  • "ఆ ముద్దియకు బుద్ధి జెప్పి యెత్తుకొని వచ్చెదము." ప్రభా. 5. 18.
  • "గిన్నె యెత్తుకొని బొంకుల్ పల్కుచున్." విప్ర. 5. 15.
  • "వా డా పిల్లను యెత్తుకపోయా డట." వా.

ఎత్తుకు పైయెత్తు వేయు

  • యుక్తికి ప్రత్యుక్తి పన్ను.
  • "వీడు కల్లంగడి వానికి పోకుండా పైపాట పాడాడు. వాడేమో యిప్పుడు మద్యపాననిషేధదళంలో చేరి ప్రచారం మొదలుపెట్టాడు. ఎత్తుకు పైయెత్తు వేయడం తప్పితే వాడూ వీడూ యిద్దరూ ఒకటే." వా.

ఎత్తు కెత్తు బంగారముఇచ్చి....

  • అమూల్యము, విలువ గలది. ఆ వస్తువునకు సరిపడినంత తూకము గల బంగారమును ఇచ్చి తీసికొనుట ఆ వస్తువుకున్న అమూల్యతను సూచించును. బంగారానికి ఇం కేపర్యాయపద మైనా చేరవచ్చును.
  • "ఎత్తు కెత్తు మెఱుంగు కుందన మిచ్చి తెచ్చితి మీసిరాజులు." శుక. 1. 222.
  • "ఎత్తుకెత్తు బంగార మిచ్చినా ఈ వస్తు వివ్వను." వా.
  • "ఆ పిల్లకు ఎత్తుకెత్తు బంగార మిచ్చినా తీరదు." వా.
  • "ఆ పనికి ఎత్తుకెత్తు బంగార మీయవచ్చు." వా.

ఎత్తుకొని పోవు

  • లేవదీసికొని పోవు. ఇది యీ నాటికీ రాయలసీమలో వాడుకలో ఉన్న పలుకుబడి.
  • "వాడు ఆ రంగనాయకిని ఎత్తుకొని పోయినా డని ఊరంతా ఒకే అనుకోవడం." వా
  • చూ. ఎత్తుక పోవు.

ఎత్తుకొని తిను

  • అడుక్కొని తిను.
  • "ఉన్నపొలం కాస్తా అమ్ముకొంటే ఎత్తుక తింటావా?" వా.

ఎత్తుకొను

  • పూనుకొను; ఆలోచించు; తలంచు.
  • "కుల మెల్ల జెఱచి నీకును గర్త యైన, యిలపతి బొలియింప నెత్తుకొన్నావు." వర. రా. అయో. పు. 397. పంక్తి. 15.
  • "వాడీమధ్య నా విషయమే బొత్తిగా ఎత్తుకోవడం లేదు." వా.

ఎత్తుగడ

  • ఆరంభము.
  • "ఆ పాట ఎత్తుగడ చాలా బాగా ఉంది గాని రాను రాను తేలిపోయింది." వా.
  • "పద్యం ఎత్తుగడ బాగా ఉంది." వా.

ఎత్తుదెంచు

  • ఎత్తి వచ్చు, దండెత్తి వచ్చు. కుమా. 10. 125. ఎత్తు____ఎత్తు 259 ఎత్తు____ఎత్తు

ఎత్తున కెత్తు

  • సరికి సరి. ఆ వస్తువు ఎంత తూకమో అంతతూకము గల మఱి యొకటి ఇచ్చుటపై వచ్చినది.
  • "ఎత్తున కెత్తు అనఘ మీ కిచ్చెద." బస. 4. 120.

ఎత్తు పెట్టు

  • ప్రోత్సహించు.
  • "విలసిత మోహదాహ పరివేదన పొమ్మని యెత్తుపెట్టగా." హంస. 1. 114.

ఎత్తుఱోళ్లు

  • తిట్టుగా స్త్రీల దూషణలో ప్రయుక్త మైనది. ఎత్తుకొన్న ఱోలులాంటివా రని కావచ్చునేమో!
  • పండితా. ప్రథ. పురా. పుట. 343.

ఎత్తులిడు

  • ప్రోత్సహించు.
  • "...పలుమాఱు వచ్చిర మ్మనుచు మిగుల నెత్తు లిడియెడు నన్ను నా యింతి చూచి." కళా. 2. 170.
  • "ఇరువంక జెలు లెత్తులిడుచు లబ్బింపంగ జిఱు నవ్వులో గొంత సిగ్గు వదలి." కళా. 7. 76.

ఎత్తులు పెట్టు

  • ప్రోత్సహించు.
  • "పొద్దున్నుంచీ ఎత్తులు పెడితే వాడు బయలుదేరాడు." వా.
  • "ఎత్తులు పెట్టి ఎత్తులు పెట్టి వాణ్ణి పంపించాను." వా.

ఎత్తులు వేయు

  • తంత్రాలు పన్ను.
  • "మన ప్రయత్న మంతా భగ్నం చేయాలని వాడు ఎత్తులు వేస్తున్నాడు." వా.

ఎత్తువడు

  • మెత్తబడు; ఎత్తుబడి పోవు అనగా బలహీనపడి పోవు. ఈ క్రింది ప్రయోగంలో శ్లేషలో అర్థాలు రెండూ ఉన్నవి.
  • "తారాచలము వ్రేకదన మెంత వింశతి, బాహునిచే నెత్తువడియె నట్టె." కుమా. 3. 5.
  • "కంటకాగమభీతి గడచె నుద్ధత భూమి, భృత్కటకం బెల్ల నెత్తు వడియె." మను. పీఠిక. 34.
  • "ఆ యెద్దు యెత్తుబడింది." వా.
  • "అతడు నాలుగునాళ్లజ్వరంతో ఎత్తుబడి పోయాడు." వా.

ఎత్తువారిచేతిబిడ్డ

  • ఎవరు కాస్త మంచిమాట మాట్లాడితే వారివైపు ఉండే వాడు.
  • "ఈత డెత్తువారి చేతిబిడ్డ గాని యొక తెన్నున బోవువాడు గాడు. ఇట్టి వాని కొలువు మిక్కిలి కష్టము." నీతిచంద్రిక. మిత్రభేదము.
  • "వాడు ఎత్తువారి చేతిబిడ్డ. ఎక్కడ ఉంటే అక్కడి మాట." వా.

ఎత్తు వేయు

  • ఉపాయము పన్ను.
  • "వాడు స్కూలుకు డబ్బిస్తున్నాడంటే యేదో ఎత్తువేశా డన్నమాటే!" వా. ఎత్తు____ఎద 260 ఎద____ఎది

చదరంగంలో ఎత్తులు వేయడంపై వచ్చినపలుకుబడి. ఎత్తు వోవు

  • ఓదిపోయి పాఱు. కోడిపందెములలో ఈ మాటను ఇప్పటికీ ఉపయోగిస్తారు. 'ఆకోడి ఎత్తు పోయింది.' అలాగే 'కొప్పెత్తు' అను మాట కూడా ఉపయోగిస్తారు.
  • "అవియును నొకటొకటికి నె,త్తు వోవక పెనగిన గని మధుత్రిపురహరుల్." ఉ. హరి. 6. 160.

ఎత్తు సేయు

  • సమాన మగు.
  • "ఇంద్ర నీలపు రంగు నెత్తు సేయ గడంగు." రుక్మాం. 2. 125.

ఎద కొఱవి గొని చూడినట్లు

  • హృదయాన్ని కొఱివితో క్రుచ్చినట్లు. అంత బాధా కరంగా.కుమా.10. 142.

ఎదను పెంచు

  • హృదయ వై శాల్యము కల్పించు. నా. మా. 99.

ఎద నెగ్గు రను

  • మనసు బాధపడు. నెగ్గు రను, దిగ్గు రను, చివుక్కు మను, భగ్గు మను అనునవి ధ్వన్యనుకరణములుగా ఏర్పడినవి.
  • "ఒక మోహనాంగశృం, గారునితోడ దీపకళిక ల్వెలుగన్ నిదురించు చున్న యా,నీరజగంధి జూచి యెద నెగ్గు రనంగడు విస్మితాత్ము డై. శుక. 1. 204.

ఎదబడు

  • భయపడు. రాయలసీమలో ఎక్కువగా వాడుకలో నున్న పలుకుబడి.
  • "వాడిమాటలకు ఎదబడేవాళ్లు ఎవరూ లేరు." వా.
  • చూ. ఎదవడు.

ఎదలో రాయి పడు

  • భయము కలుగు.
  • "పదుగురు గల సభ యన న, ప్డెదలో రాయి పడి..." గుంటూ. ఉత్త. 23.
  • చూ. గుండెలో రాయి పడు.

ఎదవడు

  • భయపడు.
  • "పెదవులు దడవుచు భీతిచే జాల నెదవడి." వర. రా. అర. పు. 112. పంక్తి. 4.
  • చూ. ఎదబడు.

ఎదాన కొట్టుకొను

  • నెత్తిన వేసికొను అనుట వంటిది. నిరసనగా అనుమాట. కొత్త. 97.

ఎదిరి నిన్ను నెఱుగు

  • తనబల మెంతో ఎదుటివారి బల మెంతో తెలియు. ఎదు____ఎదు 261 ఎదు____ఎదు
  • "చిఱుత,వెదిరి నిన్ను మెఱుగవు." కుమా. 6. 10.

ఎదుగూ పొదుగూ

  • జంటపదం.
  • "వా డెంత తిన్నా ఎదుగూ పొదుగూ లేకుండా అలాగే ఉండి పోయాడు." వా.
  • "ఈ వ్యాపారం ఎన్నాళ్లైకైనా ఎదుగూ పొదుగూ లేకుండా అలాగే ఉండి పోయింది."
  • రూ. ఎదుగూ బొదుగూ.

ఎదుగు పొదుగు లేని

  • ఏమాత్రం పెరగని.
  • "ఎదుగూ పొదుగూ లేని ఈ జీతంతో ఎలా సంసారాన్ని నెట్టేదో తెలియడం లేదు." వా.
  • రూ. ఎదుగు బొదుగు లేని.

ఎదురాడు

  • ఎదిరించి మాట్లాడు, ధిక్కరించు.
  • "పెద్దలకు ఎదురాడ రాదు." వా.

ఎదురీత

  • జనాభిప్రాయం ఒకవైపు ఉండగా దానికి భిన్నంగా ప్రవర్తించుట. ప్రవాహం ఎటువైపు పోతుందో అటువైపు పోవడం సులువు. దానికి ఎదురుగా యీదడం కష్టం.
  • "కులభేదాలు మతభేదాలు పోవాలంటున్న రోజుల్లో నీ విలా కులం పేర పార్టీ పెట్టడం వట్టి ఎదురీత నాయనా!" వా.

ఎదురుకట్ల

  • ఎదురుగా.
  • "హిమశైలజాజిని యెదురుకట్లకు బోని." సారం. 3. 108.
  • "తమ యింటి యెదురుకట్ల." వి.పు. 7. 137.
  • నేటికీ ఈమాట యిదే రూపంలో రాయలసీమలో విశేషంగా వినవస్తుంది.
  • "ఇంత పెద్దవా డైనా నా తమ్ముడు నా యెదురుకట్ల నిలబడడు." వా.
  • "అన్న యెదురుకట్ల అతను నిలబడి ఎరగడు." వా.

ఎదురు కెదురు

  • బదులుకు బదులు.
  • "ఎదురు కెదు రేల కోపించె నిందు ధరుడు." భీమ. 4. 12.

ఎదురుకొను

  • మార్కొను.
  • "కావున మన మెదురుకొనం గావలయు." జైమి. 5. 164.

ఎదురుకోలు చేయు

  • ఎదురేగి వెళ్లు.
  • "అతడు నఖండవైభవంబున, దవు దవ్వులన యెదురుకోలు చేసె." కళా. 7. 69.

ఎదురుకోళ్లు

  • పెండ్లిలో ఒకవేపు వారు మరొకవేపు వారికి ఎదురేగి వెళ్లుట.
  • "పెండ్లికొడుకువాళ్ళు వస్తున్నారట. ఎదురుకోళ్ళకు వెళ్ళాలి." వా. ఎదు_____ఎదు 262 ఎదు____ఎదు

ఎదురుచుక్క

  • ప్రతిస్పర్ధి. ఇది జ్యోతిశ్శాస్త్రరీత్యా వచ్చిన పలుకుబడి. చుక్క యెదురుగా నున్నప్పుడు ప్రయాణాదులు చేస్తే అశుభం కలుగుతుం దని ప్రతీతి.
  • "ఎపుడు శాత్రవకోటి కెదురుచు క్క గుచు." రం. రా. బాల. పు. 9. పం. 15.
  • "ఏదులకు మిత్తి లేళ్ళకు నెదురు చుక్క." శుక. 2. 283.
  • "ఎదురింటివారం కెదురుచుక్క." శుక. 3. 20.
  • "వాడికి వీడికి చుక్కెదురు." వా.
  • రూ. చుక్కెదురు.

ఎదురు చూచు

  • 1. నిరీక్షించు.
  • "నీ రాక కెదురుచూచు, నయనములు వేయి విరియించి నాకభర్త." శృం. నైష. 4. 64.
  • 2. ముఖాముఖి చూచు. అంటే అంతకు తక్కువవాడు కా డనుట.
  • "కమనీయ రూపరేఖావిలాసస్ఫూర్తి, నేభర్త శ్రీభర్త నెదురుచూచు." ఆనంద. పీఠి. 46.
  • చూ. ఎదురులు చూచు.

ఎదురు తిరుగు

  • ధిక్కరించు.
  • "తండ్రికే ఎదురు తిరిగి మాట్లాడేవాడు మనమాట వింటాడా!" వా.

ఎదురు తెన్నులు చూచు

  • నిరీక్షించు.
  • "ఆయనకోసం ఎదురు తెన్నులు చూడ్డంతో సరిపోతున్నది." వా.

ఎదురుత్తర మిచ్చు

  • బదులు చెప్పు.
  • "ఉత్తమనాథు డీత డెదురుత్తర మీ డొకనా డదే మకో." కా. మా. 3. 44.

ఎదురుత్రోవాలు చూచు

  • నిరీక్షించు.
  • "ఇంద్రద,త్తున కభిలాషతో నెదురు త్రోవలు చూచుచు." భోజ. 3. 255.

ఎదురు నడచు

  • ఎదురేగు. గౌరవసూచకంగా కూడా.
  • "ఇవ్విధంబున బ్రాగ్జ్యోతిషపతి యా యంగపతికి నెదురునడిచి యుద్ధ సన్నాహంబు చెన్నుమీఱ." కళా. 8. 120.

ఎదురుపడు

  • ఎదు రగు; ప్రతిఘటించు.
  • "జార శేఖరు డా వెలదికి నెదురు పడియె." హంస. 2. 117.
  • "వారికి, నరనందను డెదుర్పడి గుణ ధ్వని సెలగన్." భార. భీష్మ. 2. 313.

ఎదురు బదురుగా

  • ముఖాముఖిగా.
  • "వారిద్దరూ ఎదురు బదురుగా కూర్చోడం తప్పితే చేసే దే ముంది?" వా.

ఎదురులు చూచు

  • నిరీక్షించు. ఎదు____ఎదు 263 ఎదు____ఎదు
  • "కన్నులు చల్లగా గందుమో యనుచు నెదురులు చూచుచు నుండంగ." వర. రా. అయో. పు. 250. పంక్తి. 16.

ఎదురులేదు

  • అడ్డము లేదు. సాటి లేదు, ప్రతి లేదు.
  • "మహాంధ్రకవితావిద్యాబలప్రౌఢి నీ, కెదు రేరి." పాండు. 1. 27.
  • "వాడిమాటకు ఆ వూళ్ళో ఎదురు లేదు." వా.

ఎదురు వెట్టు

  • పెట్టవలసినవారికి కాక ఇతరులకు పెట్టు; తాను పొందవలసి ఉండగా వారికే తాను పెట్టు.
  • 'ఆ పిల్ల (కొత్తకోడలు) ఇంట్లో దంతా ఎదురు పెడ్తా ఉంది' అని అత్త ఆడబడుచులలాంటి వా రంటారు.
  • "ఎల్లసొమ్ములు జారుల కెదురు వెట్ట, సాగె నిచ్ఛావిహారనిశ్చలత మీఱ." శుక. 3. 350/
  • "ఇటుల నజ్జారశేఖరు డేల బట్టి యింటిలో నున్నవస్తువు లెదురువెట్టి." హంస. 2. 112.
  • "ఆ వ్యాపారంలో దిగాను. నేనే పది వేలు ఎదురుపెట్టవలసి వచ్చింది." వా.

ఎదురు వెట్టి చదరంగ మాడు

  • ఎదుటువానికి కూడా తానే డబ్బిచ్చి వానితో జూదమాడు.
  • కొవ్వెక్కి గాడిదలతో తన్నించుకొనుట వంటిది.
  • "ఎదురువెట్టి వేడ్క జదరంగ మాడెడు, పగిది నీకు గల్గు పడుపు గూటి, సొ మ్మొసంగి చేర రమ్మన్న గైకొను, నట్టివాడు ముద్దుపట్టి! విషము." చంద్రరేఖా. 2. 61.

ఎదురు వేలములు

  • భీమ. 4. 47.

ఎదురెక్కు

  • ఎదురుగా నేగు. ఆము. 1. 5.

ఎదురెదుర అను

  • ముఖాముఖి అను. వాడుకలో 'మొగా న్నే ఏ మంటాం?', అన్న రూపంలో ఉంటుంది.
  • "ఏ మెదు రెదుర మి మ్మేమందు మయ్య." బస. 7. 182.
  • "ఎదురుగా ఏ మంటాం చెప్పండి?" వా.
  • "వెనుక ఎన్ని అనుకున్నా ఎదురుగా ఏ మంటారు?" వా.

ఎదురెదురుగా

  • ఎదురుబదురుగా.
  • "ఎదురెదుర నిచ్చు పువ్వుదోయిలియు బోలె." కవిక. 4. 771.

ఎదురొడ్డు

  • 1. మార్కొను.
  • "విడిసె బతి సేన కెదురొడ్డి విమత సేన." కవిక. 2. 147.
  • 2. కాచుకొనుటకు ఎదురు దెబ్బ తీయు.
  • "అత డెదురొడ్డినట్టి శూలాయుధమును, హరియురము గాడి యారౌతు శిరము పైకి..." కళా. 8. 99. ఎదు____ఎద్దీ 264 ఎద్దీ____ఎద్దు

ఎదురొమ్ముకుంపటి

  • "పతి కెదురొమ్ముకుంపటిగ బాల్పడ కుండనిలక్ష్మి." శ్రినివా. 174.
  • చూ. రొమ్ముకుంపటి.

ఎదురొమ్ములో ములుకఱ్ఱ పొడిచినట్లు

  • కటువుగా, బాధకరంగా.

ఎదుర్కొను

  • ఎదురేగు.
  • "ఎదుర్కొనె నీహారగిరీశ్వరుండు." హర. 4. 98.

ఎదుర్కోలు చేయు

  • ఎదు రేతెంచు; గౌరవించు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు వారి కెదురేగుట గౌరవసూచకము. దానినిబట్టి యేర్పడిన పలుకుబడి.
  • "తనచక్రమునకు నాతని దివ్య తేజంబు గురుభావమున నెదుర్కోలు సేయ...." కళా. 2. 140.

ఎద్దీనిం దంటే గాటిలో కట్టివేయ మన్నట్లు

  • అనాలోచితంగా. 'మంచీ చెడ్డా గమనించే ఓపిక యెక్కడిది వాడికి? తన సలహాదార్లు చెప్పితే చాలు - ఎద్దు యీనిం దంటే గాటిలో కట్టి వేయమంటాడు.' ఎద్దు ఈనడం అసంభవం అన్న ప్రశ్నే అతనికి తోచలే దనుట.
  • "అది న్యాయ్య మిది న్యాయ్య మని చూడ కెద్దీ నె, నన గాట గట్టు మంచాడు మనిరొ."
  • త్రిశంకుస్వర్గము. అంక. 2. పే. 15.

ఎద్దీనె ననిన గొంది గట్టుమటన్న చందము

  • అవునా కాదా అని విచారించక చెప్పగానే తలఊచు పట్ల ఉపయోగించేసామ్యం.
  • "ఎందైన నిటువంటి వెద్దీనె ననిన గొందిన గట్టు మటన్న చందములు తగునె."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 145.
  • వాడుకలో:
  • "ఎద్దీనిం దంటే గాట్లో కట్టివెయ్య మన్నట్లుంది నీ వనేమాట." వా.

ఎద్దు తన్నే నని గుఱ్ఱము చాటున కేగు

  • ఒకబాధను తప్పించుకొనుటకై అంతకంటె పెద్దబాధకు తల యొగ్గు.
  • తాళ్ల. సం. 11. 3 భా. 74.

ఎద్దునకు అటుకుల రుచి యేమిటి?

  • 'గాడిద కేమి తెలుసు గంద వొడివాసన' వంటిది.
  • వెంకటేశ. 74.

ఎద్దు పట్టిన సివము

  • గంతులు వేయించునది. తాళ్ల. సం. 11. 3 భా. 26. ఎద్దు____ఎద్దు 265 ఎన____ఎను

ఎద్దుమీద వాన కురిసినట్టు

  • ఏమీ పట్టించుకొనకుండా.
  • "వాడు ఎన్ని అంటే నేమి ? ఎద్దుమీద వాన కురిసినట్టుగా ఉంటాడు." వా.

ఎద్దుమొద్దు

  • ఒక తిట్టు. చదువు సాము రాని వారిని వట్టి బలం మాత్రం ఉన్న వారిని అంటారు.
  • "ముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దు మొద్దు." శుక. 3. 21.
  • చూ. ఎద్దు మొద్దుస్వరూపం.

ఎద్దుమొద్దుస్వరూపం

  • స్తబ్ధు, జడుడు అనుట.
  • "ఎద్దుమొద్దు స్వరూపాయ ఎనుపోతాయ నమోనమ:." చాటువు.
  • "వాడు ఒట్టి ఎద్దుమొద్దు స్వరూపం. వాణ్ణి కట్టుకొని మనం ఏం చేస్తాము." వా.

ఎద్దులు బండ్లు నేక మైన కొండ మీదికి పోవును

  • ఎద్దూ బండీ ఏక మైతే కొండ మీదికి పోగలవు. కలిసి పనిచేస్తే ఎంత అసాధ్య కార్య మైనా సాధింప వచ్చును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "...యెందు నెద్దులు బండియు నేకమైన, గొండమీదికి బోవు నోకొమ్మ యనుచు." కళా. 3. 71.

ఎనవచ్చు

  • సాటి యగు. కాశీ. 5. 283.

ఎనిమిదివయట్టపు పారాయణము

  • బూతులు తిట్టుట. తె.జా.

ఎనిమిదో అఠ్ఠం

  • తిట్టు.
  • వేదాలలోని భాగాలను అఠ్ఠాలు, అష్టకాలు అంటారు. ఎనిమిదో అఠ్ఠం బూతుల పురాణం వంటిది.
  • "వాడికి దక్షిణ సరిగా ముట్టక పోయే సరికి ఎనిమిదోఅట్ఠం ఆరంభించాడు." వా.

ఎనిమిదో అఠ్ఠం పారాయణ చేయు

  • తిట్ల కారంభించు.

ఎనుపోతుపై వాన

  • సోమరి.
  • దున్న పోతుమీద వాన కురిసినా అది లెక్క చేయదు, కదలదు. అలాటివా డనుట.
  • "బూమి తుంటరి యెనుపోతుపై వాన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1496.

ఎనుమునకు గీతము

  • వ్యర్థము. అయోగ్యునిదగ్గఱ పాండిత్య ప్రదర్శనము. వ్యర్థ మనుట. శరభాంక. 3. ఎన్న____ఎన్ని 266 ఎన్ని____ఎన్ని

ఎన్నడు లేనిది

  • అలవాటు లేనిది; అరుదుగా.
  • "ఎన్నడు లేని యింతకోపపు బలుకిది యేమి పడతి యనుచు...." కళా. 5. 58.
  • "వాడు ఎన్నడూ లేనిది ఈ రోజు మాయింటికి వచ్చాడు." వా.
  • "అతడు ఎన్నడూ లేనిది తన భార్యమీద కోప్పడ్డాడు." వా.

ఎన్నరాని

  • ఎక్కు వైన.
  • "ఎన్న రానీప్రేమ వానిచక్కదన మే నేల? కనుగొంటినే." హేమా. పు. 35.

ఎన్నాళ్లకో సెల్వుగా

  • చాలనాళ్ళకుగా - ఈ రోజు.
  • "గొనబుతో నెన్నాళ్లకో సెల్వుగా నేటి, కైన నిన్నెనయ నా కబ్బె ననుచు." హంస. 2. 169.
  • వాడుకలో ఇది నెల్లూరు చిత్తూరు ప్రాంతాలలో ఈ నాటికీ వినవస్తుంది.
  • "వాడు ఈ ఊరికి వచ్చి నెల నాళ్లయింది. ఇన్నాళ్లకు సెలవుగా ఈ రోజు కన్పించాడు." వా.

ఎన్నిక కెక్కు

  • ప్రసిద్ధి చెందు.
  • "చక్రదాసు డన నెన్నిక కెక్కిన పేరు గల్గి..." హంస. 5. 8.

ఎన్నిక మీఱు

  • ప్రసిద్ధి కెక్కు.
  • "బంధుకోటిలో నెన్నిక మీఱుచుం బెరిగె." రుక్మాం. 1. 148.

ఎన్నికొను

  • పేర్కొను.
  • "వీనిజాడ లీజటివరు లెల్ల నెన్ని కొనంగ, వినియుందు." వర. రా. అర. పు. 148. పంక్తి. 11.

ఎన్ని గుండెలు !

  • "నాతి యిట్లు వేడు న న్నాదరింపక, పోవు నిన్ను నింక బురుషు డొక్కం, డెవడు నే దలంక నేరికి నెన్నిగుం, డియలు గలవు నాదుప్రియను జేర." కళ. వూ. 6. 38.
  • "వా డలా రాశా డంటే ఎన్ని గుండెలు?" వా.
  • చూ. ఎన్ని గుండె లున్నవి?
  • చూ. ఎన్ని తలలు?

ఎన్ని గుండె లున్నవి ?

  • అంత ధైర్య మెక్కడిది ? అంత ధైర్య మున్నదా అను పట్టుల ఉపయోగించే పలుకుబడి.
  • "అంత పండితుణ్ణి పట్టుకొని తప్పు పట్టడానికి వాడికి ఎన్నిగుండె లున్నాయి?" వా.
  • "నన్ను తిట్టడానికి వాని కెన్ని గుండెలున్నవి?" వా.
  • చూ. ఎన్నెదల్ గల్గె?

ఎన్ని చాళ్ల పట్టు ?

  • ఎంతదూరము. పొలాన్ని కొలిచేటప్పుడు రైతులు మామూలుగా ఎన్ని చాళ్లు పడేస్థలమో దానినిబట్టి లెక్క వేయడం అలవాటు. ఒక కాడియెద్దులు దున్నుటకు ఎన్ని____ఎన్ని 267 ఎన్నె___ఎర

వీలయినభూమి కూడా ఒక ప్రమాణంగా తీసుకోవడం అలవాటు.

  • ఇలాగే పగ్గముపట్టు. ఒక పగ్గం పొడువుగా ఉన్న నేలను పగ్గముపట్టు అంటారు. పాండు. 278.

ఎన్ని తలలు ?

  • ఎన్ని గుండెలు ?
  • అంత ధైర్యమా ? అంతకు సమర్థుడా అనుట.
  • "అకట! యీప్రాణి యనిదితాత్మకుడు గాన, దైవికమున మహావిపత్ప్రాప్తు డయ్యె, ననుచు దయ చేయవలయు నిట్లైన వారి, యెదుట నిలువంగ గ్రోధుని కెన్నితలలు ?" ప్రబోధ. 4. 27.
  • చూ. ఎన్ని గుండెలు/

ఎన్ని యెదలు కలవు ?

  • ఎంత ధైర్యం ? ఎన్ని గుండెలు ? అని నేటి వాడుక. అంత ధైర్య ముందా వానికి అనిభావం.
  • "అంగభవుడు నిన్ నిచ్చ నెఱిగి, యెఱిగి పైనెత్తి రానెన్ని యెదలు గలవు." కుమా. 9. 42.
  • చూ. ఎన్నిగుండెలు?

ఎన్నియేని

  • ఎన్నైనా, చాలా అధికముగా. భీమ. 1. 31.

ఎన్నెదల్ గల్గె

  • ఎన్నిగుండె లున్నవి అని నేటి వాడుక. ఎంత ధైర్యం ? అంత ధైర్యం ఉన్నదా ? అనుట.
  • "కన్నంతటను జూడ గా దనుతపసి, కెన్నెదల్ గల్గె నీకిటు గుడ్వ బెట్ట." బస. 6. 164 పు.
  • చూ. ఎన్ని గుండె లున్నవి ?

ఎప్పు డెప్పు డని యెదురు చూచు

  • ఆతురతతో ఎదురుచూచు.
  • "ఎప్పు డెప్పు డటంచు నెదురు చూచుచు మది, గలగు చుండెడు నుషాకన్య జేరి." ఉషా. 2. 58.

ఎమ్ములు చిల్లులు వోవ నాడు

  • మర్మభేద మైన మాటలాడు.
  • "ఎమ్ములు చిల్లులు వోవ నాడినన్." సారం. 3. 67.

ఎమ్ములు సిన్న మగు

  • ఎముకలు నుసి యగు.
  • "ఏడ్చు నమ్మ యెమ్ములు సున్న మయ్యె నేడు." వ్యస. నాట. 33.

ఎమ్మె లుపచరించు

  • వేషములువేయు, వగలుపోవు.
  • "మా, చెలి యిదె పుష్పదామకముచే నిను గట్టగ గంటి మింక నె, మ్మెలు పచరింప రా దనుచు." పారి. 5. 81.

ఎరలేని గాలము

  • పైకి ప్రమాదమని తెలియ నీయకుండా ప్రమాదము చేయునది. రామలిం. 31. ఎర_____ఎర్ర 268 ఎఱ_____ఎఱ్ఱ

ఎరవు చేయు

  • ఉపేక్షించు.
  • ఇంద్రనందను కేళి నెరవుచేసి." రుక్మాం. 3. 182.
  • "ఏను మూ చెలి నిం తేల యెరవు సేయ." శకుం. 2. 75.
  • వేఱు చేయు, పరాయిదానిగా భావించు. 'ఎరవలి సొత్తు' 'ఎరవలి తెచ్చుకొను' ల లోనూ ఉన్న ఎరవు పరశబ్ద ప్రతీకం కావచ్చును.
  • "నెఱి లేక నీతోడి నీడ యై గెడగూడి పరగిన నన్నింత యెరవు సేసి." కుమా. 5. 123.

ఎరవు లిచ్చు

  • ప్రతిఫలాపేక్ష లేక యితరులకు బదులుగా నిచ్చు.
  • "ప్రాణుల కెల్లను ఎరవు లిచ్చిన చేతులు..." తాళ్ల. సం. 5. 108.
  • "ఎరవలిసొమ్ము బరువులచేటు." సా.

ఎరసంజె

  • సంధ్యారాగము. క్రీడా. పు. 89.

ఎరువు చల్లు

  • పొలమునకు ఎరువు వేయు.
  • "ఎరువు జల్లెడు వేళ నెరువు జల్లు..." కళా. 4. 79.

ఎర్రని యేగాని లేదు

  • దమ్మిడీ లేదు.
  • "వాడి చేతిలో ఎర్రని యేగాని లేదు. వా డేం వ్యాపారం చేస్తాడు?" వా.

ఎఱయ గట్టు

  • విఱుగగట్టు.
  • "ఎట్టుకొనిపోయెదరు విప్రు నెఱయగట్టి." శివ. 4. 61.

ఎఱిగినవి నాల్గు నొడువు

  • తెలిసిన యే కొంతో చెప్పు. నేటికీ యిది వాడుకలో 'ఏవో తెలిసిన నాలుగు మాటలూ చెప్తాను' అనేరకంగా వినవస్తూనే ఉంటుంది.
  • "ఎఱిగినవి నాల్గు నొడువ నే మయిన లెస్స." ఆము. 4. 68.

ఎఱిగి యెఱిగి

  • తెలిసి తెలిసి - నొక్కి చెప్పుటలో పునరావృత్తి.
  • "శివు బరమాత్ము నెఱిగి యెఱిగి, దూషింప నీకు నో రెట్టు లాడె." కుమా. 2. 29.

తెలిసి తెలిసీ వాడు అక్కడికి పోయాడు. అవమానపడ్డాడు."

  • చూ. చేసి చేసి.

ఎఱుగనయ్యెద

  • ఎఱుగను.
  • "అకట ! యదేమియో యెఱుగ నయ్యెద." పారి. 1. 73.

ఎఱ్ఱగా బుఱ్ఱగా ఉండు

  • కాస్త అందంగా ఉండు.
  • "ఆ అబ్బాయి కాస్త ఎఱ్ఱగా బుఱ్ఱగా ఉంటాడు." వా.

ఎఱ్ఱలు ద్రోలు

  • ఎఱ్ఱవారు. ఎఱ్ఱ____ఎలు 269 ఎలు____ఎలు
  • "మో మెఱ్ఱలు ద్రోలి నిప్పుము ద్దెనది." నాయకు. 110 పు.

ఎఱ్ఱవాఱు

  • ఎఱ్ఱబారు
  • "ఎఱ్ఱవాఱి ఘూర్ణిల్లుచు మిన్ను ముట్టి మరల్లోలంబు లగునుల్లోలంబులును." విప్ర. 2. 14.

ఎలగోలు

  • "ఎలగోలు ప్రజలను హెచ్చువంటర్ల." పల.పు. 28.

ఎలయించుకొని పోవు

  • మఱిపించుకొని కొనిపోవు.
  • "వెంట వెంట వచ్చు నెలయించుకొని పొమ్ము వానికడకు..." కళా. 6. 59.

ఎలుగిచ్చు

  • పలుకు.
  • "అ,య్యా యని పిలిచిననంబికి, నోయని యెలు గీనె తొల్లి యుర గాభరణా!" శివతత్త్వ. 112.

ఎలుగు లిచ్చు

  • పిలుచు.
  • "తెచ్చి యిచ్చుబలియు దెచ్చి యీగ నొల్ల కెఱుగులిచ్చుచున్న వారు." భార. ఆది. 6. 290.
  • చూ. ఎలుగిచ్చు.

ఎలుగు సేయు

  • అఱచు.
  • "బాణహతి నెలుగు సేసిన..." భాస్క. అయో.330.

ఎలుగెత్తి

  • గొంతెత్తి.
  • "ఇవి దైత్యులమాయలు గాని బొంకు బొంకని యెలుగెత్తి చెప్పగ భయంబున నమ్మకఒపోయె." భార. భీష్మ. 3. 135.
  • "వాడు ఎలుగెత్తి పిలిచినా పలుక లేదు." వా.

ఎలుగెత్తి యేడ్చు

  • గొంతెత్తి యేడ్చు.
  • "ఎలుగెత్తి యేడ్చు దనకు దొలు, సమరత నిక్క మైన దురపిల్లు." ఉ. హరి. 5. 85.

ఎలుక మీద పిల్లి పిల్లి మీద ఎలుక వేయు

  • టాలాటోలీ చేయు.
  • "వా డేదో ఎలుకమీద పిల్లి, పిల్లిమీద ఎలుకా వేసి బతుకుతూ ఉంటాడు." వా.

ఎలుకల కోర్వలేక యింటికి చిచ్చు పెట్టినట్లు

  • చిన్న బాధను తొలగించుటకై పెద్దనష్టము తెచ్చుకొను. మానినీ. 39.

ఎలుకల నడిచినట్లు

  • యథేచ్ఛగా. గొడ్డును బాదినట్లు, కుక్కలను కొట్టినట్లు అను నేటి వాడుక ఈ అర్థం లోనిదే.
  • "తలర సాధులను సద స్యుల మునుల, నెలుకల నడచిన పొలుపున నడవ." పండితా. ప్రథ. వాద. పుట.693.

ఎలుకవేట కుఱమతిండి యేల ?

  • ఎలుకను వేటాడుటకు కుక్క కావాలా ? అల్ప మైనపనికి ఎలు____ఎల్ల 270 ఎల్ల____ఎల్లి

పెద్దప్రయత్న మెందుకు ? అనుటలో ఉపయోగించే పలుకుబడి. కుమా. 2. 60.

  • చూ. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.

ఎలుగించు

  • పిలుచు.
  • "ఉచ్చుచ్చురే శంకరోచ్ఛిష్టభోగి... అని యిటు లెలు గించునమ్మాత్ర లోన." బస. 7. 183.

ఎలుగుబంటి క్షవరం

  • తెగనిది, అసాధ్య మైనది. ఎలుగుబంటికి ఒళ్లంతా వెండ్రుకలే కనక ఎక్కడని క్షవరం చేయడం సాధ్యం? దానిపై వచ్చినపలుకుబడి
  • "ఇదంతా తప్పులతడక. దీనిలో సవరణలు ఎలా సాధ్యం/ ఎలుగుబంటి క్షవరంగా తయా రవుతుంది." వా.

ఎలుగుబంటి తంటసంపని

  • అసాధ్యము. ఎలుగుబంటిమీద ఉన్న వన్నీ వెంట్రుకలే కనుక తంటసంతో ఒక్కొక్క వెంట్రుక లాగివేయడం అసాధ్యం. అందుపై వచ్చినపలుకుబడి.
  • చూ. ఎలుగుబంటి క్షవరం.

ఎల్ల

  • ఏడుగడ. సీమాంతం. అంత కంటెగొప్పది, ఆవల లేదనుట.
  • "ఎల్ల పర్వతముల కెల్ల తీర్థముల కెల్ల యై." పండితా. ద్వితీ. పర్వ. పుట. 250.

ఎల్లచోట తామ యగుచు

  • అన్ని చోట్ల తామే అయి. అంతట తిరుగుచు అనుట.
  • "చూపుదనుక నెల్లచోట దోటయందు దామ యగుచు." పారి. 3. 51.

ఎల్లనాడు నేనాడు

  • ఎల్లప్పుడు. నొక్కి చెప్పుటకై రెండు రకాలా చెప్పడం.
  • "నాడు నే డన కెల్లనాడు నేనాడు." పండిత. ద్వితీ. పర్వ. పు. 236
  • చూ. నాడు నేడనక.

ఎల్ల వెంటల

  • అన్ని విధాల.
  • "ఎల్లవెంటలం జెడితిమి." హర. 3. 15.

ఎల్లి ద మగు

  • చులకన అగు.
  • "నీ కింతభయంబు లే కడుగ నెల్లిద మైతిమె మాట లేటికిన్." మను. 2. 41.

ఎల్లిదము చేయు

  • చులుకన చేయు.
  • "దాని కే నిపుడు ప్రేమం బంపినన్ దీని నెల్లిదముం జేసినజాడ దోచు నొకొ." పారి. 1. 54.

ఎల్లి నేటను

  • ఇటీవల, ఇంతలో, ఈ రోజులలో.
  • ఇది తెలంగాణాలో 'ఇయ్యాల రేపు' (ఈ వేళ, రేపు) అనే ఎల్లి___ఎల్లు 271 ఎవ____ఎవ్వ

రూపంలో రోజూ వినబడే మాట.

  • రాయలసీమలో దాదాపు ఇదే అర్థంలో 'రేప టెల్లుండిలో అతను రావాలి మరి' అని తఱుచు వాడుక.
  • "ఎల్లి నేటన భవదగ్రవీధికి గడారటుం డిటు వచ్చు." పాండు. 4. 61.
  • చూ. నే డెల్లి.
  • "ఇయ్యాల రేపు హైదరాబాదులో తెలుగు మాట్లాడడం ఎక్కు వయింది." వా.

ఎల్లి నేటిలో

  • త్వరలో.
  • "నిర్ణయ మా నృపాలునకు నీకును సంగతి యెల్లి నేటిలో." నైష. 2. 59.
  • చూ. నే డెల్లి.
  • వాడుకలో ఇదే అర్థంలో ఇలా వాడుతారు. "వాడు ఉత్తరం రాశాడు. ఈవాళ రేపట్లో రావాలి మఱి.

ఎల్లప్రద్దు చనునే యాలంబునం దొట్టులన్

  • వట్టిమాటలతో కుదరదు. యుద్ధంలో ఎంత సేపూ ఒట్లు వేసుకోవడంతో బీరాలు నఱకడంతో సరిపోతుందా? సరిపో దనుట. కుమా. 8. 139.

ఎల్లుండి ప్రొద్దున ఏకాదశినాడు

  • అనిర్దిష్టదినమును పేర్కొను నప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • "ఎల్లుండి పొద్దున ఏకాదశినాడు వాడు మాయింటికి వస్తాడు." వా.

ఎవడు పట్టితే వాడు

  • ప్రతివాడు.
  • "ఈ పనిని ఎవడు పడితే వాడు చేస్తాడు." వా.

ఎవరికి వారే యమునాతీరేగా

  • ఒకరి కొకరికి సంబంధము లేకుండా.
  • "వాళ్లింట్లో అంతమంది ఉన్నా ఎవరికి వారే యమునాతీరేగా ఉంటారు." వా.

ఎవరి ముక్కులో పెడదా మని?

  • ఎవరికీ చాల దనుట.
  • "ఇంట్లో పదిమంది ఉంటే అరవీశె వంకాయలు తెచ్చారే. ఎవరిముక్కులో పెడదా మని." వా.

ఎవరు తిన్నట్టు?

  • దీనివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అనుపట్ల ఉపయోగిస్తారు/
  • "ఆ కాస్త గడ్డకోసం కోర్టులకు వేలు గుమ్మరించడం ఎందుకో? ఎవరు తిన్నట్టు?" వా.

ఎవ్వరి కెవ్వరు? దేని కేది?

  • నీకూ నాకూ సంబంధం లేదు. నీ వెవరో నే నెవరో అనుట.
  • "ఏ, నెవ్వతె నీ వెవండ విక నెవ్వరి కెవ్వరు దేని కేది." రాధి. 4. 69.

ఎవ్వరు దిక్కు?

  • సహాయము ఎవారూ లే రనుట. ఎవ్వ_____ఏండ్లు 272 ఏండ్లు____ఏక
  • "నా కెవ్వ రిక దిక్కు నలినాయతాక్షి." ద్విప. కల్యా. 138.

ఎవ్వరు ముట్టని ఎముక

  • నిరుపయోగ మయిన దనుట.
  • విశ్వనాథ. శత. 13.

ఎసక మెసగు

  • ఒప్పు.*"వేంకటేశునగరు దా జేరి యిం పెసక మెసగ." కళా. 2. 130.

ఎసపోయు

  • రెచ్చగొట్టు.
  • "రాఘవాభీలకోపాగ్ని నెసపోయు పవనుని యెన్నిక." వర. రా. కిష్కిం. పు. 417. పంక్తి 13.

ఎసరుపెట్టు

  • ఎవరినష్టానికో ఎత్తులు వేయు.
  • "మామగారికి అప్పుడే అల్లుడు ఎసరు పెట్టాడు." వా.

ఎసరెత్తు

  • ఎసరువెట్టు.
  • "కొసరుచు నాతో గూటమి సేసే, యెస రెత్తకుమీ యింకాను." తాళ్ల. సం. 12. 276.
  • చూ. ఎసరు పెట్టు.

ఎస రెత్తుకొను

  • ఎసరు వెట్టు.
  • "ఎసరెత్తుక వెళ్లే వని తోలక, పస దన విధి గలపాటే సుఖము." తాళ్ల. సం. 9. 256.

ఏండ్లు పూండ్లు

  • చాలా కాలం అనుట. జం.
  • "...ఎఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టు...." మను. 1. 73.
  • "భోగింపగ సీమ కేండ్లపూండ్లకు జాలున్." పాంచా. 4.
  • "నావుడు ముట్టిన జగడం, బీ వేళ నె తీర్ప వేని యేండ్లం బూండ్లన్, నీ వేమి తీర్చె దనుటయు." జైమి. 4. 68.

ఏండ్లు పూండ్లు పట్టు

  • చాల కాలము పట్టు.
  • చూ. ఏండ్లు పూండ్లు.

ఏం డ్లెగసన బుద్ది దిగసన

  • ఏం డ్లొ చ్చే కొద్దీ తెలివి తక్కు వవుతున్నది అనుట. సింహా. నార. 19.

ఏ అంగూ లేదు

  • ఏ సహాయమూ లేదు.
  • "వాడికి ఏ అంగూ లేదు. వాడికి పిల్ల నిచ్చి ఏం ప్రయోజనం?" వా.

ఏకట దీరు

  • తృప్తి తీరు.
  • "వేకపు దలపుల వేంకటేశ! నీ యేకట దీఱద యింకాను." తాళ్ల. సణ్, 12. 276.

ఏకతాళ ప్రమాణము

  • ఒక తాడి యెత్తు. ఎత్తును, లోతును కొలిచేటప్పుడు మనుష్యప్రమాణములతో నిలువు లన్నట్లే తాటిచెట్లతో కూడా లెక్కపెట్టి చెప్పుట అలవాటు.