నిలునిలు మటుండుమీ - నాసామి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
నిలునిలు మటుండుమీ - నాసామి
నీవు నాదరి రాకుమీ - నాసామి ॥నిలు॥

చరణ:
ఆ మాయలాడి - ఏమి బోధించెరా
సామి నాకు దెల్పరా - సంశయమేమిరా ॥నిలు॥

సన్నుతాంగిని గూడి - నాసాటి వారిలో
నన్ను రద్ది జేయుట - న్యాయము గాదుర ॥నిలు॥

వేసగాడవుగద - వేణుగోపాలసామి
దాసుశ్రీరామకవిని - ధన్యుని జేయర ॥నిలు॥