నాగానందం/నాగానందం

వికీసోర్స్ నుండి

నాగానందం

చెల్లీ, దేవతలు అమృతం తాగేరు కదా, మరి వాళ్ళకి ఆకలి దప్పికలు లేవకదూ? అని అడిగావు. నిజమే, వాళ్ళకి ఆకలి వెయ్యదు. దాహంకూడ లేదు. అయితేనేమి, వాళ్ళకీ మనలాగే సుఖం, దుఃఖం బెంగా బెదురూ, పేమ వివాహం, ఈర్ష్యఅసూయా, స్నేహం, విరోధం వగైరాలన్నీ ఉంటాయి. వాళ్ళలోకూడ మనలో వలెనే ఎన్నో కులాలు, "తెగలు ఉన్నాయి. వాళ్ళలో వాళ్లు దెబ్బలాడుకుంటూ ఉంటారు కూడాను, చూడు. ఇప్పడో చక్కని కథ చెప్తాను విను. ఇది విద్యాధరులనే దేవతలకి రాజైన జీమూత వాహ నుని కథ. అతడెంతో మంచివాడు. పరోపకారి, స్వార్థ త్యాగి. అతనివలన నాXసలమంత్రా బ్రతికి బాxపడింది. ఈ కథ అంటే నాగులకెంతో ఆనందం.

జీమూతవాహనుడు విద్యాధరులకి రాజైన జీమూత కేతువు కొడుకు. సర్వవిధాలా తగినవాడు కదా అని తండ్రి జీమూతవాహనుణ్ణి రాజుగాచేసి "త్రాను తపస్సుకి పోదానును కొన్నాడు. కాని జీమూతవాహనుడు రాజ్యం చేయటానికి ఇష్టపడలేదు, అడవిలో తల్లి దండ్రుల సేవచేస్తూ పస్సు చేసుకోవటమే సుఖమైన జీవితమని అతడు తలంచేడు. అందుకని ఎవరెన్ని విధాల చెప్పినా వినకుండా అతడు తన రాజ్యాన్ని మంత్రుల కప్పగించి తల్లిదండ్రులతో కలిసి తపస్సుకి బయలుదేరాడు. జీమూతవాహనుని ఆత్రేయుడనే బాల్య స్నేహితుడొకడున్నాడు. అతడుకూడా వారితో పాటు అరణ్యంలో ఉండడానికే నిశ్చయించాడు. వీరంతా మలయపర్వత ప్రాంతంలో ఎక్కడైనా ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొందామని అనుకొని అక్కడికి బయల్దేరి వెళ్లారు.

తండ్రిగారి అనుమతి పొంది, ఆశ్రమం కట్టుకోడానికి అనువైన స్థలం వెదక డానికని జీమూతవాహనుడు, అత్రేయునితో కలిసి బయల్దేరాడు. అది మలయ పర్వతం. పర్వతం నిండా మంచి గంధపు చెట్లే, ఎక్కడ చూచినా చెట్లు, లతలు ఒకటికొకటి పెనవేసుకొని పెరిగిఉన్నాయి. రకరకాల మొక్కలు, రంగు రంగుల పువ్వులు, పలువిధాల పక్షులు, గుంపులు గుంపులుగా ఉన్న లేళ్లు, అన్యోన్యం గా పెరిగే ఏనుగులు, ఇంకా ఏన్నో జంతువులు ఆ అడవిలో ఎక్కడ చూచినా తారస పడతాయి. అక్కడక్కడ ఎవరో మునీశ్వరులు కట్టుకొన్న తపోవనాలు, ఆశ్రమాలు కూడా ఎదురౌతాయి. ఆయా చోట్ల మంచినీటి కోనేర్లు, సలసల ప్రవహించే సెలయేళ్ళు, వేడి వేడి నీటిబుగ్గలు కూడ కనిపిస్తాయి. ఇవన్నీ చూస్తూ, తమకి తగిన తావు వెతుకుతూ, జీమూతవాహనుడూ, ఆత్రేయుడూ కలిసి వెళ్లి వెళ్లి, ఒక ప్రాచీన దేవాలయ సమీపానికి చేరుకొన్నారు. ఈ అడవిలోయీ దేవాలయ మెలా వచ్చింది.? దీనిని ఎవరు కట్టంచారో? ఇంతకీ ఏ దేవునిది? అని వారిలో వారు ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేసుకోంటూన్నంతలో, ఆ దేవాలయంలోనుంచి అతి మధురమైన వీణాగానం వారికి వినిపించింది. వారిచెవుల కెంతో ఆనందమైంది. కాని ఆశ్చర్యం మరింత హెచ్చయింది. అదేదో దగ్గరగాపోయి చూడాలనే కుతూహలం వారిని మరింత త్వరపెట్టింది. ఇద్దరూ గబ గబా దేవాలయ ప్రాంగణంలోకి త్రోవదీసారు. ముఖమంటపం దాటారు. ముందుకు పోయి తొంగిచూసేరు. వాళ్ళకి తెలియకుండానే వళ్ళక్కడ ఆగిపోయి కన్ను రెప్పవెయ్యకుండా అలా చూస్తూ నిల్చిపోయారు.

అక్కడ ఒక దివ్యసుందర విగ్రహమైన విద్యాధర సుందరి వీణవాయించి దేవిని ప్రార్థిస్తూ పాదుతూంది. ఆమె ప్రక్కనే ఆమె చెలికత్తె పూజాద్రవ్యాలు గల పళ్ళెం, పన్నెరు బుడ్డి, గంధపుగిన్నె, పూల దండలు వగైరాలు పట్టుకొని కూర్చొంది. ఎదుట జగన్మాత పార్వతి విగ్రహం అభయముద్ర పట్టి, చిరునవ్వుతో, షోడశ కళాపరిపూర్ణంగా విరాజిల్లుతూంది.

"ఈ కన్య ఎవరు? ఈఅడవిలొ యిలా మందిగమెందుకుంది? ఈమె ఏ కోరికతో యీ దేవినిలా ఆరాధిస్తూంది? ఇంతకీ యీమెతో మాట్లాడి పరిచయం చేసుకొనే అవకాశం మనకెలా కలుగుతుంది?" అని జీమూతవాహనుడు తన మనస్సులో ఎన్నో గుత్తులు గుత్తులుగా ప్రశ్నలు వేసుకొంటున్నాడు. ఆత్రేయుడు కూడా అదే విధంగా ఆలోచిస్తు పుట:Naganadham.pdf/32 పుట:Naganadham.pdf/33 పుట:Naganadham.pdf/34 నన్ను ఆజ్ఞాపించి పంపేరు. మా చెల్లెలు మలయవతిని నీవు పరిగ్రహించ వలసినదని ముందుగా నేను ప్రార్ధస్తున్నాను. మాతండ్రిగారి ప్రార్ధన మీ తండైగారి సమ్మతి తరువాత విందువుగాని" అని అతడు జీమూతవాహనునితో చెప్పిన మాటలు వినగానే మలయవతికి ఎంతగానో ఆశ్చర్యం, ఆశ, ఆనందంకూడ కలిగాయి. చరురిక "భేష్, ఇదంతా దేవికృప" అన్నది.

"ఆర్యా, మీ ఆదరానికి ధన్యవాదాలు, కాని నా మనస్సు అప్పుడే వేరొక సుందరిపై లగ్నమయింది. ఇప్పుడు మరొక ప్రక్కకు దానిని మరలించడం, ధర్మమా? అధర్మమా? అనే ప్రశ్న అటుంచి, అసలు నా వశంలో లేని విషయము కాబట్టి మీరు నన్ను క్షమిస్తూ, యీ మాటలు మీ తండ్రిగరితో చెప్పవలసిందని మిమ్మల్ని ప్రాద్ర్హిస్తున్నాను" అని చెప్పి జీమూతవాహనుడు యింటికి పొవడానికి కూడ నిరాకరించాడు.

మిత్రావసువు ఆత్రేయునితో సలహాచేసి జీమూతకేతువుతో చెప్పి వ్యవహారం సానుకూలం చేసుకొందామని బయల్దేరాడు. అదేదో చూచిరావలసిన దని చరుతికను అతని వెనుకనే పంపించింది మలయవతి. కాని ఆమెకు నమ్మకం లెదు. తన బ్రతుకుమీద తనకే అసహ్యం వేసింది. చతురిక వెళ్లిన పిదప ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె దు:ఖము మరింత్ ఎక్కువైంది. తుదకు పైట చెంగుతో మడకు ఉరిపోసుకొని ఆత్మహత్య ఛేసుకొందామని నిశ్చయించింది. "దేవీ, ఈ జన్మలో కాకపోతేమానె, మరొక జన్మలోనైనా నన్ను జీమూతవాహనుని భార్యగా పుట్టించు" ఐ దేవిని ఆఖరిసారి ప్రార్ధించి, మడలో ఉరివేసుకొంది. పైటచెరగు చాల లేదు. దగ్గరసాఉన్న తీగలు మెడకు చుట్టుకొని చెట్టుకి వ్రేలాడింది.

చతురిక మొదటినుంచీ అనుమనిస్తూంది. ఒక్కర్తెనూ వదలివెళ్తే యీ రాజకుమార్తె ఏ ఘాతుకమో చేసి పోతుందేమోనని, కొంతదూరం మిత్రావసుని వెంటవెళ్ళి నట్లె వెళ్ళి తిరిగివచ్చి రాజకుమార్తె నొకసారి చూచి పోబోయింది. ఇకనేముంది. ఆమ భయబడి నట్లేఅయింది. గుండె జల్లుమంది. లబో దిబోమని గోలపెట్టి దగ్గరసా పరుగెత్తుకెళ్ళింది. "అయ్యయ్యో, మా రాజకుమారి, మలయవతి ఉరిలోపడి కొట్టుకుంటూంది. రక్షించండి రక్షించండి" అని బొబ్బలు పెట్టి ఏడవసాగింది.

చతురిక బొబ్బలు వినగానే జీమూతవాహనుడు తాను వ్రాస్తూన్న చిత్రాన్ని విడిచి, మలయవతిని రక్షించడానికి పరుగెత్తాడు. మొలనున్న కత్తితో తీగలుకొసి మలయవతిని ఉరిలోనుండి తప్పించాడు. "ఎవరిది?" అని ముఖంచూచి, తాను వలచిన విద్యాధరియే యీ మలయవతి అని గ్రహించి, అపరింతంగా ఆనందించాడు. ఆత్మహత్యా ప్రయత్నానికి హేతువు తెలిసికొని, ఆమె రెక్కపట్టుకొని తాను వ్రాస్తూన్న చిత్రంవద్దకు తీసుకుపోయి, 'ఇదిగో, ఈమె నా హృదయేశ్వరి ' అని చెప్పి నవ్వించాడు. ఇంతలో జీమూతవాహనున్ని రమ్మని పిలువడానికి ఆత్రేయుడు వచ్చాడు. "మీతండ్రిగారు మలయవతిని కోడలుగా గ్రహించడాని కంగీకరించారు పెళ్లికొడుకు వయ్యావు పద" మన్నాడు. అందరూ నవ్వుతూ, సరసాలు, పరిహాసాలు పలుకుతూ ఇంటికి మరలేరు.

ఒక చక్కని శుభముహూర్తంలో మలయవతీ జీమూతవాహనుల వివాహం మహావైభవంగా జరిగింది. వివాహమైన తర్వాత కొన్నాళ్లు అత్తవారింట్లోనే ఉండి జీమూతవాహనుడు సకల సౌఖ్యాలు అనుభవిస్తూ, ఆత్రేయ మిత్రావసువులతో కలిసి అక్కడా ఇక్కడా విలాసంగా విహరిస్తూ కాలం గడుపుతూ వచ్చారు. తన రాజ్యలోభంతో హుద్దానికి బహల్దేరలేదు. పదిమందిని చంప్ తెచ్చిన రక్తపుకూడు కంట, పండుటాకులో, పండుకాయలలో తిని బ్రతకటం ఉత్తమోత్తమమైన పద్దతి అని నిర్ణయించుకొని, అదే నీతిని ఆచరణకి తెచ్చుకొన్నాడు.

ఒకనాడు జీమూతవాహనుడు మిత్రావసువుతో కలిసి సముద్రతీరంలో విహరైస్తున్నాడు. తత్సమీప్ంలో ఉన్న పర్వతాల పంక్తినిచూచి మెచ్చుకొంటూ నడుస్తూఉంటే మిత్రావసువు జీమూతవాహనునితో ఇట్లాచెప్పాడు. "బావా ఇవి మలయపర్వతపు శిఖరాలు కావుసుమా, చచ్చిపోల్యిన పాముల ఎముకల గుట్టలు." పుట:Naganadham.pdf/38 పుట:Naganadham.pdf/39 విచారకరమైన దృశ్య చూడలేక పోయాడు, వారి నోదారుస్తూ అతడిలా అన్నాడు.

"అమ్మా, నీవెందుకిలా విచారిస్తావు, నీకుమారుని రక్షించే ప్రయత్నం నేను చేస్తాను, నీకుమారునికి బదులుగా నేనీరోజున గరుడుని భోజనమవుతాను". అని చెప్పి ఆహారంగా వెళ్ళవలసేవాడు ధరించే ఎర్రదుస్తులు తనకిమ్మని ప్రార్దించేడు, శంఖచూడుడు విస్మితుడయ్యాడు. వృద్ద తేల్లబోయింది. రాజభటుడు తన్నుతాను నమ్మలేకపోయాడు. క్షణంలో కధ అడ్దం తిరిగినట్లయింది. తమకోసం మరొక వ్యక్తి బలి అవుతాడాంటే ఆ తల్లి కొడుకులిద్దరికీ నచ్చలేదు. వారందు కంగీకరించలేదు. అతడు కోరిన ఎర్రదుస్తులు అతనికివ్వలేదు. పరోపకారం కోసం ప్రాణత్యాగం చేయటంలో తప్పులేదంటాడు జీమూతవాహనుడు. స్వార్ధంకోసం ఇంకొకరి ప్రాణాలు బలి ఇవ్వడం మహాపాపమంటారు. శంఖ చూడుడు, తని తల్లీని ఎంతచెప్పినావినక శంఖచూడుడు, తానే గదుడుని కాహారంగా పోవడానికి నిశ్చయించి, చనిపోయేముందు దైవ ప్రార్ధన చేసుకొంటానని తల్లితోకలిసి సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్ళాడు.

ఆ రోజు దీపావళి, సర్వులకు ఆనందదాయకమైన పర్వం, పందుగకదా అని జీమూతవాహనుడికి అత్తవారు క్రొత్త బట్టలు కట్త బంపేరు. కట్నమందుకొందామనే ఆశతో నౌకర్ ఆ బట్టలు పట్టుకొని జీమూతవాహనుని వెతుక్కుంటూ వచ్చేడు. అవి ఎర్రటి పట్టుబట్టలు. ఆబట్టలు పుట:Naganadham.pdf/41 ఈ లోగా జీమూతవాహనుడి కోసం అత్తమామలు, బావమరుదులు, భార్య, తల్లిదండ్రులు అందరూ వెతుక్కుంటున్నారు. అతిడింకా ఇంటికి రాలేదేమని వారంతా ఆందోళన పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశం మీదనుండి ఎగురుతొన్న గరుడుని నోటిలో ఎరగాఉన్న జీమూతవాహనుడి చూడామణి జారి క్రిందపడింది. అది అతని తల్లికే దొరికింది. మరేముంది? చూదగానే ఆమె దానిని పోల్చిపట్టి తన కొడుకు కేదో విపత్తు వచ్చిందని భావించి గోలపెట్టి ఏడ్ఫసాగింది. అంతాకలిసి జీమూతవాహనుడుఇ విడిసిన సముద్రతీరానికి నడేచేరు.

అంతలో అక్కదికి శంఖఛూడుడు వచ్చాడు. అతడు కూద విలపిస్తున్నాడు. "ఈరోజున నాకు బదులుగా ఎవరో పుణ్యాత్ముడు తన ప్రాణాలు బలియిచ్చాడు. నా మెడకి అకారణంగా పాపం చుట్టుకుంది." అని ఏడుస్తూ అతడు తన కధ అంతా ఈ రాజపరివారానికి విన్నవించాడు. వారివలన ఆ పరోపకారపారాయణుడు జీమూతవాహనుడనిన్నీ వీరంతా అతని ఆత్మీయులని తెలుసుకొన్నాడు. గరుడుని కెరయైజీమూతవాహనుడు హతుడయ్యెడని భావించి, అతని తల్లిదండ్రులు శోకావేశంతో మూర్చాగ్రస్తులయ్యారు. మలయవతి భర్త గారి చూడామణి అందిపుచ్చుకొని చితిపేర్చుకొని చనిపోవడానికి ఉద్యుక్తురాలయింది. శంఖచూడుడి కిదంతాచూచి కడుపు తరుగుకొనిపోయినంత దు:ఖమయింది. అయినా పుట:Naganadham.pdf/43 తీయబోయాను, కాని నీ ధైర్యసాహసాలతో నీవు నా హృదయాన్నే తీసిచేసేవు. నీవెవరు?" అని గరుడుడు జీమూతవాహనుణ్ణీ అడిగేడు.

    "నేనెవరైతేనేమి? మొదట తమరు తమఆకలి తగ్గించుకొండి. తర్వాత అన్నీ తెలుస్తాయి" అన్నాడు జీమూతవాహనుడ్. ఇంతలో వెనుకనుంచి శంఖచూడుని కేక వినపడింది. "పక్షిరాజా, అన్యాయంగా మీరు విద్యాధరుణ్ణి చంఫి తింటున్నారు. అతనిని వదలండి. ఇదుగో నేను వస్తున్నాను. ఈ రోజునమీకాహారంగా రావలసిన వాడిని నేను. నాకు బద్లు యీ దయామయుడు తన ప్రాణాన్ని మీకు బలియిచ్చేడు. అతని తల్లిదండ్రులు, అత్తమామలు, భార్య, బంధువులు అంతా వెనకనుండి వస్తున్నార్, అల్తనిని విడిచి పెట్టి పుణ్యం కట్టుకొండి" అని అరుస్తూ గాభరాగాపరుగెతి వచ్చా శంఖచూడుడు.
    గరుడుడు తటాలున జీమూతవాహనుణ్ణి విడిచి ప్రక్కకు తప్పుకొన్నాడు. తానుచేసిన పనికి పశ్చాతాపపడుతూ శంఖచూడుని వలన జరిగిన కధంతా సాంతంగా విన్నాడు. కాని ఏమి లాభం? జీమూతవాహనుడి శరీరంలో సగం అప్పుడే అతను కడుపులో జీర్ణించుకుపోయింది.
       రక్తసిక్తమైన శరీరంతో చావసిధ్దమై కొనౌఉపిరితో ఉన్న జీమూతవాహనుణ్ణి చూచి తల్లి దండ్రులు, అత్తమామలు, భార్య అందరూ గోలుగోలున ఏడ్చి, మొత్తుకొని, మూర్చిల్లేరు. "ఏ దేవతలకైనా దయరాదా! నా కొడు 

పక్షికి బలియై చావవలసిందేనా! ఇప్పుడే అమృతవర్షమో కురియకూడదా! తల్లీ, జగన్మాతా! అంబికా, నాకుమారుని కాపాడవా!" అని పరిపరివిధాల ఏడుస్తూన్న జీమూతవాహనుడి తల్లిని చూచి గరుడుడెంతో సిగ్గుపడ్డాడు. "అమ్మా, మీరు విలపించకండి. ఈరోజున్ండి నేను నాగులను తిననని శపధం చేస్తజన్. జరిగినదానికి విచారించి ప్రయోజనం లేదు. అయినా ఒక్కక్షణం మీరు ఓపికపడితే నేను వెళ్లి అమృతం తెచ్చి జీమూతవాహనుణ్ణి బ్రతికిస్తాను" అని చెప్పాడు గరుడుడు. చెప్పినంతనట్టు చేయగల సమర్ధుడు గనుక అతడు వెంటనే స్వర్గలోకానికి ఎగిరివెళ్ళాడు అమృతం తేవడానికి.

      మలయవతికి వీరిమాటలేవీ వినిపించలేదు. ఆమె దు:ఖావేశంలో తన్ను తానే మరిచిఫోయింది.  చితిపేర్పుంచుకొని అగ్నిలో దుముకడానికి త్వరపడుతూంది.  "అయ్యో, గౌరీమాతా, నీమాటలు కూడా పొల్లయ్యేయికదూ ! నీ మొగుడు విధ్యాధర చక్రవర్తి అవుతాడు.  నీవు చిరకాలం అతనితో కలిసి సుఖి స్తావు.  అని పల్కిన పల్కులు శుద్ద అబద్దంగా మారిపోయాయి కదా, తల్లీ, ఇక దేనికి నా జన్మకి ఎందుకీ భగద్బక్తి? దేనిమీద ఆశ? ఏది అధారం! ఎవరాలంబన? అగ్నిముఖంగా నా ప్రాణంకూడ తీసివేసి సుఖించు" అని క్రోధశోకావేశాలతో పల్కుతూ ఆమె చితికి ప్రదక్షణం చేయసాగింది. ఆమెనుచూచి, ఆమె తెగింపు గ్రహించి, చేసేదిలేక విరక్తిపడి, ఆమె తల్లిదండ్రులుకూడాగ్గిలో గెంతడానికి ఉద్యుక్తు లయ్యారు. నాగానందం

ఇంతలో ఓ పక్కనుండి అమృత కలశంతో వచ్చాడు గరుత్మంతుడు. మరో పక్క ప్రత్యక్షమైంది పార్వతి. ఆమ్యతంపోసి జీమూతవాహనుణ్ణి బ్రతికించాడు గరుడుడు. కమండలోదకం జల్లి చితినార్సింది పార్వతి.

లేచి వచ్చిన కొడుకుని కౌగలించుకొని, జీమూత వాహనుని తల్లిదండ్రులు పార్వతికి సాష్టాంగపడ్డారు. మలయవతి భర్తతో కలిసి గౌరికి మ్రొక్కింది. గరుడుడు శంఖ చూడని విడిచిపెట్టి, అతని ద్వారా సమస్త నాగకులానికి అభయమిచ్చి పంపాడు, పార్వతి ఆశీస్సులతో జీమూతవాహనుడికి విద్యాధర రాజ్యం లభించింది.

చెల్లీ, చూసేవా, జీమూతవాహనుడి త్యాగంవల్ల నాగకులమంతా నిర్భయంగా బ్రదుకగలిగింది. ఆందుకే యీకథ అంటే నాగుల కిష్టం. ఇది వింటే పాములవల్ల భయ ముండదు. చావు అంటే అందరికీ భయమే. బ్రతుకుమీద ఆశ అందరికీ ఒక్కలాటిదే. అందుచేత ఎంత దుష్ట జంతువు నైనా సరే చంపకూడదు. ఒకరికి అపకారంచేసినకంటే పరో పకారం కోసం ప్రాణాలు విడిచినా మంచిదే.

సర్వేజనా స్సుఖినోభవంతు.