Jump to content

నాగానందం/నలోదయం

వికీసోర్స్ నుండి

నలోదయం


చెల్లీ, ఏదైనా ఒక మంచికథ చెప్పమన్నావు. విను, ఇదో చక్కని కథ. చాలకాలం క్రిందట మనదేశంలో నిషధ దేశమనే రాజ్యముండేది. ఆ దేశానికి రాజు వీరసేనుడు. అతని పరిపాలనలో ప్రజలు చీకు చింతలు లేక నిత్య సుఖులై హాయిగా ఉండేవారు. ఆ మహారాజుకి తగినట్టుగానే అతని కుమారుడు నలుడనేవాడు చిన్నప్పుడే సకల విద్యలు సాంగో పాంగముగా నేర్చి, సాటివారిలో మేటియై ఇటు తండ్రికి అటు ప్రజలకి కూడ ఆశాంకురమై, అల్లారుముద్దుగా పెరిగి పెద్దవాడయేడు. తగిన వయస్సురాగానే నలుడు తన తండ్రిగారి సింహాసన మధిరోహించి, ప్రజాభీష్టమెరిగి, మంత్రి సామంతుల సలహాలు మన్నించి రాజ్యం చేయసాగేడు.

అదే సమయంలో విదర్భదేశాన్ని భీమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అన్ని విధాలా అతడు అదృష్ట వంతుడే, కాని సంతానం మాత్రం కలుగలేదు. అందుచేత ఆ మహారాజు చాలా పరితపించి, ఎన్నో వ్రతాలు, నోములు, ఉపవాసాలు, యజ్ఞయాగాలు చేసేడు. చివరకు దమన మునీశ్వరుని దయవలన అతనికి సంతాన ప్రాప్తికి వలసిన మంత్రం లభించింది. ఆ మంత్రోపాసనవలన భీమసేనునికి దముడు, దాంతుడు, దమనుడు అనే రత్నాలవంటి పుట:Naganadham.pdf/4 పుట:Naganadham.pdf/5 వతిగా దమయంతిని ఆమెకు తగిన ఉజ్జీగా పురుషులలో అందగానిగా నిన్ను బ్రహ్మ సృస్టించాడు. మీ యిద్దరికీ వివాహమైతే బాగుంటుందికదూ, చూడు నీకిష్టమైతే దజ్మయంతి దగ్గర నీగుణగణాలు వర్ణించి ఆమెను నీకు సుముఖురాలుగా చేస్తాను. మరి శలవు" అని చెప్పి ఆ హంస ఎగిరి పోయ్హింది. నలునికి కురూహలం, ఆశ్చర్యం , హర్షం ఆశ కూడా కలిగి, ల్చాలసేపు ఆ హంసపోయిన మార్గాన్నే అలా చూస్తూ నిలిచి పోయాడు.

దమయంతి అంతఃపుర వాటికలో విహరిస్తూ ఉండగా హంస అక్కడికి చేరుకుంది. అలసి సొలసినదానివలె నచ్చి ఆమె సమీపంలో వ్రాలి, తిరిగి ఎగరబోయి బోర్లపడ్డట్టు నటించింది. దయామయురాలైన దమయంతి ఆ హింసను పట్టుకొని ఒడిలోపెట్టుకొని రెక్కలు నిమురుతూ, చెలికత్తెలతో చెప్పి పాలు తెప్పించి పట్టింది. సేదదేరిన తర్వాత ఆ హంస మానవ వాక్కులలో యిలా చెప్పింది.

"రాజకుమారీ, ఈ నీ ఉపకారం ఎన్నటికి మరిచి పోను, సేవలన నేడు నా ప్రాణాలు నిలిచేయి. నేను మామూలు హంసను"కాను. బ్రహ్మదేవునివాహనాన్ని. నీ విషయంలో ఒకప్పడు బ్రహ్మనాతో చెప్పిన రహస్యాన్ని నీకు చెప్తాను. ఆ రోజున బ్రహ్మదేవుడు నా వీపుమిూద సవారీ అయి కైలాసానికి వెళ్తున్నాడు. ఈ వూరి విూదుగా ఎగిరి వెళ్తున్నాము. నాకొక కత్తూహలం కలిగి "మహాత్మా, దమయంతివంటి సౌందర్యవతి నిక్కడ సృష్టించేవకదా, మరి ఆమెకు కాబోవు భర్తగా ఎవరిని సృష్టించెవు!’ అని అడిగాను. "నిషధేశ్వరుడైన నలుడీమె భర్త" అని అతడు చెప్పేడు. అమ్మాయీ, నీవు నలుని గురించి విన్నావోలేదో. అతడు అందాలకి మన్మధుడు, ప్రతాపానికి సూర్యుడు ఐశ్వర్యానికి కుబేరుడు,అన్ని విద్యలు ఎరిగిన అపరసరస్వతి. నీకిష్టమైతే నలమహారాజు వద్ద సీరూపగుణాతిశయాలు వర్ణించి అతని మనస్సు నీపై లగ్నమయే ఉపాయం చేస్తాను.సరేనా?

హంస మాటకారితనానికి దమయంతి ఆశ్చర్య పోయింది. తను వలచిన నలిఉణ్ణి తనకు భర్తగా సృష్టించిన బ్రహ్మకు మనస్సులో వేయి నమస్సులందించింది. "బ్రహ్మ దేవుని మాట జరుగవలసినదే కదా. నీయిష్ట" మని ముభావముగా హంసతో పలికి తన సమ్మతి వెల్లడించింది.

హంస వెళ్లినది మొదలు దమయంతికి మనస్సు మనస్సులో లేదు. సర్వకాల సర్వావస్థలలోనూ ఆమెకంటి ముందు నలుని రూపమే గోచరిస్తూంది. ఏపని లోనూ ఆమెకు మనస్సు పట్టదు. ఎప్పుడుచూచినా పరధ్యానంగా ఉంటుంది. చెలికతైల వలన ఆయీసంగతి విని తల్లి దండ్రులామె వివాహానికి సన్నాహాలు చేయసాగేరు.

ఆ రోజులలో రాజకన్యకలకి స్వయంవరాలు జరిగేవి.అంటే రాకుమారి తనకు నచ్చిన వరుని మెడలో పూలదండ వేస్తుంది, అందుకని రాకుమారు లందరినీ ఆహ్వానిస్తారు. భీమసేనుడు కూడ తన కుమారైకు స్వయంవరమని దేశంలో రాజులందరికీ వర్తమానాలు పంపేడు. చప్పన్న దేశాల రాజులు స్వయంవరానికి తర్లి వెళ్లారు. నలుడుకూడ బయల్దేరాడు. నారదుని వలన దమయంతి చక్కదనాన్ని విని దేవలోకంనుండి దిక్పాలకులుకూడ స్వయంవరానికి వచ్చారు. దారిలో వారు నలుణ్ణీ చూసేరు. అతని రూపలావణ్యాలు చూచి అబ్బుర పడ్డారు. అటువంటి అందగాణ్ణి విడిచి దమయంతి తమలో ఏ ఒక్కరినీ వరించదని తేల్చుకున్నారు. అందుకని నలుణ్ణి స్వయంవరానికి రాకుండా చేసే ఉపాయం ఆలోచించారు.

     తమ ఉపాయాన్ననుసరించి దేవతలు నలుని తమ వద్దకు పిల్చి ఇలా చెప్పేరు "నిషధేశ్వరా, నీకీర్తి ఎంతగానో వింటున్నాము.  నీ గుణగణాలు దిక్కులన్నిటా మారుమ్రోగుతున్నాయి.  మేము ఇంద్రాగ్ని యమ వరుణులము. నీవలన మాకొక ఉపకారము కావలసివుంది.  ఈ దేవకార్యానికి నీవు తప్పక తోడ్పడతావని ఆశిస్తున్నాం." నలుడు ఆ నలుగురు దిక్పాలకులకు నమస్కరించి "నాశక్తివంచనలేక మీ కార్యానికి తోడ్పడతాను.  అదేదో శెలవివ్వండి" అన్నాడు.
       వరుణుడు ఆడినమాట తప్పవలన నేవాడు కాదు. అందుకని దేవరలు ముందుగానే అతనివద్ద అంగీకారముద్ర గ్రహించి ఆమీద "నీవు దూతగా దమయంతి వద్దకుపోయి మా మా గుణాతిశయాలు వర్ణీంచి, ఆమెను మా నల్వురిలో ఎవరినైనా ఒకరిని వరించమని ప్రోత్సహించాలి. అంత:పురంలోకి ఎట్లా వెళ్ళేదని సంశయించకు. మేము తిరస్కరిణీవిద్య నిస్తాము.  దాని ప్రభావంవలన నీవు ఇతరులకు కనపడవు.  ఆ విద్య నీ స్వేచ్చ ననుసరించి పనిచేస్తుంది.  కల్లకపటాలు విడిచి మాకు సహాయ్యపడగల ఉత్తముడు నీకంటె మాకు మరొకదు దొరకడు" అని చెప్పేరు.
   ఔదార్య గాంభీర్యానికి నిధి అయిన నలుడు తానాశించిన ఫలితానికి దైవికంగా వచ్చిన యీ ఆటంకాన్ని చూచి లోలోపల నవ్వుకున్నాడు.  సరేనని ఒప్పుకొని దేవతల వద్ద తిరస్కరిణీవిద్య గ్రహించాడు.  "తనను వరించమని హంసద్వారా వర్తమానమంపిన మహారాజు, తానే స్యవముగా దేవతలను వరించమని వర్తమానం తెచ్చి దమయంతి కివ్వబోయాడు!  ఏమి భగద్విలాసం! ఇంతకీ దమయంతి ఎవరిని వరిస్తుందో!" అని అనుకొంటూ నలుడు అంత:పుర ద్వారాన్ని సమీపించాడు.
  అది రాణివాసం, పోతుటీగకూడ లోనికిపోరానిచోటు. లోపల అంతా ఆడారి మయం. ఆరోజు స్వయంవర సన్నాహాల వల్ల అక్కడ మరీ కలకలగాఉంది. ఎక్కడ చూచినా దాసీల హడావుడులే. వచ్చేవారు, పోయేవారు, మంతనాలాడే వారు, నవ్వేవారు, నవ్వుతాలాడేవారు ఒకరినిమించి ఒకరన్నట్లు చెలగాటమాడి తిరుగుతున్నారు దాసీలు, వారి మధ్యనుండి దమయంతి అభ్యంతర మందిరము లోకి దారి తీసేడు నలుడు.  ఇతడేమోవారికి కనపడడు.  కాని అతనికి కనిపిస్తారు. ఎదురుగావచ్చి మెదపడేటంత హడావిడిలో వా రున్నారు. ఎక్కడ తన గుట్టు రట్టవుతుందోనన్న ఆందోళ నతో నలుడున్నాడు. ఎలాగైతేనేమి, చివరకతడు దమయంతి సాన్నిధ్యానికి చేరుకొని కృత కృత్యుడయ్యాడు. తిరిగి ఆమె సౌందర్యాన్ని చూచి ముగ్ధుడయ్యాడు. తను వచ్చినకార్యాన్ని తలంచి తనట్లా తలచకూడదను కొన్నాడు. కాని దమయంతి ఆ సమయంలో తనరూప గుణాదులే సఖులతో చర్చింస్తూండటం గమనించి, విధివై పరీత్యానికి మెచ్చుకున్నాడు. ఎట్టకేలకు తెగించి తిరస్కరిణీ విద్య తొలగించి దమయంతికి సాక్షాత్కరింతాడు.

ఉన్నట్టండి ఊటిపడ్డట్టు, అతఃపురములోకి వచ్చిన రాకుమారుని చూచి దమయంతి, ఆమె చెలిక తైలుకూడ నివ్వెర పోయారు. ఉవ్వెత్తన లేచి కూర్చున్నారు.కూర్చున్న వారేందుకో అన్నట్లు లేచి నిలబడ్డారు. దమయంతి సమయజ్ఞ రాలు, ఉచితాంచితా లెరిగినపిల్ల. గాబరాపడడానికి బదులు సవినయంగా నలుణ్ణి అడిగింది. అయ్యా విూరెవరు? యీఅభ్యంతర మందిరం లోకి ఇందరి కండ్లు కప్పి విూరెలా రాగలిగేరు. విూ రూపులేఖలు, ధైర్య సాహసాలు, హావ భావాలుచూస్తే మీరు దివ్య పురుషులవలె కనిపిస్తున్నారు. విూరు నలమహారాజు "కాదుకదా! ఇంతకీ విూరు వచ్చిన కార్య మేమో చెప్పి సంతోష పెట్టుతారా?"

దమయంతి మాటలు విని నలుడికెంతో ఆనందం కలిగింది. "కల్యాణీ, నీ అనుమానం సత్యమే. నేను నలుణ్ణే. నేనిప్పడు వచ్చిన కార్యం దేవకార్యం, ఇంద్రాగ్ని యమ నరుణులు నీతో చెప్పమని కొన్ని వాక్యాలు నాకు చెప్పారు. ఆ సందేశం నీవు సావధానంగా వినవలసిందని నా కోరిక" అన్నాడు నలుడు.

దమయంతి తటాలున లేచి, నలునికి రాజోచిత మైన స్వాగత సత్కారాలు చేసి నమస్కరించింది. పిదప సవినయంగా అతనితో ఇట్లు పలికింది. 'మహారాజా, నీవు నా హృదయ మందిరములో ఎప్పడో ప్రవేశించావు. ఇప్పడీ అంతఃపురంలోకి సందేశ వాహకుడనై దూతగా రావటం, అందులోనూ దేవదూతగా రావటం నా అదృష్టం. నీవు చెప్పవలసిన సందేశం చెస్తే వింటాను.” అన్నది. నలుడు గుండె దిటవు చేసుకొని యిలా చెప్ప నారంభించాడు. 'రాజకుమారీ, ది క్పాలకులు నీ కటాక్షాన్ని ఆశించివచ్చారు. ఇందాగ్ని యమ వరుణులప్రతాప ప్రాభవాలు నీవెరుగనివి కావు. వారిలో ఏ ఒక్క రినైనా వరించవలసినదని వారు వేర్వేరుగా నా ద్వారా నిన్ను ప్రాద్ధిస్తున్నారని భావించు. ఇంకోమాట. వారంతా దేవతలు. వారిమాట "కాదని సీ వితరుణ్ణి వరిస్తే వారు నీ వివాహానికి, భావిజీవితానికి కూడ "కావలసినంతగా ఆటంకము కలిగించగలరు. అదికాక, దేవభోగం, కోరి వెదకి వచ్చిన అమృతం, కాలికి తగిలిననిధి, ఎందుకు వదులుకోవాలి? కాబట్టి నీవీ నలుగురిలోనూ ఏఒక్కరి నైనా వరించి నట్లయితే మేలౌతుందని నా అభిప్రాయం. ఏమంటావు?" అని అడిగి నలుడు ఆమె జవాబుకోసం ఎదురు చూసేడు. దమయంత్రి మొదట చిన్న నవ్వు నవ్వింది, పిదఫ ఘాంభీరముద్ర ధరించింది. వినయంగా దేవతలకి నమస్కారాలర్పించింది. పిదప “మహాశరాజా, దేవదూతగా వచ్చి నీవు నీ కార్యాన్ని నెరసులేకుండా నెరవేర్చావు. కాని నామనస్సు ఏనాడో నీపరనుయింది. దాని నిప్పుడు ఏ దేవ తలు వచ్చినా మరల్చలేరు. నీవు కాదన్ననాడు దమయంతి యీ లోకంలోనే ఉండదు. ఇక నెందుకు నేను దేవతలకి భయపడాలో నీవే చెప్ప. అయితే, నేను వారిని నిందించ లేదు. నా నిశ్చయానికి తోడ్పడవలసిందని నీమూలంగా వారిని ప్రార్ధించుచున్నాను" అని నలునితో చెప్పింది.

నలుడు మరీ మరీ చెప్పి విసిగిపోయాడు. దేవతలు తననుఅనుమానిస్తారేమో అని శంకించాడు. దమయంతికి తన విూదగల అనురాగాన్ని చూచి తనను తానెంతో అదృష్టవంతుడని మెచ్చుకొన్నాడు. దమయంతి వద్ద శెలవు పుచ్చుకొని దేవతల వద్దకి వచ్చాడు. తూచా తప్పకుండా తనకీ దమయంతికీ మధ్యజరిగిన సంభాషణ ఆంతా వారికి వినిపించాడు. దేవతల ఆశలు అడియాశలయ్యాయి. అయినా వారు తమ స్వార్ధాన్ని ఇంకా వదల దలచలేదు.

మరునాడు స్వయంవరం. రాజాధిరాజులు, రాజ కుమాయలు, దేవ గంధర్వులు కూడ వచ్చి సభనలంకరిం చారు. స్వయంగా సరస్వతి చెలికత్తెగా వచ్చి, దమయంతితో ఆయా రాజుల నామగుణకిర్తులు వర్ణించి చెప్పసాగింది.

దమయంతి కన్నుల పండువుగా అలంకరించుకొని, చేత జయమాల గొని, దమయంతి సభామండపంలో గల రాజుల కీర్తి ప్రతిష్టలు, గుణాఖ్యానాలు వింటూంది. ఒకొక్క_రినే విడిచి ముందుకు పోతూంది. నలు డెక్కడున్నాడనే చూపు మధ్య మధ్య ఆమె కన్నులలో తళుక్కుమంటూంది.
సరస్వతి దమయంతికి నలుని చూపెట్టింది. "ఇతడు నిషధేశ్వరుడైన వీరసేనుని కుమారుడు. పదునెన్మిది ద్వీపా లకి పట్టపురాజు, తనకీర్తి ప్రతాపాలు దశదిశలా నింపిన మహారాజు. సామంతుల మెప్పలంది సమస్న రాజకులానికి వన్నె తెచ్చిన చక్రవర్తి. అందక తైలందరూ ఏరికోరి వరించ దలుస్తూన్న నలమహారాజు యిూ అందకాడే" అని చెప్పింది. దమయంతి ముఖం హర్షోత్సాహలతో వికసించింది. చేతిలో ఉన్న జయమాల అప్రయత్నంగా విూదికిలేచింది. నలుని మెడలో పూలదండ పడబోతూందన్నంతలోసరస్వతి "సఖీ,  కాదు కాదు" అంది. 'సలుడితడు "కాడు. అడుగో ఆయన"  ప్రక్కనే కూర్చున్న మరో నలుణ్ణి చూపింది. తిరిగి ఉ ఊ ఆప్రక్క నున్నవాడే నలుడు" అన్నాది. "కాదు కాదు,అ రే! ఇదేమిటీ మాయ!! ఇక్కడ అయిదుగురు నలుళ్లున్నారే! సుందరీ ఇకనీయిష్టం. ఇందులో ఎవరు నలుడో, ఎవరు కారో, నాకే తెలియకుండాఉంది. అని నివ్వెరపడి ఊరుకుంది.. 

దమయంతికీ రహస్యం విదితమయింది. దిక్పాలకులు నలుగురూ నలుని వేషంతో వచ్చి కూర్చొన్నారని గ్రహించింది. వెంటనే వారినిలా ప్రార్ధించింది. "దేవతలారా, మీ సందేశాన్ని వినకపూర్వమే నా మనస్సు సలాయ త్తమైంది. నలుని నరించడం నాధర్మం, ధర్మానికి తోడ్పడమని ధర్మమూర్తులైన మిమ్ములను నెను వేడుకొంటున్నాను" అని వారందరికీ నమస్కరించింది. . దేవతలు పసన్నులై నిజరూపాలతో లేచి నిలు చున్నారు. అసలు నలుడెవరో అందరికీ అర్థమయింది. దమయంతి ఆతని మెడలో పూలమాల వేసింది. సభ జయజయ ధ్వాగాలతో మార్మోగింది. దేవతలు నల దమయంతు లిద్దరినీ ఆశీర్వదించి తమలోకానికి వెళ్లిపోయారు. మహావైభవంగా దమయంతీ నలముహా రాజుల వివాహం జరిగింది. కాంకలు, కట్నాలు, పుచ్చుకొని, అత్తమామలవద్ద శెలవు పుచ్చుకొని, దమయంతీ ద్వితీయుడై నలుడు తన రాజధాని చేయకొన్నాడు.

కొన్నాళ్ళకి ఆ దంపతులకు ఇంద్రసేనుడనే కొడుకు, ఇంద్రసేన అనే కూతురు పుట్టేరు. కాని. చెల్లీ ఒకరు బాగుంటే చూచి సహించలే వాళ్లుంటారుకదూ! విను.

దమయంతీ స్వయంవరానికి వచ్చిన దేవతలలో కలిపుయపుడు కూడ ఉన్నాడు. అతడు కామ క్రోధ లోభ మోహాదులకి రాజు. అనాచారాత్యా చారాలు రోగ దుర్బిక్షాలు, దారిద్ర్య దుఃఖాలు అతని పరివారం. ఒకరిని బాధించి సంతసించడమే ఆయనకు ప్రియం. ఆ మహాను భావునికి నలదమయంతుల వివాహం కన్నుకుటు అయింది. వారి సౌఖ్యం అతడు చూచి సహించలేకపోయాడు. ఎలా గైనా వారిని నానాబాధలు పెట్టి తనక్షసి తీర్చుకోవాలనే పంతంపట్టి నిషధపురం ప్రవేశించాడు.

     నలుడు ధార్మికుడు, సత్యవ్రతుడు, సజ్జనుడు. సర్వులకూ ఆదర్శ పురుషుడు. అయితేనేమి, ప్రమాదం ఎంతవారి కైనా వస్తుంది. ఒకప్పకు నలుడు కొంచెం బొల్లివిడిచి కాళ్లు కడుగుకొన్నాడు. సరి! కలిమహారాజు అదే సందుచేసుకొని నలుణ్ణి ఆవహించాడు. తన శరీరంలో కలి ప్రవేశించినదే తడవుగా నలుని వివేక బుద్దులు అడుగంటేయి. ఆలస్యం పెరిగింది. అనాచారానికి పెంపు కలిగింది.

నలుని జ్ఞాతులలో పుష్కరుడనే ఆయన ఒకడున్నాడు. అతడు త్రాగుబోతు, జూదరి, వ్యభిచారి, అబద్ధాలకోరు, అన్యూఅయానికి వెనుకాడని చెయ్యి, కలిమహారాజుకి నచ్చిన స్నేహితుడు. నలునితో జూదమాడి అతని రాజ్యాన్ని గెల్చుకోమని కలి పుష్కరునికి సలహాయిచ్చాడు. తాను పాచిక లలో నిల్చి పుష్కరుని విజయానికి తోడ్పడతానని మాట యిచ్చాడు. ఈ మద్దతుతో మదించి పుష్కరుడు నలుణ్ణి జూదానికి ఆహ్వానించాడు. బుద్ధిపెడతల బట్టి నలుడు జూద చూడటానికి అంగీకరించాడు! అదేమి జూదం! అంతా కలి మాయ. నలుడు తాను పెట్టిన పణాలన్నీ ఓడిపోతాడు. పుష్కరుడు వేసినపాచికలన్నీ గెలుచుకొంటాడు. ఇదే వరుసలో జూదమూడి నలుడు తన రాజ్యమంతా పుష్కరునికి ఓడిపోయాడు. “ఏముందిక? దమయంతినికూడా ఒడ్డతావా?" అని అడిగాడు పుష్కరుడు! నలుడు తనతప్పిదాన్ని గ్రహిం చాడు. కాని జరిగినదానికి పశ్చాత్తాప పడి ఏమిలాభం! తన ఓటమి అంగీకరించి దమయంతితో కలసి ఊరువిడిచి ఎక్కడికో పోవడానికి ఉద్యక్తుడయాడు. దమయంతిని విదర్శనగరం పంపివేయాలని అతని ఊహ. కాని దమయంతి కష్టకాలంలో తన భర్తను విడిచి వేరేఉండ గలదా! పిల్లలిద్దరినీ మాత్రం విదర్సనరానికి పంపి, తాను భర్తతో అరణ్యాల వెంబడీ పోవడానికే ఆ పతివ్రత నిశ్చయించింది. ఊళ్ళో ఎవరు వారి కాశ్రయమిచ్చినా వార శిక్షార్హులు. అది పుష్కరుని మొదటి శాసనం. నల దమయంతులు కట్టు గుడ్డలతో కాన కేగవలసినదే కాని། తమ వెంట ఏవిూ తీసుకొని పోకూడదు. ఇది అతని రెండవ శాసనం.

నలుడు ప్రతి పలుక లేదు. దించిన తల ఎత్తలేదు. కోప తాపాలణచు కొన్నాడు. తనతోపాటు దమయంతికి వచ్చిన కష్టాలుచూచి నీరుగ్రుక్కుకున్నాడు. విధివైప రీత్యమని ఎంచి, లేనిదైర్యం తెచ్చుకొని అరణ్యానికి త్రోవ తీసేడు.

అది బ్రహ్మాండమైన కీకారణ్యం. పట్టపగలే అక్కడ చీకటి జీమూతంగా ఉంటుంది. కీరుమని కీచురాళ్లు అరుస్తూనే ఉంటాయి. మధ్య మధ్య పులులు, సింహాలు గర్జిస్తాయి. ఏప్రక్కనుండి ఏమి వస్తుందో తెలియదు. ఏ డొంకలో ఏ ముందో అనే భయం అలాటి అడవిలో కంకరరాళ్లూ ముళ్లూ గ్రుచ్చుకొనే త్రోవలో నడచి తనవెంటవస్తూన్న సుకుమారి దమయంతినిచూచి గుండె చెరువైపోయింది. "ప్రియురాలా, నీవెందుకీ కష్టాలుకొని తెచ్చుకుంటావు? హాయిగా పుట్టింటికి పోతే సకల సౌఖ్యాలు అనుభవించవచ్చు, ఈ కష్టాలు కాపురముండవు., నేను తిరిగి మంచిరోజులు రాగానే నిన్ను కులుకొంటాను. నామాటవిని నువ్వు మీ తల్లి దండ్రుల వద్దకి వెళ్లిపో, అలాచేసి నన్ను సంతోషపెట్టు" అని నలుడు దమయంతి వెంతగానో బ్రతిమాలాడు. కాని ఆమెవినలేదు. "మీరక్కడుంటే అక్కడే నాకు సుఖం. మిమ్మల్ని విడిచి వుంటే స్వర్గంకూడ నాకు నరకతుల్యమే. అదికాక మీ ధర్మపత్నినయిన నేను మీతోబాటు కష్టసుఖాలు పంచుకో అనుభవిస్తాను కాని ఒంటరిగా అనుభవించ గలనా? మరి ఒక్క క్షణమైనా నేనుండలేను" అని ఆమె కంటతడి పెట్టుకొని చెప్పింది.

    పగలు రెండు ఝాముల వేళ అయింది. నలునికీ దమయంతికీకూడ ఆకలి ఎక్కువగా అవుతూంది.  ఏదైనా వేటాడి తెద్దామని బయల్దేరాడు నలుడు. ఇతని కోసమే వచ్చాయా అన్నటులు సమీపంలోనే వచ్చి వ్రాలాయి కొన్ని పావురా పిట్టలు. నలునిచేతిలో ఏముంది? వలలేదు.  కర్రలేదు కత్తిలేదు ఏమీలేదు. పైమీదనున్న అంగవస్త్రాన్ని వాటిమీద విసిరాడు.  పక్షులు దొరకలేదు. సరికదా, అవి ఆ అంగవస్త్రాన్ని లంకించుకొని ఆకాశానికి ఎగిరిపోయాయి.              విన్నావా చెల్లీ, పైమీద బట్ట పక్షులు ఎత్తుకుపోయే కష్టపు రోజులనే సామెత ఎరుగవూ? అది యీనలమహారాజు కధతోటే పుట్టింది.
          నలుడు ఏకవస్త్రుడై, పక్షులమీద, బట్టమీద ఆశవిడచి నీరైనా దొరుకుతుందేమొనని నాల్గు ప్రక్కలాచూచాడు.  అడవిలో నీరక్కడ! అదికూడ దొరకలేదు.  మొగం తేలవేసి దమయంతి దగ్గరకు వచ్చాడు.  ఇద్దరూ ఒకరి అవస్థచూచి మరొకరు విచారపడ్దారు.  దేవతలకికూడ వాది దీనస్థితి చూచి జాలికలిగింది.  అమృతభరితమైన ఒక ఫలాన్ని వారిముందు పడవేసారు.  అకస్మాత్తుగా ఆకసంనుండి పడిన పండుచూచి నలుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు.  దమయంతికిచ్చి తినమన్నాడు.  ఆమె దీనిని మీరే తినండని తియ్యారించింది.  ఒకరి నొకరు బ్రతిమాలుకోసాగారు. ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు హఠాత్తుగా అక్కదికి వచ్చాడు. "అయ్యో, ఆకలి, దాహం, ఎవరక్కడ? నాకింత ఆహారం పెట్టకపొతే బ్రహ్మహత్య వారి మడకు చుట్టుకొంటుంది" అని అరస్తూ ఆ దంపతుల ముందు మూర్చపడ్డాడు.  సహజంగా ఉదారులు, దానశీలురు, పరమ దు:ఖదు:ఖితులు అయిన ఆ రాజదంపతులు తమకని దేవతలు పంపిన ఆ అమృత ఫలాన్ని చావగూర్చున్న బ్రాహ్మణుని కిచ్చి 'అతిధి దేవొభవ ' అనుకున్నారు.  ఆ పండుతిని, త్రేన్చి బొజ్జ నుమురుకుంటూ తనత్రోవను పోయాడా బ్రాహ్మడు.  ఆ బ్రాహ్మణు డెవరో తెలునా? కలి. వారినోటిదగ్గరకి వచ్చిన ఫలాన్నికూడ మాయచేసి తన్నుకుపోయాడు. అంటేది అంటకుండా ముట్టేది ముట్టకుండా చేసి ముప్పు తిప్పలాపెట్టడమే కలిగారి విలాసం.
  
  పాపం, ఆకలితో అలసి, సొలసి దమయంతి నిద్రపోయింది.  అలా కటిక నేలమీద  పడుకొని నిద్రిస్తున్న మహా రాణిని చూచి నలుని మనస్సు మరీ వికల మయింది.  "ఈ నిద్రిస్తూన్న సమయంలో ఇక్కద యీమనువిడచి నేనెక్కడకైనా పోతే బాగుండూ? నేను కానరాకపోతే యీమె బుద్ధి మళ్లించుకొని పుట్టింటికిపోయి సుఖపడుతుందిగదా!" అనుకున్నాడు నలుడు.  కాని ఎలా వెళ్ళడం. కాళ్లురాలేదు. చాచసేపు తతపటాయించాడు. 'తనకోసం బెంగపెట్టుకొని చచ్చిపోతుందేమో ' అని భయపడ్డాడు.  "ఆమెను కాపాడవలసిందని దేవతలందరినీ ప్రార్ధించాడు. ఆమె కట్టుకున్న చీరలో ఒక ముక్క చింపి తన కంగవస్త్రంగా పుచ్చుకొన్నాను. గుండె రాయిచేస్కొని, గ్రుడ్లనీరు నింపుకొని, కనిపిస్తూన్నంత వరకు వెనక్కి మళ్ళిచూస్తూ, వెళ్ళినవాడు రెండు మూడు సార్లు తిరిగివచ్చి, చూచి చివరికి తెగించి ఆమె నా అడవిలో వదిలి నలుడెక్కడికో పోదామని బయల్దేరి వెళ్లిపోయాడు.
   కొంతదూరం పోయేసరికి అతని కా అడవిలో కార్చిచ్చు మధ్య చిక్కుకొని 'సాహిసాహి ' అని అరుస్తూన్న పాము ఒకటి కనిపించింది.  పరోపకార పరాయణుడు, ఆర్త్రత్రాణ బిరుదాంకితుడు అయిన నలుడు తటాలున ఆ పామును చిచ్చులోనుంచి వెలికి తీసేడు. బయటపడడమే తడవుగా ఆ పాము నలుని బొటన వెలిమీద గట్టిగాకాటువేసింది.  నలుడీ కృతఘ్నతకి నివ్వెరపోయాడు.

"మహారాజా, నన్ను నిందించకు, నేను నిన్ను కరవాలనే కరిచాను. నా పేరు కర్కోటకుడు. ఈ నా"కాటువల్ల నీరూపు మారిపోతుంది. ఈ కష్టకాలంలో మారురూపంతో నువ్వు ఎక్కడైనా ఉండి కాలం గడపవచ్చు. తిరిగి మంచిరోజు వచ్చాక, నన్ను తలచుకొంటే నీపూర్వ రూపం నీకు వస్తుంది. లోగడ నీపై మీద బట్టను పక్షులు ఎత్తుకుపోయాయి కదూ. అదికూడ నీకు తిరిగి లభిస్తుంది. నువ్వు తిన్నగా అయోధ్యకి పో. అక్కడ ఋతుపర్ణుడడనే రాజు పరమ ధార్మికుడు రాజ్యంచేస్తున్నాడు. నీకతనివద్ద ఆశ్రయం దొరుకుతుంది. నీకు శుభమౌతుంది. మరి శెలవు" అని చెప్పి ఆ పాము మాయమయింది. నలుడు నల్లగా మాడిపోయి, పొట్టిగా మరుగుజ్జగా మారిపోయాడు.

కర్కోటకుడు చెప్పినమాటప్రకారం నలుడు ఋతుపష్టని వద్దకి చేరుకొన్నాడు. తన పేరు బాహుకుడని చెప్పకున్నాడు. వంట చెయ్యడంలో నేర్పరినని విన్నవించుకొన్నాడు, అవసరమైతే రధసారధ్యం కూడ చేయకలనని చెప్పాడు. రాజుకి ఇతని మాటలు నచ్చాయి. వెంటనే తమదివాణంలో వంటవానిగా బాహుకుని నియమించాడు. 'బ్రతికి ఉంటే బలుసుఆకు ' అనే సామెతగా నలుడక్క_డ అజ్ఞాతంగా కాలంగడపసాగేడు. నలోదయం 19

అక్కడ దమయంతి నిద్రనుండి మేల్కొని, నలుడు కానరాకపోయేసరికి గాభరాపడింది. అటూ ఇటూ చూచి వెదకి వేసారింది. దిగులుపడి పదేపదే పిలిచింది. కస్నేరు మస్నేరుగా కార్చి వలవల విలపించింది. తన్ను తానెరుగని దుఃఖావస్థలోపడి మూర్ఛిల్లింది.

మూర్చలో మునిగి తేలినంతలోగా ఆ మహాపతివ్రతకి మరికొన్ని పాట్లు వచ్చాయి. ఒక కొండచిలువ ఆమెనుపట్టి మ్రింగబోయింది. అప్పడే మూర్ఛనుండి తెప్పిరిల్లిన దమయంతి పామునుచూచి భయపడి ఆర్తనాదం చేసింది. దైవికంగా ఒక గోయవాడా త్రోవనుపోతూ దమయంతి విలాపాన్ని విని, తటాలున వచ్చి, కొండచిలువను చంపి, ఆమెను రక్షించాడు. అయితేనేమి, వాడు ఆ పాముకంటె ఎక్కువ దుర్మార్గుడు. దమయంతి రూపలావణ్యాలు చూచి వాండామెను మోహించాడు. తన్ను పెళ్లాడవలసిందని ఆమెను బలవంత పెట్టసాగాడు. దమయంతి వాని కెన్నో బుద్ధులు చెప్పింది. ఎంతగానో బోధించింది. ఎంతైనా దీనంగా విలపించి ప్రార్థించింది. వాడు వినలేదు. దమయంతి కోపగించుకుంది. ఆమె మహాపతివ్రత ఆమె గుడ్లెర్రచేసేసరికి వాటినుండి అగ్నిజ్వాలలు బయలు వెడలేయి. బోయవాడా అగ్నిలోబడి నిలువనా బూడిదయ్యాడు.

          ఈ విపత్తు గడచిన పిదప దమయంతి, నలుని వెదకుతూ, గోలు గోలున ఏడుస్తూ ఆ అడనియంతా తిరిగింది. సింహాలు, పులులుకూడ వచ్చి ఆమె దీనావస్థనుచూచి జాలి 20                                                 నాగానందం

పడి నిల్చిపోయెవి. మదించిన ఏనుగుల గుంపు ఆమెవ్ కదురుగావచ్చి ప్రక్కకు తప్పుకొని వెళ్లిపోయింది. ఇదంతాచూచి దమయంతి 'భగవంతుడు నెనిలా దు:ఖిస్తూ బ్రతకాలనే కోరుకున్నాడు కాబోలు ' అనుకొంది.

               అడవి దాటిన పిదప దమయంతికి కొందరు బిడారు వర్తకులు కనిపించారు. వారిసహాయంతో ఆమె చేదినగరం చేరుకుంది. ఆ నగరానికి రాజు సుబాహుడు. అతని భార్య దమయంతికి సాక్షాత్తు పినతల్లి, అయితేమి, మాసిన తలా, చిరిగిన చీరతో ఉన్న దమయంతిని ఎవరు పోల్చుకోగలరు? అదృష్ట వశాత్తు రాణిగారి దృష్టి వీధిలో పోతున్న దమయంతిపై బడింది. ఆమె దాసీలను పంపి దమయంతిని తన అంతఃపురానికి పిలిపించింది. 

రూపురేఖా విశేషాలవల్ల దమయంతి ఉత్తమ కులీను రాలనీ, కాలనైపరీత్యంచేత ఏదో కష్టంలోఉండి ఉదాశీనంగా ఉన్నాదనీ, దమయంతిని చూడగానే రాణి గురించింది. "అమ్మా నీవవరు? కష్టంలో, మసిలోఉన్న మాణిక్యం వలె కనిపిస్తున్నావు. నిన్నుచూస్తే నాకు పుత్రనాత్సల్యం కలుగుతూంది. తప్ప లేకపోతే సీసంగతి చెప్ప. నాకు వీలయిన నీకు సహాయంచేస్తాను. లేదంటే మాయింట్లో మాఅమ్మాయి సునందతోపాటు సుఖంగా ఉండు" అని రాణి అతి ఆప్యాయంగా ఆదరించిపలికింది. దమయంతి కొన్నాళ్ళక్కడ ఉండటానికి అంగీకరించింది. కాని తానెవరో మాత్రం చెప్పలేదు,చెప్తే నలునిగూర్చికూడ చెప్పవలసివస్తుంది. yశీ ద య 0 21 అరణ్యంలో అమాయికురాలిని నొక్క రైను విడిచివెళ్లాడనే చేరానికి సలుణ్ణి అందరూ నిందిస్తారు. తనభర్తను "గా విందిస్తూంటే వినడం ఆ పతివ్రతకు కిట్టదు. అందువల్ల, ఆప్పటి కనుకూలంగా చెప్పి, అజ్ఞాతంగా కొన్నాళ్లు కాలం గడపటానికి నిశ్చయించింది.

నలుడు రాజ్యభ్రష్టుడై దమయంతితో కలిసి ఎటో హోయాడని తెలిసిన దగ్గరనుండి భీమసేనుడు వారిద్దరినీ వెదకి రావలసినదని చారులను నాల్లు ప్రక్కలా పంపి ప్రయత్నిస్తున్నాడు ఆచారులలో సుదేవుడనే ఒక ప్రాజ్ఞుడైన బ్రాహ్మడున్నాడు. అతడు చేది నగరంలో దమయంతినిచూచి, ఆన వాలు పట్టి, సుబాహుని కామె పరిచయం చెప్పి, అతని అనుమతిమీద సగౌరవంగా దమయంతిని విదర్భనగరానికి పంపే ఏర్పాట్లు చేయించాడు.

       దమయంతి పుట్టింటికి చేరుకొంది. తన పిల్లలిద్దరినీ చేరతీసి కౌలించుకొంది. తల్లిదండ్రుల చాటున ఉన్నా, భర్న పరారీ అయిఉన్నాడనే దుఃఖంచేత దినదినమూ కృశించిపోతూ, ఎడబాటు సహిస్తూ, నలుని రాక - కెదురు చూస్తూ ఎలాగో కాలం గడపసాగింది. నలునిజాడలు వెదక కానికి నలుప్రక్కలా దక్షులైనవారిని పంపుతూ, అతణ్ణిపోల్చు కొనేందుకు అనువైన గుర్తు లెన్నో వారికి చెప్పిపంపింది." 

అదృష్టవశాత్తూ, దమయంతిని పోల్చి తెచ్చిన సుదేవుడే, అయోధ్యలో, బాహుకుణ్ణి చూసేడు. దమయంతి చెప్పిన లక్షణాలు, బాహుకని మాటలు, నడవడి, వగైరా లన్నీ చక్కగా చూచి, అన్వయించి అనుమానించాడు. అన్నీ సరిగా ఉన్నా రూపులో నలునికీ, బాహుకునికీ స్వర్ల మత్త్యాలకన్నంత ఎడముంది. అందుచేత అతడు నేరుగా వచ్చ దమయంతి కీసంగతి విన్నవించాడు. దమయంతికూడ అను మానించింది. "కారణాంతరాలచేత రూపు మారిపోయి ఉంటుందని నిశ్చయించింది. ఏదో ఉపాయంచేత అతణ్ణి విదర్బ నగరానికి రప్పించాలని ఆలోచించింది. తిరిగి ఆ సుదేవుని చేతనే దమయంతీ ద్వితీయ స్వయంవరానికి తాము దయ చేయ వలసినదని ఋతుపర్ణునికి ఆహ్వానం పంపే ఏర్పాటు చేసింది. స్వయంవరం రెండురోజుల వ్యవధిలో జరుగుతుందని చెప్పమంది. అంతతొందరలో రావాలంటే నలుడుతప్ప మరెవ్వరూ సారథ్యంచేసి ఋతుపర్ణునికి సహాయపడలేరని ఆమె ఎరుగును. ఎంతమాసినా నూనవంతుడైన నలుడు, దమయంతీ ద్వితీయ స్వయంవరమనే మాటవింటే, బయట పడి తీరతాడనే నమ్మకం కూడ ఆమెకుంది. అందుకని పన్నాగం పన్నింది.

   స్వయంవర వార్త వినగానే ఋతుపర్ణుడు ప్రయాణసన్నద్ధ డయ్యాడు. కాని వ్యవధిలేదే. ఏమి చేయవలెనో పాలుపోక దిగులుగా కూర్చొన్నాడు. బాహుకుడు కూడ ఈ వార్త విన్నాడు. అతనికి వంటివిూద తేళ్లూ, జెర్రులూ ప్రాకినట్టని పించింది. ఎలాగైనా స్వయంవర సమయానికి తానుగూడ విదర్శనగరం పోవాలని నిశ్చయించాడు. అందుకని రాజు గారికి తాను సారధిగా ఉండి, ఈ అల్పవ్యవధిలో అతనిని అయోధ్యనుండి విదర్శకు చేరుస్తానని ఒప్పకున్నాడు. ఋతు పర్ణుడు పరమానందభరితుడై బయల్దేరాడు.

నలుడు అశ్వహృదయమనే విద్య ఎరుగును. అంచు వలన అతని సారధ్యంలో గుర్రాలు గాలికంటె వడిగా పరిగెత్తి పోవసాగేయి. ఋతుపర్ణుని అంగవస్త్రం గాలి కెగిరి పోయి క్రిందపడింది. దానిని తిరిగి తెచ్చుకోవాలని అతడు రధమాపనున్నాడు. కాని బాహుపడు 'మహారాజా రధం నాలుగుమైళ్లు ముందుకువచ్చింది. దిగి వెళ్తారా!" అన్నాడు. ఋతుపష్టడు మహాశ్చర్యపోయి, తానెరిగిన అక్షహృదయమనే విద్య "బాహుకుని కిచ్చి, అతనివద్ద అతనివద్ద తాను అశ్వహృదయం నేర్చుకొన్నాడు. అనుకొన్న సమయానికి ఒకపూట ముందుగానే ఋతుపర్ణుని రధం విదర్భ చేరుకుంది. బాహుకుడు వంటశాలకి వెళ్లాడు. ఋతుపర్ణుడు తనకని సగౌరవంగా అమర్చిన విడిదిలో బసచేసాడు. కాని స్వయంవరానికి మరే రాజకుమారులు రాకపోవడం చూచి. మొదట ఆశ్చర్య పడ్డాడు. తనొక్కడే వచ్చినందుకు ఆవిూద లోలోపల సిగ్గుపడ్డాడు.

దమయంతి బాహుకుని పరీక్షించడానికని తన చెలికత్తె భారతిని నియోగించింది. ఆమె వెంట, తనబిడ్డ లిద్దరినీ పంపింది. నలుడా పిల్లలనుచూచి కంటతడి పెట్టుకొన్నాడు. ఎత్తుకొని ముద్దాడేడు. తనపిల్లలలాగే ఉన్నారనీ, అందుకని అంతగా అభిమానం కలిగిందని చెప్పి చూపరుల ఆశ్చర్యాన్ని, అనుమానాన్ని తగ్గించజూచాడు. "రేపు దమ 24

యంతినిచూసి నా భార్యలాగే ఉంది అంటావేమో" అంది భారతి. "అలా ఎందుకంటాను? కాని భారతీ, దమయంత్రి వంటి పతివ్రత తిరిగి పెళ్లాడడాని కెలా ఒప్పకొన్నాదో నాకు తెలియకుండా ఉంది. నలమహారాజు, కాలవైపరీత్యంవల్ల ఎక్కడ ఏ రూపులో ఉన్నాడో తెలియదు. కాని అట్టివాని భార్య, ఆపదసమయంలో ఆయనను విడిచి మరొకరిని వరించ బూనడమే ఆశ్చర్యకరమైన విషయం" అన్నాడు బాహుకుడు. "అడవిలో అతిచారణంగా వదిలేసిబోయిన నలుడు మంచి వాడా? అతని ఐపు తెలియకపోగా యిప్పడు మళ్లా పెళ్లాడ తానంటే దమయంతి చెడ్డదా? ఎక్కడనీతులివి, బాహుకా? అని ఉటంకించింది భారతి, "కాదు భారతీ, ఆమెపడే కష్టాలు చూడ లేక, అలా వదిలిపెట్టిన పిదపనైనా ఆమె తన పుట్టింటికి చేరి సుఖపడుతుందనే సహృదయంతోనే నలుడలా విడిచి వెళ్లిప్లోయుంటాడని నా నమ్మకం. ఇంతకీ భర్తఉండగా తిరిగి పెళ్లాడ దలచినమీ దమయంతి భర్త విూద నిందారోపణ చెయ్యదా? పోసి, నాకెందుకులే. ఏదో వంటలవాడిని. లోక విడ్డూరమైన విషయంకదా అని యింతవరకు ఏమో అన్నాను. క్షమించు" అని నలుడు వంటయింట్లోకి వెళ్లిపోయాడు. అత డక్కడ కళ్లు తుడుచుకుంటూండడం భారతి గమనించింది. అతడు వండిన వంటకా లడిగిపుచ్చుకొని వెళ్లింది. అన్ని సంగతులు విని, నలపాకాన్ని రుచిచూచి, దమయంతి బాహుకుడే నలుడని నిశ్చయించింది. 25

తల్లిదండ్రుల వద్దఅనుమతి గ్రహించి దమయంతి వంటశాలలో ఉన్నబాహుకుని వద్దకు నెల్లింది. తన అపరాధం మన్నించమని అతని కాళ్ళమిద పడింది. ఆతిన్ని రప్పించడానికే తానీ ఊహ పన్నినానని చెప్పి తద్వారాఅతనికి కష్టం కలిగించినందుకు క్షమాపణ వేడుకుంది.

నలుడు కర్కో-టకుని స్మరించాడు. వెంటనే అతని అంగవస్త్రం అతని భుజంపై వచ్చి పడింది. మరుగుజ్జ రూపు మాయమయి, దివ్యసుందరమైన అతని పూర్వపు రూపు ఆయనకు వచ్చింది. దమయంతిని లాలించి, ఆదరించి, పిల్ల లిద్దరినీ ఎత్తుకొని, అ త్తమామలవద్ద కేగి, వారికి నమస్కరించాడు నలుడు. బాహుకుడే నలుడని వినగానే ఋతుపర్ణుడు ఎక్కడ లేని ఆనందాన్ని పొందాడు. ఆ దంపతు లిద్దరినీ ఆశీర్వదించి, వారివలన కృతజ్ఞతలు, మన్ననలు పొంది, అతడా మరునాడు గ్రన తననగరానికి పయనమయ్యాడు.

కొన్నాళ్లు అ_త్తమామలవద్ద ఉండి, నలుడు తిరిగి నిషధపురానికి వెళ్లాడు. నలుగు వచ్చాడని తెలియగానే పుష్కరుడు భయపడ్డాడు. తిరిగి జూదమాడి నలుడు తాను ముందు ఓడిపోయిన రాజ్యమంతా మళ్లా గెల్చుకున్నాడు. పుష్కరుని క్షమించి విడిచిపెట్టాడు. భార్యా పిల్లలను విదర్భ నుండి తెప్పించుకొని సుఖంగా నలుడు చిరకాలం రాజ్యం చేశాడు. అతని రాజ్యంలో మరెన్నడూ కలిభాధలు లేవు. చెల్లి, యీ కధ వింటే కలిబాధ లుండవు. నల దమయంతులనీ, నాగరాజైన కర్కోటకుణ్ణి, రాజర్షి అయిన ఋతుపర్ణుణ్ణీ తలచుకొంటే సమస్తమైన కలి కల్మషాలు అతరించి పోతాయి. సకల సంపదలూ కలుగుతాయి. ఇది జ్ఞాపక ముంచుకొని రోజూ స్మరిస్తావు కదూ! శుభం.