పదబంధ పారిజాతము/అరుగుదెంచు

వికీసోర్స్ నుండి

అరికాలి నవ్వ

  • ప్రయాణేచ్ఛ.
  • ప్రయాణసూచక మగు శకున శాస్త్రప్రవచనము రీత్యా వచ్చినపలుకుబడి.
  • "వాడి కెప్పుడూ అరికాలిలో నవ్వ పెడుతూ ఉంటుంది." వా.

అరిగాపు

  • సామంతరాజు.

అరిగొలుపు

  • ఎక్కిడు, ఎక్కు పెట్టు.
  • "అ మ్మరి గొలిపె మరుడు." కుమా. 5. 36.

అరిగోలు

  • పడవ.

అరిగోరు వెట్టు

  • భాగము పెట్టు.
  • "అట్టె కర్మములకు నరిగోరు వెట్టేము." తాళ్ల. సం. 9. 198.

అరిపడు/

  • అడ్డపడు.
  • "మాకు నిప్పు డరిపడ్డదురాత్ముల.." భాగ. 3. 528.

అరిబోయు

  • ఎక్కు పెట్టు.
  • "ఘనశస్త్రం బరి బోసి యార్చి." జైమి. 5. 13.

అరివెట్టు

  • కప్పము కట్టు.
  • "మన కరివెట్టనిమహిపుడు లేడు." ద్వి. జగ. పు. 202.

అరిషడ్వర్గాలు.

  • కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు.
  • "అరిషడ్వర్గాలు జయిస్తేగానీ యోగి కాలేడు." వా.

అరుగుదెంచు

  • వచ్చు.
  • "స్థితి దప్పి యరుగుదెంచిన భూవిభుని." రుక్మాం. 2. 106.
  • "అల సమృదులాంగకంబు నై యరుగు దెంచు, నన్ని జపరిగ్రహము..." పాండు. 1. 129.
  • "అయోధ్యకు నరుగుదెంచుటయు."
  • రంగ. రా. బాల. పు. 8. పంక్తి. 18.

అరుంధతి

  • పతివ్రత.
  • అరుంధతి మహాపతివ్రత అని ప్రసిద్ధి. అందుపై వచ్చిన మాట.
  • "యామినీకాంతముఖీ! యరుంధతివి కానక నీపయి గానిపోని యీ వింత ఘటించినట్టి..."
  • శుక. 4. 54. ప.

అరుంధతీదర్శనమగు

  • కనబడకపోవు.
  • "ఆమె యెక్కడ కనబడుతుంది? ఆమె దర్శనం మరీ అరుంధతీదర్శనం అయిపోయింది." వా.

అరుణజలం

  • రక్తము.
  • "వినుతారుణ జలనిగళిత ఘనమన." కుమా. 12. 17. అరుణధారలు
  • రక్త ధారలు.
  • "పరులపై గ్రమ్మెడు నరుణధారలు దమ మేని క్రొంగంటులలోనజొచ్చి..." కుమా. 11. 135.

అరుణాంబుధారలు

  • రక్త ధారలు.
  • "తనరు నరుణాంబుధారల ననవరతము దొప్పదోగి." కుమా. 11. 206.

అరుణాంబువులు

  • రక్తము.
  • "నవధాతుజలము లరుణాంబువు లై." కుమా. 5. 157.

అరువుతిక్క

  • ఉంగిడిరోగము. పశువులకు వస్తుంది.
  • బ్రౌను.

అరువు తెరువు

  • దారి తెన్ను. జం.
  • "ఉభయభారతికి సదుత్తరం బిడనినా, డద్వైతమత మిల నరువు తెరువు, లేని దై పోవదే..."
  • శంకరవిజయ కథా. 4. 44.

అరువులు చేయు

  • వారిసంగతీ వీరిసంగతీ మాట్లాడుకుంటూ కాలము గడుపు. ఇది రాయలసీమలో ప్రచురంగా వినవచ్చే పలుకుబడి.
  • "కోడ లేమో కోడి కూసినప్పటినుంచీ ఱెక్కలు విరుచుకుంటూ ఉంటే ఆడబడుచేమో అరువులు చేసుకొంటూ కూర్చుంటుంది." వా.

అరువు లేనిమనిషి

  • ఏది యెలా చేయవలెనో తెలియనివా డనుట.
  • "వాడు ఒట్టి అరువు లేనిమనిషి. వాడేం చేస్తాడు?" వా.

అరులు మరులు

  • వయసు పండింతరువాత తబ్బిబ్బు పడుట.
  • ఇది నేటికీ రాయలసీమలో అలవాటులో ఉన్న పలుకుబడి.
  • "అరవైయేం డ్లయింది పాపం. అరులు మరులు పట్టిపోయి యేదో ఒకటి అంటూ ఉంటాడు. ఆయన మాటల కేమి?" వా.

అర్కట బెట్టుకొను

  • చంక నుంచుకొను.
  • "జనకు డర్కట బెట్టికొనియొక నాడు చని సరోవరతీరమున బాలు నునిచి..." బస. 6. 151 పుట.
  • చూ. అఱకట నిడుకొను.

అర్ఘ్యపణ్యములు వోయు

  • అర్ఘ్య పాద్యము లిచ్చు, రాగానే అతిథికి కాళ్లు కడుగుకొనుటకై నీళ్ళిచ్చు.
  • "అడుగుల కర్ఘ్యపణ్యములు వోయుచును."
  • పండితా. ప్రథ. దీక్షా. పుట. 135.

అర్చ లిచ్చు

  • పూజించు.
  • "భక్తితోడ...తోడ్కొని చని యర్చ లిచ్చి." భార. శాంతి. 6. 564. అర్ధ చంద్రం
  • నఖక్షతం.

అర్ధ చంద్ర ప్రయోగం

  • మెడబట్టి గెంటుట.
  • "నీవు వాళ్ళింటికి వెళ్ళి హెచ్చు తక్కువగా మాట్లాడావా నీకు అర్ధచంద్ర ప్రయోగం తప్పదు. జాగ్రత్త." వా.

అర్ధచంద్రప్రయోగము చేయు

  • మెడబట్టి గెంటు.

అర్ధజరతీ న్యాయం

  • ప్రామాణికం కొంతా, ప్రమాణరహితం కొంతా కలిసి ఉండడం
  • గుడ్డులో సగం పిల్ల పొదగడానికి వదిలి, సగం కూర చేసుకోవడం అసాధ్యం అనుటపై వచ్చిన సంస్కృత న్యాయం.

అర్ధాంతరంలో

  • మధ్యలో, పూర్తి కాక ముందే.
  • "వాడు చేస్తూ చేస్తూ అర్ధాంతరంలో వదిలిపెట్టి పోయినాడు. ఆ పని అంతా నేనే చేసుకోవలసి వచ్చింది." వా.

అర్ధాకలి

  • కడుపు నిండా తిండిలేమి
  • "ఆమె చేత అన్నం తింటే అర్ధాకలితో చావవలసిందే." వా.

అర్రాడు

  • తచ్చాడు.
  • "కాము డర్రాడుచున్నాడు." రాధా. 4. 314.

అర్రుగుత్తిక యగు

  • కంఠాభరణ మగు.
  • "కోమలాంగికి నర్రుగుత్తిక వై యుండి కలకంఠమా కనికరము వలదె." కవిక. 3. 120.

అర్లుమర్లు

  • చూ. అరులుమరులు.

అఱకట నిడుకొను

  • చంక బెట్టుకొను.
  • చూ. అర్కట బెట్టుకొను.
  • "కొడుకు దా నఱకట నిడుకొని వచ్చె." బస. 6 ఆ. 152 పుట.

అఱకాల బెట్టి నేల రాచు

  • వేధించు.
  • "బింకములు కూల నఱకాల బెట్టి నేల రాచకున్నను నాపేరు రాధ కాదు." రాధి. 3. 15.
  • చూ. నేలబెట్టి కాలరాచు.

అఱకాల ముల్లు గొనక

  • ఏమాత్రం శ్రమపడక, నిరపాయంగా.

"అఱకాల ముల్లు గొన కిట, దిరిగి రఘు
స్వామి యేగుదెంచున్ మదిలో,
దరుణీ! వెఱవకు విపినాం, తరమున నిను
విడిచి పోక తగ దిక నాకున్."
                     రామాభ్యు. 5. 172.

అఱకాలు గొను

  • అఱకాలిలో గ్రుచ్చుకొను.
  • "ఒక కొయ్య యఱకాలు గొన్న." పండితా. ప్రథ. పురా. పుట 390.

అఱకాలు తడి కాకుండా

  • నిరపాయముగా, అశ్రమంగా.
  • "ఉదక మిరుదెసల బాయ...పోవగా నయ్యెడు.......అరుగు మఱకాలు తడి గాకుండ." భోజ. 3. 23.

అఱకాళ్ళకు నఱచేతు లొగ్గు

  • ఎక్కువగా ఆదరించు.
  • "చెమరు నెత్తురు న వు బంధుసమితి గరముంబ్రీతి నఱకాళులకు నఱచేతు లొగ్గనునికి యెక్కడ...."
  • నిర్వ. రామా. 5. 104.

అఱకొఱగా

  • అసంపూర్ణంగా.
  • రుద్రమ. 91.
  • "ఏం చేసినా అఱకొఱగా చేయడం నా కిష్టం లేదు." వా.

అఱగాల గన్ను వచ్చినట్లు

  • చీకటిలో కూడ చక్కగా వెళ్లి గమ్యస్థానమున చేరుటకు కాలిలోనే కళ్ళుండ వలె గదా. అందుపై వచ్చిన పలుకుబడి.

"చెదర కఱగాల గన్ను వచ్చినవిధాన
నాథసం కేతముల కేగు నడికిరేలు
కాయసంభవబాధాసహాయ యగుచు
స్వైరిణీకోటి నిర్భయస్వైరధాటి."
                  పాండు. 4. 28.

అఱగాలు

  • సంపూర్ణముగా కాలు, భస్మ సాత్కారమగు.

"కనికోపించెనొ గానక. మును కోపిం
చెనొ మహోగ్రముగ నుగ్రుడు సూ,
చిన గాలెనొ చూడక యట మును
గాలెనొ నాగ నిమిషమున నఱగాలెన్."
             కుమా. 5. 51.

అఱగొండెతనము

  • దుర్మార్గము.

అఱగొడ్డెతనము

  • మూఢత్వము, దుష్టత్వము.

"అద్ది రా భక్తుని యఱగొడ్డెతనము, విద్దె
లాడుట గాక విందుమే తొల్లి, విపరీత
మందఱు విన బలికింతు, ద్రిపురారి నను
టెల్ల..."
                బస. 5. 127

  • చూ. అఱగొండెతనము.

అఱగొడ్డెము

  • చూ.అఱగొండెతనము.

అఱగొఱ లెఱుగకుండు

  • అఱమఱలు లేకుండు.

"తానుం బతియున్, మనమున నఱగొఱ
లెఱుగక యనితరసులభైకసుఖము
లందుదు రనుచున్."
     పారి. 4. 62.

అఱచేత గనందగు

  • స్పష్టముగా తెలిసికొన దగు. అఱచేతివలె స్పష్టముగా చూడ నగు.
  • అఱచేతిని స్పష్టముగా చూడ వచ్చును కదా!
  • "లక్ష్మీవిభు దివ్యలీల లఱచేత గనం దగు దీన దీనుగన్." పాండు. 2. 169.

అఱచేత నావహిల్లు

  • అందుబాటులోనికి వచ్చు.
  • "అఖిలసిద్ధులు నఱచేత నావహిల్లు."
  • భార. శాంతి. 3. 415.

అఱచేత నిమ్మపండువలె

  • సుఖముగా, హాయిగా.

"ఖరభానుప్రియనూను డిప్పుడు నినుం
గారించునే కా విభుం, డఱచే లోపలి
నిమ్మపంటివలె నత్యాసక్తి మన్నింప
సౌ, ఖ్యరసైకస్థితి నుండి....'
         సారం. 2. 111.

అఱచేత బండ్లు వచ్చినప్పుడు కఱచెదవు కాక
  • నీ కంత గొప్పతనం వచ్చినప్పుడు చూద్దాం లే! ఇందులో అలాంటి గొప్పతనం నీ కెప్పుడూ రాదు అన్న సూచన కూడా ఇమిడి ఉన్నది. అఱచేతికి పండ్లు రావడమూ అసంభవం, నీవు కఱవడమూ అసంభవమే ననుట.
  • "అఱపు లుడిగి పోపో నీ, యఱచేతం బండ్లు వచ్చినప్పుడు మమ్ముం, గఱచెదవు గాని." కళా. 3. 230
  • "అఱచేత బండ్లు వచ్చిన,గఱతువు గా కిక్షుకార్ముకప్రతిపక్షా!" నిరం. 3. 32.

అఱచేత బ్రాణము లిడుకొను

  • పిడికిట ప్రాణములు పట్టుకొను.
  • ప్రాణభయముతో ననుట.

"పిఱుదం గురుధరణీపతి, యఱచేతం
బ్రాణములుగ నభియాతిబలం, బుఱని
తెగువ ముందట బెన్, గొఱలుట చిత్త
మున బెట్టుకొని విహరించెన్.
           భార. స్త్రీ పర్వ. 2 ఆ.

అఱచేత వ్రాలు గనువేళ

  • తెల తెలవారునప్పుడు.
  • అఱచేతి రేకలు కనబడు తుండగా అని యిప్పటికీ అంటారు.
  • "అఱచేత వ్రాలు గనున, త్తఱి బడె నొక యంపకట్టె..." ఆము. 7. 10.

అఱచేతిమాణిక్యము

  • అందుబాటులోని అమూల్య వస్తువు.
  • "శీతాంశుధరు డఱచేతిమాణిక్యంబు, కద్రూజకటకుండు గాదెకొలుచు."
  • శృం. శా. 4 పే. 82.
  • చూ. అరచేతి మానికము, కరతలా మలకము.

అఱచేతిది

  • సులభసాధ్యము, అందుబాటులోనిది.
  • "పరము నిహము నఱచేతిదే ప్రయాస మించుక లేదు. తాళ్ల. సం. 5. 265.

అఱచేతిబోగ్యము

  • అందుబాటులో నున్నది.
  • అరచేతిలోనిదానివలె అనుభవింప అతిసులభ మనుట.
  • "సర్వసామగ్రి నీ, యఱ చేతి భోగ్యము." హర. 4. 23.

అఱచేతిమానికము

  • అందుబాటులో నున్న అమూల్యవస్తువు, అఱచేతిలోని మాణిక్యము.
  • "ప్రతిదేవతలు నన్ను బయలు నెత్తిన దివ్వె, యఱచేతిమానిక మనుట దప్పె."
  • ఉ. హరి. 5. 92.
  • చూ. అరచేతి మాణిక్యము.

అఱచేతి యుసిరికాయ

  • సంపంగిమన్న శత. 7.
  • చూ. కరతలామలకము.

అఱచేతలోనిది.

  • అందుబాటులోనిది.
  • "శిష్టాన్న భోజనపరు లగు పుణ్యులకుం

బుణ్యలోకంబు లఱచేతిలోనివి గావె."

  • భార. శాంతి. 1. 72.

అఱచేతు లొగ్గు

  • చూ. అఱచేతిది.
  • అఱచేతు లడ్డముగా పెట్టు.
  • ఉత్త. 6. 138.

అఱచేయు

  • మన:పూర్వకంగా కాక యేదో పట్టీ పట్టనట్లు చేయు.
  • "అఱచేసిన దోషము వచ్చు."
  • భోజ. 4. 38.

అఱజాతి

  • నీచుడు.
  • కులహీను డనుటపై వచ్చిన పలుకుబడి.
  • "నీపను లఱజాతివి." హరి. పూ. 5. 24.
  • "ప్రల్లదు డఱజాతి భక్తిహీనుండు." బసవ. 1 ఆ.

అఱ తలనొప్పి

  • ఒంటిపార్శ్వం నొప్పి.
  • తల ఒకవేపే నొప్పి ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం దాకా పెరుగుతూ వస్తుంది. ఇది ఆరంభ మయితే చాలా కాలం ఉండడం, విపరీతంగా బాధించడం అలవాటు.
  • "పొద్దు న్నే సూర్యోదయం కాక ముందే పెరుగన్నం తింటే మూడురోజులలోనే అరతలనొప్పి మాయమై పోతుంది." వా.

అఱపులకు నేర్పరి

  • మాటలలో గట్టివాడు, క్రియలో నేర్పరి కాదన్న సూచన ఇందులో ఉన్నది.
  • "నిను నెఱుగమె యఱపులకును నేర్పరి వని....." కళా. 7. 22.

అఱపొఱడు

  • గూనివాడు.

అఱమపాఱుడు

  • కపటబ్రాహ్మణుడు.
  • "అఱమపాఱుండు ప్రక్కలు విఱుగ నగుచు." కుమా. 7. 19.

అఱలేని కూర్మి

  • అఱకొఱ లేనిప్రేమ.
  • "ధవు డఱ లేనికూర్మి జవదాటక నీపలు కాదరింపగా." పారి. 1. 62.

అఱవచాకిరి

  • గొడ్డుచాకిరి.
  • "ఎవరు చేస్తారు రా వాళ్ళింట్లో అరవచాకిరీ." వా.

అఱవయేడుపు

  • దొంగయేడుపు.
  • "ఈ అఱవయేడుపులు ఏడిస్తే నేను మోసపోయేవాణ్ణి కాదు తెలుసుకో." వా.

అఱసేయక

  • వెనుదీయక-మనసులో దాచు కొనక.
  • "నీకు నఱసేయక సెప్పెద." కాశీ. 6. 267. అఱి_____అఱ్ఱా 91 అఱ్ఱా_____అఱ్ఱా

అఱిమెనకుండలు

  • అయిరేని కుండలు.
  • పెండ్లిండ్లలో కొన్ని వర్గాలలో ముందుగా ఉల్లెడ పట్టుకొని మేళతాళాలతో వెళ్ళి కుమ్మరియింటినుండి అలివేణి కుండలు తెస్తారు. వీటికే రూపాంతరాలు అఱివెణ కుండలు, అలివేణి కుండలు, అవిరేని కుండలు, అయిరేని కుండలు. వీటిపై రంగులతో చిత్రించడం కద్దు.

అఱివెణకుండలు

  • చూ. అఱిమెన కుండలు.

అఱుగ్రమ్ము

  • పై బడు, కవియు.
  • "అఱుగ్రమ్మి మఱియు ని ట్లనిరి నరేంద్ర గిఱిగొన్న ప్రేమ భోగినుల గామంబు."
  • గౌ. హరి. ప్రథ. పంక్తి. 966.
  • "పఱచు నెత్తురుటేర్లు బహుమాంస ములకు, నఱు గ్రమ్ము భూతంబు లై రణం బొప్పె."
  • రంగ. రామా. సుం. 265 పు

అఱుదెవులు

  • క్షయ.

అఱ్ఱాక యిడు

  • ఆటంక పెట్టు.
  • చూ. అఱ్ఱాకల బెట్టు.

"ఆకొని యఱచెడు ప్రేవులు
నేకట వో నమలవలయు నీమాంసము న
ఱ్ఱాక యిడి యివ్విధంబున
దేకువ చెడి పల్క నగునె ధేనువు నాతోన్." భోజ.

అఱ్ఱాకల బెట్టు

  • బాధపెట్టు.

"నీ వాకొన్నాడవు భోజనోత్తరమునం
దాస్తాన మై యుండ న, ఱ్ఱాకం బెట్టక
 చెప్పెదన్ సకలవృత్తాంతంబునున్." కాశీ. 7. 174.

  • "ప్రసూనబాణు డఱ్ఱాకల బెట్టి దా

నఱవ నావెలబాలికకై విటావళిన్." కళా. 1. 133.

  • "......సాకగదే నన్నిపుడ

ఱ్ఱాకల బెట్టక పలాశనాసక్తుడ వై." కా. మా. 3 ఆ. 89 ప.

అఱ్ఱాకలి సేయు

  • కడుపు నిండా పెట్టక బాధ పెట్టు.
  • నేడు అర్ధాకలి అరకడుపు అనే మాటలతోనే యిది కనపడుతుంది.
  • "అఱ్ఱాకలి సేయకుము." భోజ. 6. 165.
  • చూ. అర్ధాకలి.

అఱ్ఱాడు

  • ఉత్కంఠ గొను; ఆశతో చుట్టుముట్టుల తిరుగు.
  • "ఒక్క వేదండస్వామి మదంబు సేసె గరిణీధామంబు లఱ్ఱాడగాన్."కుమా. 1. 86.
  • "చిగురు జొంపములందు దగిలి యఱ్ఱాడుచు గెరలు కోయిల సుస్వరములకును." మార్కం. 5. 7.
  • "ఇబ్బాలకులు మన వాలకపు సొమ్ము లందు నేమేనియు నపహరించుటకు నఱ్ఱాడుచున్నవారు. మీరలీ మ్రుచ్చుల నెచ్చరికం గనుపెట్టుకొని యుండుడు..." ప్రభా. 1. 107. అఱ్ఱు_____అల 92 అల_____అల

అఱ్ఱు కఱ్ఱున బొడిచిన ట్లగు

  • మిక్కిలి బాధ కలుగు.
  • "కొట్టి కోలాహల మొనర్చి గోడు గుడిపి, రఱ్ఱు కఱ్ఱున బొడిచిన ట్లయ్యె బసికి." నాయకు. 43 పు.

అలంకారవిద్యార్థి

  • విద్యార్థి వేషమే కాని ఆజిజ్ఞాస లేనివాడు.
  • "వాడు వట్టి అలంకారవిద్యార్థి. వాడికి చదు వేం వచ్చు? వేషం మాత్రమే." వా.

అలంగం తిరగడం

  • స్వేచ్ఛగా తిరగడం.
  • నిరసనగా అనుమాట.

అలక పాన్పు

  • పెండ్లిలో జరిపే ఒక సాంగెం. మంచం పడక వేసి, దాని మీద నూతనవధూవరులను కూర్చుండబెట్టి, దంపతి తాంబూలాలూ అవీ ఇప్పించడం కూడా ఇందులోని భాగమే. అప్పుడు అల్లుడు కోరిన యే కోరిక నయినా మామగారు తీర్చడం విధి. అది తీర్చే దాకా అల్లుడు అలకపట్టి ఉంటాడు.
  • "ఆ అల్లుడు అలకపాన్పుమీద రేడియోకొని మ్మని అడిగా డట." వా.

అలగాజనం

  • చిల్లరిజనం.
  • కొత్త. 315.

అలజడి

  • ఆందోళన.

అలజడివెట్టు

  • తొందరపెట్టు.
  • "అప్పిచ్చిన వారలు మా, యప్పులు పెట్టు మని చాల నలజెడి వెట్టన్." రుక్మాం. 4. 110.
  • చూ. అడజడిపెట్టు.

అలబలము

  • కలకలము.
  • "అలబలముతోడ మృగ యు లరిగిరి వెంటన్." సారం. 1. 85.

అలబలము సేయు

  • అల్లరి చేయు. కలకలధ్వనులు చేయు.
  • "అల బలము లసంఖ్యము లై, యలబలములు సేయుచుండ..." విజయ. 3. 140.
  • "అలబలము సేయు శుక శారికల నదల్చి." విప్ర. 2. 56.

అలమారుచు

  • బండి యెద్దులలో వలపటి దానిని దాపటికీ, దాపటి దానిని వలపటికీ మార్చి కట్టు.

అలరమ్ములు

  • పుష్ప బాణములు.
  • "అలిగి విరహుల నలరమ్ము లాడ నేసి." కుమా. 9. 124.

అలరుతేనెలు చిందు

  • మాధుర్యము లొలుకు. అల____అల 93 అల____అలి
  • "....జవరదనము నలరుందే నెల్చిం దినగతి మాధుర్యము బొందుపడ ంవీణె ముట్టి పాలతుక పాడెన్." కళా. 2. 33.

అలరొందు

  • ఒప్పు.
  • "అది చూచి యలరొందు నగచర విభుని."
  • వర. రా. బా. పు. 18. పంక్త్ల్ 8.

అలవి కాదు

  • సాధ్యము కాదు.
  • రాయలసీమలో ఇది నేటికీ వాడుకలో ఉన్న మాట.
  • వ్యతిరేకార్థములో మాత్రమే యిది ప్రయుక్తమవుతుంది.
  • "బలహీను డైన వానికి నలవియె మోపెట్టి తెలియ నక్కార్ముకమున్." భార. ఆది. 7. 234
  • "వృత్రు ఘనబాహుబలం బలవికి మీఱెను." భార. ఉద్యో. 1. 125.
  • "చేరల గప్పుకో నలవి గామి జీదరం జెంది." పారి. 4. 14.
  • "నలినాయతాక్షి లేనడ లెంచ నంచవ య్యాళికత్తెకు నైన నలవి గాదు." శుక. 2. 7.
  • "వాడికి అలవిగాని పొగరు." వా.
  • చూ. అలివికాదు...

అ(లి)వి కాదు

  • సాధ్యము కాదు.<.big>
  • దేనినైనా తన చెప్పుచేతులలోనికి తీసుకొనగాదు.
  • ఇది వాడుకలో కూడ ఉన్నది. వాడు అలివి గాని మనిషి అని రాయలసీమలో వాడుక.
  • "అతన్ని పట్టడానికి అలివి కాదు."
  • "ఏ మనుకొన్నావో? వాడికి అలివి కాని కోపం." వా.
  • "ఆ తిరునాళ్లలో అలివిగాని జనం."

అలసి సొలసి

  • శ్రమపడి.
  • "అలసి సొలసి ప్రియంవద యంకపాలి." శకుం. 2. 228.

అలికి ముగ్గు పెట్టినట్లు

  • చక్కగా తీర్చినట్లు. లోపాలను కప్పిపుచ్చి అన్న సూచన కూడా యిందులో ఉంది.
  • "ఆవిడ మాట్లాడితే అలికి ముగ్గుపెట్టి నట్లుగా ఉంటుంది." వా.

అలికిడి చేయు

  • సంతానవతి యగు, గర్భిణి యగు.
  • "ఏమిరా! మనమరాలు ఏమైనా అలికిడి చేసిందా?" వా.

అలిగి తన్నిన పఱపు పయి పడినట్లు

  • చెడుపు చేయగా వానికి మంచి జరిగినట్లు.

"వెఱవకు కలలో జేసిన
కొఱగామికి వగచుచోట గుణరత్నము చే
కుఱె నీకు నలిగి తన్నిన
బఱపుపయిం బడినయట్లు పద్మదళాక్షి!"
                          ఉ. హరి. 5. 153.

పండితా. పూ. 387 పు. అలి_____అలు 94 అలు_____అలు

అలిగి పఱపుపై పడినగతి

  • కారణము బాధ కలిగించున దైనను కార్యము శుభప్రదమైనపట్టుల ఉపయోగించే ఉపమానం.
  • రొట్టె విరిగి నేతిలో పడినట్లు వంటిది.
  • "నీవిక నడవి జరింపగ గలుగు టలిగి పఱపుపై బడినగతి యయ్యె." కా. మా. 4. 146.
  • చూ. తన్నిన పరపుపై పడినట్లు.

అలివేణికుండలు

  • చూ.అఱిమెనకుండలు.

అలుక తీర్చు

  • బుజ్జగించి కోపము తీర్చు.
  • "అలుక దీర్చెద గాదేని జలరుహాక్షి." ప్రభా. 5. 137.

అలుకలు తీర్చు

  • కోపము పోగొట్టు.
  • "వలపులపల్ల వుం డొకడు వట్టిచలంబున నేపదీన మై, యలుకలు తీర్చి తీర్చి యొక యచ్చర వచ్చి..." మను. 5. 62.

అలుకుచుట్ట

  • తిట్టు.
  • పేడ అలకడానికి ఉపయోగించే గుడ్డపేలిక అనుట.
  • "వాడో అలుకుచుట్ట." వా.

అలుకు వోదు

  • ఈ చెడ్డపేరు, ఈ మచ్చ పోదు.
  • నే నేం తప్పుచేశా నని అలుకు?" అని నేటి వాడుకలో ఈ అలుకు కనిపిస్తుంది.
  • "పొరిగొన కీయల్కు వో దని సూచు..." పండి. ద్వితీయ. మహిమ. 47 పుట.

అలుగువారు

  • పొంగిపొరలు.
  • అలుగు లనగా తూములు. చెఱువు నిండా నిండినప్పుడే అలుగులు పారడం జరుగుతుంది.
  • "అరిది సురతభావరసము అలుగువార బోలును." తాళ్ల. సం. 3. 219.
  • చూ. అలుగులుపాఱు.

అలుగులు వాఱు

  • చెఱువులు నిండినప్పుడు పైన నీళ్లు ఒక వేపు దొరలి పోతాయి. అలాగే లక్షణ యా ఇట నిండి పొరలి పారు అనుట.
  • "పళ్ళెరం బలుగులు వాఱె రా యనుచు." బస. 7. 201 పుట.
  • "చనుగప్పు దొలగ వాసనగాలి కెదురేగు, బరు వొప్ప నలుగుల బాఱు కరణి." మను. 3. 31.
  • "చెఱువులు అలుగులు పారినవి." వా.
  • చూ. మఱవపాఱు.

అలుచగు

  • చులకన యగు.
  • నేటి వాడుకలో అలుసగు అన్నట్టుగా వినవస్తుంది. అలో_____అల్ల 95 అల్ల_____అల్లా
  • "వీడుబట్టు అలుచాయె వేడుక లుడివోయెను." తాళ్ల. సం. 5. 128.
  • "వాడింటికి పదేపదే పోవడంవల్ల అలుసై పొయ్యాను." వా.

అలో లక్ష్మణా యను

  • పరిదేవించు.

".......బావమాని దివి రాహుం బట్టి
మ్రింగంగ నై, యల్లో లక్ష్మణ యంచు
బాఱె నత డయ్యాఖండలుం జూచు
చున్, బెల్లై భీభర మేచ నింద్ర!
మహిభృద్భేదీ యటంచున్ వెసన్."
        రామకథా. ఉత్త. కాం. పూ. భా. 8. 48.

అలో పొలో యను

  • కుయ్యో మొఱ్ఱో యను.
  • "తను దత్తుగా గయికొనితల్లి యలో పొలో యంచు దు:ఖమ్ము నొందు చుండ." పాణి. 5. 108.

అల్కానాయాలు

  • తిట్టు.
  • చూ. అల్కా వాడు.

అల్కావాడు

  • నీచుడు, హల్కా అంటే తేలిక.
  • చూ. హల్కా వాడు.
  • "వాడు వట్టి అల్కావాడు. వాడికి కాస్త దూరంగా ఉండడం మంచిది." వా.

అల్ల కల్లోల మగు

  • నానా అల్లరీ అగు.
  • "దివిటీదొంగలు వస్తున్నా రనేసరికి ఊరంతా అల్లకల్లోలం అయిపోయింది." వా.

అల్లటపెట్టు

  • కష్ట పెట్టు.
  • అల్లాడునట్లు చేయు అని అర్థం. నేటి రూపం అల్లాడపెట్టు.
  • "న న్నెంత అల్లట పెట్టె దో యయ్య నే నెఱుగ." బస. 1. 10.

అల్లము తాడే బెల్ల మయినది

  • గతి లేనమ్మకు గంజే పానకము వంటిది.
  • అల్లం కారంగా ఉంటుంది. అదే బెల్లంగా మారింది అనుట.

అల్లరీ ఆగం

  • చూ. అల్లరీ హంగామా.

అల్లరీ హంగామా

  • గందరగోళం, హడావుడి.
  • "వాడి దంతా వట్టి అల్లరీ హంగామా. చేసేదీ లేదూ పెట్టేది లేదూ." వా.
  • చూ. అల్లరీ హంగామా.

అల్ల ల నాడు

  • కదలాడు (బరువుతో)
  • ధ్వన్యనుకరణము.
  • "లేచి, కుచంబులున్ దుఱుము లేనడు మల్లల నాడ నయ్యెడన్." మను. 2. 29.

అల్లాటప్పా

  • తేలిక యైనది, మామూలు.
  • వ్యతి రేకార్థంలో నే వినవస్తుంది.
  • "ఇ దేం అల్లాటప్పా వ్యవహారం కాదు. నిదానంగా ఆలోచించు." వా.

అల్లాడగ

  • గజగజలాడగా.
  • భీమ. 1. 47. అల్లా____అల్లి 96 అల్లి_____అల్లు

అల్లాడి ఆకులు మేయు

  • నానాకష్టాలు పడు.
  • "అల్లాడి ఆకులు మేసి ఆ ఊరు వెడితే తీరా వాడు ఇంట్లో లే డన్నారు." వా.

అల్లాడు

  • రోదించు, కొట్టుకొను.
  • అలుగురాజు. 65 పు.

అల్లారుబెల్లం

  • ప్రియ మైనది.
  • "ఎల్లబంధువులకు నల్లారుబెల్ల మై." కళా. 6. 19.

అల్లారుముద్దుగా

  • గారాబంగా.
  • "అనుగుంగ్రీడల నెల్లవారలకు నిట్లల్లారుము ద్దైనకూతునకున్." వసు. 3. 32.
  • "వాళ్లు ఆ పిల్ల నెంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు." వా.

అల్లిందామరయునుబోలె

  • అవినాభావముగా.
  • "నీరజవదనా!, యేమిటికి దలకె దల్లిం, దామరయునుబోలె నుండి తగవు విడుతురే." ఉ. హరి. 5. 20.

అల్లి బిల్లి కొను

  • వ్యాపించు.
  • "మావుల్ క్రోవులు నల్లి బిల్లి కొను కాంతారంబులందు." మను. 2. 22.

అల్లి బిల్లిగ నల్లుకొను

  • చిక్కగా అల్లుకొను.
  • "వాసంతిక లుద్యల్లీల నల్లిబిల్లిగ నల్లి కొనిన యొక లతా గృహాంతర సీమన్." మను. 3. 113.

అల్లిబిల్లిగా

  • చిక్కగా.
  • "అల్లిబిల్లిగా నల్లుకొను బొండు మల్లి యల." రాధి. 1. 115.

అల్లిబిల్లి యగు

  • కలసిమెలసి యుండు, కూడి మాడి అన్నట్లు.
  • "అరిగి తనకూర్మిచెలువతో నల్లిబిల్లి, యగుచు నెప్పటియట్ల నెయ్యమున నుండె." పరమ. 3. 274.

అల్లివి ల్లై యుండు

  • ఆనందముతో నుండు.
  • "బల్లిదుం డలమేల్మంగపతి అల్లి బి ల్లై యున్నా డమ్మా యశోదమ్మా." తాళ్ల. సం. 10. 161.

అల్లి బెల్లి మాటలు

  • కల్లబొల్లి మాటలు.
  • వెంకటే. 3. 161.

అల్లి రము లాఱగించు

  • అల్లెము తిను.
  • "అల్లిరము లారగించ వెన్నుడ వై వేడుకతో విచ్చేసినట్లు." తాళ్ల. సం. 9. 144.

అల్లుకొను

  • 1. వ్యాపించు.
  • "జలశీకరంబులు చద లెల్ల నిండి... చుక్కల నల్లుకొనగ." వర. రా. యు. పు. 16 పంక్త్ల్ 25.
  • 2. వృద్ధిచెందు.
  • "అల్లుకొనె గర్మములు అక్కడికి నక్కడికి." తాళ్ళ. సం. 7. 256.