Jump to content

నా సామి నీకిది - న్యాయమా

వికీసోర్స్ నుండి


పల్లవి:
నా సామి నీకిది - న్యాయమా న్యాయమా
నా సాటివారిలో - నగుబాటు లాయెరా ॥నా సామి॥

చరణ:
సుందరాంగ నిను - జూచినప్పటి నుండి
ఇందన్నము నిద్ర - నేనెరుగ నన్నేలరా
అందరాని మ్రాని పండ్ల - కాసించి నట్లాయె బ్రతు
కెందుకిక నా - యందు దయ రాదేమిరా ॥నా సామి॥

పాటలాధర నిన్ను - పటమున వ్రాసుక
మాటి మాటికి తమి - నాటి చూచుకొనుచు
కాటుక కన్నుల వెంట - దీటుగా జారు కన్నీట
మీటిన విచ్చు గుబ్బలపై - శాటి దడిసె నీ కేటిమాటలు ॥నా సామి॥

వర తోట్ల వల్లూరి - వాసా వేణుగోపాలా
స్థిర శీల ఘన దాసు - శ్రీరామకవి పాల
కరుణలేదాయె నాపై - మరుబారి కోర్వగలనా
సురత సుఖమున నరసి ప్రోవర - చరణములకే శరణుజొచ్చెద ॥నా సామి॥