నిను ధ్యానించెద నోయమ్మా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

రాగం: దేశ్        తాళం: ఆది

పల్లవి:
నినుధ్యానించెద నోయమ్మా
నను కాపాడుము మాయమ్మా

నీ పదములు కెందామరలై
నా యెద కొలనున విచ్చినవి
నీ పదనఖరుచి వెన్నెలలై
హృదయాంబరమున పర్వినది
నా-హృదయాంబరమున పర్వినది

నీ చిరునవ్వులు మల్లియలై
నా యెదతోటను రాలినవి
నీ కనుచూపులు దివ్వియలై
హృదయ గృహమ్మున వెల్గినవి
నా-హృదయగృహమ్మున వెల్గినవి

నీ జ్యోతిస్సులు వెల్లువలై
ఆహా! నను ముంచెత్తినవి
నీ భావనలే శ్రీసచ్చిదా
నందములై పురివిప్పినవి


ఈ పాట mp3