పంచతంత్రము (దూబగుంట నారాయణ)/పంచమాశ్వాసము
పంచతంత్రము
అసంప్రేక్ష్యకారిత్వము
క. | శ్రీకారుణ్యకటాక్ష, స్వీకృతబుధబంధునికర జృంభితవిమతా | 1 |
వ. | అవధరింపుము సుదర్శనక్షితీశ్వరనందను లసంప్రేక్ష్యకారిత్వం బెఱింగింపు మనిన | 2 |
చ. | నిజమును గల్లయుం దెలియనేరక క్రోధమునం బ్రమత్తుఁడై | 3 |
వ. | అనుటయు నృపకుమారులు తత్కథాక్రమం బెఱింగింపుఁ డనిన నతం డిట్లనియె. | 4 |
సీ. | గౌడదేశంబునఁ గల దగ్రహారంబు, సకలసౌఖ్యములకు జన్మభూమి | |
గీ. | నధికసంతోషచిత్తుఁడై యతివఁ జూచి, నాతి నీగర్భమున నున్ననందనుండు | 5 |
వ. | యాజ్ఞసేని యిట్లనియె నాథా నీమనోరథసహస్రంబు లేమియుఁ గొఱగా వీయస్థి | 6 |
గీ. | మహి ననాగతకార్యంబు మదిఁ దలంచి, కోరునాతఁడు దుఃఖసంకులత నొందు | 7 |
వ. | అనినం దత్కథాక్రమంబు విఫ్రుండు తనభార్య నడిగిన నానితంబినీతిలకం | 8 |
సీ. | పరఁగ విద్యాభ్యాసపరుఁ డొక్క భూసురుం డనువుగా మహళయంబున భుజించి | |
| చేతి కందెడునట్టె చేరువ నాకుంభ మెలమితోఁ బ్రీతుఁడై యచటఁ బెట్టి | |
తే. | సమధురోత్కృష్టభోజనోత్సవముకతన, నతఁడు సుఖసుప్తి నొందెడునవసరమున | 9 |
వ. | ఆనైష్ఠికుండు తనలో నిట్లని తలపోయం దొడంగె. | 10 |
చ. | కఱ వరుదెంచినన్ ఘటము గర్భమునం గలసక్తు వంతయున్ | 11 |
వ. | ఇవ్విధంబునం గ్రమక్రమవృద్ధిం బొందినఛాగంబులు కాలాం | 12 |
సీ. | కోడె లన్నింటిని గూడంగఁ దోలించి మేదింప దుక్కికి మెతక లైన | |
తే. | రాజుచేత మహాగ్రహారములు వడసి, గుళ్లుఁ జెఱువులు వనములు గోపురములు | 13 |
సీ. | గజనికేతనములు గట్టించి యన్నిఁట భద్రదంతావళప్రతతి నుంచి | |
తే. | రత్నభూషణాలంకృతరమ్యగాత్రు, ననుదినంబును వాహ్యాళి కరుగునన్నుఁ | 14 |
క. | కులమును రూపును గుణమును, గలకోమలిఁ బెండ్లియాడి కాయజకేళిం | 15 |
తే. | పెక్కునోములు నోమంగ భీతహరిణ, నేత్ర గర్భంబు ధరియించి పుత్రుఁ గాంచ | 16 |
తే. | కనకసూత్రంబుతో మొలగంట లమర, జోక నలికంబుపై రావిరేక లనుర | 17 |
చ. | పనితమకంబునన్ గృహిణి బాలకు నెత్తక యుండు దెట్లు నీ | 18 |
క. | తలయుం జీరయు నొడలును, దెలతెలఁగాఁబడ్డపిండి దిక్కులు గప్పన్ | 19 |
వ. | విస్మితుండై మనోరాజ్యంబు మిథ్య యగుటకుఁ జింతాక్రాం | 20 |
తే. | పుణ్యదివసంబు వచ్చినఁ బొలఁతి వేడ్క, నర్భకుని నాత్మనాథున కప్పగించి | 21 |
ఉ. | ఆనగరంబుభూపతిగృహంబునఁ బుణ్యదినంబు వచ్చినన్ | |
| దా నది చూచి బ్రాహణుఁడు తద్దయు శోకము నొంది యాత్మలో | 22 |
వ. | అని మఱియు నమ్మహీసురవరుండు తనమనంబున. | 23 |
ఉ. | ఎన్నఁడు వచ్చుఁ బుణ్యతిథి యెన్నఁడు దానముచేయు భూవరుం | 24 |
ఉ. | అక్కఱ లెల్లఁ దీఱవు నృపాగ్రణికిం బొడసూపకున్న నా | 25 |
గీ. | అనుచుఁ గదలి పోవు నట పోయి క్రమ్మఱ, మగిడి వచ్చి బాలుమొగము చూచు | 26 |
వ. | ఇవ్విధంబున నాందోళించుడెందంబు కొందలం బంద నందందు సందడిం బొందుచుఁ | 27 |
సీ. | నకులంబు చూడంగ నొకకృష్ణసర్పంబు, వడిగొని మూషికద్వారవీథి | |
గీ. | దాన మంది యపుడు ధరణీసురుఁడు తన, పట్టిఁ దలఁచుకొనుచుఁ బాఱుతెంచి | 28 |
క. | ఈనోరు రక్త మూరక, కానేరదు శిశువుఁ జంపెఁగా దుర్జాతం | 29 |
వ. | అడిచి యమ్మహీదేవుం డభ్యంతరమందిరంబునకుం జని శతఖండీకృతకృష్ణసర్పంబును | 30 |
క. | పదిలముగ వినక చూడక, మొదలఁ బరామర్శ చేసి మొనయక పరుసం | 31 |
వ. | అనిన నవ్విధం బెఱింగింపు మని యావిప్రుండు భార్య నడిగిన నమ్మానినీతిలకం | 32 |
చ. | కలఁ డొకపట్టణంబునను గ్రామణి వైశ్యకుమారుఁ డెల్లవా | 33 |
గీ. | ఉండి సెట్టిబిడ్డఁ డొకనాఁడు తనదాదిఁ, జేరఁ బిలిచి నాకుఁ జెప్పు మతివ | 34 |
సీ. | తల మాసినపుడును దైల మించుక లేక, ముదమునఁ గోకయు మొలకు లేక | |
గీ. | యేల యున్నాఁడ నీదేహ మేల నాకు, విడుతు నీప్రొద్దె కాదేని విపినభూమి | 35 |
వ. | అనినం గన్నీ రొలుక నయ్యుపమాత యిట్లనియె. | 36 |
క. | నాకన్నతండ్రి నీ కీ, శోకం బేమిటికి నేను జూడఁగ భాగ్య | 37 |
గీ. | వెలయ నీవు జనించినవేళఁ దొల్లి, దివ్యయోగీంద్రు నడిగినఁ దేటపఱిచె | 38 |
వ. | అని యతం డిట్లు చెప్పె నది యాదిగ నేను సంవత్సరమాసదినంబు లెన్నికొనుచుండు | 39 |
ఉ. | బద్ధగజాజినాంబరము బాలశశాంకళావతంసస | 40 |
శా. | ఓరీ వైశ్యకుమార సాహసమహోద్యోగంబునన్ జావఁగాఁ | 41 |
క. | కల యని చూడకుమీ నా, పలు కంతయు నిక్కువంబు భావించి మదిన్ | 42 |
వ. | అవ్విధం బెట్టి దనిన. | 43 |
సీ. | అరుణోదయంబున హరిహరస్మరణంబు, చేయుము మేల్కాంచి చిత్త మలరఁ | |
గీ. | లగుడమున మస్తకంబులు పగుల నడువఁ, దాఁకు వడునట్టి భిక్షుకత్రయము చూడఁ | 44 |
వ. | ఇవ్విధంబున సంప్రాప్తం బయినధనంబువలన. | 45 |
సీ. | దేవతాగృహములు దృఢముగాఁ గట్టించి, ఘనతటాకంబులు కలుగఁజేసి | |
గీ. | యాశ్రితుల బంధుజనముల నరసి మనిచి, పుత్త్రపౌత్త్రాభివృద్ధితోఁ బొగడువడఁగ | 46 |
వ. | అప్పు డావైశ్యకుమారుండు తనదాదిం బిలిచి యిట్లనియె నేఁ డరుణోదయానంత | 47 |
సీ. | పాకశాసనపురప్రాసాదశిఖరాగ్రగురుతరసౌవర్ణకుంభ మనఁగఁ | |
గీ. | నరుణకిరణుండు పొడచూపె నఖిలజనక, రాబ్జములతోడఁ గుముదవనాలి మొగుడ | 48 |
వ. | ఇవ్విధంబున సూర్యోదయం బగుటయుఁ గనుంగొని యవ్వైశ్యకుమారుండు తన | 49 |
క. | క్షారాభ్యంగస్నానము, లారంగ నవశ్య మగుట నతిశీఘ్రగతిన్ | 50 |
వ. | అనిన నాయమ విదగ్ధక్షౌరకుం బిలిచి తెల్పిన వాఁడును దంతధావనపదనఖధావనాది | |
| నేఁ డించుకతడవు మద్గృహంబున నిలువు మని నిలిపి తైలాభ్యంగనస్నానం బాచ | 51 |
క. | కొనిపోయి నిష్కశతమును, తనకాంతకు దాఁప నిచ్చి తద్వృత్తాంతం | 52 |
వ. | తనభార్య కిట్లనియె. | 53 |
క. | పరదేసు లైనజోగుల, తిరిపంబున నడఁచి ధనముతిప్పలఁ బడసెన్ | 54 |
వ. | అని క్షౌరకుండు క్షారాభ్యంగనస్నానధౌతపరిధానాదికర్మంబు లావైశ్యకుమారు | 55 |
గీ. | నీవు గాక యుండ నెరయంగ నిరువురఁ, దొడికి వచ్చితేని నొడిక మైన | 56 |
వ. | అనినం బ్రమోదంబు నొంది యాభిక్షుకుండు మఱియును నిరువురం దోడ్కొని | 57 |
గీ. | మెచ్చు లొదవంగ నర్చన లిచ్చి వారి, కిచ్చవచ్చిన భోజనం బిడుచు నుండి | 58 |
క. | పొడవు గలజంగమయ్యను, బెడతల లగుడంబుచేత బెట్టడువ మహిన్ | 59 |
క. | అప్పుడు మొఱ్ఱో యనుచుం, దప్పక మువ్వురును గూయఁ దలవరులు వడిన్ | 60 |
వ. | ఆభిక్షుకత్రయంబును మోపించుకొని నాపితుం బెడకేలు గట్టికొనివచ్చి భూవరు | |
| జూఱగొనియం గావున నీవు న ట్లవిచారమూఢుండ వని పలికి వెండియు. | 61 |
క. | నెఱయంగఁ బలుకనేరని, యెఱుకయు నాచారహీనునిలువడియును నీ | 62 |
వ. | అని మఱియుం దనపురుషు నుద్దేశించి. | 63 |
చ. | తనమతి వేగిరించి నెఱి దప్పఁగఁ గర్జము సేయరాదు చే | 64 |
వ. | అని యిట్లు తనభార్య చెప్పినవివేకవచనంబులకుఁ బ్రమోదంబును నవిచారమూర్ఖత్వం | 65 |
చ. | కదిసి పఠింప లోకహితకార్యము లెల్లను దోఁచు మూఢులై | 66 |
క. | ధర్మార్థకామసాధన, కర్మములకుఁ దగినయట్టికథ లన్నియు మీ | 67 |
వ. | అనిన విష్ణుశర్మకుం గుమారు లిట్లనిరి. | 68 |
చ. | విమలగుణోన్నతాపరుసవేది యొకించుక సోఁకినట్టి లో | 69 |
వ. | అని యతనికిం బ్రణామంబులు చేసి మఱియు నక్కుమారులు నృపనీతిశాస్త్రం | 70 |
శా. | బాలాహృత్సరసీమరాళ పరిఘాభవ్యోన్నతోద్యద్భుజా | 71 |
లయగ్రా. | కింకరజనాంబురుహపంకరుహమిత్త్ర రిపుపంకరుహరాజిహరిణాంకనిభమూర్తీ | 72 |
భుజంగప్రయాతము. | దిగంతప్రమేయప్రదీప్తారుకీ ర్తీ | 73 |
గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజన
విధేయ నారాయణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బను
మహాప్రబంధంబునం దసంప్రేక్ష్యకారిత్వం బనునది పంచ
తంత్రంబునందు సర్వంబును బంచమాశ్వాసము.
————