నీతోటి మాటలు - నాకేలరా సామి

వికీసోర్స్ నుండి


పల్లవి:
నీతోటి మాటలు - నాకేలరా సామి
నాతోటి మాటలు - నీకేలరా ॥నీతోటి॥

అనుపల్లవి:
నే తాళ దానితో - ఖాతాలు నీకేల
ప్రీతిగల నాతియని - పోతివి రాతిరి ॥నీతోటి॥

చరణ:
పరువటరా నాతో - పనులేమిరా సామి
పరువటరా నాతో - పనులేమిరా
విరజాజి బంతులు - విసరకురా సామి
సరసము విరసమౌ - చాలుర చాలుర ॥నీతోటి॥

ఒయ్యార మిదియేమి - ఊరుకోరా సామి
ఒయ్యార మిదియేమి - ఊరుకోరా
ఉయ్యాల మంచము - నూచకురా సామి
అయ్యది గయ్యాళి - అయ్యయో అయ్యయో ॥నీతోటి॥

వేసమా వల్లూరి - వేణుగోపాలా సామి
వేసమా వల్లూరి - వేణుగోపాలా
దాసు శ్రీరాముని - భాసుర వాక్యము
చేసెరా వేయివేలు - సేబాసు సేబాసు ॥నీతోటి॥