నీదు పదయుగమే శరణమని
స్వరూపం
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు
రాగం: మధువర్షిణి తాళం: ఆది పల్లవి: నీదు పదయుగమే, శరణమని నేను తలచెద దేవీ! గౌరీ! అనుపల్లవి: మనసున కలతలు వీగీపోగా బ్రతుకున శుభములు సాగీరాగా తలపుల సొగసులు వాగైసాగా మాయలు మనసున మాడీపోగా నీ పదగరిమలు జోడైరాగా ఎడదయు చెలిమికి గూడే కాగా గురుపద నిరతియు నీడై ఊగా అనుదిన జపములు తోడై మూగా జగముల నెటుగన శ్రీచక్రంబే మిలమిల మెరయుచు మాకై వెల్గా ఆ నవ వరణల పూజావేళా మా మతి గృహముల పూలే రాలా సచిదానందపు తేనే పొంగా