పదబంధ పారిజాతము/అధవా
Appearance
అద్దు_____అధా 61 అధి______అధీ
అద్దు పద్దు.
- అదుపు ఆజ్ఞ. జం.
- "అద్దూ పద్దూ లేక వా డీమధ్య మితిమీఱి పోతున్నాడు." వా.
అద్దు ముద్దు
- ముద్దు ముచ్చట. జం.
- "అద్దుముద్దు మీఱి యాడది మగ డంచు, గుడిమాడి యాడ జూడ దలచి." రాధి. 3 ఆ.
అద్దెకు తిప్పు
- అద్దెకు ఇచ్చు.
- "వాడు ఉన్న నాలుగు ఇళ్లూ అద్దెకు తిప్పుతూ జీవిస్తున్నాడు." వా.
అద్భుత పడు
- ఆశ్చర్యపడు.
- "అశ్వము గొం చుడువీధి నేగ నద్భుతపడి." జైమి. 2. 29.
అద్వైతము
- చాదస్తము.
- "వాడి దంతా ఒట్టి అద్వైతం." వా
అధవా.
- ఒక వేళ.
- "వసుమతిపై నధవా నన్ను బుట్టింప నూహ కల్గెనేని." వరాహ. 2. 156.
- "నీవు వస్తే మంచిది. అధవా ఏకారణం వల్ల యినా నువ్వు రాలేక పోతే మీ వా ణ్ణయినా తప్పకుండా పంపించు." వా.
అధాయకుడా విధాయకుడా ?
- వాడికి చెప్పి ఏమి ప్రయోజనం? వా డిందులో చేయ గలది యేమి కలదు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
- "వా డేమి అధాయకుడా ? విధాయకుడా ? వా డేమంటే నేమి? వా.
అధిక ప్రసంగము చేయు
- అనవసరముగా జోక్యము కలిగించుకొని మాట్లాడు.
అధిక ప్రసంగి
- వాచాలుడు.
- చూ. అదనప్రసంగి.
అధిక మాసము.
- సూర్యుడు ఒకే రాశిలో ఉండగా రెండు చాంద్రమాన మాసము లారంభ మైతే తొలిది అధికమాసం. రెంటికీ ఒకేపేరు ఉంటుంది.
- అధికచైత్రము, నిజచైత్రము ఇత్యాదులు.
అధికాచమానం
- బహిర్దేశమునకు వెళ్లుట వైదికుల పరిభాష.
- చూ. అల్పాచమానం.
అధివాసరము
- తద్దినానికి ముందునాటిరాత్రి ఉపవసించుట. దీనినే అతివాస మనీ వాడుకలో అంటారు.
- (రూపం) అతివాసము.
అధీతి బోధాచరణ ప్రచారణములు
- చదుట, ఇతరులకు చెప్పుట, ఆ ప్రకారం ఆచరించుట, వానిని అనుసరించ మని యిత అద్ధా_____అన 62 అన_____అన
- రులలో ప్రచారము చేయుట.
అద్ధాన్నం.
- ఇది కోస్తాజిల్లాలలో వినిపించే రూపం.
- చూ. అధ్వాన్నం.
అధ్వాన్నం
- దిక్కు మాలినది, పాడుది.
- "డించిపోవ దగవా యధ్వాన్న పుం బట్టునన్." హర. 3. 86.
- ఈ అధ్వాన్నం అనేక రకాలు గా ఉపయోగిస్తారు.
- "ఈ పుస్తకం చాలా అధ్వాన్నంగా ఉంది."
- "తండ్రి చాలా కష్టపడి సంపాదించి పోయిన ఆస్తి నంతా వాడు నాలుగు రోజులలో అధ్వాన్నం చేసి పారేశాశు."
- "ఎందుకు రా ఈ అధ్వాన్న పుబతుకు." వా.
అనంతశ యనం
- పాడె.
- అంతము లేనిశయనము కనుక.
అనక్షరకుక్షి
- చదువు రానిమొద్దు.
- చూ. నిరక్షరకుక్షి.
అనగా అనగా
- తెలుగునాట ప్రతి జానపద కథా అనగా అనగా అన్న పలుకుబడితో ప్రారంభం కావడం అలవాటు.
- అనగా అనగా ఒక ఊరు, అనగా అనగా ఒకరాజు - అన్నట్లు.
"అనగా ననగా నొకపుర
మొనరుం జంద్రవతి యనగ."
శుక. 1. 171.
అనగి పెనగి
- అన్యోన్యముగా-కలసి మెలసి.
- "అరమరలు లేనికూరిమి ననగి పెనగి." పారి. 1. 94.
అనగిపెనగి యుండు
- స్నేహముగా కలసి మెలసి యుండు.
అనగ్ని దగ్ధుడు
- నిప్పు పెట్టినా కాలనివాడు.
అనధ్యయనం
- చదువగూడని రోజు.
- చతుర్దశి, పూర్ణమ లేక అమాస్య, ప్రతిపత్తులలో వేదాధ్యయనం చేయరా దని శాస్త్రం. అష్టమి కూడా వీనిలో చేర్చుట కలదు.
- (రూపాం) అనధ్యాయం.
- చూ. శిష్టానధ్యాయం.
అనబట్టదు
- 1. ఏమీ అన లేము.
- "అనబట్టదు లోకములోన నిట్టి వేసవి గలదే?" కుమా. 6. 138.
- 2. ఇలా అని చెప్ప వీలులేదు.
- "అయ్యో! మాసంసారం ఇట్లా అనబట్ట దమ్మా!" వా. అనబట్టు
- అనుటకు తగు, అనవలసి వచ్చు, రాయలసీమలో వాడుకలో ఉంది.
- "ఇట్లా అని అనబట్టదు వాడి సంగతి."
- "ఇట్లా చేస్తా వుంటే ఏదో గట్టిగా అన బట్టుతుంది." వా.
అనరాదు గాక
- అనగూడదు గానీ.
- "అనరాదు గాక నా యింటన కా దిటు వంటి చెలువ నాకంబున గల్గునె." కళా. 5. 117.
- "అనగూడదు గానీ వా డంత నీచుడు మరొకడు ఉండడు." వా.
- "నాకొడుకు కనక అనరాదు గానీ వాడు మంచి దిట్ట మైనపండితుడు." వా.
అనలు కొనలు పాఱు
- తీగ సాగు, వృద్ధి చెందు, తీగ పెరిగేటప్పుడు ననలు వేస్తూ పెరగడం ద్వారా వచ్చినపలుకుబడి.
- "అనలుం గొనలుం బాఱుచు, మనమున నా కోర్కెతీగె మగువకు మిగులం." కళా. 6. 212.
- "కుటిలాలక కూర్మి యనలు గొనలుం బారన్." సారం. 3. 144.
- "అమరగ లతికలు...గుము రై, యెల దోట యనలు గొనలుం బాఱెన్." విప్ర. 2. 24.
- చూ. తీగ సాగు.
అనవలసి యంటి
- మాటసామెతగా చెప్పితినే కానీ మ రేమీ కాదు అన్న సందర్భంలో ఉపయోగించే పలుకుబడి.
- "అనవలసి యంటి నిన్నుం, గను గొనుటే చాలు బడలికలు కనుపించెన్." శుక. 2 ఆ. 523.
అనాగతవిధాత
- రాబోవు కీడును ముందే గ్రహించి దానికై జాగ్రత్త పడువాడు.
- పంచతంత్రములోని మూడు చేపలకథపై వచ్చినపలుకుబడి. భారతంలోనూ ఉన్నది.
అనాఘ్రాతపుష్పము
- వాసన చూడనిపూవు, అనను భూతపూర్వము.
- పాండు. 5. 186.
అనిగొను
- యుద్ధము చేయు.
- యామున. 1. 221.
అనిచి పుచ్చు
- పనిమీద పంపు.
- "నన్నుం దగవుగ భూవిభుకడ కనిచి పుచ్చు." భాస్క. అర. 2. 176.
అనియు ననక మునుపే
- వెంటనే అనుటి.
- నోటిమాట నోటిలో ఉండగానే, అనీ అనక ముందే, వచ్చీ రాక ముందే, చేసీ చేయక ముందే, చెప్పీ చెప్పక ముందే-ఇలాంటివి పెక్కులు.
- "అని యనియు ననక మునుపే యనఘా!..." శుక. 2 ఆ. 165. ప. అనీ కొనా తెలియ లేదు
- మొదలూ, తుదీ తెలియలేదు. అల్లుటలో తొలుత ఆరంభించేటప్పుడు 'అని' వేస్తారు. అలాగే ఆఖరున ఉన్నది కొన. అవి రెండూ తెలియుట అనగా అందలి వివర మంతా తెలియుట - తుదీ మొదలూ కూడా.
- "ఇందులో అనీకొనా తెలియడం లేదు." వా.
అనీ మొనా తెలియదు
- ఇందులో మొదలేదో తుది ఏదో తెలియదు. అంటే దాని తత్త్వం తెలియ దనుట. జం.
- "అనీ మొనా తెలిస్తే గానీ ఏ ముడీ విప్పలేము." వా.
అను కణకన్
- పైపై పడగా, వర్షించగా.
- "ఉర్వీతల మద్రువంగ నుల్క్స్స్పాతం బనుకణక." కుమా. 2. 11.
అనుకుంటూ ఉండగా
- ఆ ప్రస్తావమే జరుగుతుండగా.
- "అనుకుంటూండ గానే వచ్చావు. నూరేండ్లాయుసు." వా.
అనుమానం పెనుభూతం
- అనుమానం చెడ్డది.
- చూ. అనుమానం ప్రాణసంకటం.
అనుమానం ప్రాణసంకటం
- అనుమానం చెడ్డది.
- "వాని కేదో అనుమానం పట్టుకొంది. రోజురోజుకూ నీరసించి పోతున్నాడు. అనుమానం ప్రాణసంకటం." వా.
- చూ. అనుమానం పెనుభూతం.
అనుమానపు పీనుగ
- వట్టి అనుమానపు మనిషి అని నిందగా అనుటలో ఉపయోగించేపలుకుబడి.
- "వాడింట్లో ఎక్కడ దిగనిస్తాడు రా. ఒట్టి అనుమానప్పీనుగ." వా.
అనుమానపు మనిషి
- అడుగడుగునా సందేహా లుండే మనిషి.
- "వాడు చాలా అనుమానం మనిషి. ఏది నిశ్చయించుకోవా లన్నా సంవత్సరాలు పడుతుంది." వా.
- చూ. అనుమానపుపీనుగ.
అనుము, మినుము అనకుండు
- ఏమీ అనకుండు, మౌనము వహించు.
- "అనుము మినుము ననక చాటున గూర్చుండె నక్కటకట!"
- గుంటూ. వూ. పు. 31.
- "నే నెంత నెత్తి పగలగొట్టుకుంటున్నా వాడు అనుమూ మినుమూ అనకుండా బెల్లంకొట్టిన రాయిలా ఉంటే నే నేం చేసేది?" వా.
అనువు గానిచోట అధికుల మనరాదు
- కూడనిచోట మన గొప్ప చూపరాదు.
- "ఇల్లూ దొడ్డీ అంతా వాడిది. సంపాదించి తెచ్చి వేస్తున్న వాడు వాడు. మనం ఎవరం ఏ మనడానికీ? వాడి ప్రవర్తన బాగా లేకపోతే అది వేరేమాట. మన