నేనెరుగనా నీజాడ - నాసామి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
నేనెరుగనా నీజాడ - నాసామి నేనెరుగనా ॥నే॥

అనుపల్లవి:
మాను నీ వగలెల్ల - మావద్దనా సామి ॥నే॥

చరణ:
మరుపెన్నటికి రాని - మంచి మాటలె చెప్పి
అరచేత వైకుంఠ మట్టెచూపి
పరిపూర్ణ దయ గలిగి - పనులెల్ల కానిచ్చి
సరసుడవు నీ వింద్ర జాలములు చేసేవు ॥నే॥

ముద్దు నాసామి నీ - మురిపంపు సుద్దులివి
ముత్యాలు పదివేలు - మూటగట్టు
బద్దులాడను పంచ - బాణుడాన నీవలపు
మిద్దె పై నిడుపరుగు - మీసాలపై తేనె ॥నే॥

కనికరము పూజ్య మా - కాశ పుష్పము నిజము
వినవోయి మగవారి - వింతలెల్ల
ఘనదాసు శ్రీరామ - కవికీర్తనంబులే
విన వేడుకాయె నీ - పని పదిల మాయెనిక ॥నే॥