నా తల్లి దత్త నా తండ్రి దత్త

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి:
జయ గురు దత్త జయ గురు దత్త జయ గురు దత్త శ్రీ దత్త 
శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ గురు దత్త శ్రీ దత్త

చరణం:
నా తల్లి దత్త నా తండ్రి దత్త నాయన్న దత్త శ్రీ దత్త
     పరువు      తెరువు       గురువు
     కలిమి        బలిమి        చెలిమి
      బుద్ధి         వృద్ధి          సిద్ధి

      తెలివి         విరివి         నిడివి 
      గుడి           బడి          మడి 
      చేత            వ్రాత          కైత
      మాట          పాట          బాట 

      చూపు         రూపు          ఏపు
       నిద్ర            ముద్ర           భద్ర
       కొలువు        నెలవు         సెలవు
      కలము          పొలము       బలము
 
      పంట            ఇంట              వెంట 
      మనసు         తపసు            సొగసు
      బ్రహ్మ            విష్ణు              శివ 
      గానం             ధ్యానం           లీనం 

      లోన              పైన               మేను 
నాదంటు వేరె లోకానలేదె నా స్వామి దత్త శ్రీ దత్తా
లోకాన నీవె కాకున్న నేనె వేరేది లేదె శ్రీ దత్తా
ఈ భేధబుద్ధి ఈ మాయ సుద్ధి తొలగింపరావె శ్రీ దత్తా

నీకంటె వేరె కానంగ రాదె నా స్వామి దత్త శ్రీ దత్తా
నువ్వు నువ్వు నువ్వె నేనేను నేనె భేధంబు లేదె శ్రీ దత్తా
నా స్వామి దత్త స్మృతిగామి దత్త శ్రీ సచ్చిదానంద జయ దత్తా