నే గననా సామి - నే గననా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
నే గననా సామి - నే గననా
శ్రీగల వాడవు నీవని - చిన్నతనము సుందరుండవని
కౌగిట నేను బదినాలుగు విధముల - గరడీలు గరపినది ॥నే గననా॥

చరణం1:
వేడుక కాడవు నీవని - వీధిలో నినుగని పోకుమని
కోడెకాడ రారమ్మని - కోడిగము లాడినది ॥నే గననా॥

చరణం2:
చక్కని వాడవు నీవని - చనవుగలదు వెరపేమి యని
చక్కిలి గింతలు గొలుపుచు మోవి చు - రుక్కున నొక్కినది ॥నే గననా॥

చరణం3:
వాసిగ వల్లూరి వాసుడని - భాసుర వేణుగోపాలుడని
దాసు రామకవిపాలుడని దర - హాసము జేసినది ॥నే గననా॥