పంచతంత్రము (దూబగుంట నారాయణ)/తృతీయాశ్వాసము
పంచతంత్రము
సంధివిగ్రహము
క. | శ్రీపతిదృఢపదయుగళ, స్థాపితహృత్కమల సకలజలనిధిమధ్య | 1 |
వ. | ఏకాగ్రచిత్తుండవై తత్కథాసుధారసంబు వీనులం గ్రోల నవధరింపుము. సుదర్శన | 2 |
చ. | అలఘువిరోధి కార్యమునకై కడుచుట్టఱికంబు చేసినన్ | 3 |
వ. | అనినఁ దత్కథాక్రమం బెట్టి దని నృపకుమారు లడిగిన విష్ణుశర్మ యిట్లనియె. | 4 |
ఉ. | మెండగుశాఖలన్ ధరయు మిన్నును దిక్కులు నాక్రమించి మా | 5 |
గీ. | అనుదినంబును దనచల్లఁదనముచేత, జలద మెబ్భంగి సకలజీవులను బ్రోచుఁ | 6 |
ఉ. | ఆమహనీయభూరుహమునం దనిశంబు ననేకబాంధవ | 7 |
వ. | ఇట్లు వాయసనివాసం బైనయవ్వటముహీరుహంబున కనతిదూరంబున. | 8 |
ఉ. | వేఱొకవంకఁ గొండగుహ వేశ్మముఁ గాఁగ నులూకభర్త దన్ | |
| యీఱమునందు రేలు దమయిచ్చల మేసి దివంబు లాగుహన్ | 9 |
వ. | అతం డొక్కనాఁటినిశాసమయంబునఁ దనకుం గలమంత్రులం బిలిచి వారలతో | 10 |
క. | మహిఁ గాకులకును మనకును, సహజం బగు వైర మగుటఁ జంపఁగఁ దగు నా | 11 |
క. | మీరును మీమీసేనలఁ, దోరముగాఁ గూర్చుకొనుచుఁ దోడ్తెం డనినన్ | 12 |
లయగ్రాహి. | రండు వెస దండు వెడలుం డొకఁడు నుండకని యొండొరులఁ జేరుచును మెండుకొని దిక్కుల్ | 13 |
క. | చెలఁగుచును దివాభీతం, బులు వడి నిబ్భంగి నడవఁ బొడగని విభుఁ డ | 14 |
సీ. | అనుచు నయ్యుపమర్దుఁ డర్ధరాత్రపువేళఁ, గదలుచుఁ గలయులూకములఁ గూర్చి | |
గీ. | యుఱికి కొన్నిటికంఠముల్ నఱికివైచి, యేచి కొన్నిటివక్షంబు లూచి వైచి | 15 |
వ. | మఱియు ననేకప్రకారంబుల నయ్యులూకంబులు కాకంబులకు మహాప్రళయం బాపా | 16 |
గీ. | అట్టియుత్పాతకాలంబునందు మేఘ, వర్ణుఁ డొకతొఱ్ఱఁ దనమేను వైచి యుండఁ | 17 |
క. | అతనికిఁ గులక్రమాగత, మతియుతు లగుమంత్రివరులు మాన్యులు గల ర | 18 |
వ. | వార లెవ్వ రంటేని యుద్దీపియు సందీపియు నాదీపియుఁ బ్రోద్దీపియుఁ జిరంజీవి | 19 |
గీ. | ఏను లేనిమీర లెందును గొఱగారు, మీరు లేని నేను మృతునియట్ల | 20 |
క. | మీబుద్ధిబలముప్రాపున, నాబాహుపరాక్రమమున నడచితిమి తుదిన్ | 21 |
వ. | అనిన మేఘవర్ణునకు నుద్దీపి యనునమాత్యుం డిట్లనియె. | 22 |
సీ. | బలవద్విరోధికిఁ దొలఁగి యవ్వలనొండు, బలవంతుతోఁ గూడి నిలుచు టొండె | |
గీ. | నతనిపలుకులు విన్నవాఁడై యతండు, వరుస సందీపి యనియెడివానిఁ జూచి | 23 |
గీ. | తొలుత నుద్దీపి దేవరతోడ నిపుడు, సరవిఁ జెప్పినమూఁడుపక్షములు నమరు | 24 |
క. | తనయున్నచోట నుండఁగ, ననుకూలతఁ గార్యసిద్ధు లగుఁ దగినక్రియన్ | 25 |
చ. | నెలవున నప్రమత్తమతి నిల్చినరాజు జయంబు చేకొనున్ | 26 |
గీ. | కాన నెలవు విడువఁగా రాదు విడువక, పోక యున్న రాకపోక యైన | 27 |
వ. | అనుటయు. | 28 |
క. | విని యాదీపిం గనుఁగొని, యనుకూలం బైనకార్య మడుగుటయును నా | 29 |
చ. | అతిబలవంతుఁ డైన వినయంబున వారలతోడిమైత్త్రి సం | |
| గతుఁ డయి పొల్చు టొప్పు నది గాదని యొండొకదేశ మేఁగినన్ | 30 |
క. | అటు గాన నధికబలములఁ, దటుకున మన మిచటఁ గూర్చి తగుసంధియ సం | 31 |
వ. | అని చెప్పుటయును. | 32 |
క. | అమ్మాటలు వెడయూఁకొని, క్రమ్మఱఁ బ్రోద్దీపివంకఁ గనుఁగొని తగ నీ | 33 |
వ. | అతం డవ్వాయసపతి కిట్లనియె. | 34 |
గీ. | రాత్రిగాని కానరా దులూకములకుఁ, బగలుగాని కానఁబడదు మనకు | 35 |
క. | అదిగాన రాత్రిఁ గానక, కదలక నిద్రించుమనలఁ శౌర్యం బెసఁగన్ | 36 |
గీ. | పగలు గానకున్న పగతుర నరికట్టి, తెగ వధింప కేల పగ యడంగు | 37 |
వ. | సకలనయశాస్త్రతత్వజ్ఞుం డైనచిరంజీవి యనునమాత్యుం గనుంగొని యతనికిం బ్రియ | 38 |
క. | ఓతండ్రి నీదుబుద్ధి, ద్యోతంబున రాజ్య మేను దుది ముట్టంగాఁ | 39 |
వ. | కావున. | 40 |
క. | ఇప్పటికిఁ జేయఁ దగియెడు, నప్పనికిం దెరువు పెట్ట నర్హుఁడ వనినన్ | 41 |
క. | వీరిందఱుఁ బరమాప్తులు, నేరుపు గలకార్యమతులు నీ కెఱిఁగింపన్ | 42 |
క. | ఐనను నాయెఱిఁగినపని, యే నించుక విన్నవింతు నిందఱు నాప్తుల్ | 43 |
గీ. | మంత్ర మాప్తపరంపర మ్రందిపోవు, నఖిలకార్యంబులకు విఘ్న మావహిల్లు | 44 |
వ. | కావున మంత్రరక్షయ భూవల్లభులకుఁ బ్రధానకార్యం బని కార్యాకార్యజ్ఞుం డైన | |
| పాతప్రతీకారకార్యసిద్ధు లనుపంచాంగమంత్రంబులం బ్రవీణుండై సామదానభేదదం | 45 |
క. | తనబలము నెదిరిబలమును, మనమునఁ జింతింప కరుల మర్దించుటకై | 46 |
వ. | మఱియును. | 47 |
చ. | అతులితసత్ప్రతాపమహిమాస్పదుఁ డైన విరోధి దూరసం | 48 |
చ. | ఒనరఁగ బుద్ధిమంతుఁ డయి యోరుపు గల్గి యొకప్డు వేళ వ | 49 |
చ. | వదల కుపాయవంతుఁ డగువానికి నెన్నఁడు రాగశక్తిమైఁ | 50 |
క. | వరమంత్రశక్తివశమై, గురురాజ్యశ్రీభుజంగకుటిలవిహార | 51 |
క. | ఖలులకు మందులకును గ్రో, ధులకును లోభులకు గర్వితులకును నతిమ | 52 |
ఉ. | నాయము దప్ప కెంతయు మనంబున గర్వము లేక కార్యముల్ | 53 |
వ. | అని చెప్పి చిరంజీవియు నిట్లనియె మనకు నియ్యెడం గయ్యంబునఁ గాలంబు గా | 54 |
క. | బలసంపద లేకుండిన, వలయు ధనము మంత్రనిధియు వసుధాపతికిన్ | 55 |
క. | విను ప్రాణము వంచించిన, జనులకుఁ బొందంగ రానిసంపద యర్థిం | 56 |
గీ. | మంచిగుణములు గలిగినమనుజునందు, ఫలము గలుగుట కనుమానపడఁగ వలదు | 57 |
క. | శూరులు నుదారశుద్ధులు, సారమతులు నైనబుధులసాహాయ్యమునన్ | 58 |
చ. | వల నగురాజ్యలక్ష్మి వరవంశపరంపర వచ్చినట్టు ని | 59 |
గీ. | ధరణి సత్సహాయవిరహితునకుఁ గార్య, మొక్కఁ డైనఁ జేయ నొరపు గాదు | 60 |
ఉ. | ఏలిక యాత్మబుద్ధిఁ దన కించుక దోఁపనికార్య మాప్తుఁడై | 61 |
చ. | సతతము నాయమున్ వ్యయము సన్మతితోడ నెఱింగి గుప్తమం | 62 |
క. | చెడు నాత్మశక్తి యెఱుఁగక, కడుగర్వముతోడఁ గడిఁదికార్యము చేయన్ | 63 |
వ. | కావునఁ గయ్యం బియ్యెడం కార్యంబు గా దులూకంబులకును మనకును సహజవైరం | 64 |
క. | మన కయ్యులూకములతో, ననఘా సహజంబు వైర మగు టేకతనన్ | 65 |
గీ. | తొల్లి యొకగార్దభము పులితోలుతోడఁ, గప్పఁబడుటను వేసవికాల మెల్లఁ | 66 |
వ. | అనిన నవ్విధం బెట్లని మేఘవర్ణుం డడిగినఁ జిరంజీవి యిట్లనియె. | 67 |
సీ. | ఒకయూర నొకచాకి యొక్కగాడిదఁ దెచ్చి, దాని లావుగ మేపఁ దలఁపు పుట్టి | |
గీ. | గడఁగి దూరంబునందునఁ గంబళంబుఁ, గప్పికొని వింట శర మిడి కాచి యుండ | 68 |
వ. | చేరం జూచి దానికయి పొంచినయతండు. | 69 |
క. | పులి యని పాఱితి నక్కట, బలుగాడిద యెలుఁగుకతన బై లయ్యె నిఁకన్ | 70 |
వ. | కావునఁ గాకులకు నులూకంబులకు వాగ్దోషంబునంజేసి ప్రబలవిరోధంబు సంభవించె | 71 |
క. | ఈక్షితిలోనం గలిగిన, పక్షులు దమలోనఁ గూడి ప్రభువై మనలన్ | 72 |
వ. | ఉద్యోగించుసమయంబునం దొకవృద్ధకాకం బాపక్షిసమూహంబుకడకుం జనుదెంచిన | 73 |
ఉ. | క్రూరము ఘోరదృష్టియు విరూపము నీచము నైజకోపదు | 74 |
గీ. | రాజు లేక యున్న రా జున్నయట్ల కా, రాజునెపము చెప్పి బ్రతుకవచ్చుఁ | 75 |
వ. | అనిన విని పక్షు లావృత్తాంతం బంతయు నెఱిఁగింపు మని యడిగిన వావృద్ధకాకం | 76 |
సీ. | ఏకొండ చూచిన నెరగలి వడిఁ బర్వి, పొగ లేనియనలంబు లెగయుచుండ | |
గీ. | సలిలతత్వంబు వనరుహాసనుఁడు మాన్పఁ, బోలునో కాక యింతలోఁ బొడ వడంగ | 77 |
వ. | ఇవ్విధంబునం బండ్రెండుసంవత్సరంబు లనావృష్టిదోష మైన నొక్కయెడ మహాగ | 78 |
గీ. | వెన్ను మునుఁగంగ నుదకంబువిరివి గలుగు, వారిజాకర మెందైన మాకు వలయు | 79 |
క. | దిక్కులకుఁ గొంద ఱరుగుం, డక్కడ జల మరసి యిచటి కరుదేరంగా | 80 |
వ. | అని యగ్గజేంద్రుఁ డగ్గజంబులలోన నధికజవసత్వంబులు గలయేనుంగులఁ గొన్నిటిని | 81 |
ఉ. | ఇన్నిదినంబు లయ్యును గజేశ్వర చంద్రసరోవరంబు నా | 82 |
చ. | కురువకతింత్రిణీలికుచకోమలతాలతమాలసాలకే | 83 |
గీ. | జమ్ము ముమ్మర మశ్వత్థసమితి యమిత, మబ్జములు కేతకంబులు నపరిమితము | 84 |
వ. | నితాంతసంతుష్టాంతరంగుం డగుచు నచ్చోటికిఁ గదలి పోవ నుత్సహించుచుండునంత | 85 |
సీ. | పాదఘట్టన నేల భార మగ్గల మైన, మ్రగ్గి దిగ్గజములు మ్రొగ్గి పడఁగ | |
| ఘీంకారరవము సంకీర్ణ మై పర్వఁగ, దండుకొండలు ప్రతిధ్వనుల నీనఁ | |
గీ. | దేవసైన్యంబులకు నోడి దితిజకులము, నిలువఁ జో టెచ్చటను లేక జలధి చొరఁగఁ | 86 |
గీ. | అట్టి సంరంభగమనంబునందు నందుఁ, గలశశకంబులు తత్పాదఘట్టనమున | 87 |
వ. | తా నరణ్యంబునం గలశశకంబుల కెల్లను రాజు గావునఁ దనబంధుప్రీతంబు మృతిఁ | 88 |
చ. | వఱపు జనింప నేల యనివారణ వారణపంక్తు లింతగా | 89 |
వ. | అని యిట్లు చింతాక్రాంతుండై యున్నతనయేలికం జూచి బహువృత్తాంశవిదుం | 90 |
ఉ. | చచ్చినవారికిన్ వగవఁ జయ్యన వారలు లేచి క్రమ్మఱన్ | 91 |
వ. | అనినం దెలి వొందినచిత్తంబుతోడ సుముఖుం డగుచు శిలీముఖుండు దనయమాత్యుం | 92 |
క. | గిరిగహ్వరముల కొండెను, ధరణీవివరముల కొండెఁ దడయక చని య | 93 |
గీ. | ఏమఱుటఁ జేసి యిటువంటియెడరు పుట్టె, మోసపోయితి మెఱిఁగిన మోస గలదె | 94 |
వ. | అనిన శిలీముఖుం డిట్లనియె. | 95 |
గీ. | నిన్నుఁ గడచినట్టినిజ మైనహితుఁడును, నీతియుతుఁడుఁ గలఁడె నిర్మలాత్మ | 96 |
వ. | అనుమాటకు విజయుం డిట్లనియె. | 97 |
క. | దేవ నను భారపెట్టితి, గావున నాసామజములకడకుం జని యా | 98 |
వ. | అని యతం డాప్రొద్ద కదలి పోయి చంద్రసరోవరతీరంబున నున్న యగ్గజయూథం | 99 |
సీ. | చేరినఁ జేసాచి చెనకెడుగతి దంతి, నిజకరంబునఁ బట్టి నేలఁ గలపు | |
గీ. | గాన నాకు వీనిఁ గదియంగ నేలంచుఁ, జెంత నున్న శైలశిఖర మెక్కి | 100 |
వ. | చూచి సూక్ష్మరూపంబున నున్న యాచెవులపోతుం గనుంగొని గజేంద్రుం డోరీ | 101 |
గీ. | ఓషధులఁ బ్రోచి జీవుల నుద్ధరించు, కైరవాప్తునిదూత నిక్కడకు నన్ను | 102 |
వ. | అగ్గజశ్రేష్ఠునకు విజయుం డిట్లనియె. | 103 |
చ. | పెఱికినయాయుధంబు గొని భీతిలఁగాఁ బొడువంగఁ జూచినన్ | 104 |
వ. | కావున నేను నిజంబు పల్కెద నాకర్ణింపుము. | 105 |
క. | ఎదిరితనసత్త్వ మెఱుఁగక, మదమున వైరమ్ము గొన్న మతిహీనునకుం | 106 |
క. | ఈకొలను చంద్రుపేరన్, బ్రాకటముగ మున్ను కలిగె బహుపక్షికుల | 107 |
క. | ఇందులకుం గావలిగాఁ, బొందుగ మ మ్మునిచినాఁడు బుధజనకుఁడు మ | 108 |
క. | శశికి వంశ్యుల మగుటను, శశకము లనఁ బరఁగి ధాత్రిఁ జరియింతుము క | 109 |
క. | ఈతెఱఁ గెఱుఁగక వచ్చితి, మీతెరువున నడవ మింక నేఁగెద మిదె మీ | 110 |
క. | ఈయపరాధంబున కీ, రేయి కళానిధికి మ్రొక్కి ప్రియమున ననుపన్ | 111 |
ఉ. | అంతటఁ బ్రొద్దు గ్రుంకుటయు నాశశకంబు గజేంద్ర రోహిణీ | 112 |
క. | ఆచెవులపోతు కరిపతిఁ జూచి శశాంకుండు కరుణసొంపున నిన్నున్ | 113 |
క. | వచ్చినతెరువునఁ బోయిన, వచ్చుఁ జుమీ చేటు కాన వచ్చినపని నే | 114 |
క. | గజయూథంబులు గొలువఁగ, గజనాథుఁడు గదలెఁ తీవ్రగమనంబున న | 115 |
వ. | చనుదెంచి తత్పాదంబులకుం బ్రణామం బాచరించి దేవా గజయూథంబులు మన | 116 |
క. | కావున నీయల్పుఁడు ప్రజ, నేవెరవునఁ బ్రోచు టరిది హీనునిఁ బతిఁగా | 117 |
వ. | అనినఁ బక్షులు మాకు నక్కథ వినవలయుఁ జెప్పు మనిన వృద్ధకాకం బిట్లనియె. | 118 |
చ. | ఒక పెనుమ్రానికొమ్మతుద నొప్పగుగూఁట వసింతు నేను దా | 119 |
గీ. | అట్లు మెలఁగంగ నొక్కనాఁ డాఖగంబు, పొసఁగ మేఁతకునై పోయి మసలుటయును | 120 |
వ. | దీర్ఘకర్ణుం డనుపేరం బరఁగుశశకంబు చొచ్చికొనియున్నసమయంబున నాపక్షి | 121 |
గీ. | విడిచిపోయినయింటికిఁ బుడమిఱేఁడు, లేనిధరణికి మగదిక్కు లేనిసతికిఁ | 122 |
క. | నా కిప్పు డుండ నర్హం, బీకోటర మేల విడుతు నిలఁ జెఱువులుఁ బ | 123 |
వ. | మనుస్మృతిమార్గంబు గలదు గావున నే నిచ్చోటు విడువ ననినఁ బక్షి యిట్లనియె. | 124 |
క. | మొగమోట లేక నాయి, ల్లగు నని గైకొనఁగ నీకు నర్హమె యిచటన్ | 125 |
వ. | అనుటయు దీర్ఘకర్ణుండు తగ వనినం గా దనవచ్చునే రమ్మని వెడలిన నాపక్షియుం | 126 |
క. | యమునానదీతటంబునఁ దమసత్యవ్రతుఁడు గలఁడు దధికర్ణుఁ డనన్ | 127 |
వ. | కపింజలం బిట్లనియె. | 128 |
క. | పిల్లి కడుఁ గ్రూరహృదయం, బెల్లప్పుడు నమ్మఁ బోల దే నెఱుఁగుదు నీ | 129 |
క. | ఆచారవంతుఁ డుత్తముఁ, డీచేరువవార లెల్ల నెఱుఁగుదు రతనిన్ | 130 |
గీ. | భయము నీకు నాకుఁ బరఁగంగ నేకంబు, నాకు వచ్చుకీడు నీకు రాదె | 131 |
వ. | ఎడదవ్వుల నిలిచి దధికర్ణు నుద్దేశించి. | 132 |
క. | ఇరవునకునై వివాదం, బిరువురకుం గలిగి యిచటి కేతెంచితి మీ | 133 |
వ. | విని యల్లన తల యెత్తి చూచి దధికర్ణుం డిట్లనియె. | 134 |
గీ. | మున్నువలెఁ గాదు మిక్కిలి ముసలి నైతిఁ, గదిసియుండినయది గాని కాన రాదు | 135 |
క. | నను విశ్వసించి చేరం, జనుదెం డని పలుక నవియుఁ జకితస్థితి నొ | 136 |
క. | ధర్మంబు చెఱుపఁ జెఱుచును, ధర్మము రక్షించువానిఁ దా రక్షించున్ | 137 |
క. | ధర్మంబు పరమమిత్త్రుఁడు, ధర్మము వెనువెంట వచ్చుఁ దక్కినధనముల్ | 138 |
గీ. | ఇట్టిమాట లెల్ల విని నిజంబులు గాని, యధమవృత్తిఁ గల్లలాడ నేను | 139 |
క. | తలఁప నహింసకు మిగులం, గలిగినధర్మంబు లేదు గావున నే నీ | 140 |
క. | పరభామఁ గన్నతల్లిఁగఁ, బరధనముం బెంకు గాఁగ భావింపుచు స | 141 |
గీ. | సకలభూతసమితి సౌఖ్యదుఃఖంబులు, తనవిగాఁ దలంచుతత్త్వవిదుఁడు | 142 |
వ. | అట్లు గావున. | 143 |
గీ. | ఎవ్వరికి హింస చేయక హితము చేసి, నాఁడునాఁటికిఁ జాంద్రాయణవ్రతంబు | 144 |
క. | అని తమ్ము నమ్మఁ బలికిన, విని వెఱవక చేరఁ బోవ వేగమె రెంటిన్ | 145 |
వ. | కావున నీయల్పుండు రాజ్యార్హుండు గాఁ డని యావృద్ధకాకంబు పలికినం బక్షులు | 146 |
క. | నీ కేమికీడు చేసితిఁ, గాకమ రాజ్యార్హుఁ డితఁడు గాఁ డని నన్నున్ | 147 |
వ. | అని మఱియు నిట్లనియె. | 148 |
సీ. | తొడరి వాఁడిశరంబు దూఱి పాఱినగంటి, మంత్రౌషధంబుల మాన నేర్చుఁ | |
గీ. | గాన నాకుఁ బక్షిగణము లనుష్ఠించు, ప్రాభవంబు చెఱుపఁబడియెఁ గాన | 149 |
వ. | అదియ కారణంబుగా నులూకంబులకుఁ గాకంబులకు సహజవైరంబు వాటిల్లె నని | |
| సంధివిగ్రహంబు లిప్పటికిఁ బ్రయోజనంబులు గా వాసనయానద్వైధీభావసమాశ్రయం | 150 |
గీ. | వినుతుఁ డధికుఁడై కడుసమీపమున నున్న, హీనబలునకుఁ దనయున్నచోన యునికి | 151 |
క. | యానంబు గదలి పోవుట, గాన బలము లేని మనకుఁ గా దదియుం బెం | 152 |
గీ. | చిరసమాశ్రయవర్తన స్థిరతఁ జేసి, శత్రువరులను గెలుచుట సంశ్రయంబు | 153 |
క. | ఒడలికి నలజడి యైనన్, గడఁగి సమాశ్రయము నేన కావించెద ని | 154 |
క. | బలవంతు రైనశత్రులఁ, బలువురనేనియును బుద్ధిబలమున గెలువన్ | 155 |
వ. | అనినఁ గాకప్రభుం డత్తెఱం గెఱింగింపు మనినఁ బ్రధానాగ్రగణ్యుం డగుచిరంజీవి | 156 |
సీ. | యజ్ఞార్థ మనుచు ధరామరుఁ డొక్కఁడు, కొని యొకమేషంబుఁ గొంచు రాఁగఁ | |
గీ. | యనఁగ నమ్మి చీంబోతుఁ దా నచటఁ గట్టి, యాతఁ డాచమనార్థమై యరుగఁ దడవ | 157 |
ఉ. | కావున నేను శాత్రవనికాయము గెల్చెద సాహసంబుతో | 158 |
గీ. | మున్ను చచ్చినకాకులమూఁక నడుమ, నన్నుఁ బడవైచి తొలఁగి మిన్నక చనుండు | 159 |
గీ. | ఆచిరంజీవిఁ జెప్చినయట్ల చేసి, తానుఁ దనవారు నవ్వల తరువుఁ బాసి | 160 |
ఉ. | పొంగినవేడ్కతోడ మును పూర్వదిశాంగనఁ గూడి యుంటి నా | |
| శాంగనఁ జేరెనో యనఁగఁ నస్తగిరిన్ రవి చేరి క్రుంకినన్ | 161 |
వ. | అయ్యంధకారంబున జిరంజీవి తాను మున్నున్నవటమహీరుహంబుక్రింద మృతకాక | 162 |
గీ. | శత్రునిశ్శేషముగఁ జేసి చంపకున్న, నొకఁడు దప్పిన మన కది యొప్పకుండు | 163 |
వ. | అప్పలుకు లాకర్ణించి యతనిమంత్రు లేకవాక్యంబుగా నిట్లనిరి. | 164 |
ఉ. | దేవర నీతివాక్యము సుధీవిభవాఢ్యులు మెచ్చ నాడితౌ | 165 |
వ. | అవ్విధం బంతయు నెఱింగి చిరంజీవి తనలో నిట్లని వితర్కించె. | 166 |
గీ. | మొనసి చేయవలయు మొదల నుద్యోగంబు, చేసెనేని కార్యసిద్ధిఁ బొందఁ | 167 |
వ. | ఉన్న సమయంబున. | 168 |
క. | కాకంబు లెల్ల మడిసెం, గా కిచ్చట నొకటి యైన గలిగెనె యనుచున్ | 169 |
వ. | ఇట్లు గూసినచిరంజీవికూత విని యులూకంబులు పోక మగిడి వచ్చి యచ్చోటు | 170 |
సీ. | అవధరింపుఁడు నన్ను నమ్మేఘవర్ణుండు, దప్పక కార్యంబు చెప్పు మనిన | |
గీ. | యోరి పగవారిపక్షమై నోరికొలఁది, నోడితివి దీనఁ జే టగుఁ గుడువు మనుచుఁ | 171 |
క. | దిగ విడువక ప్రాణంబులు, తగ నాకంఠమున నిలిచి తల్లడపఱచెన్ | 172 |
వ. | అనుటయు నుపమర్దుండు రక్తాక్షుండు మొదలయినతనయమాత్యులం గనుంగొని వీని | 173 |
ఉ. | ఈతఁ డసాధ్యశత్రుఁ డని యించుకయు న్మతి లేక వీని దు | 174 |
గీ. | వీఁడె కాఁడు హీనవిమతుఁ డైనను నొచ్చి, చిక్కినపుడ వేగఁ జెఱుపవలయు | 175 |
వ. | అనుటయు నుపమర్దనుండు క్రూరాత్ముం డనుతనయమాత్యు నడిగిన నతం డిట్లనియె. | 176 |
క. | శరణము జొచ్చినవానిన్, బరిమార్చినయతని కధికపాపం బనుచున్ | 177 |
వ. | అనిన నతండు దీప్తాక్షుం డనునమాత్యుం గనుంగొని నీమదిం దోఁచిన కార్యంబు చెప్పు | 178 |
చ. | అనఘ యెఱుంగ వెందు శరణాగతుఁ జంపినచోటు చెప్పఁగా | 179 |
వ. | అనుటయుఁ దత్కథాక్రమం బెట్టి దనిన నుపమర్దున కతం డిట్లనియె. | 180 |
ఉ. | ము న్నొకపట్టణంబునఁ బ్రమోదమునన్ ధనగుప్తనామసం | 181 |
గీ. | మెలఁగు నాసతి దనపతి మిగులవృద్ధు గాన వెన్నఁడు నొల్లక కదియనీక | 182 |
వ. | ఆచోరుండు నలుదిక్కులం బరికించునప్పు డనర్ఘ్యమణికనకభూషణాలంకృతయై | |
| తదీయాభరణకాంతు లినుమడింప నక్కంబుకంఠికంఠాభరణం బపహరింపం గరంబు | 183 |
క. | తొడగినతొడవులదీప్తులు, తొడిఁబడి చీఁకట్లు దూలఁ దూలఁగఁ దనపైఁ | 184 |
వ. | తనజీవితేశ్వరుం డున్నదిక్కున కభిముఖియై. | 185 |
సీ. | కరికుంభములకంటెఁ గడుసైనచనుదోయి, యుగ్మలి బిగియార నొత్తి యొత్తి | |
గీ. | తెలుపునంతట మేల్కని తెలివి నంది, తనకుఁ బ్రియకాంత చేసినధన్యతకును | 186 |
వ. | ఆవైశ్యుండు కొండొకసేపున కాకుటిలకుంతల కిట్లనియె. | 187 |
క. | ఏకాలంబున వెనుకను, నీకౌఁగిలి నాకు నబ్బ నేరదు భాగ్యం | 188 |
వ. | అనిన నయ్యింతి భయముకతనం బలుకక నిజకటాక్షవీక్షణంబులం గరాభినయ | 189 |
ఉ. | ఈరమణీలలామ నను నెప్పుడు వృద్దుఁ డటంచు దగ్గఱం | 190 |
వ. | అనినఁ జోరుం డిట్లనియె. | 191 |
చ. | కలధన మెల్ల దేవుకొని గ్రక్కునఁ బోయెద నంచు వచ్చి నీ | 192 |
వ. | అనిన వైశ్యుం డతని కిట్లనియె. | 193 |
క. | ఉపకారంబునకును బ్ర, త్యుపకారము సేయ కుంట యుచితమె నీ వీ | 194 |
వ. | తనకుం గలిగినధనం బంతయు నతనిముందటం బెట్టి నీ వేమియుం బెనంగక కొనిపొ | 195 |
క. | తెగి చంపరాదు కాకముఁ, బగతురు దమలో విరోధపడిరేని శుభం | 196 |
వ. | అనినఁ దత్కథాక్రమం బెట్టి దని యుపమర్దుం డడిగిన నావక్రనాసుం డిట్లనియె. | 197 |
చ. | ఘన మగునగ్రహారమునఁ గర్మవిదుం డొకబ్రాహ్మణుండు పా | 198 |
గీ. | మొగులు సన్నపుఁజినుకుతో ముసురుకొనుట, మీఁదఁ జీఁకటి దట్టమై మెండుకొనుట | 199 |
సీ. | ఎదురుగా నొక్కరుఁ డేగుదెంచిన వానిఁ, దరలక చోరుండు దాఁకి బెదరి | |
గీ. | యపహరించుకొఱకు నరిగెద నే నన్న, నేను నతనిఁ బట్ట నిపుడు వత్తు | 200 |
వ. | కదియం బోయి యమ్మహీదేవుగృహద్వారంబునొద్ద నిలిచి చోరునిం జూచి బ్రహ్మ | 201 |
గీ. | ఏను మున్ను పోయి యీయింటివిప్రునిఁ, బట్ట భుక్తి నాకుఁ బెట్టఁ జూచి | 202 |
వ. | చోరుం డిట్లనియె. | 203 |
గీ. | తొలుత నీవు విప్రుఁ దెలిపిన మఱి నాకుఁ, బట్ట నెట్టు వచ్చుఁ బశుయుగంబు | 204 |
వ. | అని మఱియు నిట్లనియె. | 205 |
క. | చొరఁబడి గోయుగముం గొని, సరగున నే నూరు వెడలి చనునంతట భూ | 206 |
క. | పసుల మును నీవు దోలిన, ముసరిన నెవ్వగల నతఁడు ముచ్చిరుచుండన్ | 207 |
వ. | ఇవ్విధంబున నయ్యిరువురు నొండొరులమీఁదియాగ్రహంబున మెల పెఱుంగక | 208 |
ఉత్సాహ. | వెస నితండు నిన్నుఁ బట్ట వేచి వచ్చె బ్రహ్మరా | 209 |
గీ. | విని మహీసురవర్యుండు వితతమంత్ర, బలమునను బ్రహ్మరాక్షసుఁ బాఱఁ దోల | 210 |
క. | కావున శరణాగతునిం, గావం దగుఁ గాని చంపఁ గా దనినయెడన్ | 211 |
వ. | వక్రనాసుండు చెప్పినయట్ల చెప్పిన విని రక్తాక్షుండు సముస్థితుండై మ్రొక్కి యుప | 212 |
గీ. | దీనదశ దోఁపఁ బగతుండు హీనవృత్తి, నడఁగి బల మబ్బువేళను మడఁగఁజేయు | 213 |
వ. | అని మఱియు నిట్లనియె ము న్నిట్టిప్రియాలాపంబుల కలరి. | 214 |
క. | ప్రేమను జారిణి యగుతన, రామను శిరసావహించె రథకారుఁ డొకం | 215 |
వ. | అతం డిట్లను రథకారుని కొక్కకులకాంత గలదు దానితెఱంగు వినుండు. | 216 |
క. | నగుమొగముఁ గలికికన్నులు, బిగిచన్నులు నసదునడుము బింబాధరమున్ | 217 |
క. | ఆపొలఁతుక పరపురుష, వ్యాపారము సేయుచుండ వరుఁ డెఱిఁగి నిజం | 218 |
ఉ. | బాలరొ నన్ను రాజు పనిపంపఁగఁ బోవుచునున్నవాఁడఁ బో | |
| నేల నృపాలుకొల్వునకు నేగతి వచ్చె నవస్థ యంచుఁ జిం | 219 |
ఉ. | ఎన్నికబంట వీవు నిను నేలిక పిల్చి ప్రియంబు చెప్పినన్ | 220 |
వ. | అని ససంభ్రమంబును సకౌతుకంబునుంగా నమ్మగువ యతని మజ్జనభోజనాదులం | 221 |
క. | తడ నోర్వవు ప్రాణంబులు, దడసి నినుం బాసి నాకుఁ దప్పదు నీకున్ | 222 |
గీ. | అనుచుఁ గందర్పసంక్రీడ నాత్మనాభు, నుల్ల మలరంగ నేర్పుల నోలలార్చి | 223 |
క. | పుచ్చి యుపనాథుఁ బిలువం, బుచ్చి యుదక మాడఁబోవఁ బోవక మగుడన్ | 224 |
వ. | పదంపడి యక్కాంతయు. | 225 |
చ. | ఒడలికి నాడి సన్నమణుఁ గొప్పఁగఁ గట్టి సుగంధ మంతటం | 226 |
గీ. | ఇవ్విధంబునఁ గైసేసి యిందువదన, దీప్తు లడరంగ నద్దంబు తెచ్చి చూచి | 227 |
వ. | అయ్యవసరంబున నుపనాథుండును నతిసంభ్రమంబున నలంకరించుకొని దూతి | 228 |
క. | ఆసమయంబునఁ బుష్పశ, రాసనుసామ్రాజ్యలక్ష్మి యన శృంగారో | 229 |
వ. | ఇట్లు చేరినకాంతాతిలకంబునకుం గదిసి యతం డిట్లనియె. | 230 |
ఉ. | ఎప్పుడు పిల్చుఁ బద్మముఖి యెప్పుడు దానిప్రియుండు వోవు న | |
| నెప్పుడుఁ గోరుచుండుదు మహిం దలపోయఁగ నేను ధన్యుఁడన్ | 231 |
క. | అని మఱియుఁ బ్రియము చెప్పుచు, ఘనపరిరంభంబు చేసి కాంతయు నతఁడున్ | 232 |
గీ. | మగువ కాలు చాప మగనిఁ దాఁకుటయును, నతివ యాత్మలోన నది యెఱిఁగి | 233 |
వ. | విచారించుసమయంబునం గూటమితమకంబున నమ్మగువయభిప్రాయం బెఱుంగమిం | 234 |
గీ. | నాకు వలతొ మున్ను చేకొన్నమగనికి, వలతొ నిజము చెప్పవలయుఁ జెలియ | 235 |
ఉ. | ఓరి దురాత్మ నీవును బ్రియుండవె నాహృదయేశుకాలిపై | 236 |
వ. | అదియునుంగాక. | 237 |
సీ. | మగఁడు దైవం బని మదిఁ దలంచినయట్టి, మగువ పుణ్యాంగన మగువలందు | |
గీ. | గాన సతియుఁ బతియుఁ గలకాల మెల్లను, దోడునీడ గాఁగఁ దొలఁగ రనిన | 238 |
వ. | ఇట్లని తలంచె. | 239 |
గీ. | మిగులఁ బక్ష మైనమెలఁతుక యొకనాఁడు, ప్రియము పుట్టి యొకనిఁ బిలిచెనేని | 240 |
క. | పరపురుషుండును దరుణియు, సురతశ్రమపారవశ్యసుఖసుప్తిమెయిం | 241 |
ఉ. | ఆరథకారుఁ డల్లన నిజాంగనఁ దెల్పినఁ గన్ను విచ్చి యా | 242 |
గీ. | అనిన దానినాథుఁ డటఁ బాసి తొలఁగిన, నొద్ద నిదురపోవుచున్న విటునిఁ | 243 |
క. | ఆమంచము తల నిడుకొని, ప్రేమంబునఁ బెద్దవీథిఁ బెట్టిన జారుం | 244 |
వ. | కావునఁ బ్రత్యక్షదోషంబు చేసినవానిం జూచి యైన నవివేకి మంచిమాటలకుం జొక్కి | 245 |
ఉ. | నీపగవానిముందటను నీగుణముల్ గొనియాడఁ గోపసం | 246 |
క. | తనయేలిక ముదల కొనక, గొనకొని ప్రాణంబు విడువఁ గొఱగా దనినన్ | 247 |
గీ. | చచ్చి యేమి సేయు దిచ్చట నీ వన్న, నతఁడు దా నులూక మగుచుఁ బుట్టి | 248 |
వ. | అనిన విని రక్తాక్షుం డవ్విధంబు సేయ నీకు సాధ్యంబుగా దెట్లనినఁ దొల్లి యొక్క | 249 |
సీ. | మునివరుఁ డొకరుండు ముఖ్యతీర్థము లెల్ల, నాడి భాగీరథి కరిగి యందు | |
గీ. | నతఁడు గనుఁగొని కౌతుకాయత్తచిత్తుఁ, డగుచు నమ్మూషికముమీఁద నిగుడుకరుణఁ | 250 |
క. | ఆరామయుఁ దనకన్నకు, మారికకం టెను గరంబు మక్కువ మెఱయన్ | 251 |
వ. | అతిమనోహరాకార యైనయక్కొమ్మం గనుంగొని యొక్కనాఁ డమ్మునీశ్వరుండు | 252 |
క. | ఈకన్నియఁ దగువరునకు, నీకున్న రజస్వల యయి యిది వృషలి యగున్ | 253 |
క. | త్రిభువనదీపకుఁ డగునా, నభోమణిఁ దలంచిన వేగ నమ్మునిమ్రోలన్ | 254 |
క. | ఈరూపవతికి మర్త్యులు, గా కని నిలిపితిని భార్యఁ గైకొనుమీ | 255 |
ఉ. | ఏణవిలోలనేత్ర వరియింప మహాబలుఁ డైనయాజగ | 256 |
చ. | తలఁచిన నాసమీరుఁడును దత్పరతం బొడచూపి నిల్చినన్ | 257 |
ఉ. | నా కధికుండు దేవపతి నాతుక నాయన కిచ్చినన్ దగుం | 258 |
వ. | అని యిట్లు వాయుదేవుం డమ్మునీంద్రు నొడంబడం బలికి యతనిచేత ననుజ్ఞా | 259 |
చ. | అతులతపస్సమాధినియతాత్ములు నధ్వరకర్తలున్ దృఢ | 260 |
వ. | అని మఱియు ననేకప్రకారంబులఁ బ్రస్తుతింపఁ బ్రసన్నముఖుం డైనశతమఖున | 261 |
సీ. | కలికిచూపులకాంతిఁ గలువతోరణములు, పచరించినట్లున్న బాలఁ జూడు | |
గీ. | నమరవల్లభ నీకైన నమరుఁ గాని, నరసురాసురయక్షకిన్నరవరులకు | 262 |
వ. | అని యిట్లు మహేంద్రునకు నన్నారీరత్నంబుపయిం బ్రియంబు పుట్టం బల్కిన తప | 263 |
చ. | సురుచిరరత్నసానువుల శుద్ధసువర్ణమహోన్నతాయత | 264 |
ఉ. | మేరుమహామహీధరము మీకును మాకును బెద్ద గావునన్ | 265 |
వ. | అమ్మునీంద్రుండు తనమనంబున. | 266 |
గీ. | పిలిచి యీఁబోవ నెవ్వారు దొలఁగనాడి, పడుచు నొల్లమి లోకంబుపాడి గాదె | 267 |
వ. | ఒల్లకున్న నేమి యగు నని మహామేరువుం దలంచిన నమ్మహీధరంబును నత్యంతసుకు | 268 |
గీ. | ఎవ్వరికి నీక నీకు నే నిత్తు ననుచు, నింతగాఁ బెంచినాఁడ నీయిందువదన | 269 |
వ. | అన నమ్మహీధరం బిట్లనియె. | 270 |
గీ. | చూడ సూక్ష్మంబు గాని నా సొబగుమేను, ఘాతగొని పెక్కు లాఁగలు గాఁగఁ ద్రవ్వు | 271 |
ఉ. | కావున నీకుమారికకుఁ గాంతుఁడు మూషిక మైన నొప్పుఁ గా | 272 |
క. | ముని పుణ్యాశ్రమభూములు, వనితం గొని తిరిగి తిరిగి వరియింపుఁ డటం | 273 |
గీ. | ఇంత చక్కనితరుణి మహీసురులకు, నమర నేర్చునె రాజుల కైనఁ గాక | 274 |
క. | ఇది దాఁ గన్యాత్వంబున, ముదిసినఁ గడుధర్మహాని మున్నిటిరూపం | 275 |
క. | అని పలుక నపుడు మూషిక, తనువునఁ దనమ్రోల నున్నదానిని ఖేదం | 276 |
వ. | అట్లు గావున. | 277 |
తరల. | ఇనసమీరణదేవతాధిపహేమశైలము లాదిగాఁ | 278 |
వ. | అంతట నుపమర్దుండును జిరంజీవిఁ జేరంబిలిచి యభయం బిచ్చి వెఱవ కుండు మని | 279 |
క. | అరులకుఁ గలసత్త్వంబును, దెరువులు నునికియును వారు ద్రిమ్మరుతావుల్ | 280 |
గీ. | అని విచారించి గుహచుట్టు నరయఁ దొల్లి, యాలమందలయునికిప ట్టగుటఁజేసి | 281 |
వ. | తిరిగి పెద్దవాకిట వచ్చి యులూకంబులఁ జూచునప్పు డవి రాత్రి దూరదేశంబులు | 282 |
ఉ. | నమ్మినవారిఁ జంపినను నాకు నధర్మము గాదు లెస్సగా | 283 |
ఉ. | ఏపని చేయు మంచుఁ దనయేలిక సేవకుఁ బంచెఁ బొందుగా | 284 |
సీ. | అని నిశ్చయింపుచు నతివేగమునఁ జని, యేలికఁ గాంచి కే లెత్తి మ్రొక్కి | |
గీ. | మెఱసి నేర్పున ముక్కునఁ గఱచిపట్టి, కడలఁ దృణకాష్ఠములు గొంచుఁ గాకకులము | 285 |
క. | ఘూకంబు లున్నగుహకునుఁ వాకిటఁ గాష్ఠములుఁ దృణము వడిఁ గప్పింపన్ | 286 |
వ. | తనదుపక్షానిలంబునంజేసి యయ్యనలంబు నిగుడం జేసిన. | 287 |
శా. | ధూమజ్వాలలతోడివహ్ని గుహలోఁ దూరంగ నయ్యండజ | 288 |
వ. | రక్తాక్షుం డుపమర్దున కిట్లనియె. | 289 |
క. | తెగి చంపరాదు గాకముఁ దగ వని దుర్ణీతు లపుడు దలకొల్పఁగ నీ | 290 |
క. | హితుఁ డైనమంత్రి పలుకులు. మతి ననుమానించి విననిమావవపతి యీ | 291 |
వ. | అనిన విని యుపమర్దుం డిట్లనియె. | 292 |
గీ. | విను మధర్మమైనపని ధర్మ మని తోఁచుఁ, గానితెరువు తెరువుగాఁ దలంచు | 293 |
ఉ. | కావున నాకుఁ బధ్య మగుకార్యముగాఁ గడు నొత్తి యమ్మెయిన్ | 294 |
మ. | ఒకయక్షౌహిణితోడఁ బాండవబలం బున్న న్నిశామధ్యవే | 295 |
గీ. | అని యూరకుండునంతట, ననలశిఖాసమితిచేత నన్నియు సమయం | 296 |
క. | అవి యుపమర్దనునంగము, లివి యారక్తాక్షముఖ్యహితమంత్రిసుహృ | 297 |
గీ. | అపుడు మేఘవర్ణాదివాయసకులంబు, పొరిఁ జిరంజీవిఁ బొగడుచుఁ బోయి నిజని | 298 |
వ. | చిరంజీవి నాలోకించి నీ విన్నిదినంబులు శాత్రవజనంబులు నమ్మునట్లుగా నెవ్విధం | 299 |
గీ. | సకలదిక్కుల రాజుల శౌర్యమహిమ, గెలిచి తనుఁ గొల్చుతమ్ములు గలుగునట్టి | 300 |
సీ. | కాషాయదండంబు గైకొని యమసూతి, కంకుభ ట్టనునామకంబు దాల్చె | |
గీ. | కృష్ణ సౌభాగ్యరేఖ నుత్కృష్ట యయ్యు, నిలిచె సైరంధ్రి యను పేర నీచవృత్తి | 301 |
క. | ఏనును నవ్విధమునఁ గడు, హీనదశం బగరఁ గొలిచి యీడేర్చితి నీ | 302 |
వ. | అనిన మేఘవర్ణుండు చిరంజీవి కిట్లనియె. | 303 |
క. | నీ వసిధారావ్రతమున, నావంతయు శంక లేక యహితులలోనన్ | 304 |
సీ. | అవధరింపుం డులూకాధీశమంత్రుల, లోన రక్తాక్షుఁ డనూనవిభవ | |
గీ. | నన్నుఁ జంప బుద్ధు లెన్నియేనియుఁ జెప్ప, వినయమున నులూకవిభుఁడు వినక | 305 |
క. | శరణాగతులం జంపెడు, పురుషులు నెచ్చోటఁ గానమును వినమును సు | 306 |
వ. | అనిన వారివచనంబు లవలంబించి రక్తాక్షుపలుకు లనాదరంబు చేసి నన్నుఁ దోడ్కొ | 307 |
క. | పగవానిపక్షమునవాఁ, డగపడినం గాచెనేని నత్యాసన్నుం | 308 |
గీ. | అరులవద్దనుండి యరుదెంచి కొల్చిన, భటుఁడుఁ బాము నొక్కభంగి గాన | 309 |
వ. | అని చెప్పి మఱియును. | 310 |
సీ. | జలక మాడెడువేళ సరసాన్నపానంబు లింపైనయవి భుజియించుతఱిని | |
గీ. | నృపుఁడు దేహంబుసంరక్ష నియతిఁ జేయఁ, దగును ధర్మార్థకామసాధనము గాఁగ | 311 |
సీ. | దుర్మంత్రి నేలినతోడనే చెడు రాజు, చెడు నపథ్యంబులు చేసి రోగి | |
గీ. | వింతభంగి దుర్వ్యసనికి విద్య చెడును, జెడు సుఖంబు పరాధీనసేవకునకు | 312 |
సీ. | శుష్కకాష్ఠంబులసోఁకున నగ్నియు, నతిమూర్ఖువలనఁ గ్రోధానలంబుఁ | |
గీ. | నంతకంతకు నభివృద్ధి నందునట్లు, విశ్రుతోద్యోగనిజధైర్యవిక్రమముల | 313 |
వ. | అని మఱియును. | 314 |
ఉ. | మూఁపున మోసి యైన రిపుమూర్తిఁ జెడం దఱి వేచి యుండఁగా | 315 |
వ. | అనిన మేఘవర్ణుం డక్కథ వినవలతుం జెప్పు మనినఁ జిరంజీవి యిట్లనియె. | 316 |
గీ. | మందవిషుఁ డనుపేరిట బొందుపడిన, యురగ మిట్టట్టు నాఁకటఁ దిరుగుచుండి | 317 |
క. | కని యక్కొలనిసమీపం, బునకున్ జేరంగ నరిగి భోగివిభుఁడు గ్ర | 318 |
వ. | ఎలుంగు కుత్తుకం దగుల హీనస్వరంబున నిట్లనియె. | 319 |
క. | నాకడుపుకొఱకు దైవం, బీకార్పణ్యంబు దెచ్చె నెవ్వరి నడుగం | 320 |
వ. | అనుటయు నమ్మండూకాధీశ్వరుం డగుజలపాదుండు మమ్ము నిప్పు డాశ్రయించు | 321 |
సీ. | అర్ధరాత్రపు వేళ నాఁకొని డస్సి నే, నెరకునై యిట్టట్టుఁ దిరుగుచుండ | |
గీ. | మంత్రవాదులఁ గొనివచ్చి మందు లొసఁగి, యతిని బ్రతికించుకొని నన్ను నాత్మఁదలఁచి | 322 |
క. | పసిపాపఁ డనక నాసుతుఁ, గసుమాళపుఁజెడుగుఁబురుగు కఱచెను దీనన్ | 323 |
వ. | అని యతం డెంతయు నలుక వొడమిన వెండియు. | 324 |
ఉ. | కప్పల మోచిమోచి కడగానక వాసిన గొల్చి యాఁకటన్ | 325 |
గీ. | సుతుఁడు చచ్చేనేని సుతునితోడనె కూడ, నరుగునట్లు గాఁగ నహి శపింతుఁ | 326 |
వ. | అని యిట్లు ఘోరంబుగా శపియించిన నమ్మహీసురవరునిష్ణురాలాపంబులు నాకుఁ | 327 |
గీ. | అశనిహతుఁ డైన శూలవిద్ధాంగుఁ డైనఁ, బడక యొకచోటఁ గొఱ దప్పి బ్రతుకుఁ గాని | 328 |
తరల. | అనువిచారము నామదిం గడు నగ్గలంబుగఁ బర్వినన్ | 329 |
వ. | అని మఱియును. | 330 |
శా. | మామీపెద్దలు బుద్ధిచాలమిఁ గడున్ మైత్త్రిన్ సుఖామోఘవి | 331 |
ఉ. | ఉండిన నూరకుండుదునె యొక్కరుఁ డీపని చేయ నోపఁ డీ | 332 |
వ. | అనినం బ్రమోదాయత్తచిత్తుండై జలపాదుం డలవు మిగులఁ బుట మెగసి ఫణిపతి | 333 |
క. | వడిగా నడచిన మాకుం, గడువేడుక గాక మందగమనము మా కి | 334 |
వ. | అనుటయు మందవిషుం డిట్లనియె. | 335 |
గీ. | మీరు పెట్టక కాని యాహార మిచట, నబ్బకుండుట తెలిసినయదియ కాదె | 336 |
వ. | అని మఱియును. | 337 |
క. | ఈకొలఁది చూడ దేహము, నా కేమియు వశము గాదు నడవఁగ నోపన్ | 338 |
వ. | అనుటయు భేకకులాధీశ్వరుం డయ్యహికిం గరుణించి నీకు ముదల వెట్టితి నిక్కొలని | 339 |
చ. | వలసినకప్పలం గడుపువాచఁగఁ బారణ చేసి వచ్చి ని | 340 |
వ. | అంతట నొక్కనాఁడు మందవిషుండు జలపాదశేషం బైనసరోవరంబునఁ గ్రుమ్మరి | 341 |
క. | భూసురశాపము నన్నుం, జేసినదోషంబు నిన్నుఁ జెందినపనికిం | 342 |
వ. | వధియించి యాకృష్ణసర్పంబు నిజేచ్ఛం జనియెం గావున నేనును నవ్విధంబున శత్రుల | 343 |
గీ. | అగ్నిశేషంబు ఋణశేష మహితశేష, మడఁపలేకున్న నవి వృద్ధి యగుడు నేచి | 344 |
గీ. | అడవి నిర్దహింప ననలంబు తరుమూల, రక్ష సేయ మొలచుఁ గమ్మఱంగ | 345 |
వ. | అని విచారించి పగతుగ నిరవశేషంబుగా సంహరించిన భాగ్యవంతుండ వని పలికి | 346 |
సీ. | వ్యసనశీలుఁడు గాక వసుమతీనాథుండు, సకలప్రజానురంజనము వడసి | |
గీ. | యాత్మసంరక్ష మఱవ కహర్నిశంబు, ధార్మికుం డని జగ మెల్లఁ దన్నుఁ బొగడ | 347 |
వ. | అని మఱియును. | 348 |
క. | కడిఁదిపగరు గైదువు గొని, పొడిచినయెడ నైన బ్రదుకు బుద్ధిని జెఱుపం | 349 |
చ. | అలఘునిశాతహేతి నదరంటఁగఁ దాఁకినవైరి యాహవ | 350 |
వ. | అని మఱియును. | 351 |
క. | ఏపని యుద్యోగించిన, నాపని దైవానుకూల మైన ఫలించున్ | 352 |
వ. | కావున దైవానుకూలత లేని పౌరుషవ్యాపారంబు నిరర్థకం బెట్లంటేని. | 353 |
సీ. | తాపసవేషంబు ధరియించె రాముఁడు, బంధనప్రాప్తుఁడై బలి యడంగె | |
గీ. | సర్వమును దైవవశమున జరుగు జగము, గాన నేరక తాఁ గర్తగాఁ దలంచు | 354 |
వ. | అని మఱియును. | 355 |
చ. | శ్రుతమునఁ జేసి బుద్ధి మతిశూన్యఘనవ్యసనంబుచేత మూ | 356 |
వ. | అని యిట్లు చిరంజీవి చెప్పినహితోపదేశంబునకుఁ బగ సాధించినసాహసంబునకుఁ | 357 |
ఉ. | హారపటీగహీరరజతాద్రితుషారధరాధరేంద్రమం | 358 |
క. | ఉభయదళరుద్ర లక్ష్మీ, శుభమందిర సతతదానశోభిత సమ్య | 359 |
మత్తకోకిల. | వాసవప్రతిమానవైభవ వైరిరాజభయంకరా | 360 |
గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ నారా
యణనామధేయప్రణీతం బైనపంచతంత్రంబనుమహాకావ్యంబునందు
సంధివిగ్రహం బనునది తృతీయాశ్వాసము.
————