నేను నీదాన నా - మేను నీ దేనురా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
నేను నీదాన నా - మేను నీ దేనురా
నీనా సందున - గానడెవాడురా ॥నేను॥

చరణ:
ఎన్నడు నీమాట - కెదురాడనురా
మన్నించి తిన్నగ - మాటాడ వేమిరా ॥నేను॥

ఓరీ నాసామి నే - కోరితిరా నిన్నే
తీరైన గుబ్బల - గోరులుంచ రార ॥నేను॥

భాసుర వేణుగో - పాల దయాళవాల
దాసు శ్రీరాముని - దయనేల వదేల ॥నేను॥